గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, జులై 2024, శుక్రవారం

గదిలో మూగది పాటపాడె శ్రుతిలో గాంధర్వమొప్పారగా... సమస్యకు నా పూరణ. తే.12 - 7 - 2024.

 జైశ్రీరామ్.

మ.  మదిలో నిల్చిన మాతృమూర్తి కృపచే మాతృప్రభా దర్శనం

బెదలో నిండుచు, పొంగిపొర్ల నదియే యీశాని వాగ్రూపమై

సుధలంజిందుచు శబ్దరూపమవగా శోభాయమానంబుగా

గదిలో మూగది పాటపాడె శ్రుతిలో గాంధర్వమొప్పారగా.

జైహింద్.

Rephrase with Ginger (Ctrl+Alt+E)
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.