గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, మే 2024, మంగళవారం

విశ్వ విభు,వేదవేద్యు,బోది వృక్ష,రాధామయ,వేకువకల,శ్లోకిత,మాధవ,స్తుతి వర,ధన్యోపమ,పశుతుల్య,అరిషడుల,ధన్యతా,జ్ఞానినా,సుస్వప్న,గర్భ"ఆర్తి దూర"వృత్తము... రచన:-వల్లభవఝల ఆప్పల నరసింహమూర్తి,

జైశ్రీరామ్.

 వేద వేద్యు విశ్వ విభునిన్!వేకువ కల గాంచి నాడ!విశ్వ స్తుత్యు స్తోత్రము లున్!

సాధితంబు పెంచు ప్రభునిన్! సాక గలమె మల్లి నాధు!శశ్వదార్తి దూరమవన్!
పాదు కొల్పు జ్ఞాన మెలమిన్ ! ప్రాకి దరియ నెంచి నాడ!పశ్వ సామ్య జ్ఞాన గమిన్!
రాధ మాధవం బిదనన్!రాకసి యరిష్టు లేగె!రాశ్వదాన్య ధన్యు కృపన్!

సృజనాత్మక గర్భ కవితా స్రృవంతి యందలి"అనిరుద్ఛందాంతర్గత"ఉత్కృతి'
ఛందము లోనిది,ప్రాసనియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు.10.19.అక్షరములకు చెల్లును,

పోకము=పొంకము(గర్వము).రాశి+వదాన్య ధన్యు=రాశి చక్ర మందలి గురుతముడగు
గురుడు, 

1.గర్భగత"విశ్వ విభు"వృత్తము,

వేద వేద్యు విశ్వ విభునిన్!
సాధితంబు పెంచు ప్రభునిన్!
పాదు కొల్పు జ్ఞాన మెలమిన్!
రాధ మాధవం బిదనన్!

అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"9"అక్షరములుండును,

2.గర్భగత"వేద వేద్యు"వృత్తము,

వేకువ కల గాంచినాడ!
ప్రాక గలమె మల్లి నాధు!
ప్రాకి దరియ నెంచి నాడ!
రాకసి యరిషట్టు  లేగె!

అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"9"అక్షరములుండును,

3,గర్భగత"బోది వృక్ష"వృత్తము,

విశ్వ స్తుత్యు స్త్రోత్రములన్!
శశ్వ దార్తి దూరమవన్!
పశ్వ సామ్య జ్ణాన గమిన్!!
రాశ్వదాన ధన్యు కృపన్!

అభిజ్ఞా ఛందము నందలి,అనుష్టుప్"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"8"అక్షధము లుండును,

4,గర్భగత"రాధామయ"వృత్తము,

వేద వేద్యు విశ్వ విభునిన్!వేకువ కల గాంచి నాడ!
సాధితంబు పెంచు ప్రభునిన్!సాక గలమె?మల్లి నాధు!
పాదు కొల్పు జ్ఞాన మెలమిన్!  ప్రాకి దరియ నెంచి నాడ!
రాధ మాధవం బిదనన్!రాకసి యరి షట్టు లేగె!

అణిమా ఛందము నందలి"ధృతి ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"18"అక్షరము లుండిను,
యతి"10,వ యక్షరమునకు చెల్లును,

5.గర్భగత"వేకువ కల"వృత్తము,

వేకువ కల గాంచి నాడ!వేద వేద్యు విశ్వ విభునిన్!
సాక గలమె?మల్లి నాధు!సాధితంబు పెంచు ప్రభునిన్!
ప్రాకి దరియ నెంచి నాడ! పాదుకొల్పు జ్ఞాన మెలమిన్!
రాకసి యరి షట్టు లేగె!రాధ మాధవం బిదనన్!

అణిమా ఛందము నందలి"ధృతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు.పాదము నకు18.అక్షరము లుండును,
యతి"10,వ యక్షరమునకు చెల్లును,

6.గర్భగత"శ్లోకిత"వృత్తము,

వేద వేద్యు విశ్వ విభునిన్!విశ్వ స్తుత్యు స్తోత్రములన్!
సాధితంబు నిల్పు ప్రభున్!శశ్వ దార్తి దూరమవన్!
పాదుకొల్పు జ్ఞాన మెలమిన్!పశ్వ సామ్య జన్మ గమిన్!
రాధ మాధవం బిదనన్!రాశ్వదాన్య ధన్యు కృపన్!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
 ప్రాసనియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి10,వ యక్షరమునకు చెల్లును,

7,గర్భగత"మాధవ"వృత్తము.

విశ్వ స్తుత్యు స్తోత్రములన్!వేద వేద్యు విశ్వ విభునిన్!
శశ్వ దార్తి దూరమవన్!సాధితంబు నిల్పు ప్రభున్!
పశ్వ సామ్య జన్మ గమిన్!పాదు కొల్పు జ్ఞాన మెలమిన్!
రా శ్వదాన్య ధన్యు కృపన్!రాధ మాధవం బిదనన్!

