గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

18, జులై 2024, గురువారం

అర్పణము,దర్పము,మొద్దుబారు,తాయిలాలు,గోయినెట్టు,చెడునైజం,సన్మార్గ,చిదుపు,జీవము,లోకోద్థరణ,శ్రమపడని,నందనము,ఛిద్రమేర్చు,జీవా,గర్భ "శ్రేయమెంచు"వృత్తమురచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి,,

జైశ్రీరామ్. 

అర్పణంబుగ పొందు సొమ్మే!హాయిగా త్రాగుళ్ళ కాయెన్!అది లోకోద్ధరణ మెట్లౌ?

దర్ప మెంచెను మొద్దు బార్చెన్!తాయిలాలే తప్పు పంచన్!తదనర్ధంబు శ్రమ మృగ్యమ్!
కూర్పు మాదరణంబు మంచిన్!గోయి నెట్టే నైజమాయెన్!కొదు వేదీ?శ్రమకు జీవా!
చేర్పు మెల్లెర నందనంబున్!శ్రేయ మెంచే మార్గ మెంచుమ్!చిదుపం జీవములు పాపమ్!

సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి.అనిరుద్ఛందాంతర్గత"ఉత్కృతి"
ఛందము లోనిది,ప్రాసనియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10.18,అక్షరములకు చెల్లును,

1.గర్భగత"అర్పణము"వృత్తము,

అర్పణంబుగ పొందు సొమ్మే!
దర్ప మెంచెను మొద్దు బార్చెన్!
కూర్పు మాదరణంబు మంచిన్!
చేర్చు మెల్లెర నందనంబున్!

అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"9"అక్షరము లుండును,

2.గర్భగత"దర్పము"వృత్తము,

హాయిగా త్రాగుళ్ళ కాయెన్!
తాయిలాలే తప్పు పంచన్!
గోయి నెట్టే నైజమాయెన్!
శ్రేయ మెంచే మార్గ మెంచుమ్!

అభిజ్ఞా ఛందము నందలి"అనుష్టుప్"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు పాదమునకు"8"అక్షరము లుండును,

3.గర్భగత"మొద్దు బారు"వృత్తము,

అది లోకోద్ధరణ మెట్లౌ?
త దనర్ధంబు శ్రమ మృగ్యమ్!
కొదు వేదీ?శ్రమకు జీవా!
చిదుపం జీవములు పాపమ్!

అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదము నకు"9"అక్షరము లుండును,

4.గర్భగత"తాయిలాలు"వృత్తము,

అర్పణంబుగ పొందు సొమ్మే!హాయిగా త్రాగుళ్ళ కాయెన్!
దర్ప మెంచెను మొద్దు బార్చెన్!తాయి లాలే తప్పు పంచన్!
కూర్పు మాదరణంబు మంచిన్!గోయి నెట్టే నైజ మాయెన్!
చేర్పు మెల్లెర నందనంబున్!శ్రేయ మెంచే మార్గ మెంచుమ్!

అణిమా ఛందము నందలి అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"10"వ యక్షరమునకు చెల్లును,

5.గర్భగత"గోయి నెట్టు"వృత్తము,

హాయిగా త్రాగుళ్ళ కాయెన్!అర్పణంబుగ పొందు సొమ్మే!
తాయి లాలే తప్పు పంచన్!దర్ప మెంచెన్ మొద్దు బార్చెన్!
గోయి నెట్టే నైజమీయెన్!కూర్పు మాదరణంబు మంచిన్!
శ్రేయ మెంచే మార్గ మెంచుమ్!చేర్పు మెల్లెర నందనంబున్!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"9"వ యక్షరమునకు చెల్లును,

6.గర్భగత"చెడు నైజం"వృత్తము,

 అర్పణంబుగ పొందు సొమ్మే!అది లోకోద్థరణ మెట్లౌ? 
దర్ప మెంచెను మొద్దు బార్చెన్! త దనర్ధంబు శ్రమ మృగ్యమ్!
కూర్పు మాదరణంబు మంచిన్!కొదు వేదీ?శ్రమకు జీవా!
చేర్పు మెల్లెర నందనంబున్!చిదుపం జీవములు పాపమ్!

అణిమా ఛందము నందలి"ధృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"18"అక్షరము లుండును,
యతి"10"వ యక్షరమునకు చెల్లును,

7.గర్భగత"సన్మార్గ"వృత్తము,

అది లోకోద్ధరణ మెట్లౌ?అర్పణంబుగ పొందు సొమ్మే!
త దనర్ధంబు,శ్రమ మృగ్యమ్!దర్ప మెంచెను మొద్దు  బార్చెన్!
కొదు వేదీ?శ్రమకు జీవా!కూర్పు మాదరణంబు మంచిన్!
చిదుపం జీవములు పాపమ్!చేర్పు మెల్లర నందనంబున్!

