గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, జులై 2024, మంగళవారం

నిత్యం క్రోధాచ్ఛ్రియం రక్షేత్త .... మేలిమిబంగారం మన సంస్కృతి.

 జై శ్రీరామ్.

శ్లో.  నిత్యం క్రోధాచ్ఛ్రియం రక్షేత్త - పో రక్షేచ్చ మత్సరాత్|

విద్యాం మానావమానాభ్యాం - ఆత్మానం తు ప్రమాదతః|| 

తే.గీ.  కోపము వలన లక్ష్మిని, కూరుకొను న

సూయ వలన తపంబును, స్వీయ

గౌరవాగౌరవములచే జ్ఞాన విద్య,

తప్పుచే నాత్మఁ జెడనీకు, ధర్మ నిరత!

భావము. 

ఎల్లప్పుడునూ - కోపము వలన ఐశ్వర్యమును, అసూయ వలన తపస్సు, 

మానావమానముల వలన విద్య, పొరపాటు వలన ఆత్మ చెడకుండా 

కాపాడుకోవలెను.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.