గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, మే 2024, బుధవారం

వినుత,నుతమతి,విమలత,అగణిత,గుణఖని,చనుమతి,సామత,జగతి,దీపమ,తగుతగ, మగసరి,వెనుదిరుగు,జనహిత,బెగలకు,"గర్భ,మేలొనరు"వృత్తము,రచన;-వల్లభవఝల అప్పల నరసింహమూర్తి,

 జైశ్రీరామ్.

తను వినుత నుత మతిన్!తగు తగ వర్తిలుమా!తరుగని కీర్తి ధర్మతన్!
మను విమల మతి యుతిన్!మగసరి వీవె యనన్!మరువరు సర్వ కాలమున్!
విను మగణిత మతివై!బెగలక సాగు ధృతిన్!వెను దిరు గేల?మానవా!
చను మతి హిత మరయన్!జగతికి దీపమవై!జనులకు మేలు జేయుమా!

సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి "అనిరుద్ఛందాంతర్గత, ఉత్కృతి
ఛందము లోనిది,ప్రాసనియమము కలదు,పాదమునకు,26.అక్షరము లుండును,
యతులు.10,18,అక్షరములకు చెల్లును,

1.గర్భగత"వినుత"వృత్తము,

తను వినుత నుత మతిన్!
మను విమల మతి యుతిన్!
విను మగణిత మతివై!
చను మతి హిత మరయన్!

అభిజ్ఞా ఛుదము నందలి "బృహతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"9.అక్షరము లుండును,

2.గర్భగత"నుతమతి"వృత్తము,

తగు తగ వర్తిలుమా!
మగసరి వీవె యనన్!
బెగలక సాగు ధృతిన్!
జగతికి దీపమవై!

అభిజ్ఞా ఛందము నందలి "అనుష్టుప్"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"8"అక్షరము లుండును,

3.గర్భగత"విమలత"వృత్తము,

తరుగని కీర్తి ధర్మతన్!
మరువరు సర్వ కాలమున్!
వెరపది మాను మానవా!
చరితను నిల్వు మంచిగన్!

అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"9"అకంషరము లుండును,

4.గర్భగత"అగణిత"వృత్తము,

తను వినుత నుత మతిన్!తగుతగ వర్తిలుమా!
మను విమల మతియుతిన్!మగసరి వీవె యనన్!
విను మగణిత మతివై!!బెగలక సాగు ధృతిన్!
చనుమతి హిత మరయన్!జగతికి దీపమవై!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిదె,
ప్రాసనియమము కలదు,పాదమునకు"17"అక్షరము లండును,
యతి.10,వ యక్షరమునకు చెల్లును,

5.గర్భగత"గుణఖని"వృత్తము,

తగు తగ వర్తిలుమా!తను వినుత నుత మతిన్!
మగసరి వీవె యనన్!మను విమల మతి యుతిన్!
బెగలక సాగు ధృతిన్!విను మగణిత మతివై!
జగతికి దీపమవై!చను మతి హిత మరయన్!

అణిమా ఛందము నందలి "అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"9,వ యక్షగమునకు చెల్లును,

6.గర్భగత"చను మతి"వృత్తము,

 తను వినుత నుత మతిన్!తరుగని కీర్తి ధర్మతన్!
మను విమల మతి యుతిన్!మరువరు సర్వ కాలమున్!
విను మగణిత మతివై!వెరపది మాను మామానవా!
చను మతి హిత మరయన్!జనులకు మేలు జేయుమా!

అణిమా ఛందము నందలి"ధృతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"18"అక్షరము లుండును,
యతి"10"వ యక్షరమునకు చెల్లును,

7.గర్భగత"సామత"వృత్తము,

తరుగని కీర్తి ధర్మతన్!తను వినుత నుత మతిన్!
మరువరు సర్వ కాలమున్!మను విమల మతి యుతిన్!
వెరపది మాను మానవా!విను మగణిత మతివై
చరితను నిల్వు మంచివై!చను మతి హిత మరయన్!

