గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

20, ఆగస్టు 2019, మంగళవారం

అనఘా,నమ్మిక,అహమస్మి,పద్మినీ,అమరప్రియా,ప్రభుతర,ప్రగతిపద్మ,పగబూను,అమరికా,ప్రగల్భినీ,గర్భ"-వదాన్య ధన్య,వృత్తము. రచన;-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.
అనఘా,నమ్మిక,అహమస్మి,పద్మినీ,అమరప్రియా,ప్రభుతర,ప్రగతిపద్మ,పగబూను,అమరికా,ప్రగల్భినీ,గర్భ"-వదాన్య ధన్య,వృత్తము. రచన;-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

"-వదాన్యధన్య"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.జ.స.మ.జ.భ.ర.లగ.గణములు.యతులు.09,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ప్రగతి గోరు పద్మమే?ప్రభుత"-ఓం,ఐం,హ్రీం,శ్రీం"-మవన్?పగల్బూన తావు లేదుగా?
జగము వెల్గు నింపగన్?సబబునై!క్షేమ మేర్చుతన్?సగర్వాన కీర్తి నిల్పుతన్?
సిగముడిం బిగింపునై!శిబి"-వదాన్యంబౌ!భారతిన్?సెగల్తర్ము!ధీర మార్భటిన్?
ప్రగమనంబగూర్చుతన్?ప్రబల సౌశీల్యంబుత్కృతిన్?ప్రగల్భాలు రూపు మాపుచున్?
1.గర్భగత"-అనఘా"-వృత్తము.
అనుష్టుప్ఛందము.న.ర.లగ.గణములు.వృ.సం.88.
ప్రాసనియమము కలదు.
ప్రగతి కోరు!పద్మమే?
జగము వెల్గు నింపగన్?
సిగముడిన్!బిగింపునై!
ప్రగమనంబు గూర్చుతన్?
2.గర్భగత"-నమ్మిక"-వృత్తము.బృహతీఛందము.వృ.సం.136.
ప్రాసనియమము కలదు.
ప్రభుత"-ఓం,ఐం,హ్రీం,శ్రీం"-మవన్?
సబబు నై!క్షేమ మేర్చుతన్?
శిబి'-వదాన్యం బౌ!భారతిన్?
ప్రబల సౌశీల్యం బుత్కృతిన్?
3.గర్భగత"-అహమస్మి"-వృత్తము.
బృహతీఛందము.య.జ.ర.గణములు.వృ.సం.170,
ప్రాసనియమము కలదు..
పగల్బూన తావు లేదుగా?
సగర్వాన!కీర్తి నిల్చుతన్?
సెగల్తర్ము!ధీర మార్భటిన్?
ప్రగల్భాలు! రూపు మాపుచున్?
4.గర్భగత"-పద్మినీ"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.జ.స.మ.లగ.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ప్రగతి కోరు!పద్మమే!ప్రభుత"-ఓం,ఐం,హ్రీం,శ్రీం,-మవన్?
జగము వెల్గు!నింపగన్?సబబునై!క్షేమం బేర్చుతన్?
సిగ ముడిన్!బిగింపునై!శిబి'-వదాన్యంబౌ?భారతిన్!
ప్రగమనంబు!గూర్చుతన్?ప్రబల సౌశీల్యం బుత్కృతిన్?
5.గర్భగత"-అమర ప్రియా"-వృత్తము.
ధృతిఛందము.న.మ.ర.య.జ.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ప్రభుత"-ఓం,ఐం,హ్రీం,శ్రీం,-"మవన్?పగల్బూన!తావు లేదుగా?
సబబు నై?క్షేమం బేర్చుతన్?సగర్వాన!కీర్తి నిల్చుతన్?
శిబి వదాన్యంబౌ?భారతిన్!సెగల్తర్ము!ధీర మార్భటిన్?
ప్రబల సౌశీల్యం బుత్కృతిన్?ప్రగల్భాలు!రూపు మాపుచున్?
6.గర్భగత"-ప్రభుతర"-వృత్తము.
ఉత్కృతి ఛందము.న.మ.ర.య.జ.ర.న.ర.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం
ప్రభుత"-ఓం,ఐం,హ్రిం,శ్రీం'-మవన్?పగల్బూన తావు లేదుగా?ప్రగతి కోరు పద్మమే?
సబబు నై!క్షేమం బేర్చుతన్?సగర్వాన!కీర్తి నిల్చుతన్?జగమువెల్గు!నింపగన్!
శిబి వదాన్యంబౌ!భారతిన్?సెగల్తర్ము!ధీర మార్భటిన్?సిగముడిం!బిగింపునై?
ప్రబల సౌశీల్యంబుత్కృతిన్?ప్రగల్భాలు!రూపు మాపుచున్?ప్రగమనంబు గూర్చుతన్?
7.గర్భగత"-ప్రగతి పద్మ"-వృత్తము.
అత్యష్టీఛందము.య.జ.ర.న.ర.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమముకలదు.వృ.సం.
పగల్బూన!తావు లేదుగా?ప్రగతి కోరు పద్మమే?
స గర్వాన!కీర్తి నిల్చుతన్?జగము వెల్గు నింపగన్?
సెగల్తర్ము!ధీర మార్భటిన్?సిగ ముడింబిగింపునై?
ప్రగల్భాలు!రూపు మాపుచున్?ప్రగమనంబు గూర్చుతన్?
8.గర్భగత"-పగబూను"-వృత్తము.
ఉత్కృతిఛందము.య.జ.ర.న.ర.జ.స.మ.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
పగల్బూన!తావులేదుగా?ప్రగతి కోరు పద్మమే?ప్రభుత"-ఓం,ఐం,హ్రీం,శ్రీం"- మవన్?
సగర్వాన!కీర్తి నిల్చచుతన్జగము వెల్గునింపగన్?సబబునై!క్షేమంబేర్చుతన్?
సెగల్తర్ము!ధీర మార్భటిన్?సిగ ముడి న్బిగింపునై!శిబి వదాన్యంబౌ!భారతిన్!
ప్రగల్భాలు రూపుమాపుచున్?ప్ర గమనంబు!గూర్చుతన్?ప్రబల సౌశీల్యం బుత్కృతిన్?
9.గర్భగత"-అమరికా"-వృత్తము.
అత్యష్టీఛందము.న.మ.ర.న.ర.లగ.గణములు.యతి09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ప్రభుత!"-ఓం,ఐం,హ్రీం,శ్రీం"-మవన్?ప్రగతి గోరు పద్మమా?
సబబు నై !క్షేమంబేర్చుతన్?జగము వెల్గు నింపగన్?
శిబి వదాన్యంబౌ?భారతిన్!సిగ ముడిం బిగింపునై?
ప్రబల! సౌ శీల్యం!బుత్కృతిన్?ప్రగమనంబు!గూర్చుతన్?
10,గర్భగత"-ప్రగల్భినీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.మ.ర.న.ర.జ.త.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ప్రభుత"-ఓం,ఐం,హ్రీం,శ్రీం"-మవన్?ప్రగతి గోరు పద్మమే?పగల్బూన తావు లేదుగా?
సబబునై!క్షేమం బేర్చుతన్?జగము వెల్గు నింపగన్?సగర్వాన కీర్తి నిల్చుతన్?
శిబి'-వదాన్యంబౌ!భారతిన్?సిగ ముడిన్బిగింపు నై!సెగల్తర్ము!ధీర!మార్భటిన్?
ప్రబల! సౌ శీల్యం బుత్కృతిన్?ప్రగమనంబు!గూర్చుతన్?ప్రగల్భాలు రూపు మాపుచున్?
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.