గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, ఆగస్టు 2019, శనివారం

సమాశ్రీ,చరణసేవ,భద్రక,చాతురి,తనరా,శ్రీహరీ,సాధితాంశ,వన్నెల శోభ,భాష్యము,సద్యోగ,గర్భ"-విద్యోత్సుక"-వృత్తము. రచన:-వల్లభవవఝ అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.
సమాశ్రీ,చరణసేవ,భద్రక,చాతురి,తనరా,శ్రీహరీ,సాధితాంశ,వన్నెల శోభ,భాష్యము,సద్యోగ,గర్భ"-విద్యోత్సుక"-వృత్తము. రచన:-వల్లభవవఝ అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

"-విద్యోత్సుక"-వృత్తము.
అభికృత్ఛందము.ర.జ.ర.భ.స.జ.య.జ.గ.గణములు.యతులు.09,17.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ఆదిలేదు?అంతులేదు?ఆధ్యంత మసలె!లేదు?అన్నల మిన్నీవు!శ్రీహరీ!
వేదమీవు!భాష్య మీవు?విద్యోత్సుక ప్రభ వీవు?వెన్నల దొంగీవు!కృష్ణుడా?
సాధితాంశ!సార మీవు?సద్యోగ చరితు డీవు?జన్నములం!ముక్తి నిత్తువే?
పాదు వౌచు!నిల్చి గావు!పద్యాలను నడిపించు!వన్నెల!శోభాయ మానతన్?
1.గర్భగత"-సమాశ్రీ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.జ.గల.గణములు.వృ.సం.171.
ప్రాసనియమము కలదు.
ఆది లేదు?అంతు లేదు?
వేదమీవు!భాష్యమీవు?
సాధితాంశ సార మీవు?
పాదు వౌచు నిల్చి కావు?
2.గర్భగత"-చరణసేవ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.త.న.గల.గణములు.వృ.సం.189,
ప్రాసనియమము కలదు.
ఆద్యంత మసలె!లేదు?
విద్యోత్సుక ప్రభ వీవు?
సద్యోగ చరితు డీవు?
పద్యాలను!నడిపించు!
3.గర్భగత"-భద్రకా"-వృత్తము.
బృహతీఛందము.భ.త.ర.గణములు.వృ.సం.167.
ప్రాసనియమము కలదు.
అన్నల మిన్నీవు!శ్రీహరీ?
వెన్నల దొంగీవు!కృష్ణుడా?
జన్నములం!ముక్తి నిత్తువే?
వన్నెల!శోభాయ మానతన్?
4.గర్భగత"-చాతురి"-వృత్తము.
అష్టీఛందము.ర.జ.ర.భ.స.ల.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ఆది లేదు?అంతు లేదు?ఆధ్యంత మసలె!లేదు?
వేద మీవు!భాష్య మీవు?విద్యోత్సుక!ప్రభ వీవు?
సాధి తాంశ!సారమీవు? సద్యోగ చరితు  డీవు?
పాదు వౌచు?నిల్చి కావు? పద్యాలను!నడిపించు!
5.గర్భగత"-తనరా"-వృత్తము.
అత్యష్టీఛందము.త.న.ర.స.ర.లగ.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.షం.
ఆద్యంత మసలె!లేదు?అన్నల మిన్నీవు?శ్రీహరీ?
విద్యోత్సుక!ప్రభ వీవు?వెన్నల దొంగీవు?కృష్ణుడా?
సద్యోగ!చరితు డీవు?జన్నములం?ముక్తి నిత్తువే?
పద్యాలను!నడిపించు!వన్నెల శోభాయ మానతన్?
6.గర్భగత"-శ్రీహరీ"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.త.ర.స.జ.గల.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
అన్నల మిన్నీవు?శ్రీహరీ?ఆది లేదు?అంతు లేదు?
వెన్నల దొంగీవు?కృష్ణుడా?వేద మీవు?భాష్య మీవు?
జన్నములం?ముక్తి నిత్తువే?సాధితాంశ!సార మీవు?
వన్నెల!శోభాయ మానతన్?పాదు వౌచు!నిల్చి!కావు?
7.గర్భగత"-సాధితాంశ"-వృత్తము.
అభికృత్ఛందము.త.న.ర.స.ర.య.జ.ర.ల.గణములు.యతులు.09,17.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ఆధ్యంత మసలె!లేదు?అన్నల మిన్నీవు?శ్రీహరీ?ఆది లేదు?అంతు లేదు?
విద్యోత్సుక ప్రభ!వీవు?వెన్నల దొంగీవు?కృష్ణుడా?వేద మీవు?భాష్య మీవు?
సద్యోగ!చరితు డీవు?జన్నములం?ముక్తి!నిత్తువే?సాధితాంశ!సార మీవు?
పద్యాలను!నడిపించు!వన్నెల శోభాయ మానతన్?పాదువౌచు నిల్చి కావు?
8.గర్భగత"-వన్నల శోభ"-వృత్తము.
అభికృతిఛందము.భ.త.ర.స.జ.ర.భ.స.ల.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
అన్నల మిన్నీవు?శ్రీహరీ?ఆదిలేదు?అంతు లేదు?ఆధ్యంత మసలె!లేదు?
వెన్నల దొంగీవు?కృష్ణుడా?వేద మీవు?భష్యమీవు?విద్యోత్సుక!ప్రభవీవు?
జన్నములం!ముక్తి నిత్తువే?సాధితాంశ!సారమీవు?సద్యోగ చరితుడీవు?
వన్నెల శోభాయ మానతన్?పాదు వౌచు?నిల్చి కావు!పద్యాలను నడిపించు!
9.గర్భగత"-భాష్యము"-వృత్తము.
అష్టీఛందము.త.న.ర.జ.ర.ల.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ఆధ్యంత మసలె!లేదు?ఆదిలేదు?అంతు లేదు?
విద్యోత్సుక ప్రభ వీవు?వేద మీవు?భాష్య మీవు?
సద్యోగ!చరితు డీవు?సాధితాంశ!సార మీవు?
పద్యాలను!నడిపించు!పాదు వౌచు?నిల్చి!కావు?
10,గర్భగత"-సద్యోగ"-వృత్తము.
అభికృతిఛందము.త.న.ర.జ.ర.జజ.జ.గ.గణములు.యతులు.09,17.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ఆధ్యంత మసలె!లేదు?ఆది లేదు?అంతు లేదు?అన్నల మిన్నీవు?శ్రీహరీ?
విద్యోత్సుక!ప్రభ వీవు?వేద మీవు?భాష్య మీవు?వెన్నల దొంగీవు!కృష్ణుడా?
సద్యోగ చరితు డీవు?సాధితాంశ!సార మీవు?జన్నములం?ముక్తి నిత్తువే?
పద్యాలను!నడిపించు!పాదువౌచు!నిల్చి!కావు?వన్నెల!శోభాయ!మానతన్?
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అన్నివృత్తములు అలతి అలతి పదములతో అలరించు చున్నవి పాండితీ స్రష్టకు ప్రణామములు
శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.