అణిమా ఛందము నందలి"అత్యష్టి "ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును,
యతి,9,వ యక్షరమునకు చెల్లును,

8,గర్భగత"స్తుతి వర"వృత్తము,

వేకువ కల గాంచి నాడ !విశ్వ స్తుత్యు స్తోత్రములన్!
సాక గలమె?మల్లి నాధు!శశ్వ దార్తి దూరమవన్!
ప్రాకి దరియ నెంచి నాడ!పశ్వ సామ్య జన్మ గమిన్!
రాకసి యరిషట్టు లేగె!రాశ్వదాన ధన్యు కృపన్!

అణిమా ఛందము నందలి"అత్యష్టి ఛందము లో నిది.
ప్రాస నియమము కలదు,పాదమునకు17"అక్షరము లుండును,
యతి,10,వ యక్షరమునకు చెల్లును,

9,గర్భగత"ధన్యు కృప"-వృత్తము,

విశ్వ స్తుత్యు స్తోత్రములన్!వేకువ కల గాంచి నాడ!
శశ్వ దార్తి దూరమవన్!సాక గలమె?మల్లి నాధు!
పశ్వ సామ్య జన్మ గమిన్!ప్రాకి దరియ నెంచి నాడ!
రాశ్వదాన ధన్యు కృపన్!రాకసి యరి షట్టు లేగె!

అణిమా ఛందము నందలి"అత్యష్టి ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు 17"అక్షరములుండును,
యతి,9,వ యక్షరమునకు చెల్లును,

10,గర్భగత"-పశు తుల్య"వృత్తము,

వేకువ కల గాంచి నాడ!వేద వేద్యు విశ్వ విభునిన్!విశ్వ స్తుత్యు స్తోత్రములన్!
సాక గలమె?మల్లి నాధు!సాధితంబు నిల్పు ప్రభునిన్!శశ్వ దార్తి దూరమవన్!
ప్రాకి దరియ నెంచి నాడ!పాదు కొల్పు జ్ఞాన మెలమిన్!పశ్వ సామ్య జన్మ గమిన్!
రాకసి యరి షట్టు లేగె!రాధ మాధవం బిదనన్!రాశ్వదాన్య ధన్యు కృపన్!

అనిరుద్ఛందము నందలి"-ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు.10,19,అక్షరములకు చెల్లును,

11.గర్భగత" అరిషడుల"వృత్తము,

వేద వేద్యు విశ్వ విభునిన్! విశ్వ స్తుత్యు స్తోత్రములన్!వేకువ కల గాంచి నాడ!
సాధితంబు నిల్పు ప్ర భునిన్! శశ్వ దార్తి దూరమవన్!సాక గలమె మల్లి నాధు!
పాదు కొల్పు జన్మ మెలమిన్!పశ్వసామ్య జన్మ గమిన్!ప్రాకి దరియ నెంచి నాడ!
రాధ మాధవం బిదనన్!రాశ్వదాన్య ధన్యు కృపన్!రాకసి యరిషట్టు లేగె!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,18,అక్షరములకు చెల్లును,

12.గర్భగత"ధన్యతా"వృత్తము,

విశ్వ స్తుత్య స్తోత్రములన్!వేద వేద్యు విశ్వ విభు నిన్!వేకువ కల గాంచి నాడ!
శశ్వదార్తి దూరమవన్!సాధితంబు నిల్పు ప్రభునిన్!సాక గలమె మల్లి నాధు!
పశ్వ సామ్య జన్మ గమిన్!పాదు కొల్పు జన్మ మెలమిన్!ప్రాకి దరియ నెంచి నాడ!
రాశ్వదాన్య ధన్యు కృపన్!రాధ మాధవం బిదనన్!రాకసి యరి షట్టు లేగె!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు9,18,అక్షరము లకు చెల్లును,

13,గర్భగత"జ్ఞానినా"-వృత్తము,

వేకువ కల గాంచి నాడ!విశ్వ స్తుత్యు స్తోత్రములన్!వేద వేద్యు విశ్వ విభునిన్!
సాక గలమె?మల్లి నాధు!శశ్వ దార్తి దూరమవన్!సాధితంబు నిల్పు ప్రభునిన్!
ప్రాకి దరియ నెంచి నాడ!పశ్వ సామ్య జస్మ గమిన్!పాదు కొల్పు జన్మ మెలమిన్!
రాకసి యరి షట్టు లేగె!రాశ్వదాన్య ధన్యు కృపన్!రాధ మాధవం బిదనన్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు"10,18,అక్షరములకు చెల్లును,

14,గర్భగత"సుస్వప్న"వృత్తము,

విశ్వ స్తుత్యు స్తోత్రములన్!వేకువ కల గాంచి నాడ!వేద వేద్యు విశ్వ విభునిన్!
శశ్వ దార్తి దూరమవన్!సాక గలమె?మల్లినాధు!సాధితంబు నిల్పు ప్రభున్!
పశ్వ సామ్య జన్మ గమిన్!ప్రాకి దరియ నెంచి నాడ!పాదు కొల్పు జన్మ మెలమిన్!
రాశ్వదాన్య ధన్యు కృపన్!రాకసి యరిషట్టు లేగె!రాధ మాధవం బిదనన్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"26"అక్షరముఞలుండును,
యతులు,9,18,అక్షరములకు చెల్లును,
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.