గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, మే 2024, గురువారం

అవాహూతః ప్రవిశ్యతి. .. మేలిమి బంగారం మన సంస్కృతి.

జైశ్రీరామ్.

 శ్లో.  అవాహూతః ప్రవిశ్యతి అపృష్టో బహుభాషతే,

అవిస్యస్తే విశ్వసితి మూఢ చేతా నరాధమః. (విదురనీతి)

తే.గీ.  మూఢమతి నరాధముఁడు తా పోవుచుండు

పిలువకున్నను పరగృహంబలుసుఁడగుచు,

నడుగకున్నను మాటాడునధికముగను,

నమ్మకూడని వారిని నమ్ముచుండు.

భావము. మూఢ మతియగు నరాధముడు పిలువబడకయే పరులకడకేగును, 

ఎవ్వరెమియు అడగకకున్నను అధికముగా మాటలాడును, నమ్మగూడని వారిపై 

విశ్వాసముంచును.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.