గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, ఆగస్టు 2019, మంగళవారం

భద్రక,తరంగ'మత్తరజినీ,భద్రశ్రీ,తజ్ఝరీ,తబ్బిబ్బు,శాశ్వత,రభతా,త్వదర్థ,హొయలా,గర్భ"-నిబ్బరింపు"-వృత్తము, రచన;-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.

జైశ్రీరామ్.
భద్రక,తరంగ'మత్తరజినీ,భద్రశ్రీ,తజ్ఝరీ,తబ్బిబ్బు,శాశ్వత,రభతా,త్వదర్థ,హొయలా,గర్భ"-నిబ్బరింపు"-వృత్తము,
రచన;-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.

"-నిబ్బరింపు"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.త.న.త.జ.ర.జ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ఉబ్బని తబ్బిబ్బు పడకు!ఒయ్యారపు సోకు గాడ!ఉబ్బు గాదు?వాపు సోదరా!
నిబ్బరివై!నిల్వ దగదు? నెయ్యా నను !బల్కు చుంటి!నిబ్బరంబు!కీడు సేయురా!
గబ్బుగ!వైద్యున్గనుమయ!కయ్యంబన బోకు మోయి!గబ్బు కంపు! 
నొందు టభ్రమా!
నిబ్బరమౌ!జీవిత మగు? నెయ్యంబది!శాశ్వతంబు!నిబ్బరించు!మిత్ర సత్తమా!
అర్ధములు:-
ఉబ్బు=పొంగుట(ధనగర్వము),వాపు=శరీరపుపొంగు,(అనారోగ్యము),
నిబ్బరి=నిబ్బరత్వము,గబ్బుగ=వడిగా,గబ్బుకంపు=శరీర అనారోగ్యము
వలన కల్గిన దుర్వాసన,అభ్రమా=ఆశ్చర్యమా!(ఆశ్చర్యము కాదు.)
నిబ్బరమౌజీవితము=నిశ్చితమైన జీవితము.(అనారోగ్యమగు,ధృడమైన
శరీరము).నిబ్బరించు=నిబ్బరించినవాడవు కమ్ము.
1.గర్భగత"-భద్రక"-వృత్తము.
బృహతీఛందము.భ.త.ర.గణములు.వృ.సం.167.
ప్రాసనియమము కలదు.
ఉబ్బని తబ్బిబ్బు పడకు!
నిబ్బరి వై!నిల్వ దగదు?
గబ్బగ వైద్యుని గనుమయ?
నిబ్బరమౌ!జీవిత మగు!
2.గర్భగత"-తరంగ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.త.జ.గల.గణములు.వృ.సం.173.
ప్రాసనియమము కలదు.
ఒయ్యారపు!సోకుగాడ!
నెయ్యానను పలుకుచుంటి!
కయ్యంబన బోకుమోయి?
నెయ్యంబది శాశ్వతంబు!
3.గర్భగత"-మత్తరజినీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.
ప్రాసనియమము కలదు.
ఉబ్బు గాదు!వాపు సోదరా!
నిబ్బరంబు!కీడు సేయురా!
గబ్బు కంపుటొందు ట భ్రమా?
నిబ్బరించు!మిత్ర సత్తమా!
4.గర్భగత"-భద్రశ్రీ"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.త.ర.త.జ.గల.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ఉబ్బని!తబ్బిబ్బు పడకు?ఒయ్యారపు!సోకు గాడ!
నిబ్బరివై!నిల్వదగదు? నెయ్యానను బల్కు చుంటి!
గబ్బగ!వైద్యుని గనుమయ?కయ్యంబనబోకు?మోయి!
నిబ్బరమౌ?జీవిత మగు!నెయ్యంబది శాశ్వతంబు!
5.గర్భగత"-తజ్ఝరీ"-వృత్తము.
