గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, మే 2024, శుక్రవారం

తరుము,నురుగు,వెలుగుల,వరామ,"గర్భ గురుతమ"వృత్తము, .. రచన శ్రీవల్లభవఝల అప్పల నరసింహమూర్తి,.

జైశ్రీరామ్


దేవదేవు మేని  ఛాయలా!తేట తెలుగు వెలుగులా!తీరోర్మి  నురుగు బలెన్!
భావజాల హాస్య భంగిమన్!పాటు పడెడి మనిషిలా!పారంగత వరములా!
శ్రీ వరామ శోభ  పెంపులా!చేటు తరుము పరశులా!శ్రీ రాముని మనసులా!
పావనంబు భారతంబగున్!వాటమొనరు శుభములన్!పారుం వర గురుతమై!

సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి,అనిరుద్ఛందాంతర్గత"ఉత్కృతి"
ఛందము లోనిది,ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు.10,19,అక్షరములకు చెల్లును,

తీరోర్మి=సముద్ర తీర కెరటము.పరశులా=గండ్ర గొడ్డలి వలె.

1.గర్భగత"ఛాయలా"వృత్తము,

దేవ దేవు మేని ఛాయలా!
భావజాల హాస్య భంగిమన్!
శ్రీ వరామ శోభ పెంపులా!
పావనంబు భారతంబగున్!

అభిజ్ఞా ఛందము నందలి "బృహతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు 9,అక్షరము లుండును,

2.గర్భగత"హాస్య"వృత్తము,

తేట తెలుగు వెలుగులా!
పాటు పడెడి మనిషీలా!
చేటు తరుము పరశులా!
వాట మొనరు శుభములన్!

అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"9"అక్షరము లుండును,

3.గర్భగత"శోభిల"వృత్తము,

తీరోర్మి నురుగు బలెన్!
పారంగత వరములా!
శ్రీరాముని మనసులా!
పారుం వర గురుతమై!

అభిజ్ఞా ఛందము నందలి"అనుష్టుప్"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు8,అక్షరము లుండును,

4,గర్భగత"స్వచ్ఛతా"వృత్తము,

దేవ దేవు మేని ఛాయలా!తేట తెలుగు వెలుగులా!
భావజాల హాస్య భంగిమన్!పాటు పడెడి మనిషిలా!
శ్రీ వరామ శోభ పెంపులా!చేటు తరుము పరశు లా!
పావనంబు భారతం బవన్!వాట మొనరు శుభములన్!

అణిమా ఛందము నందలి"ధృతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు.పాదమునకు"18"అక్షరము లుండును,
యతి"10"వ యక్షరములకు చెల్లును,

5,గర్భగత"తీరోర్మి "వృత్తము,

తేట తెలుగు వెలుగులా!దేవ దేవు మేని ఛాయలా!
పాటు పడెడి మనిషిలా!భావజాల హాస్య భంగిమన్!
చేటు తరుము పరశులా!శ్రీ వరామ శోభ పింపులా!
వాట మొనరు శుభములన్!పావనంబు భారతంబవన్!

అణిమా ఛందము నందలి"ధృతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"18"అక్షరము లుండును,
యతి"10"వ యక్షరమునకు చెల్లును,

6.గర్భగత"భంగిమ"వృత్తము,

దేవ దేవు మేని ఛాయలా!తీరోర్మి నురుగు బలెన్!
భావ జాల హాస్య భంగిమన్!పారంగత వరములా!
శ్రీ వరామ శోభ పెంపులా!శ్రీరాముని మనసులా!
పావనంబు భారతంబవన్!పారుం వర గురుతమై!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు'"17"అక్షరము లుండును,
యతి.10,వ యక్షరమునకు చెల్లును,

7.గర్భగత"పాటుపడు"వృత్తము,

తీరోర్మి నురుగు బలెన్!దేవ దేవు మేని ఛాయలా!
పారంగత వరములా!భావజాల హాస్య భంగిమన్!
శ్రీరాముని మనసులా!శ్రీ వరామ శోభ పెంపులా!
పారుం వర గురుతమై!పావనంబు భారతంబవన్!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"9"వ యక్షరమునకు చెల్లును,

