గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, ఆగస్టు 2019, గురువారం

మదన,సమాశ్రీ,మత్తరజినీ,యవన,జీవికా,విలోకినీ,రాజిర,కలిమిరా,కుంతల,కొలువుదీరు,గర్భ"-జన్మతారక"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.
మదన,సమాశ్రీ,మత్తరజినీ,యవన,జీవికా,విలోకినీ,రాజిర,కలిమిరా,కుంతల,కొలువుదీరు,గర్భ"-జన్మతారక"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

"-జన్మతారక"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.భ.త.స.జ.ర.జ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కొలువు దీరె!మహాలక్ష్మి!కొలహా పురంబు నందు!కోరువారి కొంగు బంగరై!
చెలువమైన!మహాశక్తి!శిలగా ధరా తలాన!చేరువౌచు దీర్చు కోర్కెలన్!
కలిమి రాజ్ఞి!విలోకాన!కల లెల్లా పండెనంచు!గారబంబు నిండ!కొల్చితిన్!
తలపు నిండె!మహాసాధ్వి!తలపించె!మాత రూపు!తారకంపు!జన్మమాయెలే!
1.గర్భగత"-మదన"-వృత్తము.
బృహతీఛందము.న.భ.త.గణములు.వృ.సం.312.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కొలువు దీరె!మహాలక్ష్మి!
చెలువమైన!మహాశక్తి!
కలిమి రాజ్ఞి!విలోకాన!
తలపు నిండె!మహాసాధ్వి!
2.గర్భగత"-సమాశ్రీ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.జ.గల.గణములు.వృ.సం.171.
ప్రాసనియమము కలదు.
కొలహా!పురంబునందు!
శిలగా!థరాతలాన!
కలలెల్లా!పండెనంచు!
తలపించె!మాత రూపు!
3.గర్భగత"-మత్తరజినీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.
ప్రాసనియమము కలదు.
కోరు వారి!కొంగు బంగరై!
చేరు వౌచు!దీర్చు కోర్కెలన్!
గారబంబునిండ !కొల్చితిన్?
తారకంపు!జన్మమాయె లే!
4.గర్భగత"-యవన"-వృత్తము.
అత్యష్టీఛందము.న.భ.త.ర.జ.గల.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కొలువు దీరె!మహా లక్ష్మి!కొలహా పురంబు నందు!
చెలువ మైన!మహా శక్తి !శిలగా ధరా తలాన!
కలిమి రాజ్ఞి !విలోకాన!కల లెల్లా!పండెనంచు!
తలపు నిండె!మహాసాధ్వి!తలపించె!మాత రూపు!
5.గర్భగత"-జీవికా"-వృత్తము.
అత్యష్టీఛందము.స.జ.ర.జ.ర.లగ.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కొలహా పురంబు నందు!కోరు వారి!కొంగు బంగరై!
శిలగా!ధరాతలాన!చేరువౌచు!దీర్చు కోర్కెలన్?
కల లెల్లా పండె నంచు!గారబంబు నిండ!కొల్చితిన్!
తలపించె!మాత రూపు!తారకంపు జన్మ మాయె లే!
6.గర్భగత"-విలోకినీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.జ.ర.జ.ర.జ.స.స.గల.గణములు.యతులు.09,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కొలహా పురంబునందు!కోరువారి కొంగు బంగరై!కొలువు దీరె!మహా లక్ష్మి!
శిలగా ధరాతలాన!చేరువౌచు!దీర్చు కోర్కెలన్?చెలువమైన!మహా శక్తి!
కలలెల్లా!పండె నంచు!గారబంబు నిండ కొల్చితిన్!కలిమిరాజ్ఞి!విలోకాన!
తలపించె!మాతరూపు!తారకంపు జన్మ మాయె!లే!తలపునిండె!మహా సాధ్వి!
7.గర్భగత"-రాజిర"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.న.భ.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కోరు వారి!కొంగు బంగరై!కొలువు దీరె!మహా లక్ష్మి!
చేరు వౌచు!దీర్చు కోర్కెలన్?చెలువ మైన !మహా శక్తి!
గారబంబు!నిండ కొల్చితిన్!కలిమి రాజ్ఞి !విలోకాన!
తారకంపు!జన్మ మాయె లే!తలపు నిండె!మహా సాధ్వి!
8.గర్భగత"-కలిమిరా"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.న.భ.ర.స.జ.గల.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కోరువారి కొంగుబంగరై!కొలువుదీరె!మహాలక్ష్మి!కొలహా పురంబు నందు!
చేరువౌచు దీర్చు కోర్కెలన్?చెలువ మైన!మహాశక్తి!శిలగా ధరాతలాన!
గారబంబు నిండ కొల్చితిన్!కలిమి రాజ్ఞి విలోకాన!కలలెల్లా!పండెనంచు!
తారకంపు జన్మమాయె లే!తలపునిండె మహాసాధ్వి!తలపించె మాత రూపు!
9,గర్భగత"-కుంతల"-వృత్తము.
అత్యష్టీఛందము.స.జ.భ.స.స.గల.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కొలహా పురంబు నందు!కొలువు దీరె మహాలక్ష్మి!
శిలగా ధరా తలాన! చెలువమైన మహా శక్తి!
కల లెల్లా పండెనంచు!కలిమి రాజ్ఞి విలోకాన!
తలపించె మాత రూపు!తలపు నిండె మహా సాధ్వి!
10,గర్భగత"-కొలువుదీరు"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.జ.భ.స.స.ర.జ.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కొలహా పురంబు నందు!కొలువు దీరె!మహాలక్ష్మి!కోరువారి!కొంగు బంగరై!
శిలగా ధరాతలాన!చెలువమైన మహా శక్తి! చేరువౌచు!దీర్చు కోర్కెలన్?
కల లెల్లా పండెనంచు!కలిమి రాజ్ఞి విలోకాన!గారబంబు నిండ!కొల్చితిన్?
తలపించె మాత రూపు!తలపు నిండె!మహాసాధ్వి! తారకంపు జన్మ మాయె లే?

స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.