పోతన భాగవతము లోని కథా క్రమమును దశమ స్కంధము వరకు తెలుసుకొన్నాము కదా! ఇప్పుడు ఏకాదశ { 11 వ } , ద్వాదశ { 12 వ } స్కంధములలోని కథా క్రమమును తెలుసుకొందామా? ఐతే చూడండి.
పోతన భాగవత కథా క్రమము. ఏకాదశ { 11 వ } స్కంధము.
విశ్వామిత్ర వసిష్ఠ నారదాది మహర్షులు శ్రీ కృష్ణ సందర్శనంబునకు వచ్చుట.
వసుదేవునికి నారదుడు పురాతనంబగు విదేహర్షభ సంవాదంబు దెలుపుట.
బ్రహ్మాది దేవతలు శ్రీ కృష్ణుని వైకుంఠమునకు బిలువ వచ్చుట.
కృష్ణుడు దుర్నిమిత్తంబులంగని యాదవుల నెల్ల ప్రభాస తీర్థమునకు బంపుట.
కృష్ణుడుద్ధవునకు బరమార్ధోపదేశము సేయుట.
అవధూత యదు సంవాదము.
శ్రీకృష్ణ బలరాములు వైకుంఠమున కరుగుట.
ఏకాదశ { 11 వ } స్కంధమునందలి కథా క్రమము సమాప్తము.
ద్వాదశ { 12 వ } స్కంధ కథా క్రమము.
శుకయోగి పరీక్షిత్తునకు భావి కాల గతుల జెప్పుట.
యుగ ధర్మ ప్రాకృతాది ప్రళయ చతుష్టయ వివేచనము.
పరీక్షిత్తు తక్షకునిచే దష్టుండై మృతినొంద అతని పుత్రుడు సర్ప యాగము సేయుట.
శ్రీ వేదవ్యాసుడు వేదములను పురాణములను లోకమందు ప్రవర్తింప చేయుట.
మార్కండేయోపాఖ్యానము.
చైత్రాది మాసంబుల సంచరించెడు ద్వాదశాదిత్యుల క్రమంబును తెలుపుట.
ద్వాదశ { 12 వ } స్కంధము సమాప్తము.
ఇంత వరకు కథా క్రమాన్ని చూచిన మనం ఇకపై ప్రతీ కథలో నున్న బాల రసాల సాల నవ పల్లవ కోమలత్వాన్ని తెలుసుకొనే ప్రయత్నం చేద్దామా! ఆ శ్రీమహా విష్ణువు మన ఆకాంక్ష తీర్చును గాక.
జై శ్రీమన్నారాయణ.
జైహింద్.
Print this post
లాక్షాగృహమందు లవుడు లంకిణి గూల్చెన్. అనే సమస్యకు శ్రీ మరుమామల
దత్తాత్రేయావధాని పూరణ.
-
జైశ్రీరామ్.
శ్రీ మరుమామల దత్తాత్రేయావధాని
సమస్య.
*లాక్షాగృహమందు| లవుడు| లంకిణి గూల్చెన్.*
*మా తమ్ముని పూరణ.*
కం. రక్షణనిడె భీముడెచట?
రక్షాంతక రామ త...
2 రోజుల క్రితం
3 comments:
మహోపన్యాసకులకు నమస్కారము
మీ బ్లాగులు చాలా బాగున్నాయి. మీతో పరిచయము కోరుతున్నాను.
నా గురించి. నేనొక రిటైర్డు ఇంజనీరుని. ఇప్పుడు భాగవతము గణనాధ్యాయిని.. వీలయితే నడుస్తున్న నా గణనోపాఖ్యనము pothana-telugu-bhagavatham.blogspot.com/ లో చూడగోర్తాను
సాంబ శివాఖ్య!మీమనసు చల్లని వెన్నకుతీసిపోదు. ఆ
యంబకటాక్షముండి మిము హాయిగ నేడిటుపొందినాడ. నా
సంబర మేమి చెప్పనగు సద్గుణ గణ్యులు సాంబ శైవులే
అంబరమంటు సంతసము నల్లన వ్యక్తము చేసినారిటన్.
అమృతము కురిసిన రాత్రి[i] యంటే అనుభవమై
ఏకత్వానేకత్వసామర్థ్య[ii]! వొంటి మీద తెలివొచ్చాక
ఈ ना छीज को భాగవతం గణించ నాఙ్ఞనిచ్చారని
నే నుకొనే గురుసాయి కృప చూసి ఆనందంతో
తబ్బిబ్బయ్యి ఆయంబ కటాక్షమున్న మహామహుని
ద్వారా ఆయమ్మ కరుణకూడ అందిస్తున్నాడా యని
ఆశ్తర్యపడి ఇరవ్వైయేళ్ల[iii] పైన విశాఖుడనయ్యు అందుకో
కోవచ్చని తెలిసికోలేకపోయినందుకు బాధపడుతూ
అరవైలకొచ్చిన అబ్బాయినేకదా ఆలస్యమేమి కాలేదని
ఆనందిస్తూ
మీ పలుకులు నాకు ద్విగుణోత్సాహం ప్రసాదిస్తున్నాయని
గణన గణనీయంగా చేయగలనని తెలుపుకుంటూ
మీ పలుకలలోని చల్లనివెన్న సద్గుణాలు ఆ శైవస్వరూప
దివ్యునవే యని మనవి చేసుకుంటున్నాను
- మీ స్నేహ మాధుర్యాన్ని ఆశ్వాదిస్తూ
(భగవతగణనాధ్యాయి)
________________________________
[i] 250709న ఇక్కడ సింగపూర్లో రాత్రి చూసాను
[ii] ఏకపత్నీత్వంతో రాము .. అయ్యయ్యో హనుమంతుని ముందు కుప్పిగంతులు
[iii] 71 నుండి 93 వరకు విశాఖలోనే ఉన్నా
--
ఊసా
(ఊలపల్లి సాంబశివ రావు.)
కామెంట్ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.