అత్యష్టీఛందము.త.జ.ర.జ.ర.లగ.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ఒయ్యారపు!సోకుగాడ!ఉబ్బు! గాదు!వాపు సోదరా?
నెయ్యానను!బల్కు చుంటి! నిబ్బరంబు!కీడు సేయురా?
కయ్యంబన! బోకు?మోయి?గబ్బు కంపు టొందు టభ్రమా?
నెయ్యంబది?శాశ్వతంబు! నిబ్బరించు!మిత్ర సత్తమా!
6.గర్భగత"-తబ్బిబ్బు"-వృత్తము..
ఉత్కృతిఛందము.త.జ.ర.జ.ర.జ.స.భ.లల.గణములు.యతులు.09,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ఒయ్యారపు!సోకుగాడ!ఉబ్బు కాదు వాపు!సోదరా?ఉబ్బని!తబ్బిబ్బు!పడకు!
నెయ్యానను!బల్కుచుంటి!నిబ్బరంబు!కీడు సేయురా!నిబ్బరివై!నిల్వ దగదు?
కయ్యంబన బోకుమోయి?గబ్బు కంపు!పొందు టబ్రమా?గబ్బుగ!వైద్యుని! కనుమయ?
నెయ్యంబది!శాశ్వతంబు?నిబ్బరించు!మిత్ర సత్తమా?నిబ్బరమౌ!జీవితమగు!
7.గర్భగత"-శాశ్వత"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.భ.త.న.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ఉబ్బు కాదు?వాపు సోదరా?ఉబ్బని!తబ్బిబ్బు పడకు?
నిబ్బరంబు!కీడు సేయురా!నిబ్బరివై!నిల్వ దగదు?
గబ్బు కంపు!పొందుటబ్రమా?గబ్బుగ!వైద్యుని!కనుమయ?
నిబ్బరించు!మిత్ర సత్తమా?నిబ్బరమౌ?జీవిత మగు?
8.గర్భగత"-రభతా"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.భ.త.న.త.జ.గల.గణములు.యతులు10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ఉబ్బు కాదు?వాపు సోదరా!ఉబ్బని!తబ్బిబ్బు పడకు?ఒయ్యారపు!సోకుగాడ.
నిబ్బరంబు!కీడు సేయురా!నిబ్బరివై!నిల్వదగదు?నెయ్యానను!బల్కుచుంటి?
గబ్బుకంపు!టొందుటబ్రమా?గబ్బుగ!వైద్యుని కనుమయ?కయ్యంబనబోకు?మోయి!
నిబ్బరించు!మిత్రసత్తమా!నిబ్బరమౌ?జీవితమగు!నెయ్యంబది!శాశ్వతంబు?
9.గర్భగత"-తద్వర"-వృత్తము.
అత్యష్టీఛందము.త.జ.ర.స.భ.లల.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ఒయ్యారపు!సోకుగాడ!ఉబ్బని!తబ్బిబ్బు పడకు?
నెయ్యానను!బల్కుచుంటి?నిబ్బరివై!నిల్వ దగదు?
కయ్యంబనబోకు మోయి?గబ్బుగ!వైద్యుని గనుమయ!
నెయ్యంబది?శాశ్వతంబు!నిబ్బరమౌ?జీవితమగు?
10,గర్భగత"-హొయలా"-వృత్తము.
ఉత్కృతిఛందము.త.జ.ర.స.భ.స.జ.ర.లగ.గణములు.యతులు.09,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ఒయ్యారపు!సోకుగాడ!ఉబ్బని!తబ్బిబ్బు పడకు?ఉబ్బు కాదు?వాపు సోదరా!
నెయ్యానను!బల్కుచుంటి!నిబ్బరివై!నిల్వదగదు?నిబ్బరంబు!కీడు సేయురా?
కయ్యంబన బోకుమోయి?గబ్బుగ!వైద్యుని!గనుమయ? గబ్పుకంపు! టొందుటభ్రమా?
నెయ్యంబది?శాశ్వతంబు!నిబ్బరమౌ?జీవితమగు!నిబ్బరించు!మిత్ర సత్తమా!
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.