జైశ్రీరామ్.
ఏకాక్షర పద విన్యాస
కంద పద్యము.
నన్నన్నను నిన్నన్నను.
నిన్నేనని నేనన. నినునేనెన్నను. ని
న్నెన్నను నిన్నే. నన్నె
న్నెన్నా నన్నే నను,నినునేనననన్నా.
భావము:
నన్ను విమర్శించినా, నిన్ను విమర్శించినా, ఆ విమర్శలు అన్నగా నీకే చెందుతాయని నేననగా, నీతో ఏకీభవించను, నీకు వచ్చిన విమర్శలు నీకే, నాకు ఎన్ని విమర్శలు వచ్చినా నాకే అన్న నిన్ను ఏమీ అనక అంగీకరిస్తాను అన్నయ్యా.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.