జైశ్రీరామ్.
శ్లో. ఇన్ద్రియాణి చ సంయమ్య - బకవత్ పణ్డితో నరః |
దేశకాల బలం జ్ఞాత్వా - సర్వకార్యాణి సాధయేత్ ||
తే.గీ. పండితులుబకమట్టుల నుండవలయు
పనులనేకాగ్రచిత్తులై ఫలితమంద
దేశకాలస్వశక్తులతెలుసుకొనుచు
పనులనన్నిటిన్ సాధించి పరఁగవలయు.
భావము. బుద్ధిమంతుడైన మనుష్యుడు కొంగవలె నేకాగ్రచిత్తుడై
యింద్రియములను వశమునందుంచుకొని, దేశమును, కాలమును,
తన బలమును తెలిసికొని సమస్త కార్యములను సాధింపవలెను.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.