గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, ఆగస్టు 2019, బుధవారం

సమాశ్రీద్వయ,చెడుతీర్పు,సుమగంథిద్వయ,రమజా,తరోజ,అజరా,చీదరణ,భ్రాంతినీ,గర్భ"-నిరాదరణ"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.
సమాశ్రీద్వయ,చెడుతీర్పు,సుమగంథిద్వయ,రమజా,తరోజ,అజరా,చీదరణ,భ్రాంతినీ,గర్భ"-నిరాదరణ"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

"-నిరాదరణ"-వృత్తము.
సంకృతిఛందము.ర.జ.ర.జ.ర.య.త.ర.గణములు.యతులు.09,17.
ప్రాసనియమము కలదు.వృ.సం.
అమ్మ చేతిముద్ద లేదు?ఆదరించు!తండ్రి లేడు?అంతా!మిథ్యెంచి!చూడగన్?
వమ్ము జీవయాన మాయె!వాదిలంగ!లేదదేది?భ్రాంతేగా!మాయ లోకమున్?
కమ్మనైన!మాట లేదు?కాదు!తప్పనంగ!తప్పు?క్రాంతేదీ?శాంత మేదిలన్?
చిమ్మ చీకటాయె!నీతి!చీదరింపు!లాదరింప!చింతింపే! నిండె! మేథినిన్!
1.గర్భగత"-సమాశ్రీ ద్వయ"-వృత్తములు.
అనుష్టుప్ఛందము.ర.జ.గల.గణములు.వృ.సం.171.
ప్రాస నియమము కలదు.
1.  అమ్మ చేతి ముద్ద లేదు?           2. ఆదరించు!తండ్రి లేడు?
     వమ్ము జీవ యాన మాయె!           వాదిలంగ!లేద దేది?
     కమ్మనైన!మాట లేదు?                 కాదు తప్పనంగ!తప్పు?
     చిమ్మ చీకటాయె!నీతి!                 చీదరింపు లాదరింప!
2.గర్భగత"-చెడుతీర్పు"-వృత్తము.
అనుష్టుప్ఛందము.మ.ర.లగ.గణములు.వృ.సం.81.
ప్రాసనియమము కలదు.
అంతా!మిథ్యెంచి!చూడగన్?
భ్రాంతేగా!మాయ లోకమున్?
క్రాంతేదీ!శాంత మేదిలన్?
చింతింపే! నిండె! మేథినిన్!
3.గర్భగత"-సుమగంథి ద్వయ"-వృత్తములు.
అష్టీఛందము.ర.జ.ర.జ.ర.ల.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
1.  అమ్మ చేతి ముద్ద లేదు?ఆదరించు!తండ్రి లేడు?
     వమ్ము జీవయాన మాయె!వాదిలంగ!లే దదేది?
     కమ్మనైన!మాట!లేదు?కాదు!తప్పనంగ!తప్పు?
     చిమ్మ చీకటాయె!నీతి! చీదరింపు లాదరింప!

2.   ఆదరించు!తండ్రి లేడు?అమ్మ చేతి ముద్ద లేదు?
      వాదిలంగ!లే దదేది?వమ్ము జీవ యాన మాయె!
     కాదు!తప్పనంగ!తప్పు?కమ్మనైన మాట లేదు?
     చీదరింపు లాదరింప! చిమ్మ చీకటాయె!నీతి!
4.గర్భగత"-రమజా"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.జ.ర.మ.జ.గ.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ఆదరించు!తండ్రి లేడు?అంతా మిథ్యెంచి!చూడగన్?
వాదిలంగ!లే దదేది? భ్రాంతేగా!మాయ లోకమున్?
కాదు!తప్పనంగ తప్పు?క్రాంతేదీ?శాంత మేదిలన్?
చీదరింపు! లాదరింప!చింతింపే! నిండె మేథినిన్?
5.గర్భగత"-తరోజ"-వృత్తము.
సంకృతి ఛందము.ర.జ.ర.మ.జ.త.ర.జ.గణములు.యతులు.09,17.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ఆదరించు!తండ్రి లేడు?అంతా మిథ్యెంచి చూడగన్?అమ్మ చేతి ముద్ద లేదు?
వాదిలంగ!లే దదేది?భ్రాంతేగా!మాయ లోకమున్?వమ్ము జీవయాన మాయె?
కాదు!తప్పనంగ!తప్పు?క్రాంతేదీ?శాంతమేదిలన్?కమ్మ నైన!మాట లేదు?
చీదరింపు లాద రింప!చింతింపే! నిండె! మేథినిన్? చిమ్మ చీకటాయె!నీతి!
6.గర్భగత"-అజరా"-వృత్తము.
అష్టీఛందము.మ.ర.య.జ.ర.ల.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
అంతా మిథ్యెంచి చూడగన్?అమ్మ చేతి ముద్ద లేదు?
భ్రాంతేగా!మాయ లోకమున్?వమ్ము జీవయాన మాయె?
క్రాంతేదీ? శాంత  మేదిలన్? కమ్మనైన  మాట లేదు?
చింతింపే!నిండె మేథినిన్? చిమ్మ చీకటాయె! నీతి!
7.గర్భగత"-చీదరణా"-వృత్తము.
సంకృతిఛందము.మ.ర.య.జ.ర.జ.ర.జ.గణములు.యతులు.09,17.
ప్రాస నియమము కలదు.వృ.సం.
అంతా!మిథ్యెంచి చూడగన్?అమ్మ చేతి ముద్ద లేదు?ఆదరించు తండ్రి లేడు?
భ్రాంతేగా!మాయ లోకమున్?వమ్ము జీవయాన మాయె?వాదిలంగ!లే దదేది?
క్రాంతేదీ? శాంత మేదిలన్? కమ్మనైన  మాట లేదు? కాదు!తప్పనంగ తప్పు?
చింతింపే? నిండె! మేథినిన్? చిమ్మ చీక టాయె నీతి!  చీదరింపు లాదరింప!
8.గర్భగత"-భ్రాంతినీ"-వృత్తము.
సంకృతిఛందము.ర.జ.ర.జ.ర.య.త.ర.గణములు.యతులు.09,17.
ప్రాస నియమము కలదు.వృ.సం.
ఆదరించు తండ్రి లేడు?అమ్మ చేతి ముద్ద లేదు?అంతా!మిథ్యెంచి చూడగన్?
వాదిలంగ లే దదేది?వమ్ము జీవయాన మాయె?భ్రాంతేగా?మాయ లోకమున్!
కాదు!  తప్ప నంగ!తప్పు ?కమ్మనైన మాట లేదు?భ్రాంతేదీ?శాంత మేదిలన్?
చీద రింపు లాద రింప!చిమ్మ చీక  టాయె!   నీతి!చింతింపే?నిండె మేథినిన్?
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
గర్భగత సమాశ్రీ ద్వయ వృత్తములన్నియు మనో రంజకముగా నున్నవి. శ్రీ వల్లభవఝుల వారికి ప్రణామములు . శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.