గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, ఆగస్టు 2019, గురువారం

ధారా,మృదుమానస,వారుణ,సుగమ్య,రసాన్విత,సావధాన,జగజ్జ్యోతి,జగమెడంగు,రసాత్మక,ఉర్మిల,గర్భగత"-ఉర్మిలభంగినీ"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.
ధారా,మృదుమానస,వారుణ,సుగమ్య,రసాన్విత,సావధాన,జగజ్జ్యోతి,జగమెడంగు,రసాత్మక,ఉర్మిల,గర్భగత"-ఉర్మిలభంగినీ"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.                          

"-ఉర్మిల భంగినీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.స.జ.ర.స.జ.స.య.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
జీవ సాగర!గమ్య నావ!సాగు టుర్మిల భంగినిన్?జగమెడంగు చింతార్భటిన్?
పావకంబగు!మోక్ష మీయ!బాగు గూర్ప సు రామతన్?పగను బాపు స్వాతంత్ర్యతన్?                                                                                            
సావధాన్యత!సవ్య మేర్ప!జాగు మాన్పు!వరాశ్రులన్?జగపు వెల్గు!ధన్యంబవన్?                                                                                          
రావదేమిర?దివ్య తేజ!రాగమై!సుర ధామమౌ!ప్రగుణమౌచు!ప్రాచుర్యతన్!
ఉర్మిల=కెరటము,భంగి=విధము.
1.గర్భగత"-ధారా"-వృత్తము.
బృహతీఛందము.ర.స.జ.గణములు.వృ.సం.347.
ప్రాసనియమము కలదు.
జీవ సాగర గమ్య నావ!
పావకంబగు!మోక్ష మీయ?
సావధాన్యత!సవ్య మేర్ప!
రావ దేమిర?దివ్య తేజ!
2.గర్భగత"-మృదు మానస"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.స.లగ.గణములు.వృ.సం.91.
ప్రాసనియమము కలదు.
సాగు టుర్మిల భంగినిన్?
బాగు గూర్ప సు రామతన్?
జాగు మాన్పు!వరాశ్రులన్!
రాగమై!సురధామమౌ?
3.గర్భగత"-వారుణ"-వృత్తము.
బృహతీఛందము.న.ర.ర.గణములు.వృ.సం.152.
ప్రాసనియమము కలదు.
జగ మెడంగు చింతార్భటిన్?
పగను బాపు స్వాతంత్ర్యతన్?
జగపు వెల్గు ధన్యంబవన్?
ప్రగుణ మౌచు!ప్రాచుర్యతన్!
4.గర్భగత"-సుగమ్య"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.స.జ.ర.స.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.
జీవ సాగర గమ్య నావ!సాగు టుర్మిల భంగినిన్?
పావకంబగు!మోక్ష మీయ?బాగు గూర్ప సురామతన్?
సావధాన్యత!సవ్య మేర్ప!జాగు మాన్పు!వరాశ్రులన్?
రా వదేమిర!దివ్య తేజ!రాగమై!సుర ధామమౌ?
5.గర్భగత"-రసాన్విత"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.స.జ.స.య.లగ.గణములు.యతి09వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
సాగు టుర్మిల భంగినిన్?జగ మెడంగు చింతార్భటిన్?
బాగు గూర్ప సురామతన్?పగను బాపు స్వాతంత్ర్యతన్?
జాగు మాన్పు వరాశ్రులన్?జగపు వెల్గు ధన్యంబవన్?
రాగమై సుర ధామమౌ?ప్రగుణ మౌచు ప్రాచుర్యతన్?
6.గర్భగత"-సావధాన"-వృత్తము.-ఉత్కృతిఛందము.ర.స.జ.స.య.య.స.జ.గల.గణములు.యతులు9,18.
ప్రాసనియమముకలదు.వృసం.
సాగు టుర్మిల భంగినిన్?జగమెడంగు!చింతార్భటిన్?జీవ సాగర గమ్యనావ!
బాగు గూర్ప సురామతన్?పగను బాపు!స్వాతంత్ర్యతన్?పావకంబగుమోక్షమీయ!                                              
జాగు మాన్పు వరాశ్రులన్?జగపు వెల్గు ధన్యంబవన్?సావధాన్యత!సవ్యమేర్ప!                                                      రాగమై!సుర ధామమౌ?ప్రగుణ మౌచు!ప్రాచుర్యతన్?రా వదేమిర!దివ్యతేజ!
7గర్భగత"-జగజ్జ్యోతి"-వృత్తము.
ధృతిఛందము.న.ర.ర.ర.స.య.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము.కలదు..వృ.సం.                                    
జగమెడంగు!చింతార్భటిన్?జీవసాగర!గమ్య నావ!
పగను మాపు!స్వాతంత్ర్యతన్?పావకంబగు!మోక్షమీయ!
జగము వెల్గు!ధన్యంబవన్?సావధాన్యత!ధన్య మేర్ప!
ప్రగుణమౌచు!ప్రాచుర్యతన్?రా వదేమిర?దివ్య తేజ!
8.గర్భగత"-జగమెడంగు"-వృత్తము.
ఉత్కృతి ఛందమడంన.ర.ర.ర.సయ.ర.స.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
జగమెడంగు!చింతార్భటిన్?జీవ సాగర గమ్య నావ!సాగు టుర్మిల భంగినిన్?
పగను బాపు!స్వాతంత్ర్యతన్?పావ కంబగు!మోక్షమీయ!బాగు గూర్పసు రామతన్?                                             జగము వెల్గు ధన్యంబవన్?సావధాన్యత!ధన్య మేర్ప!జాగు మాన్పువరాశ్రులన్?                                                   ప్రగుణ మౌచు!ప్రాచుర్యతన్?రా వదేమిర?దివ్య తేజ!రాగమై!సుర దామమౌ?
9.గర్భగత"-రసాత్మక"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.స.య.జ.ర.గల.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
సాగు టుర్మిల భంగినిన్?జీవ సాగర గమ్య నావ!
బాగు గూర్ప!సు రామతన్?పావకంబగు!మోక్ష మీయ!
జాగు మాన్పు!పరాశ్రులన్?సావధాన్యత!ధన్యమేర్చ!
రాగమై!సుర ధామమౌ?రా వదేమిర?దివ్య తేజ!
10,గథ్భగత"-ఉర్మిల"-వృత్తము.
ఉత్కృతి ఛందము.ర.స.య.జ.ర.భ.స.య.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
సాగు టుర్మిల భంగినిన్?జీవ సాగర గమ్య నావ!జగమెడంగు!చింతార్భటిన్?
బాగు గూర్ప సు రామతన్?పావకంబగు!మోక్ష మీయ!పగను బాపు స్వాతంత్ర్యతన్?                                             జాగు మాన్పు పరాశ్రులన్?సావ ధాన్యత!ధన్య మేర్చ!జగము వెల్గు ధన్యం బవన్?                                                 రాగమై!సుర ధామమౌ?రా వదేమిర?దివ్య తేజ!ప్రగుణ మౌచు !ప్రాచుర్యతన్?                                                       స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.