గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, ఆగస్టు 2019, శనివారం

చెరగొను,శోభకా,దైవనింద,ప్రతాప,సాధినీ,దుర్వారుక,పరాధీన,సరిసాగు,సచ్ఛలనా,చలనశక్తి,గర్భ"-తూగాడు"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్
చెరగొను,శోభకా,దైవనింద,ప్రతాప,సాధినీ,దుర్వారుక,పరాధీన,సరిసాగు,సచ్ఛలనా,చలనశక్తి,గర్భ"-తూగాడు"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ. 
                         
"-తూగాడు"-వృత్తము.
ఉత్కృతిఛందము.జ.న.ర.త.ర.య.జ.య.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
స్వతంత్ర చలన శక్తినిన్!సర్వార్ధ సాధకంబునౌ?సాగమాను!పరాధీనతన్?
ప్రతాప మమరు!భాగ్యతన్?పర్వంబు జీవ ధాత్రికిన్?బాగు గోరు సదాచారివై?
గతించు చెడులు సౌమ్యతన్!గర్వంబు దూర మేర్పడున్?కాగలుంగు వరీయంబులున్?                                      
స్తుతింపు గనుత!మాన్యతన్?దుర్వారకంబు లంటకన్?తూగ గల్గు ప్రబోధంబులన్?                                            
1.గర్భగత"-చెరంగొను"-వృత్తము.
బృహతీఛందము.జ.న.ర.గణములు.వృ.సం.190.
ప్రాసనియమము కలదు.
స్వతంత్ర చలన శక్తినిన్?
ప్రతాప మమరు భాగ్యతన్?
గతించు చెడులు సౌమ్యతన్!
స్తుతింపు గనుత మాన్యతన్?
2.గర్భగత"-శోభకా"-వృత్తము.
అనుష్టుప్ఛందము.త.ర.లగ.గణములు.వృ.సం.85.
ప్రాసనియమము కలదు.
సర్వార్థ సాధకంబునౌ?
పర్వంబు జీవ థాత్రికిన్?
గర్వంబు దూర మేర్పడున్?
దుర్వారకంబు లంటకన్?
3.గర్భగత"-దైవనిందా"-వృత్తము.
బృహతీఛందము.ర.స.ర.గణములు.వృ.సం.155.
ప్రాసనియమము కలదు.
సాగమాను!పరాధీనతన్?
బాగు కోరు సదాచారివై!
కా గలుంగు వరీయంబులున్?
తూగ గల్గు ప్రమోదంబులన్!
4.గర్భగత"-ప్రతాప"-వృత్తము.
అత్యష్టీఛందము.జ.న.ర.త.ర.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
స్వతంత్ర చలన శక్తినిన్?సర్వార్థ సాధకంబునౌ?
ప్రతాప మమరు భాగ్యతన్?పర్వంబు జీవథాత్రికిన్?
గతించు చెడులు సౌమ్యతన్?గర్వంబు దూర మేర్పడున్?
స్తుతింపు గనుత!మాన్యతన్?దుర్వారకంబు లంటకన్?
5.గర్భగత"-సాధినీ"-వృత్తము.
అత్యష్టీఛందము.త.ర.య.జ.య.లగ.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
సర్వార్థ సాధకంబునౌ?సాగమాను పరాధీనతన్?
పర్వంబు జీవ థాత్రికిన్?బాగు కోరు సదాచారివై!
గర్వంబు దూర మేర్పడున్?కా గలుంగు వరీయంబులన్?
దుర్వారకంబు లంటకన్?తూగ గల్గు ప్రమోదంబులన్?
6.గర్భగత"-దుర్వారక"-వృత్తము.
ఉత్కృతిఛందము.త.ర.య.జ.య.జ.భ.స.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
సర్వార్థ సాధకంబునౌ?సాగమాను పరాధీనతన్?స్వతంత్ర చలన శక్తినిన్?
పర్వంబు జీవథాత్రికిన్?బాగుకోరు సదాచారివై!ప్రతాప మమరు భాగ్యతన్?
గర్వంబు దూర మేర్పడున్?కా గలుంగు వరీయంబులన్?గతించు చెడులు సౌమ్యతన్?                                                                                  
దుర్వారకంబు లంటకన్?తూగ గల్గు ప్రమోదంబులన్? స్తుతింపు గనుత! మాన్యతన్?                                                                              
7.గర్భగత"-పరాధీన"-వృత్తము.
ధృతిఛందము.ర.స.ర.జ.న.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
సాగమాను పరా ధీనతన్?స్వతంత్ర చలన శక్తినిన్?
బాగు కోరు సదాచారివై!ప్రతాప మమరు భాగ్యతన్?
కా గలుంగు వరీయంబులన్?గతించు చెడులు సౌమ్యతన్?
తూగ గల్గు ప్రమోదంబులన్?స్తుతింపు గనుత మాన్యతన్?
8.గర్భగత"-సరిసాగు"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.స.ర.జ.న.ర.త.ర.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
సాగమాను పరాధీనతన్?స్వతంత్ర చలన శక్తినిన్?సర్వార్థ సాధకంబునౌ?
బాగు కోరు సదాచారివై!ప్రతాప మమరు భాగ్యతన్?పర్వంబుజీవథాత్రకిన్?
కాగలంగు వరీయంబులన్?గతించు చెడులు సౌమ్యతన్? గర్వంబు దూర మేర్పడున్?                                                                                
తూగ గల్గు ప్రమోదంబులన్?స్తుతింపు గనుత మాన్యతన్?దుర్వారకంబు లంటకన్?                                                                              
9.గర్భగత"-సచ్ఛలనా"-వృత్తము.
అత్యష్టీఛందము.త.ర.జ.భ.స.లగ.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
సర్వార్థ సాధకంబునౌ?స్వతంత్ర చలన శక్తినిన్?
పర్వంబు జీవ థాత్రికిన్?ప్రతాప మమరు భాగ్యతన్?
గర్వంబు దూర మేర్పడున్?గతించు చెడులు సౌమ్యతన్?
దుర్వారకంబు లంటకన్?స్తుతింపు గనుత మాన్యతన్?
10,గర్భగత"-చలనశక్తి"-వృత్తము.
ఉత్కృతిఛందము.త.ర.జ.భ.స.య.జ.య.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
సర్వార్థ సాధకంబునౌ?స్వతంత్ర చలన శక్తినిన్?సాగమాను పరాధీనతన్?
పర్వంబు జీవ థాత్రికిన్?ప్రతాప మమరు భాగ్యతన్?బాగుకోరు సదాచారివై!
గర్వంబు దూర మేర్పడున్?గతించు చెడులు సౌమ్యతన్? కా గలుంగు వరీయంబులన్?                                                                      
దుర్వారకంబు లంటకన్?స్తుతింపు గనుత మాన్యతన్?తూగ గల్గు ప్రమో దంబులన్?                                                                        
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.