గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

17, ఆగస్టు 2019, శనివారం

అశేషక,వర్ణిత,మత్తరజినీ,సుశోభిత,నిగతగ్గు,పాతకాళి,రజ్జు,నిగారింపు,సరళీకృత,సరళిత,గర్భ"-జీవసరళి"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ,

జైశ్రీరామ్.
అశేషక,వర్ణిత,మత్తరజినీ,సుశోభిత,నిగతగ్గు,పాతకాళి,రజ్జు,నిగారింపు,సరళీకృత,సరళిత,గర్భ"-జీవసరళి"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ,

"-జీవసరళి"-వృత్తము.
ఉత్కృతిఛందము.య.స.భ.త.న.ర.జ.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
జగంమారె?యుగంమారె?జగజ్జీవ సరళి మారె!జాతినీతి మేత మేసెనే?
నిగ్గు తగ్గె!నెపం బెచ్చె?నిగారింపు!ధనం పట్టె!నేతిబీర సౌరు భంబు నన్?
పగల్నిండె!ప్రతాపాన!ప్రగల్భాలు పరిధి దాటె!పాత కంపు!క్రొత్త యింపనన్?
భుగ ల్నిండె!భువాలెల్ల?పొగల్గ్రమ్మె!బ్రతుకు తీరు!భూత భ్రాంతి మూతి నాకెనే?
1.గర్భగత"-అశేషక"-వృత్తము.
అనుష్టుప్ఛందము.య.స.గల.గణములు.వృ.సం.154.ప్రాసనియమము కలదు.
జగం!మారె!యుగం!మారె?
నిగ్గు తగ్గె!నెపంబెచ్చె!
పగల్నిండె!ప్రతాపాన?
భుగల్నిండె!భువాలెల్ల?
2.గర్భగత"-వర్ణిత"-వృత్తము.
బృహతీఛందము.య.న.జ.గణములు.వృ.సం.377
ప్రాసనియమము కలదు.
జగజ్జీవ సరళి మారె!
నిగారింపు!ధనము పట్టె?
ప్రగల్భాలు పరిధి దాటె!
పొగల్గ్రమ్మె!బ్రతుకు తీరు?
3.గర్భగత"మత్తరజినీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.
ప్రాసనియమముశకలదు.
జాతి నీతి మేత మేసనే?
నేతిబీర సౌరు భంబునన్?
పాత రోత క్రొత్త యింపనన్?
భూత భ్రాంతి!మూతి నాకెనే?
4.గర్భగత"-సుశోభిత"-వృత్తము.
అత్యష్టీఛందముయ.స.భ.త.న.గల.గణములు.యతి09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
జగం మారె!యుగం మారె?జగజ్జీవ సరళి మారె?
నిగ్గు తగ్గె నెపం బెచ్చె?నిగారింపు!ధనము పట్టె?
పగల్నిండె!ప్రతాపాన?ప్రగల్భాలు పరిధి దాటె?
భుగల్నిండె!భువాలెల్ల?పొగల్గ్రమ్మె?బ్రతుకు తీరు?
5.గర్భగత"-నిగ తగ్గు"-వృత్తము.
ధృతిఛందము.య.న.జ.ర.జ.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
జగ జ్జీవ సరళి మారె?జాతి నీతి మేత మేసెనే?
నిగారింపు!ధనము పట్టె?నేతి బీర సౌరు భంబునన్?
ప్రగల్భాలు పరిధి దాటె?పాత రోత క్రొత్త యింపనన్?
పొగల్గ్రమ్మె?బ్రతుకు తీరు!భూత భ్రాంతి మూతి నాకెనే?
6.గర్భగతరోపాతరోత"-వృత్తము.
ఉత్కృతిఛందము.య.న.జ.ర.జ.ర.య.స.గల.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
జగ జ్జివ సరళి మారె?జాతి నీతి మేత మేసెనే?జగం మారె!యుగం!మారె?
నిగారింపు ధనం పట్టె?నేతి బీర సౌరు భంబునన్?నిగ్గు తగ్గె!నెపం బెచ్చె?
ప్రగల్బాలు పరిధి దాటె?పాత రోత! క్రొత్త యింపనన్?పగల్నిండె!ప్రతాపాన?
పొగల్గ్రమ్మె?బ్రతుకు తీరు!భూత భ్రాంతి!మూతినాకెనే?భుగల్నిండె?భువాలెల్ల?
7.గర్భగత"-రజ్జు"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.య.స.గల.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
జాతి నీతి!మేత మేసెనే?జగం మారె?యుగం మారె?
నేతిబీర సౌరు!భంబునన్?నిగ్గు తగ్గె!నెపం బెచ్చె?
పాత రోత క్రొత్త యింపనన్?పగ ల్నిండె!ప్రతాపాన?
భూత భ్రాంతి!మూతినాకెనే?భుగల్నిండె?భువాలెల్ల?
8.గర్భగత"-నిగారింపు"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.య.స.భ.య.న.గల.గణముల.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
జాతి నీతి మేత మేసెనే?జగం మారె?యుగం మారె?జగ జ్జీవ సరళి మారె?
నేతి బీర సౌరుభంబునన్?నిగ్గు తగ్గె!నెపం బెచ్చె?నిగారింపు!ధనం పట్టె?
పాత రోత క్రొత్త యింపనన్?పగల్నిండె!ప్రతాపాన?ప్రగల్భాలు పరిధి దాటె?
భూత భ్రాంతి!మూతి నాకెనే?భుగల్నిండె?భువాలెల్ల?పొగల్గ్రమ్మె?బ్రతుకు తీరు!
9.గర్భగత"-సరళీకృత"-వృత్తము.
అత్యష్టీ ఛందము.య.న.జ.య.స.గల.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
జగ జ్జీవ సరళి మారె?జగం మారె?యుగం మారె?
నిగారింపు!ధనం పట్టె?నిగ్గు తగ్గె?నెపం బెచ్చె?
ప్రగల్భాలు పరిధి దాటె?పగల్నిండె?ప్రతాపాన?
పొగల్గ్రమ్మె?బ్రతుకు తీరు!భుగల్నిండె?భువాలెల్ల?
10,గర్భగత"-సరళిత"-వృత్తము.
ఉత్కృతిఛందము.య.న.జ.య.స.ర.జ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
జగ జ్జీవ సరళి మారె?జగం మారె?యుగం మారె?జాతినీతి మేత మేసెనే?
నిగారింపు ధనం పట్టె?నిగ్గు తగ్గె!నెపం బెచ్చె?నేతి బీర సౌరుభంబు నన్?
ప్రగల్భాలు పరిధి దాటె?పగల్నిండె?ప్రతాపాన?పాత రోత క్రొత్త యింపనన్?
పొగల్గ్రమ్మె?బ్రతుకు తీరు!భుగ ల్నిండె?భువాలెల్ల?భూత భ్రాంతి మూతి నాకెనే?
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.