గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

18, ఆగస్టు 2019, ఆదివారం

మత్తరజినీ,సమాశ్రీ,తృప్తిదా,హేతుకా,బీరువోని,చేదుగనే,మనురా,మానరే, సుగంథీ,మారుమా,గర్భ"-మారాడు వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.

జైశ్రీరామ్.
మత్తరజినీ,సమాశ్రీ,తృప్తిదా,హేతుకా,బీరువోని,చేదుగనే,మనురా,మానరే, సుగంథీ,మారుమా,గర్భ"-మారాడు వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.

"-మారాడు"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.త.స.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
బీరు వోని!ధైర్య మూనుమా! పేద వంచు! నెంచ కీవు ?పేరొందే!పనులు చేయుమా?
చేర నెంచు!ముక్తి సౌథమున్?చేదుగాని!చర్యనెంచు!శ్రీ రమ్యం బదెయె? సోదరా!
కోరు శాంతి జీవితంబునన్?క్రోధ మంద!మాను మయ్య!కోరిందే!గనెదు! భూతలిన్?
మారు మాటలాడ బోకుమా?మాధకాల!ముట్ట బోకు?మారామే!భవిత మాపురా!
1గర్భగత"-మత్తరజినీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.
ప్రాసనియమము కలదు.
బీరు వోని!ధైర్య మూనుమా?
చేర నెంచు?ముక్తి సౌధమున్?
కోరు శాంతి!జీవితంబునన్?
మారు మాట లాడ!బోకుమా?
2.గర్భగత"-సమాశ్రీ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.జ.గల.గణములు.వృ.సం.171.
ప్రసనియమము కలదు.
పేద వంచు!నెంచ కీవు?
చేదు కాని!చర్య నెంచు?
క్రోధ మంద!మాను మయ్య?
మాధకాలు!ముట్ట బోకు?
3.గర్భగత"-తృప్తిదా"-వృత్తము.
బృహతీఛందము.మ.న.ర.గణములు.వృ.సం.185.
ప్రాసనియమము కలదు.
పేరొందే!పనులు చేయుమా?
శ్రీరమ్యంబదియె?సోదరా!
కోరిందే?కనుదు!భూతలిన్?
మారామే?భవిత!మాపురా!
4.గర్భగత"-హేతుకా"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.ర.జ.గల.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
బీరువోని?ధైర్య మూనుమా!పేదవంచు?నెంచకీవు?
చేర నెంచు!ముక్తి సౌధమున్?చేదుగాని!చర్య నెంచు?
కోరు శాంతి!జీవితంబునన్?క్రోధ మంద!మాను మయ్య?
మారు మాట లాడ బోకుమా?మాధకాలు!ముట్ట బోకు?
5.గర్భగత"-బీరువోని"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.త.స.లగ.గణములుయతి.09.వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
పేద వంచు!నెంచ కీవు?పేరొందే?పనులు!చేయుమా?
చేదు గాని!చర్య నెంచు?శ్రీరమ్యంబదియె?సోదరా?
క్రోధ మంద!మానుమయ్య?కోరిందే?కనుదు!భూతలిన్?
మాధకాలు!ముట్ట బోకు?మారామే!భవిత! మాపురా?
6.గర్భగత"-చేదుగాని"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.త.స.య.జ.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
పేదవంచు నెంచకీవు?పేరొందే!పనులు చేయుమా?బీరు వోని ధైర్యమూనుమా?
చేదుగాని!చర్యనెంచు?శ్రీరమ్యంబదియె?సోదరా?చేరనెంచు?ముక్తిసౌథమున్?
క్రోధమంద!మానుమయ్య?కోరిందే!కనుదు భూతలిన్?కోరు శాంతి! జీవితంబునన్?
మాధకాలు!ముట్ట బోకు?మారామే!భవిత!మాపురా?మారు మాట లాడ బోకుమా?
7.గర్భగత"-మనురా"-వృత్తము.
ధృతిఛందము.మ.న.ర.ర.జ.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
పేరొందే?పనులు చేయుమా!బీరువోని ధైర్య మూనుమా?
శ్రీ రమ్యం బదియె?సోదరా?చేర నెంచు!ముక్తి సౌథమున్?
కోరిందే!కనుదు భూతలిన్?కోరు శాంతి జీవితంబునన్?
మారామే?భవిత మాపురా?మారు మాట లాడ బోకుమా?
8.గర్భగత"-మానరే"-వృత్తము.
ఉత్కృతిఛందము.మ.న.ర.ర.జ.ర.ర.జ.గల.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
పేరొందే!పనులు జేయుమా?బీరువోని?ధైర్య మూనుమా?పేద వంచు నెంచకీవు?
శ్రీ రమ్యంబదియె?సోదరా?చేర నెంచు!ముక్తి సౌథమున్?చేదుగాని.చర్య నెంచుమా?
కోరిందే?కనుదు!భూతలిన్?కోరు శాంతి జీవితంబులన్?క్రోధమంద మాను మయ్య?
మారామే?భవిత మాపురా?మారు మాట లాడ బోకుమా?మాధకాలు! ముట్ట బోకుమా?
9.గర్భగత"-సుగంథీ"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.జ.ర.లగ.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
పేదవంచు!నెంచకీవు?బీరువోని?ధైర్య మూనుమా?
చేదుగాని!ధైర్య మూనుమా?చేర నెంచు?ముక్తి సౌధమున్?
క్రోధమంద!మాను మయ్య?కోరు శాంతి జీవితంబులన్?
మాధకాలు!ముట్ట బోకుమా?మారు మాట లాడ బోకుమా?
10,గర్భగత"-మారుమా"-వృత్తము.
ఉత్కృతి ఛందము,ర.జ.ర.జ.ర.య.త.జ.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
పేదవంచు?నెంచకీవు?బీరువోని?ధైర్య మూనుమా?పేరొందే?పనులు జేయుమా?
చేదు గాని!చర్య నెంచుమా?చేరనెంచు?ముక్తి థామమున్?శ్రీరమ్యంబదియె?సోదరా?
క్రోధ మంద!మానుమయ్య?కోరు శాంతి!జీవితంబులన్?కోరిందే కనుదు భూతలిన్?
మాధకాలు!ముట్ట బోకుమా?మారు మాట లాడ బోకుమా?మారామే? భవిత మాపురా?
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.