గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

10, ఆగస్టు 2019, శనివారం

భారణా,వరీయత్తరజినీ,నిభసరి,నిరంజనీ,దోషాపహ.భారజ,పోషకా,భారసీ,నిర్వేదనా,ఉత్పలమాల,గర్భ"-ఫలితోత్పల"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.
భారణా,వరీయత్తరజినీ,నిభసరి,నిరంజనీ,దోషాపహ.భారజ,పోషకా,భారసీ,నిర్వేదనా,ఉత్పలమాల,గర్భ"-ఫలితోత్పల"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

"-ఫలితోత్పల"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.ర.న.భ.భ.ర.జ.ర.లగ.గణములు.యతులు,10,18,
ప్రాసనియమము కలదు.వృ.సం.
రోష కషాయ వీక్షణల!రోదిల జేయగ రాదు!రూకలం దలంపు!దోషమౌ?
భూషిత మెంచ మానుటగు!బూది గదే?తుదినెంచ!బూకరాలు!నిల్వవెన్నడున్?
పోషకమందు!భేదిలును!పోదు వదే?యవినీతి!పోకడం!తరింపు గాంతువే?
భూషలు దోషపూర్ణమగు!బోధలు మెచ్చుట మేలు!పోకుమా!దురాన! మానవా!
1.గర్భగత"-భారణా"-వృత్తము.
బృహతీఛందము.భ.ర.న.గణములు.వృ.సం.471.
ప్రాసనియమము కలదు. వృ.సం.
రోష కషాయ వీక్షణల!
భూషిత మెంచ మానుటగు?
పోషకమందు భేదిలును!
భూషలు దోష పూర్ణమగు!
2.గర్భగత"-వరీయ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.భ.భ.గల.గణములు.వృ.సం.183.
ప్రాసనియమము కలదు.
రోదిల జేయగ రాదు!
బూదిగదే?తుది నెంచ!
పోదు వదే?యవినీతి!
బోధలు మెచ్చుట మేలు?
3.గర్భగత"-మత్తరజినీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.
ప్రాసనియమము కలదు.
రూకలం దలంపు దోషమౌ?
బూకరాలు నిల్వ వెన్నడున్?
పోకడం !తరింపు గాంతువే?
పోకుమా!దురాన మానవా!
4.గర్భగత"-నిభసరి"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.ర.న.భ.భ.గల.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
రోష కషాయ వీక్షణల!రోదిల జేయగ రాదు!
భూషిత మెంచ మానుటగు!బూది గదే?తుది నెంచ!
పోషక మందు భేదిలును!పోదువదే?యవి నీతి!
భూషలు దోష పూర్ణ మగు!బోధలు మెచ్చుట!మేలు!
5.గర్భగత"-నిరంజనీ"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.భ.ర.న.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
రూకలం దలంపు దోషమౌ!రోష కషాయ వీక్షణల!
బూకరాలు నిల్వ వెన్నడున్?భూషిత మెంచ మానుటగు?
పోకడం!తరింపు గాంతువే?పోషక మందు భేదిలున్?
పోకుమా!దురాన మానవా!భూషలు దోష పూర్ణమగు!
6.గర్భగత"-దోషాపహా"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.భ.ర.న.భ.భ.గల.గణములు.యతులు10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
రూకలం దలంపు దోషమౌ?రోష కషాయవీక్షణల!రోదిల జేయగ రాదు!
బూకరాలు నిల్వ వెన్నడున్?భూషితమెంచ మానుటగు!బూది గదే?తుదినెంచ?
పోకడం దరింపు గాంతువే?పోషక మందు భేదిలున్?పోదువదే!యవినీతి?
పోకుమా!దురాన మానవా!భూషలు దోష పూర్ణమగు!బోధలు మెచ్చుట మేలగు?
7.గర్భగత"-భారజ"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.భ.ర.జ.ర.లగ.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
రోదిల జేయగరాదు!రూకలం దలంపు దోషమౌ?
బూదిగదే?తుదినెంచ?బూకరాలు నిల్వ వెన్నడున్?
పోదు వదే యవినీతి?పోకడం!తరింపు గాంతువే?
బోధలు మెచ్చుట మేలగు?పోకుమా!దురాన మానవా?
8.గర్భగత"-పోషకా"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.భ.ర.జ.ర.య.స.జ.లల.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
రోదిల జేయగ రాదు!రూకలం దలంపు దోషమౌ?రోష కషాయ వీక్షణల!
బూదిగదే?తుదినెంచ?బూకరాలు నిల్వ వెన్నడున్?భూషిత మెంచ మానుటగు!
పోదువదే?యవినీతి?పోకడం తరింపు గాంతువే?పోషకమందు!భేదిలును!
బోధలు మెచ్చు మేలగు?పోకుమా!దురాన మానవా? భూషలు దోషపూర్ణమగు!
9.గర్భగత"-భారసీ"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.భ.ర.స.జ.లల.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
రోదిల జేయగ రాదు!రోష కషాయ వీక్షణల!
బూదిగదే?తుదినెంచ?భూషిత మెంచ!మానుటగు?
పోదువదే?యవినీతి?పోషక మందు!భేదిలును!
బోధలు మెచ్చు!మేలగు?భూషలు దోష పూర్ణమగు!
10,గర్భగత"-నిర్వేదనా"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.భ.ర.స.జ.స.జ.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
రోదిల జేయగరాదు?రోష కషాయ వీక్షణల!రూకలం దలంపు!దోషమౌ?
బూదిగదే?తుదినెంచ!భూషిత మెంచ!మానుటగు! బూకరాలు నిల్వవెన్నడున్?
పోదువదే!యవినీతి?పోషకమందు!భేదిలును!పోకడం తరింపు!గాంతువే?
బోధలు మెచ్చు మేలగు?భూషలు దోష పూర్ణ మగు!పోకుమా!దురాన మానవా?
11.గర్భగత"-ఉత్పలమాలా"-వృత్తము.
కృతిఛందము.భ.ర.న.భ.భ.ర.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
రోష కషాయ వీక్షణల!రోదిల జేయగ రాదు!రూకలన్?
భూషిత మెంచ మానుటలు!బూదిగదే?తుదినెంచ!బూకరా?
పోషక మందు!భేదిలును!పోదువదే?యవినీతి!పోకడన్?
భూషలు దోష పూర్ణమగు!బోధలు మెచ్చు మేలగు!పోకుమా!
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.