జైశ్రీరామ్.
శ్లో. నిన్దాం యః కురుతే సాధోః - తథా స్వం దూషయత్యసౌ।
ఖే భూతిం యః క్షిపేదుచ్ఛై - ర్మూర్ధ్ని తస్యైవ సా పతేత్॥
తే.గీ. సుజనులను నింద చేసిన చూడ తనను
తానె నిందించుకొనుటౌను, జ్ఞానులార!
బూడిదను పైకి విసిరిన పూర్తిగాను
మీదె పడునది, తెలియుఁడు మోదమలర.
భావము. సత్పురుషుని నింద చేసేవాడు తనను తానే నిందించుకున్న
వాడవుతాడు. ఆకాశంలోకి గట్టిగా బూడిదను విసిరితే అది అతడిపైకే
వచ్చి పడుతుంది కదా.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.