గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, ఆగస్టు 2019, సోమవారం

శ్రీ గుత్తి నారాయణరెడ్డి తెలుగు సాహితీ పీఠం సంస్థ, బెంగుళూరు వారికి ధన్యవాదములు.

జైశ్రీరామ్.
ఓం నమో నారాయణాయ.
ఆర్యులకు వందనములు.
శ్రీ గుత్తి నారాయణరెడ్డి తెలుగు సాహితీ పీఠం సంస్థ, బెంగుళూరు వారు
శ్రీకృష్ణ దేవరాయల వారి ఐదువందల పదవ పట్టాభిషేక వార్షికోత్సవమును నిర్వహించి అందు 
వారు సగౌరవముగా అందఁ జేయు అష్ట దిగ్గజ కవుల పురస్కారములో 
నన్నునూ గ్రహించి పురస్కారము నాకునూ అనుగ్రహించిన నిర్వాహకులు శ్రీ గుత్తి (జోళదరాశి) చంద్రశేఖరరెడ్డిగారికి, అభినందించ వచ్చిన సహృదయ మిత్రవరులకు నాపై అవ్యాజ కరుణాపూర్ణ హృదయమును చూపించు అందరికినీ 
నా హృదయపూర్వక ధన్యవాదములు తెలియఁ జేయుచున్నాను.
జైశ్రీమన్నారాయణ.
మీ
చింతా రామకృష్ణారావు.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
చాలా సంతోషముగా నున్నది . పాండితీ స్రష్ట శ్రీ చింతా సోదరులకు , ప్రముఖ పండితులైన సరస్వతీ పుత్రు లందరికీ ప్రణామములు .+ అభినందన మందారములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.