గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, జులై 2024, గురువారం

3. శా. క్రన్నన్ గావఁగ వచ్చి ప్రోతు వనుచున్, ..గానం శ్రీమతి దోర్బల బాలసుజాత.

 

జైశ్రీరామ్.

3. శా. క్రన్నన్ గావఁగ వచ్చి ప్రోతు వనుచున్, గన్పింతువీవంచు నో

కన్నా! చిత్త కవాటమున్ దెఱచి, నిన్ గాంచంగ నేనుంటి, నా

కన్నుల్ కాయలు కాచుచుండె, నయినన్ గన్పింప రావేల? శ్రీ

మన్నారాయణ! గాంచ నేరనయితో మాన్యా! మదిన్ వెల్గు నిన్.

భావము.

శ్రీమన్నారాయణా! కన్నతండ్రీ! వేగమే కాపాడుటకు వచ్చి నన్ను కాపాడుదువనియు, నీవు నాకు కనిపింతువనియు, నా హృదయ కవాటమును తెరచి యుంచితిని. నా కన్నులు కాయలు కాచుచుండెను అయినప్పటికీ నీవు నాకు కనిపించగా రావేమి? నా హృదయముననే నీవు ప్రకాశించుచున్నప్పటికీ నిన్ను చూచుట నే నెఱుఁగకుంటినా?

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.