గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, మే 2024, మంగళవారం

శబ్దబ్రహ్మము.

 జైశ్రీరామ్.

శబ్దబ్రహ్మము.

 

శ్లో.  ఇదం అంధతమః కృత్స్నం - జాయతే భువనత్రయం

యది శబ్దాన్వయం జ్యోతి: - ఆసంసారం న దీప్యతే.


భావము.  మూడు లోకాలలో శబ్దమనే జ్యోతి వెలిగి ఉండక పోతే, 

ఈ సమస్త జగత్తు అంధకారంలో మునిగి ఉండి కనిపించేది కాదు..


శ్లో.  అనాది నిధనం బ్రహ్మ - శబ్దతత్త్వం యదక్షరం

వివర్తతేర్థ భావేన - ప్రక్రియా జగతో యతః.


భావము.  పూర్వకాలంనుండి శబ్ద బ్రహ్మ అక్షరరూపంలో ఈ జగత్తులో 

వ్యాపించి ఉందని, దానిని మనం సభక్తి పూర్వకంగా సేవించాలి.


శ్లో.  నృత్తావసానే నాటరాజ రాజో - ననాద ఢక్కాం నవ పంచవారం, 

ఉద్ధర్తు కామః సనకాది సిద్ధాన్ - ఏతద్విమర్శే శివ సూత్రజాలమ్.

(నవ=తొమ్మిది. పంచ=ఐదు కలిపితే =14)


భావము.  పరమశివుడు నాట్యం చేస్తూ తన ఢమరుకాన్ని పదునాలుగు 

పర్యాయాలు మ్రోగించగా, ఉద్దర్తు కాములయిన సనకాది సిద్ధులు 

శివసూత్రజాలముగా గ్రహించిరి.  ఆ శబ్దం నుండి పుట్టిన అక్షరాలను 

‘పాణిని’ అనే ఋషి గ్రహించి, పదునాలుగు వ్యాకరణ సూత్రాలుగ 

రచించెను. ఆ సూత్రాలే అక్షరాల పుట్టుకకి ముఖ్య భూమికలు. 

అక్షరాలని సృష్టించి సూత్రీకరించింది పాణిని ఐతే, వాటికి 

వార్తీకం వ్రాసినది ‘వరరుచి’. వివరణాత్మకమైన భాష్యాన్ని వ్రాసినది 

‘పతంజలి మహర్షి.’ .


శ్లో.  వాక్యకారం వరరుచిం - భాష్యకారం పతంజలిం,

పాణినిం సూత్రకారంచ - ప్రణతోస్మి మునిత్రయమ్.


అని ముందుగా పైముగ్గురు మునులకి నమస్కరించి, పూర్వం వ్యాకరణాన్ని, 

తద్వారా భాషని అభ్యసించేవారు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.