గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, నవంబర్ 2008, శుక్రవారం

నిర్గుణ్యమేవ సాధీయో . . . మేలిమి బంగారం మన సంస్కృతి 19

లోకం తీరు:-

ఈ లోకంలో మనం చూస్తున్నాం. సుగుణ పూర్ణులను అవమానమానించుటయు, నిర్గుణులను, దుర్గుణులను గౌరవించుటయు అక్కడక్కడా జరుగుతోంది. దీని విషయంలో చక్కని శ్లోకమొకటుంది. చూద్దామా!
శ్లో. నిర్గుణ్యమేవ సాధీయో ధిగస్తు గుణ గౌరవం
శాఖినోన్యే విరాజంతే ఖండ్యంతే చందన ధృమాః !

గీ. నిర్గుణుని గౌరవింతురు నిజము కాదె?
సద్గుణుని గౌరవింపరు చక్కగాను.
విషపు వృక్షము జోలికి వెళ్ళ లేరు.
మంచి గంధపు చెట్టును త్రుంచుదు రిల.

భావము:- దుష్టులన్నను, మూర్ఖులన్నను, భయ విహ్వలురై వారి జోలికి ఎవరూ పోరు. ఆదుష్టత్వమే, ఆ మూర్ఖత్వమే వారి రక్షా కవచము. మంచివారన్నచో లోకువ కావుననే వారిని లెక్క చేయరు. చూడండి. ముండ్ల చెట్టు జోలికెవ్వరూ పోరు. మంచి గంఢపు చెట్టునయితే ముక్క ముక్కలు చేసి పట్టుకు పోతారు కదా.
ఏమి లోకువండి. ఏమి లోకమండి. ఆ పరమాత్మయే మంచి వారికి రక్ష.
జైహింద్.
Print this post

2 comments:

yuddandisivasubramanyam చెప్పారు...

excellent treasure of knowledge.
my gratitude to you.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆర్యా! సుబ్రహ్మణ్యం గారూ! మీ స్పందనకు ధన్యవాదాలండి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.