గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

18, జులై 2024, గురువారం

14. శా. కన్నుల్ సూచెడి శక్తి కల్గియును..... శ్రీమన్నారాయణ శతకము. గానం శ్రీమతి దోర్బల బాలసుజాత.

 

జైశ్రీరామ్.

14. శా. కన్నుల్ సూచెడి శక్తి కల్గియును నిన్ గాంచంగ లేవేలనో?

మన్నైపోయెడి దేహమందు కల నిన్ మర్యాదగాఁ జూడలే

కున్నన్ గన్నులవేల మాకుఁ? గననీవో నిన్ను గుర్తించి? శ్రీ

మన్నారాయణ! దేహివౌచుఁ గల నిన్ మా కండ్లతోఁ జూడనీ.

భావము.

శ్రీమన్నారాయణా! కన్నులకు చూచెడి శక్తి యున్నప్పటికీ ఎందుచేతనో కాని నిన్నుచూడలేకపోవుచున్నవి మన్నైపోయే శరీరమునగల నిన్ను గౌరవప్రదముగా చూడలేకపోయినచో అట్టి కన్నులు మాకెందులకు? నిన్ను గుర్తించి చూడనీయవా యేమి? దేహధారివై మా రూపములోనున్న నిన్ను కన్నులతో చూడనిమ్ము.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.