అణిమా"ఛందము నందలి."ధృతి ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"10"వ యక్షరమునకు చెల్లును,

8.గర్భగత"జగతి"'వృత్తము,

తగు తగ వర్తిలుమా!తరుగని కీర్తి ధర్మతన్!
మగ సరి వీవ యనన్!మరువరు సర్వ కాలమున్!
బెగలక సాగు ధృతిన్!వెరపది మానుమానవా!
జగతికి దీపమవై!చరితను నిల్వు మంచివై!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు 17,అక్షరము లుండును,
యతి"9"వ యక్షరమునకు చెల్లును,

9.గర్భగత"దీపమ"వృత్తము,

తరుగని కీర్తి ధర్మతన్!తగు తగ వర్తిలుమా!
మరువరు సర్వ కాలమున్!మగసరి వీవ యనన్!
వెరపది మాను మానవా!బెగలక సాగు ధృతిన్!
చరితను నిల్వు మంచివై!జగతికి దీపమవై!

అణిమా ఛందము నందలి"అత్యష్టి ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు "17"అక్షరము లుండును,
యతి,10,వ యక్షరమునకు చెల్లును,

10.గర్భగత"తగు తగ"వృత్తము,

తగు తగ వర్తిలుమా!తను వినుత నుత మతిన్!తరగని కీర్తి ధర్మతన్!
మగసరి వీవ యనన్!మను విమల మతి యుతిన్!మరువరు సర్వ కాలమున్!
బెగలక సాగు ధృతిన్!విను మగణిత గుణివై!వెరపది మాను మానవా!
జగతికి దీపమవై!చను మతి హిత మరయన్!చరితను నిల్వు మంచివై!

అనిరుద్ఛందము నందలి "ఉత్కృతి "ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,9,18,అక్షరములకు చెల్లును,

11.గర్భగత"మగసరి"వృత్తము,

తను వినుత నుత మతిన్!తరగని కీర్తి ధర్మతన్!తగు తగ వర్తిలుమా!
మను విమల మతి యుతిన్!మరువరు సర్వ కాలమున్!మగసరి వీవ యనన్!
విను మగణిత గుణివై!వెరపది మాను మానవా!బెగలక సాగు ధృతిన్!
చను మతి హిత మరయన్!చరితను నిల్వు మంచివై!జగతికి దీపమవై!

అనిరుద్ఛందము నందలి "ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు.10,19,అక్షరములకు చెల్లును,

12.గర్భగత" వెను దిరుగు"వృత్తము,

తరుగని కీర్తి ధర్మతన్!తను వినుత నుత మతిన్!తగు తగ వర్తిలుమా!
మరువరు సర్వ కాలమున్!మను విమల మతి యుతిన్!మగసరి వీవ యనన్!
వెరపది మాను మానవా!విను మగణిత గుణివై!బెగలక సాగు ధృతిన్!
చరితను నిల్వు మంచివై!చను మతి హిత మరయన్!జగతికి దీపమవై!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,19,అక్షరములకు చెల్లును,

13.గర్భగత"-జనహిత"వృత్తము,

తగు తగ వర్తిలుమా!తరుగని కీర్తి దర్మతన్!తను వినుత నుత మతిన్!
మగసరి వీవ యనన్!మరువరు సర్వ కాలమున్!మను విమల మతి యుతిన్!
బెగలక సాగు ధృతిన్!వెరపది మాను మానవా! విను మగణిత గుణివై!
జగతికి దీపమవై!చరితను నిల్వు మంచివై!చను మతి హిత మరయన్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,9,18,అక్షరములకు చెల్లును.

14.గర్భగత"బెగలకు"వృత్తము,

తరగని కీర్తి ధర్మతన్!తగు తగ వర్తిలుమా!తను వినుత నుత మతిన్!
మరువరు సర్వ కాలమున్!మగసరి వీవ యనన్!మను విమల మతి యుతిన్!
వెరపది మాను మానవా!బెగలక సాగు ధృతిన్!విను మగణిత గుణివై!
చరితను నిల్వు మంచివై!జగతికి దీపమవై!చను మతి హిత మరయన్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,18.అక్షరములకు చెల్లును,

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.