గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, మే 2024, సోమవారం

నమః సూర్యాయ శాంతాయ .. మేలిమిబంగారం మన సంస్కృతి.

జైశ్రీరామ్.

శ్లో.  నమః సూర్యాయ శాంతాయ  -  సర్వరోగ నివారిణే!

ఆయు రారోగ్య ఐశ్వర్యo  -  దేహి! దేవః జగత్పతే!!

తే.గీII.  సూర్య దేవా! జగత్పతీ! శుభద! నతులు!

రోగములు పాపి శాంతి సద్యోగములను

కొలుపువాఁడవు కృపతోడఁ గొలుపు మాకు

ఆయురాగ్య సంపదలనుపమముగ.

భావము:-

ఓ సూర్యదేవ! జగత్ పరిపాలకా! నీకిదే నా నమస్కారము. నీవు సర్వరోగములను 

తొలగించువాడవు. శాంతిని ఒసంగువాడవు. మాకు ఆయువును,ఆరోగ్యమును, 

సంపదను అనుగ్రహించుము.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.