గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

17, నవంబర్ 2008, సోమవారం

జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీ. మేలిమి బంగారం మన సంస్కృతి 6

మంచీ - చెడ్డా అంతా నాలుకపైనే ఆధార పడి వుంది:-

మనం సమాజంలో చూస్తూ ఉంటాం. కొంతమంది చాలా చమత్కారంగా మాతాడుతారు. వారు కార్య సాధనలో గట్టి వారు. కొందరు మటాడడం వలన వారికి అవుతున్న పనులు కూడా ఆగిపోతుంటాయి. కొందరు యేమీ పైకి మాటాడకుండానే వారి పనులను వారు చేయించుకో గలుగుతారు. అన్నిటికీ మూలం మాటాడే నాలుకే కారణం.
ఈక్రింది శ్లోకాన్ని పరిశీలించండి.

శ్లోకము:-
జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీ
జిహ్వాగ్రే మిత్ర బాంధవాః
జిహ్వాగ్రే బంధన ప్రాప్తిః
జిహ్వాగ్రే మరణం ధృవం.

కందము:-
జిహ్వాగ్రము నుండును సిరి.
జిహ్వాగ్రము నుండు మిత్ర బృందము, బంధుల్.
జిహ్వాగ్రము బంధన మిడు.
జిహ్వాగ్రము మరణ కారి. జీవిత మందున్.

మన నాలుక చివరనే లక్ష్మి యున్నది. మననాలుక సహాయముతో పలికెడి మాటల వలననే మనకు బంధు మిత్రాదు లేర్పడు తున్నారు. మన మాటల కారణముగనే మనకు బంధన మేర్పడును. మనమాటలే మన మరణ హేతు వగుటయు నిజము.

మనము ధర్మ బద్ధముగా బ్రతుకుట కొరకు చక్కని సంభాషణ లక్ష్మీప్రదము. మంచిగా మాటలాడువారికడకు గౌరవ భావముతో బంధు మిత్రాదులు చేరుదురు. చెడుగా గర్వముతో మాటాడుట వలన మనకు బంధనం కూడా ప్రాప్తించ వచ్చును. మన మాట పొందిక లేకపోయినచో యితరులకు రుచించక పోవుట వలన అది మన ప్రాణములకు కూడా ముప్పు తే వచ్చును. కావుననే మనము మంచిగా మాటాడడం చాలా అభ్యాసం చేసయినా అలవరచుకోవాలి. అది మనకు మన కుటుంబానికి చాలా మంచిది. కాబట్టి అలా చేద్దామా!

జైహింద్.
Print this post

2 comments:

లక్ష్మి చెప్పారు...

baagundi

durgeswara చెప్పారు...

chaalaa baagaavraastunnaaru.dharma sooxmaalanu.dhanyavaadamulu

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.