గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

27, ఆగస్టు 2019, మంగళవారం

ఉపమా,అనఘా,మత్తరజినీ,కల్మివెల్గు,బిగువ,దీపప్రతీక,లోకతీరు,శ్రీవాణీ,సొత్తునౌ,కోమలినా,గర్భ"-పెంపుటింపులు"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.
ఉపమా,అనఘా,మత్తరజినీ,కల్మివెల్గు,బిగువ,దీపప్రతీక,లోకతీరు,శ్రీవాణీ,సొత్తునౌ,కోమలినా,గర్భ"-పెంపుటింపులు"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

"-పెంపుటింపులు"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.న.ర.న,ర.య.జ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమము కలదు.వృ.సం.
దిగులు పడకు!బాలకా!తెలివి విద్య నేర్చుమా!దేశ ఖ్యాతి పెంపు నెంచుమా?
ప్రగతి పనుల!దేలుమా!వలని చేష్ట వీడుమా!పాశ బద్ధ తీరు గాకుమా?
నగపు బిగువు!ధీరతన్!నలిను!రాణి!మెచ్చగా!నాశమెంచమాని!మెల్గుమా?
ఖగ విహరుని!భక్తినిన్?కలిమి పెంపు!టింపిలన్!కాశి వాసి!కీర్తనంబులన్?

అర్ధములు:-
పాశబద్ధ తీరు=బంధింబడిన విధము.(స్వేచ్ఛ లేని విధము),నగపు
బిగువు=కొండంతటి ధైర్యము,నలిను రాణి=బ్రహ్మ భార్యయగు సరస్వతి,
ఖగ విహరుని=పక్షి వాహనుని,(శ్రీమహా విష్ణుని),వలని చేష్ట=పనికిరాని
పని,నాశ మెంచ మాని=వినాశము కోరుట మాని.
1.గర్భగత"-ఉపమా"-వృత్తము.
బృహతీఛందము.న.న.ర.గణములు.వృ.సం.192.
ప్రాసనియమము కలదు.
దిగులు పడకు!బాలకా?
ప్రగతి పనుల!దేలుమా!
నగపు బిగువు!ధీరతన్!
ఖగ విహరుని!భక్తినిన్?
2.గర్భగత"-అనఘా"-వృత్తము.
అనుష్టుప్ఛందము.న.ర.లగ.గణములు.వృ.సం.88,
ప్రాసనియమము కలదు.
తెలివి!విద్య నేర్చుమా!
వలని చేష్ట వీడుమా!
నలిను రాణి మెచ్చగా!
కలిమి పెంపు టింపిలన్?
3.గర్భగత"-మత్తరజినీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.
ప్రాసనియమము కలదు.
దేశ ఖ్యాతి!పెంపు నెంచుమా?
పాశ బద్ధ తీరు గాకుమా?
నాశ మెంచమాని!మెల్గుమా?
కాశి వాసి!కీర్త నంబులన్?
4.గర్భగత"-కల్మి వెల్గు"-వృత్తము.
అత్యష్టీఛందము.న.న.ర.న.ర.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
దిగులు పడకు!బాలకా?తెలివి విద్య!నేర్చుమా!
ప్రగతి!పనుల దేలుమా?వలని చేష్ట !వీడుమా!
నగపు బిగువు ధీరతన్!నలిను రాణి!మెచ్చగా?
ఖగ విహరుని!భక్తినిన్?కలిమి పెంపు టింపిలన్?
5.గర్భగత"-బిగువ"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.య.జ.ర.లగ.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
తెలివి!విద్య నేర్చుమా!దేశ ఖ్యాతి!పెంపు నెంచుమా?
వలని చేష్ట వీడుమా!పాశ బద్ధ !  తీరు గాకుమా?
నలిను రాణి!మెచ్చగా?నాశ మెంచమాని!మెల్గుమా?
కలిమి పెంపు టింపిలన్? కాశి వాసి! కీర్తనంబులన్?
6.గర్భగత"-దీప ప్రతీక"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.య.జ.ర.జ.న.సలగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
తెలివి!విద్య నేర్చుమా?దేశ ఖ్యాతి!పెంపు నెంచుమా!దిగులు పడకు!బాలకా?
వలని చేష్ట వీడుమా?పాశ బద్ధ తీరు!గాకుమా?ప్రగతి పనుల దేలుమా?
నలిను రాణి మెచ్చగా!నాశ మెంచమాని!మెల్గుమా?నగపు బిగువు!ధీరతన్?
కలిమి పెంపు!టింపిలన్?కాశి వాసి కీర్తనంబులన్?ఖగ విహరుని!భక్తినిన్?
7.గర్భగత"-లోకతీరు"ధృతిఛందము
ధృతిఛందము.ర.జ.ర.న.న.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
దేశ ఖ్యాతి!పెంపు నెంచుమా?దిగులు పడకు!బాలకా!
పాశ బద్ధ తీరు గాకుమా?ప్రగతి పనుల దేలుమా!
నాశ మెంచమాని!మెల్గుమా?నగపు బిగువు ధీరతన్?
కాశి వాసి!కీర్తనంబులన్?ఖగ విహరుని!భక్తినిన్?
8.గర్భగత"-శ్రీవాణీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.న.న.ర.న.ర.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
దేశ ఖ్యాతి!పెంపు నెంచుమా?దిగులు పడకు!బాలకా!తెలివి!విద్య నేర్చుమా!
పాశ బద్ధ!తీరు గాకుమా?ప్రగతి! పనుల దేలుమా! వలని చేష్ట వీడుమా?
నాశమెంచ మాని!మెల్గుమా?నగపు బిగువు!ధీరతన్?నలిను రాణి!మెచ్చగా!
కాశి వాసి!కీర్త నంబులన్?ఖగ విహరుని!భక్తినిన్?కలిమి పెంపు!టింపిలన్?
9.గర్భగత"-సొత్తునౌ"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.జ.న.స.లగ.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
తెలివి!విద్య నేర్చుమా!దిగులు పడకు!బాలకా?
వలని!చేష్ట వీడుమా?ప్రగతి పనుల!దేలుమా?
నలిను!రాణి!మెచ్చగా!నగపు బిగువు!ధీరతన్?
కలిమి!పెంపు!టింపిలన్?ఖగ విహరుని!భక్తినిన్?
10,గర్భగత"-కోమలినా"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.జ.న.స.య.జ.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
తెలివి!విద్య నేర్చుమా!దిగులు పడకు!బాలకా?దేశ ఖ్యాతి!పెంపు నేర్చుమా?
వలని!చేష్ట వీడుమా?ప్రగతి పనుల!దేలుమా? పాశ బద్ధ!తీరు గాకుమా?
నలిను రాణి!మెచ్చగా!నగపు బిగువు!ధీరతన్?నాశ మెంచ మాని!మెల్గుమా!
కలిమి పెంపు!టింపిలన్?ఖగ విహరుని!భక్తినిన్?కాశి వాసి!కీర్తనంబులన్.
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.