గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, ఆగస్టు 2019, బుధవారం

భారవాహా,స్తుతి,భద్రకా,ధాత్రీశ,కోమల,దీప్తుల,తేజక,అలివేణీ,సంభ్రమ,విరిబోణీ,గర్భ"-ఆమనీ"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.
భారవాహా,స్తుతి,భద్రకా,ధాత్రీశ,కోమల,దీప్తుల,తేజక,అలివేణీ,సంభ్రమ,విరిబోణీ,గర్భ"-ఆమనీ"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

"-ఆమనీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.ర.ర.స.భ.మ.స.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ఆమని యేమనెన్?నేస్తమా!అలివేణీ,విరిబోణీ!ఆది మహాలక్ష్మి యేననెన్?
కోమలి శ్రీ వరా లిచ్చుతన్?కొలువై!తా గుణదీప్తిన్!క్రోధము లేనట్లు చూతనెన్?
థీమహి!రమ్యతం దీర్చుచున్!తెలివిన్!కీర్తిల నీతిన్?ధీ దితులన్!నింపి శోభిలన్?
కామిద మేర్చి!ధాత్రిన్సదా!కలిదోషార్తిని లేకన్!కాదనకన్!జీవ భాగ్యముల్?
1.గర్భగత"-భారవహా"-వృత్తము.
బృహతీఛందము.భ.ర.ర.గణమలు.వృ.సం.151.
ప్రాసనియమము కలదు.
ఆమని!యేమనెన్?నేస్తమా!
కోమలి!శ్రీవరాలిచ్చుతన్?
థీ మహి!రమ్యతం!దీర్చుచున్!
కామిద మేర్చి!ధాత్రింసదా!
2.గర్భగత"-స్తుతి"-వృత్తము.
అనుష్టుప్ఛందము.స.భ.గగ.గణములు.వృ.సం.52.
ప్రాసనియమము కలదు.
అలివేణీ!విరిబోణీ!
కొలువై!తా గుణ దీప్తిన్?
తెలివిన్!కీర్తిల నీతిన్!
కలి దోషార్తిని లేకన్?
3.గర్భగత"-భద్రకా"-వృత్తము.
బృహతీఛందము.భ.త.ర.గణములు.వృ.సం.167.
ప్రాసనియమము కలదు.
ఆది మహా లక్ష్మి !యే ననెన్?
క్రోధము లేనట్లు! చూతనెన్?
ధీ దితులం!నింపి!శోభిలన్?
కాదనకన్?జీవ భాగ్యముల్!
4.గర్భగత"-ధాత్రీశ"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.ర.ర.స.భ.గగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.షం.
ఆమని!యేమనెన్?నేస్తమా!అలివేణీ!విరి బోణీ!
కోమలి!శ్రీ వరాలిచ్చుతన్?కొలువై!తా గుణదీప్తిన్!
ధీ మహి!రమ్యతం దీర్చుచున్!తెలివిన్కీర్తిల నీతిన్!
కామిద మేర్చి!ధాత్రిం సదా!కలి దోషార్తిన్! లేకన్?
5.గర్భగత"-కోమల"-వృత్తము.
అత్యష్టీఛందము.స.భ.మ.స.ర.లగ.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమణు కలదు.వృ.సం.
అలివేణీ!విరి బోణీ!ఆది మహాలక్ష్మి!యే ననెన్!
కొలువై తా గుణదీప్తిన్?క్రోధము లేనట్లు జూతనెన్?
తెలివిన్!కీర్తిల నీతిన్!ధీ దితులం నింపి శోభిలన్?
కలి దోషార్తిని లేకన్?కాదనకన్?జీవ భాగ్యముల్!
6.గర్భగత"-దీప్తుల"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.భ.మ.స.ర.య.స.య.లగ.గణములు.యతులు.9,18
ప్రాసనియమము కలదు.వృ.సం.
అలివేణీ!విరి బోణీ!ఆది మహాలక్ష్మి!యే ననెన్!ఆమని!యేమనెన్!నేస్తమా?
కొలువై తాగుణ దీప్తిం!క్రోధము లేనట్లు?జూతనెన్!కోమలి శ్రీ వరాలిచ్చుతన్?
తెలివిన్కీర్తిల నీతిన్?ధీ దితులం నింపి!శోభిలన్?థీ మహి!రమ్యతం దీర్చుచున్?
కలి దోషార్తిని లేకన్?కాదనకన్!జీవ భాగ్యము ల్కామిద మేర్చి!ధాత్రింసదా!
7.గర్భగత"-తేజక"-వృత్తము.
ధృతిఛందము.భ.త.ర.భ.ర.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు. వృ.సం.
ఆది మహాలక్ష్మి!యేననెన్? ఆమని!యేమనెం?నేస్తమా!
క్రోధము లేనట్లు?జూతనెన్! కోమలి శ్రీ వరాలిచ్చుతన్?
ధీ దితులం!నింపి!శోభిలన్?ధీమహి!రమ్యతం దీర్చుచున్?
కాదనకం!జీవ భాగ్యముల్! కామిద మేర్చి!థాత్రిం!సదా!
8.గర్భగత"-అలివేణీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.త.ర.భ.ర.ర.స.భ.గగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ఆది మహాలక్ష్మి యేననెన్?ఆమని !యేమనెన్?నేస్తమా!యలివేణీ!విరిబోణీ!
క్రోధము లేనట్లు జూతనెన్?కోమలి శ్రీ వరాలిచ్చుతన్?కొలువై తా గుణదీప్తిన్!
ధీ దితులన్!నింపి!శోభిలన్?ధీమహి రమ్యతం దీర్చుచున్?తెలివిం కీర్తిల నీతిన్?
కాదనకన్? జీవభాగ్యముల్!కామిదమేర్చి!థాత్రిన్!సదా!కలిదోషార్తిని లేకన్?
9.గర్భగత"-సంభ్రమ"-వృత్తము.
అత్యష్టీఛందము.స.భ.మ.స.య.లగ.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము.కలదు.వృ.సం.
అలివేణీ!విరిబోణీ!ఆమని!యేమనెన్?నేస్తమా!
కొలువై!తా గుణ దీప్తిన్!కోమలి శ్రీ వరాలిచ్చుతన్?
తెలివిం!కీర్తిల నీతిన్?ధీమహి రమ్యతందీర్చుచున్?
కలి దోషార్తిని లేకన్?కామిద మేర్చి ధాత్రిన్!సదా!
10,గర్భగత"- విరిబోణీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.భ.మ.స.య.య.స.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
అలివేణీ!విరిబోణీ!ఆమని యేమనెన్?నేస్తమా!ఆదిమహా లక్ష్మి!యేననెన్?
కొలువై!తా గుణదీప్తిన్!కోమలి శ్రీ వరాలిచ్చుతన్?క్రోధము లేనట్లు జూతనెన్!
తెలివిన్!కీర్తిల నీతిన్?ధీమహి రమ్యతం దీర్చుచున్?ధీ దితులన్?నింపి శోభిలన్?
కలిదోషార్తిని లేకన్?కామిద మేర్చి!థాత్తిన్ సదా!కాదనకం!జీవ భాగ్యముల్!
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
వివిధ వృత్తముల పరిచయము అద్భుతముగా నున్నది. ధన్య వాదములు శ్రీ వల్లభవఝులవారి కృషి శ్లాఘనీయము శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.