శ్రీ యస్. సుదర్శన్ మున్నగు వక్తలు ప్రసంగించారు. శ్రీ సి.పి. బ్రౌన్ తెలుగు భాషకు చేసిన సేవలు కొనియాడారు. బ్రౌన్ 270 కావ్యాలను, 83 శతకాలను, 23 ద్విపద కావ్యాలను పండితులచే పరిష్కరింపజేశాడు. ఈ భాషా సేవకు అడ్డు వస్తుందనో యేమో తాను వివాహము చేసుకోలేదు. బ్రిటిష్ వాడయినప్పటికీ కలకత్తాలో పుట్టిన బ్రౌన్ ఉద్యోగరీత్యా ఆంద్ర దేశంలోనుండి, కర్నూలులో నివసిస్తూ తెలుగు భాషామతల్లికి అపారమయిన సేవ జేసి ముద్దుబిడ్డడయ్యాడు.
అతనిని గూర్చి నేను సభలో ఆశువుగా చెప్పిన పద్యాలు.
సీ:-
" సి " సలైన హిందువు చేయెత్తి జై కొట్ట
" పి " న్నలు పెద్దలు పేర్మి బొగడ.
" బీ " జ మట్టుల పద్య రాజము లందించి,
" ఆర్ "తిని బాపిన యమరు డతడు.
" ఓ " కంట కనిపెట్టి యుత్కంఠ మదితో-
-" డ
బల్యూ " హలకు రూప బ్రహ్మ యతడు.
" ఎన్ " ని నాళ్ళైనను మన్నలందంగ
మహనీయ సేవలు మహిని జేసి,
గీ:-
తెలుగు కావ్యాల పద్యాల వెలుగ జేసి,
వేమనాదుల జగతిని విశద పరచి,
పండు వెన్నెల తెలుగన ప్రబల జేసె.
సీ.పి. బ్రౌనన మనకున్న ప్రాపనంగ.
" సి " సలైన హిందువు చేయెత్తి జై కొట్ట
" పి " న్నలు పెద్దలు పేర్మి బొగడ.
" బీ " జ మట్టుల పద్య రాజము లందించి,
" ఆర్ "తిని బాపిన యమరు డతడు.
" ఓ " కంట కనిపెట్టి యుత్కంఠ మదితో-
-" డ
బల్యూ " హలకు రూప బ్రహ్మ యతడు.
" ఎన్ " ని నాళ్ళైనను మన్నలందంగ
మహనీయ సేవలు మహిని జేసి,
గీ:-
తెలుగు కావ్యాల పద్యాల వెలుగ జేసి,
వేమనాదుల జగతిని విశద పరచి,
పండు వెన్నెల తెలుగన ప్రబల జేసె.
సీ.పి. బ్రౌనన మనకున్న ప్రాపనంగ.
గీ:-
తెలుగు భాషామతల్లియె పులకరింప,
సేవ జేసిరి భాషకు సీ.పి. బ్రౌను.
వేమనాదుల కవితలు వెలుగు జూచె
బ్రౌను సాహిత్య సేవల ప్రబలె తెలుగు.
తెలుగు భాషామతల్లియె పులకరింప,
సేవ జేసిరి భాషకు సీ.పి. బ్రౌను.
వేమనాదుల కవితలు వెలుగు జూచె
బ్రౌను సాహిత్య సేవల ప్రబలె తెలుగు.
ఉ:-
ఎచ్చట బుట్టినాడొ? మన మీతని సేవలు సంస్మరింపగా
నిచ్చట చేరినాము. మహనీయులు పుట్టిన దేశమందు తా
మెచ్చగ నుండినాడతడు. మేలిమి బంగరు మూర్తి తాను. తా
నచ్చపు భారతీయుడన యద్భుత సేవలు జేసె నిచ్చటన్.
ఎచ్చట బుట్టినాడొ? మన మీతని సేవలు సంస్మరింపగా
నిచ్చట చేరినాము. మహనీయులు పుట్టిన దేశమందు తా
మెచ్చగ నుండినాడతడు. మేలిమి బంగరు మూర్తి తాను. తా
నచ్చపు భారతీయుడన యద్భుత సేవలు జేసె నిచ్చటన్.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.