గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, ఆగస్టు 2019, శుక్రవారం

రసాంఘ్రి,భ్రమక,మత్తరజినీ,హీనతా,రనజారజ,గతమాగత,చంద్రమా,చక్ర భ్రమక,శబరీ,శశిచర,గర్భ"-సౌశీల్యతా"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.
రసాంఘ్రి,భ్రమక,మత్తరజినీ,హీనతా,రనజారజ,గతమాగత,చంద్రమా,చక్ర భ్రమక,శబరీ,శశిచర,గర్భ"-సౌశీల్యతా"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

"-సౌశీల్యతా"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.స.మ.జ.న.ర.జ.ర.లగ.గణములు.యతులు.09,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
గతమాగత!లోకంబున్?కాలచక్ర భ్రమక మొప్పు!కాన నౌనె?జీవి శాశ్వతల్?
స్థితమంచుం!వర్తింపన్!చీలిపోవు!మమతలెల్ల?శ్రీనివాసు!గొల్వుమా!మహిన్!
హితమేగతి?చేకూరున్!హేళమౌను!జనన శోభ!హీనతత్వ ముప్పు!దోషమౌ?
జిత కర్ముడె!మోక్షార్ధౌ?శీల వర్తి!సు గుణు డౌను!క్షీణ మేర్చ బోకు?జీవమున్!
1.గర్భగత"-రసాంఘ్రి"-వృత్తము.
అనుష్టుప్ఛందము.స.స.గగ.గణములు.వృ.సం.28.
ప్రాసనియమము కలదు.
గతమాగత!లోకంబున్?
స్థితమంచున్?వర్తింపన్?
హిత మేగతి?చేకూరున్!
జిత కర్ముడె!మోక్షార్ధౌ?
2.గర్భగత"-భ్రమక"-వృత్తము.
బృహతీఛందము.ర.న.జ.గణములు.వృ.సం.379.
ప్రాసనియమము కలదు.
కాలచక్ర భ్రమక మొప్పు!
చీలిపోవు!మమత లెల్ల?
హేళమౌను!జనన శోభ!
శీల వర్తి!సుగుణు డౌను!
3.గర్భగత"-మత్తరజినీ"-వృత్తము.వృ.సం.171.
ప్రాసనియమము కలదు.
కాన నౌనె?జీవి శాశ్వతల్!
శ్రీనివాసు!గొల్వుమా!మహిన్!
హీనతత్వ!ముప్పు దోషమౌ?
క్షీణమేర్చ బోకు?జీవమున్!
4.గర్భగత"-హీనతా"-వృత్తము.
అత్యష్టీఛందము.స.స.మ.జ.న.గల.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
గతమాగత!లోకంబున్?కాలచక్ర భ్రమక మొప్పు!
స్థితమంచున్?వర్తింపన్!చీలిపోవు!మమతెల్ల
హిత మేగతి?చేకూరున్!హేళమౌను!జనన శోభ!
జిత కర్ముడె?మోక్షార్ధౌ?శీల వర్తి! సుగుణు!డౌను?
5.గర్భగత"-రనజారజ"-వృత్తము.
ధృతిఛందము.ర.న.జ.ర.జ.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కాలచక్ర!భ్రమక మొప్పు!కాన నౌనె?జీవి శాశ్వతల్?
చీలిపోవు మమత లెల్ల?శ్రీనివాసు!గొల్వుమా!మహిన్!
హేళమౌను!జనన శోభ!హీనతత్వ ముప్పు దోషమౌ?
శీలవర్తి సుగుణుడౌను?క్షీణ మేర్పబోకు?జీవమున్?
6.గర్భగత"-గతమాగత"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.న.జ.ర.జ.ర.స.స.గగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కాలచక్ర భ్రమక మొప్పు!కాననౌనె?జీవి శాశ్వతల్!గతమాగత లోకంబున్?
చీలిపోవు!మమతలెల్ల?శ్రీనివాసు!గొల్వుమా!మహిన్!స్థితమంచున్ వర్తింపన్?
హేళమౌను!జనన శోభ!హీనతత్వ ముప్పు దోషమౌ?హిత మేగతి చేకూరున్?
శీల వర్తి!సుగుణుడౌను?క్షీణమేర్పబోకు?జీవమున్?జిత కర్ముడె? మోక్షార్థౌ?
7.గర్భగత"-చంద్రమా"- వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.స.స.గగ.గణములు.యతి,10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కాననౌనె?జీవి సౌఖ్యతల్?.గతమాగత లోకంబున్!
శ్రీనివాసు!గొల్వుమా!మహిన్!స్థితమంచున్!వర్తింపన్?
హీన తత్వ!ముప్పు దోషమౌ?హిత మేగతి?చేకూరున్?
క్షీణ మేర్పబోకు?జీవమున్?జిత కర్ముడె!మోక్షార్ధౌ?
8.గర్భగత"-చక్ర భ్రమక"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.స.స.మ.జ.న.గల.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కాననౌనె?జీవి శాశ్వతల్?గతమాగత లోకంబున్!కాలచక్ర భ్రమక మొప్పు?
శ్రీనివాసు!గొల్వుమా!మహిన్!స్థితమంచున్!వర్తింపన్?చీలిపోవు?మమతలెల్ల?
హీన తత్వ ముప్పు దోషమౌ?హిత మేగతి?చేకూరున్!హేళ మౌను జననశోభ!
క్షీణ మేర్పబోకు?జీవమున్?జిత కర్ముడె?మోక్షార్ధౌ?శీల వర్తి! సుగుణుడౌను
9.గర్భగత"-శబరీ"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.న.జ.స.స.గగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు! వృ.సం.
కాలచక్ర భ్రమక మొప్పు?గతమాగత లోకంబున్?
చీలిపోవు!మమత లెల్ల?స్థిత మంచున్?వర్తింపన్?
హేళమౌను? జనన శోభ!హిత మేగతి!చేకూరున్?
శీల వర్తి!సుగుణు డౌను!జిత కర్ముడె?మోక్షార్ధౌ?
10,గర్భగత"-శశిచర"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.న.జ.స.స.మ.జ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కాలచక్ర భ్రమక మొప్పు?గతమాగత లోకంబున్?కాననౌనె?జీవి శాశ్వతల్?
చీలిపోవు!మమత"-లెల్ల!స్థితమంచున్?వర్తింపన్?శ్రీనివాసు!కొల్వుమా మహిన్?
హేళ మౌను?జనన శోభ!హిత మేగతి? చేకూరున్?హీన తత్వ ముప్పు దోషమౌ?
శీలవర్తి!సుగుణు డౌను!జిత కర్ముడె?మోక్షార్ధౌ?క్షీణ మేర్ప బోకు?జీవమున్.
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.