గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, ఆగస్టు 2019, గురువారం

భారతదేశ 73వ స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు.

జైశ్రీరామ్.
ఆర్యులారా! నేడు 73వ భారతదేశ స్వాతంత్ర్యదినోత్సవము. ఈ సందర్భముగా యావద్భారత జాతికి స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు.

ఆంగ్లేయులు వ్యాపార నెపంతో భారతదేశంలో అడుగు పెట్టి, వారి కుటిల రాజనీతిని ఉపయోగించి భారతదేశ పాలకులలో పరస్పరం వైరం కల్పించి, ఈ అనైక్యతను ఆసరాగా తీసుకొని పరిపాలన చేజిక్కించుకొన్నారు. 2శతాబ్దాలపాటు వారు ఇష్టారాజ్యంగా పరిపాలన సాగించి ప్రజలను కట్టుబానిసలుగా వాడుకున్నారు. అంతే కాక వారి మతాన్ని విపరీతముగా ప్రచారం చేసుకొని మన సాంస్కృతిక మూలలాను సహితం కుదిపేశారు.

ఈ దుస్థితిని సహించలేని ఆత్మాభిమానంగల భారతీయులు స్వాతంత్ర్య కాంక్షతో ఉద్యమించటం ప్రారంభించారు. 1857 లో సిపాయిల తిరుగుబాటుతో స్వాతంత్ర్య పోరాటం ప్రారంభమయిందని చెప్పవచ్చును.
ఈ పోరాటంలో ఎందరో ఎందరెందరో తమ ధన మాన ప్రాణాలను పణంగాపెట్టారు. తమ సర్వస్వం ధారపోశారు.
కుటుంబాలకు కుటుంబాలే భారతమాత స్వేచ్ఛ కోఱకు అసువులు త్యాగం చేశారు.
వేలకు వేలు భారతీయులు బలికాగా కొన్ని పదుల వ్యక్తుల పేర్లు మాత్రమే చరిత్రపుటల్లోకెక్కాయి.
ఇంతటి మహనీయమైన త్యాగుల ఫలితంగానే 14 . 8 . 1947. అర్థరాత్రి సరిగ్గా 12 గంటలకు అనగా 15 . 8 . 1947 ప్రారంభ క్షణమున మనకు స్వాతంత్ర్యాన్ని బ్రిటిష్ పాలకులు ప్రకటించారు.
ఇంతటి మస
హత్తరమైన స్వాతంత్ర్యం మనకు లభించినప్పటికీ మనకు బ్రిటిష్ వాళ్ళు పీల్చి పిప్పిచేసిన దేశమే లభించింది.
ఇక్కడ మరొక్క విషయం మనం మరువలేము.
బ్రిటిష్ వారు పోతూపోతూ దేశాన్ని రెండు ముక్కలు చేసి ఇచ్చి కొట్టుకుచావమన్నారు. ఇ
ఈ అగ్ని ఈ రెండుదేశాలూ ఉన్నంతకాలం సమసిపోయేలా లేదు.
72 సంవత్సరాల తరువాత
370రద్దు చేయబడిన నేడు మనకు కొంత స్వాతంత్ర్యం వచ్చినట్టుంది.
ఇంకా ఆక్రమిత కాస్మీరును కూడా మన ఏలుబడిలోకి తీసుకు రాగలిగినప్పుడే మనకు పరిపూర్ణ స్వాతంత్ర్యం వచ్చినట్టవుతుంది.
దీనిని సాధించాలంటే పాలకులకు చిత్తశుద్ధి చాలా అవసరం.
నిస్వార్థత్వం అవసరం.
నిజాయితీ అవసరం.
అంతే కాదు.
మనం స్వతంత్ర భారతీయులమని గర్వపడ గలిగేది కేవలం పై దేశాలనుండి ఋణవిముక్తులం అయినప్పుడు మాత్రమే అని చెప్పక తప్పదు.
స్వేచ్ఛగా ఆడా మగా తిరగగలగాలి. వ్యక్తిగతమయిన కట్టుబాట్లనతిక్రమించ కూడదు. మానవులంతా ఆర్ధిక సాంఘిక రాజకీయ స్వేచ్ఛను అనుభవించ కలగాలి. ఇది ఏ ఒక్కరో చేసేది కాదు. వ్యక్తి సంస్కారం అందరిలోనూ ప్రతిబించాలి.
స్వార్థం తప్పకుండా ఉండవచ్చు. ఐతే పరార్థం కూడా ఆలోచించకలగాలి.త్యాగశీలత మూలసూత్రంగా అందరిలోనూ పరిమళిస్తే నిజమయిన స్వాతంత్ర్యఫలాలనందరం అనుభవించటం సాధ్యమౌతుందని గ్రహించాలి.
వందే భారత మాతరమ్.
వందే భారత మాతరమ్.
వందే భారతమాతరమ్.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
స్వాతంత్ర దినోత్సవం గురించి చక్కగా వివరించారు. ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.