అణిమా ఛందము నందలి"ధృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"18"అక్షరము లుండును,
యతి"10"వ యక్షరమునకు చెల్లును,

8.గర్భగత"చిదుప"వృత్తము,

హాయిగా త్రాగుళ్ళ కాయెన్!అది లోకోద్ధరణ మెట్లౌ?
తాయి లాలే తప్పు పంచన్!త దనర్ధంబు,శ్రమ మృగ్యమ్!
గోయి నెట్టే నైజమే యౌ!కొదు వేదీ?శ్రమకు జీవా!
శ్రేయ మెంచే మార్గ మెంచుమ్!చిదుపం జీవములు పాపమ్!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి,9"వ యక్షరమునకు చెల్లును,

9.గర్భగత"జీవము"వృత్తము,

అది లోకోద్ధరణ మెట్లౌ?హాయిగా త్రాగుళ్ళ కాయెన్!
త దనర్ధంబు, శ్రమ మృగ్యమ్!తాయి లాలే తప్పు పంచన్!
కొదు వేదీ?శ్రమకు జీవా!గోయి నెట్టే నైజమే యౌ!
చిదుపం జీవములు పాపమ్!శ్రేయ మెంచే మార్గ మెంచుమ్!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరములుండును,
యతి10,వ యక్షరమునకు చెల్లును,

10,గర్భగత"లోకోద్ధరణ"వృత్తము.

హాయిగా త్రాగుళ్ళ కాయెన్!అర్పణంబుగ పొందు సొమ్మే!అది లోకోద్ధరణ మెట్లౌ?
తాయిలాలే తప్పు పంచన్!దర్ప మెంచెను మొద్దు బార్చెన్!త దనర్ధంబు శ్రమ మృగ్యమ్!
 గోయి నెట్టే నైజమే యౌ!కూర్పు మాదరణంబు మంచిన్!కొదు వేదీ?శ్రమకు జీవా!
శ్రేయ మెంచే మార్గ మెంచుమ్!చేర్పు మెల్లర నందనంబున్!చిదుపం జీవములు పాపమ్!

అనిరుద్ఛందము నందలి "ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,9,18,అక్షరము లకు చెల్లును,

11.గర్భగత"శ్రమ పడని"వృత్తము,

అర్పణంబుగ పొందు సొమ్మే!అది లోకోద్ధరణ మెట్లౌ?హాయిగా త్రాగుళ్ళ కాయెన్!
దర్ప మెంచెను మొద్దు బార్చెన్!త దనర్ధంబు, శ్రమ మృగ్యమ్!తాయి లాలే తప్పు పంచన్!
కూర్పు మాదరణంబు మంచిన్!కొదు వేదీ?శ్రమకు జీవా!గోయి నెట్టే నైజమే యౌ!
 చేర్పు మెల్లర నందనంబున్!చిదుపం జీవములు పాపమ్!శ్రేయమెంచే మార్గ మెంచుమ్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు.10,19,అక్షరము లకు చెల్లును,

12.గర్భగత"నందనము"వృత్తము,

అది లోకోద్ధరణ మెట్లౌ?అర్పణంబుగ పొందు సొమ్మే!హాయిగా త్రాగుళ్ళ కాయెన్! 
త దనర్ధంబు.శ్రమ మృగ్యమ్!దర్ప మెంచెను మొద్దు బార్చెన్!తాయి లాలే తప్పు పంచన్!
కొదు వేదీ?శ్రమకు జీవా!కూర్పు మాదరణంబు మంచిన్!గోయి నెట్టే నైజమే యౌ!
చిదుపం జీవములు పాపమ్!చేర్పు మెల్లర నందనంబున్!శ్రేయ మెంచే మార్గ మెంచుమ్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,19,అక్షరములకు చెల్లును,

13.గర్భగత"ఛిద్ర మేర్చు"వృత్తము,

హాయిగా త్రాగుళ్ళ కాయెన్!అది లోకోద్ధరణ మెట్లౌ?అర్ప ణంబుగ పొందు సొమ్మే!
తాయిలాలే తప్పు పంచన్!త దనర్ధంబు,శ్రమ మృగ్యమ్!దర్ప మెంచెను మొద్దు బార్చెన్
గోయి నెట్టే నైజమే యౌ!కొదు వేదీ?శ్రమకు జీవా!కూర్పు మాదరణంబు మంచిన్!
శ్రేయ మెంచే మార్గ మెంచుమ్!చిదుపం జీవములు పాపమ్!చేర్పు మెల్లర నందనంబున్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు.9,18,అక్షరములకు చెల్లును,

14.గర్భగత"జీవా"వృత్తము,

అది లోకోద్ధరణ మెట్లౌ?హాయిగా త్రాగు ళ్ళ కాయెన్!అర్పణంబుగ పొందు సొమ్మే!
త దనర్ధంబు,శ్రమ మృగ్యమ్!తాయిలాలే తప్పు పంచన్!దర్ప మెంచెను మొద్దు బార్చెన్!
కొదు వేదీ?శ్రమకు జీవా!గోయి నెట్టే నైజమే యౌ!కూర్పు మాదరణంబు మంచిన్!
చిదుపం జీవములు పాపమ్!శ్రేయ మెంచే మార్గ మెంచుమ్!చేర్పు మెల్లర నందనంబున్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,18,అక్షరములకు చెల్లును,
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.