జైశ్రీరామ్.
శ్లో. లుబ్ధమర్థేన గృహ్ణీయాత్ - స్తబ్ధమంజలి కర్మణా ।
మూర్ఖం ఛన్దోఽను వృత్తేన - యథార్థత్వేన పండితమ్ 11
తే.గీ. లోభియగువాఁడు ధనముచే లొంగు మనకు,
ఘన నతులు నహంకారియున్ గరిగి లొంగు,
మూర్ఖుఁడడిగిన పని చేయ పొంగి లొంగు,
సత్యవాక్కులంలొంగును సద్గుణుండు.
భావము. ధనమునందాసక్తిగల లోభిని ధనముద్వారా, అహంకారిని నమస్కారము
ద్వారా, మూర్ఖుని ఆతని కోరిక ననుసరించి పనిచేసియు, బుద్ధిమంతుడైన వానిని
సత్యవచనముల ద్వారా వశపఱచుకొనవలెను.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.