జైశ్రీరామ్.
శివాలయమున శివుని దర్శించు పద్ధతి తెలుపు శ్లోకము.
శ్లోII వృషస్య వృషణం స్పృష్ట్వా శృంగమధ్యే శివాలయమ్ |
దృష్ట్వా క్షణం నరో యాతి కైలాసే శివ సన్నిధమ్ ||
తే.గీ.II వృషభ వృషణమంటి, శృంగమధ్యమునుండి
భక్తితోడమనము పరవశమున
శివునియాలయమున శివదర్శనంబును
క్షణము చేయ ముక్తి కలుగు నిజము.
భావము. శివాలయమునకు వెళ్ళిన భక్తులు శివుని వాహనమయిన
వృషభము యొక్క వృషణము చేతితో తాకి, ఆ వృషభము
కొమ్ముల మధ్యనుండి శివలింగ దర్శనము భక్తితో చేసినచో
ముక్తి తప్పక లభించును.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.