గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, ఆగస్టు 2019, సోమవారం

సద్బుధ,రసాంఘ్రి,భద్రకా,బాంధవీ,సుశోభిత,సదావశ్య,భక్తిరస,సహస్రార్చి,మిత భాషిత,మితభుజి,గర్భ"-చ్యుత కర్మణీ"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.
సద్బుధ,రసాంఘ్రి,భద్రకా,బాంధవీ,సుశోభిత,సదావశ్య,భక్తిరస,సహస్రార్చి,మిత భాషిత,మితభుజి,గర్భ"-చ్యుత కర్మణీ"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

చ్యుత కర్మణీ"- వృత్తము.
ఉత్కృతిఛందము.స.భ.భ.స.స.మ.స.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదువృ.సం.
మిత భుక్తం!మిత భాష్యము!మిత మెంచకు?దానానన్?మేథిని థన్యంబిదే!సుమా! 
స్థిత ప్రజ్ఞన్!హిత మెంచుము!జిత కర్మను మోక్షంబౌ?శ్రీధరు నెంచన్వలెన్మదిన్?
గత మేలున్?మది నిల్పుము!గత మాగత లోకంబున్?కాదన కౌదార్యమెన్నడున్?
చ్యుత కర్మం!జనబోకుము?స్తుతి మానకు!దైవాలన్?శోధన కీర్తించుమాన్యతన్?
1.గర్భగత"-సద్బుధ"-వృత్తము.
బృహతీఛందము.స.భ.భ.గణములు.వృ.సం.436.
ప్రాసనియమము కలదు.
మిత భుక్తం!మిత భాష్యము!
స్థిత ప్రజ్ఞం!హిత మెంచుము!
గత మేలున్?మది నిల్పుము!
చ్యుత కర్మం!జనబోకుము?
2.గర్భగత"-రసాంఘ్రి"-వృత్తము.
అనుష్టుప్ఛందము.స.స.గగ.గణములు.వృ.సం.28.
ప్రాసనియము కలదు.
మిత మెంచకు?దానానన్?
జిత కర్మను!మోక్షంబౌ?
గత మాగత!లోకంబున్?
స్తుతి మానకు దైవాలన్?
3.గర్భగత"-భద్రకా"-వృత్తము.
బృహతీఛందము.భ.త.ర.గణములు.వృ.సం.167.
ప్రాసనియమము కలదు.
మేథిని!ధన్యంబిదే?సుమా!
శ్రీధరు!నెంచన్వలెన్?మదిన్!
కాదన కౌదార్య మెన్నడున్?
శోధన కీర్తించు మాన్యతన్?
4.గర్భగత"-బాంధవీ"-వృత్తము.
అత్యష్టీఛందము.స.భ.భ.స.స.గగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
మిత భుక్తం!మిత భాష్యము!మిత మెంచకు!దానానన్?
స్థిత ప్రజ్ఞన్?హితమెంచుము!జిత కర్మను!మోక్షంబౌ?
గత మేలున్?మది నిల్పుము!గత మాగత!లోకంబున్?
చ్యుత కర్మం?జనబోకుము!స్తుతి మానకు!దైవాలన్?
5.గర్భగత"-సుశోభిత"-వృత్తము.
అత్యష్టీఛందము.స.స.మ.స.ర.లగ.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
మిత మెంచకు?దానానన్!మేథిని!ధన్యంబిదే?సుమా!
జిత కర్మను!మోక్షంబౌ!శ్రీధరు నెంచన్వలెన్?మదిన్!
గత మాగత !లోకంబున్?కాదన కౌదార్య మెన్నడున్?
స్తుతి మానకు!దైవాలన్?శోధన కీర్తించు!మాన్యతన్?
6.గర్భగత"సదావశ్య"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.స.మ.స.ర.జ.య.స.లల.గణములు.యతులు.9,18
ప్రాసనియమము కలదు.వృ.సం.
మిత మెంచకు?దానానన్?మేథిని!ధన్యంబిదే?సుమా!మిత భుక్తం!మిత భాష్యము!
జిత కర్మను!మోక్షంబౌ?శ్రీధరు నెంచన్వలెన్?మదిన్!స్థిత ప్రజ్ఞం!హిత మెంచుము!
గత మాగత లోకంబున్?కాదన కౌదార్య మెన్నడున్?గత మేలుం?మది నిల్పుము!
స్తుతి మానకు దైవాలన్?శోధన కీర్తించు!మాన్యతన్?చ్యుత కర్మం!జన బోకుము!
7గర్భగత"-భక్తిరస"-వృత్తము.
ధృతిఛందము.భ.త.ర.స.భ.భ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
మేథిని!ధన్యంబిదే?సుమా!మిత భుక్తం!మిత భాష్యము!
శ్రీధరు!నెంచన్వలెన్?మదిన్!స్థిత ప్రజ్ఞం!హిత మెంచుము!
కాదన కౌదార్య మెన్నడున్?గత మేలుం!మది నిల్పుము!
శోధన కీర్తించు!మాన్యతన్?చ్యుత కర్మం!జన బోకుము!
8.గర్భగత"-సహస్రార్చి"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.త.ర.స.భ.భ.స.స.గగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
మేథిని!ధన్యం బిదే?సుమా!మిత భుక్తం!మిత భాష్యము!మిత మెంచకు దానానన్?
శ్రీధరు!నెంచన్వలెన్మదిన్?స్థిత ప్రజ్ఞం!హిత మెంచుము!జిత కర్మను! మోక్షంబౌ?
కాదన కౌదార్య మెన్నడున్?గత మేలుం!మది నిల్పుము!గత మాగత! లోకంబున్?
శోధన కీర్తించు మాన్యతన్?చ్యుత కర్మం!జన బోకుము?స్తుతి మానకు! దైవాలన్?
9.గర్భగత"-మిత భాషిత"-వృత్తము.
అత్యష్టీఛందము.స.స.త.య.స.లల.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
మిత మెంచకు?దానానన్!మిత భుక్తం!మిత భాష్యము!
జిత కర్మను!మోక్షంబౌ?స్థిత ప్రజ్ఞం!హిత మెంచుము!
గత మాగత!లోకంబున్?గత మేలుం!మది నిల్పుము!
స్తుతి మానకు!దైవాలన్?చ్యుత కర్మం!జన బోకుము!
10,గర్భగత"-మిత భుజి"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.స.త.య.స.స.స.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
మిత మెంచకు!దానానన్?మిత భుక్తం!మిత భాష్యము!మేథిని!ధన్యంబిదే? సుమా!
జిత కర్మను మోక్షంబౌ?స్థిత ప్రజ్ఞం!హిత మెంచుము!శ్రీధరు!నెంచన్వలెన్ మదిన్!
గత మాగత లోకంబున్?గత మేలుం!మది నిల్పుము!కాదన కౌదార్య మెన్నడున్?
స్తుతి మానకు!దైవాలన్?చ్యుత కర్మం!జన బోకుము?శోధన కీర్తించు మాన్యతన్?
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.