గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, నవంబర్ 2008, ఆదివారం

సంతోషో నందనం వనం. మేలిమి బంగారం మన సంస్కృతి 5.

శత్రు మిత్రులు - స్వర్గ నరకాలు అన్నీ మనలోనే వున్నాయి:-

మానవుడు యెంత గొప్పవాడయినను కామాది అరిషడ్వర్గాన్ని జయించకపోతే తన గొప్పతనమంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. నరకమనేది ఎక్కడో లేదు.ఈ క్రింది శ్లోకాన్నిపరిశీలించండి.

శ్లొకము:-
క్రోధో వైవస్వతో రాజా
ఆశా వైతరణీ నదీ
విద్యా కామ దుఘా ధేనుః
సంతోషో నందనం వనం.


తేటగీతి:-
క్రోధమే యముడందురు కోవిదు లిల.
ఆశ వైతరణీ నది. అరసి చూడ.
విద్యయే కామ ధేనువు.విశ్వమందు.
సంతసమునంద నవనము. సన్నుతాత్మ !

మానవునకు గల కోపమే యమ ధర్మ రాజు. అతనికుండే ఆశయే వైతరణీ నది. అతని విద్యయే అతని పాలిటి కామ ధేనువు. అతని సంతోషమే ఆనంద నందన వనము.

గ్రహించ గలము కదా! ఇంకెందుకాలస్యం ? మనమూ యీ పైన చెప్పిన సల్లక్షణాల్ని పెంపొందించుకంటే సరిపోతుంది కదా ! ప్రయత్నిద్దామా?

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.