8,గర్భగత"పావన"వృత్తము,

తేట తెలుగు వెలుగులా!తీరోర్మె నురుగు బలెన్!
పాటు పడెడు మనిషిలా!పారంగత వరములా!
చేటు తరుము పరశులా!శ్రీరాముని మనసులా!
వాటమొనరు శుభములన్!పారుం వర గురుతమై!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"10,వ యక్షరమునకు చెల్లును,

9.గర్భగత"రామక"వృత్తము,

తీరోర్మె నురుగు బలెన్!తేట తెలుగు వెలుగులా!
పారంగత వరములా!పాటు పడెడు మనిషిలా!
శ్రీరాముని మనసులా!చేటు తరుము పరశులా!
పారుంవర గురుతమై!వాట మొనరు శుభములన్!

అణిమా ఛందము నందలి"అత్యష్టి ఛందము లో నిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"17"అక్షఠము లుండును,
యతి"9,వ యక్షరమునకు చెల్లును,

10.గర్భగత"పారంగత"వృత్తము,

తేట తెలుగు వెలుగులా!దేవదేవు మేని ఛాయలా!తీరోర్మి నురుగుబలెన్!
పాటు పడెడు మనిషిలా!భావజాల హాస్య భంగిమన్!పారంగత వరములా!
చేటు తరుము పరశులా!శ్రీ వరామ శోభ పెంపులా!శ్రీరాముని మనసులా!
వాట మొనరు శుభములన్!పావనంబు భారతంబవన్!పారుం వర గురుతమై!

అనిరుద్ఛందము నందలి "ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు.10,19,అక్షరములకు చెల్లును,

11.గర్భగత"తరుము"వృత్తము,

దేవ దేవు మేనిఛాయలా!తీరోర్మీ నురుగు బలెన్!తేట తెలుగు వెలుగులా!
భావజాల హాస్య భంగిమన్!పారంగత వరములా!పాటు పడెడు మనిషిలా!
శ్రీ వరామ శోభ పెంపులా!శ్రీరాముని మనసులా!చేటు తరుము పరశులా!
పావనంబు భారతంబవన్!పారుం వర గురుతమై!వాట మొనరు శుభములన్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,18,అక్షరములకు చెల్లును,

12,గర్భగత"-నురుగు"-వృత్తము,

తీరోర్మి నురుగు బలెన్!దేవ దేవు మేని ఛాయలా!తేట తెలుగు వెలుగులా!
పారంగత వరములా!భావజాల హాస్య భంగిమన్!పాటు పడెడు మనిషీలా!
శ్రీరాముని మనసులా!శ్రీ వరామ శోభ పెంపులా!చేటు తరుము పరశులా!
పారుం వర గురుతమై!పావనంబు భారతం బవన్!వాట మొనరు శుభములన్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు.9,18,అక్షరములకు చెల్లును,

13.గర్భగత"వెలుగుల"వృత్తము,

తేట తెలగు వెలుగులా!తీరోర్మి నురుగు బలెన్!దేవ దేవు మేని ఛాయలా!
పాటుపడెడు మనిషిలా!పారంగత వరములా!భావజాల హాస్య భంగిమన్!
చేటు తరుము పరశులా!శ్రీరాముని మనసులా!శ్రీ వరామ శోభ పెంపులా!
వాట మొనరు శుభములన్!పారుం వర గురుతమై!పావనంబు భారతంబవన్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమమ కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,18,అక్షరములకు చెల్లును,

14.గర్భగత" వరామ"వృత్తము,

తీరోర్మి నురుగు బలెన్!తేట తెలుగు వెలుగులా!దేవ దేవు మేని ఛాయలా!
పారంగత వరములా!పాటు పడెడు మనిషిలా!భావ జాల హాస్య భంగిమన్!
శ్రీరాముని మనసులా!చేటు తరుము పరశులా!శ్రీవరామ శోభ పెంపులా!
పారుం వర గురుతమై!వాట మొనరు శుభములన్!పావనంబు భారతం బవన్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు.9,18,అక్షరములకు చెల్లును,

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.