గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, ఆగస్టు 2019, ఆదివారం

కందళీ,కలివర,కామత,శిరసావహ,వరదాయినీ,సత్వరయా,సదానంద,భారమే,సంతప,సత్యభాషిణీ,గర్భ"-దాస్యతాశ్రి"-వృత్తము.రచన:-వల్లభవఝ అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.

 జైశ్రీరామ్.
కందళీ,కలివర,కామత,శిరసావహ,వరదాయినీ,సత్వరయా,సదానంద,భారమే,సంతప,సత్యభాషిణీ,గర్భ"-దాస్యతాశ్రి"-వృత్తము.రచన:-వల్లభవఝ అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.
                   
"-దాస్యతాశ్రి"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.జ.భ.స.జ.ర.య.త.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
పర వేష భాష భూషలు!వరదంబై నిల్చె నేడు!భారతీయం బేమాయె?కనన్!
వర థాత్రి కట్టు బొట్టులు!భరమాయెన్చిత్ర మేమొ?పారశీకంబే!మోక్షమయెన్!
థర పాత రోత కూర్చెన్?థర నేలెం?భూతిక్రాంతి!తారకా!శ్రీమంతా!వరదా?
శిరసావహింతు రేలనొ?స్థిర దాసోహంబనంగ?చేర నెంచే!సూత్రంబిదియా?
1.గర్భగత"-కందళీ"-వృత్తము.
బృహతీఛందము.స.జ.భ.గణములు.వృ.సం.428.
ప్రాసనియమము కలదు.
పరవేష భాష భూషలు!
వర థాత్రి కట్టు బొట్టులు!
థర పాత రోత కూర్చెన్?
శిరసావ హింతు రేలనొ?
2.గర్భగత"-కలివర"-వృత్తము.
అనుష్టప్ఛందము.స.త.గల.గణములు.వృ.సం.164.
ప్రాసనియమము కలదు.
వరదంబై!నిల్చె నేడు!
భరమాయెన్చిత్ర మేమొ?
థర నేలెన్?భూతి క్రాంతి!
స్థిర! దాసోహమ్మనంగ?
3.గర్భగత"-కామత"-వృత్తము.
బృహతీఛందము.ర.మ.స.గణములు.వృ.సం.195.
ప్రాసనియమము కలదు.
భారతీయం బేమాయె?కనన్!
పారశీకంబే!మోక్ష మయెన్?
తారకా!శ్రీమంతా!వరదా?
చేర నెంచే!సూత్రం బిదియా?
4.గర్భగత"-శిరసావహ"-వృత్తము.
అత్యష్టీఛందము.స.జ.భ.స.త.గల.గములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
పర వేష భాష భూషలు!వరదంబై!నిల్చె నేడు?
వర థాత్రి కట్టు బొట్టులు!భరమాయెన్?చిత్ర మేమొ?
థర పాత రోత కూర్చెను?థర నేలెం?భూతి క్రాంతి!
శిరసావహింతు!రేలనొ?స్థిర దాసోహమ్మనంగ?
5.గర్భగత"-వరదాయి"-వృత్తము.
అత్యష్టీ ఛందము.స.త.ర.య.త.లగ.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
వరదంబై!నిల్చె నేడు?భారతీయం బేమాయె?కనన్?
భరమాయెం?చిత్ర మేమొ?పారశీకంబే!మోక్షమయెన్?
థర నేలెం!భూతి క్రాంతి?తారక!శ్రీమంతా!వరదా?
స్థిర దాసో  హమ్మనంగ?చేర నెంచే!సూత్రం బిదియా?
6.గర్భగత"-సత్వరయా"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.త.ర.య.త.జ.జ.ర.లల.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
వరదంబై!నిల్చె నేడు?భారతీయం బేమాయె?కనన్!పర వేష భాష భూషలు!
భరమాయెం!చిత్ర మేమొ?పారశీకంబేమోక్షమయెన్!వరధాత్రి కట్టు బొట్టులు!
థర నేలెన్భూతి క్రాంతి?తారక!శ్రీమంతా!వరదా?థర పాత రోత కూర్చెను?
స్థిర దాసోహమ్మనంగ!చేర నెంచే!సూత్రంబిదియా?శిరసావహింతు రేలనొ?
7.గర్భగత"-సదానంద"-వృత్తము.
ధృతిఛందము.ర.మ.స.స.జ.భ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు వృ.సం.
భారతీయం బేమాయె?కనన్!పర వేష భాష భూషలు!
పారశీకంబే!మోక్షమయెన్?వర థాత్రి కట్టు బొట్టులు!
తారక!శ్రీమంతా!వరదా?థర పాత రోత కూర్చెను?
చేర నెంచే!సూత్రంబిదియా?శిర సావ హింతు రేలనొ?
8.గర్భగత"-భారమే?"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.మ.స.స.జ.భ.స.త.గల.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
భారతీయం బేమాయె?కనన్!పర వేష భాష భూషలు!వరదంబై!నిల్చె నేడు!
పారశీకంబే!మోక్షమయెన్?వరథాత్రి కట్టుబొట్టులు!భరమాయెం!చిత్రమేమొ?
తారక!శ్రీమంతా!వరదా!ధర పాత రోత కూర్చెను!ధర నేలెం?భూతి క్రాంతి!
చేర నెంచే?సూత్రంబిదియా!శిరసావహింతు రేలనొ?స్థిరదాసోహమ్మనంగ?
9.గర్భగత"-సంతప"-వృత్తము.
అత్యష్టీఛందము.స.త.భ.జ.ర.లల.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
వరదంబై!నిల్చె నేడు!పర వేష భాష భూషలు?
భర మాయెం!చిత్ర మేమొ?వర థాత్రి!కట్టు బొట్టులు!
ధర నేలెం?భూతి క్రాంతి!థర పాత రోత కూర్చెను!
స్థిర దాసోహమ్మనంగ?శిరసావహింతు రేలనొ?
10,గర్భగత"-సత్య భాషిణీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.త.భ.జ.ర.స.య.త.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
వరదంబై!నిల్చె!నేడు!పర వేష భాష భూషలు!భారతీయం బేమాయె!కనన్?
భరమాయెంచిత్ర మేమొ?వర థాత్రి!కట్టు బొట్టులు!పారశీకంబే!మోక్షమయెన్!
ధర నేలెం!భూతి క్రాంతి!ధర పాత రోత కూర్చెను!తారక!శ్రీమంతా!వరదా!
స్థిర దాసోహమ్మనంగ?శిరసావహింతు రేలనొ?చేర నెంచే?సూత్రంబిదియా?
 స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.