గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, ఆగస్టు 2019, గురువారం

మత్తరజినీ,తరంగ,చెడుతీర్పు,రజోత్తమ,రమ్యజా,జీవితాన,మాయశ,మేలెంచు,స్వరతా,సుయోచనా"-గర్భ"-లీలామయ"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.
మత్తరజినీ,తరంగ,చెడుతీర్పు,రజోత్తమ,రమ్యజా,జీవితాన,మాయశ,మేలెంచు,స్వరతా,సుయోచనా"-గర్భ"-లీలామయ"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

లీలామయ"-వృత్తము.
అభికృతిఛందము.ర.జ.ర.త.జ.ర.మ.జ.గ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
లేని పోని!యూహ!లేలయా?లీలామయ జీవితంబు!లీలేరా!యెంచి చూడగన్?
కాన వేమి?యాగతంబులన్!కాలుం డెర వేయుచుండు!గేలంబున్!చిక్కుదేహమున్?
జ్ఞాన జీవ!మోక్షమెంచుమా!చాలింపకు ప్రార్థనంబు!జాలంబున్మేలు కోరుమా!
మేన బ్రాణ మున్న మానవా?మేలెంచుమ నీమ మొప్ప!మేలౌ!జన్మంబు ధన్యతన్?
                       
1.గర్భగత"-మత్తరజినీ"-వృత్తము.
బృహతీ ఛందము.ర.జ.ర.గణములు.ర.జ.ర.గణములు.వృ.సం.171.
ప్రాసనియమము కలదు.
లేని పోని యూహ లేలయా?
కాన వేమి?యాగతంబులన్!
జ్ఞాన జీవ!మోక్ష మెంచుమా!
మేన బ్రాణ మున్న మానవా?
2.గర్భగత"-తరంగ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.త.జ.గల.గణములు.వృ.సం.173.
ప్రాసనియమము కలదు.
లీలామయ జీవితంబు!
కాలుం డెర వేయు చుండు!
చాలింపకు ప్రార్థనంబు!
మేలెంచుమ!నీమ మొప్ప!
3.గర్భగత"-చెడుతీర్పు"-వృత్తము.
అనుష్టుప్ఛందము.మ.ర.లగ.గణములు.వృ.సం81.
ప్రాసనియమము కలదు.
లీలేరా!యెంచి చూడగన్?
గాలంబున్!చిక్కు దేహమున్!
జాలంబున్!మేలు కోరుమా!
మేలౌ?జన్మంబు!ధన్యతన్?
4.గర్భగత"-రజోత్తమ"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.త.జ.గల.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
లేని పోని!యూహ లేలయా?లీలామయ జీవితంబు!
కానవేమి?యాగతంబులన్!కాలుం డెర వేయుచుండు!
జ్ఞానజీవ!మోక్ష మెంచుమా!చాలింపకు ప్రార్థనంబు!
మేన బ్రాణ మున్న మానవా!మేలెంచుమ!నీమ మొప్ప!
5.గర్భగత"-రమ్యజా"-వృత్తము.
అష్టీఛందము.త.జ.ర.మ.జ.గ.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
లీలా మయ జీవితంబు!లీలేరా!యెంచి చూడగన్?
కాలుండెర వేయు చుండు!గాలంబున్!చిక్కు దేహమున్?
చాలింపకు!ప్రార్థ నంబు!జాలంబున్!మేలు కోరుమా!
మేలెంచుమ!నీమమొప్ప!మేలౌ?జన్మంబు ధన్యతన్?
6.గర్భగత"-జీవితాన"-వృత్తము.
అభికృతిఛందము.త.జ.ర.మ.జ.త.ర.జ.గ.గణములు.యతులు.09,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
లీలామయ జీవితంబు!లీలేరా?యెంచి చూడగన్?లేనిపోని యూహలేలయా?
కాలుండెర వేయుచుండు!గాలంబున్!చిక్కు దేహమున్?కానవేమి యాగతంబులన్?
చాలింపకు!ప్రార్ధనంబు!జాలంబున్!మేలు కోరుమా!జ్ఞాన జీవ మోక్షమెంచుమా!
మేలెంచుమ!నీమ మొప్ప!మేలౌ!జన్మంబు ధన్యతన్?మేన బ్రాణమున్న మానవా?
7.గర్భగత"-మా యశ"-వృత్తము.
అత్యష్టీఛందము.మ.ర.య.జ.ర.లగ.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియు కలదు.వృ.సం.
లీలేరా!యెంచి చూడగన్?లేని పోని యూహ లేలయా?
గాలంబున్!చిక్కు దేహమున్?కాన వేమి?యాగతంబులన్?
జాలంబున్!మేలు కోరుమా!జ్ఞాన జీవ మోక్ష మెంచుమా?
మేలౌ?జన్మంబు!ధన్యతన్! మేన బ్రాణ మున్న మానవా?
8.గర్భగత"-మేలెంచు"-వృత్తము.
అభికృతిఛందము.మ.ర.య.జ.ర.య.భ.ర.ల.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
లీలేరా?యెంచి చూడగన్?లేని పోని యూహ లేలయా?లీలా మయ జీవితంబు?
గాలంబున్!చిక్కు దేహమున్?కానవేమి?యాగతంబులన్?కాలుండెర వేయుచుండు!
జాలంబున్?మేలు కోరుమా!జ్ఞాన జీవ!మోక్ష మెంచుమా?చాలింపకు! ప్రార్థనంబు!
మేలౌ?జన్మంబు!ధన్యతన్!మేన బ్రాణ మున్న మానవా?మేలెంచుమ! నీమ మొప్ప!
9.గర్భగత"-స్వరతా"-వృత్తము.
అత్యష్టీఛందము.త.జ.ర.జ.ర.లగ.గణములు.యతి 09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
లీలామయ జీవితంబు?లేని పోని యూహ లేలయా?
కాలుం డెర వేయుచుండు!కాన వేమి?యాగతంబులన్?
చాలింపకు!ప్రార్థనంబు! జ్ఞాన జీవ మోక్ష మెంచుమా?
మేలెంచుమ!నీమ మొప్ప!మేన బ్రాణ మున్న!మానవా?
10,గర్భగత"-సు యోచనా"-వృత్తము.
అభికృతిఛందము.త.జ.ర.జ.ర.ర.మ.జ.గ.గణములు.యతులు.09,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
లీలామయ!జీవితంబు?లేని పోని!యూహ లేలయా?లీలేరా?యెంచి చూడగన్?
కాలుం డెర వేయు చుండు!కానరాని!యాగతంబులన్?గాలంబున్! చిక్కు దేహమున్?
చాలింపకు!ప్రార్థనంబు!జ్ఞాన జీవ!మోక్ష మెంచుమా? జాలంబున్? మేలు కోరుమా!
మేలెంచుమ!నీమ మొప్ప!మేన బ్రాణమున్న!మానవా?మేలౌ? జన్మంబు!ధన్యతన్?
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.