గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, జులై 2024, సోమవారం

యదధ్రువస్య దేహస్య .. మేలిమిబంగారం మన సంస్కృతి.

 జైశ్రీరామ్.

శ్లో.  యదధ్రువస్య దేహస్య - సానుబంధస్య దుర్మతిః |

ధ్రువాణి మన్యతే మోహాద్గృ - హక్షేత్రవసూని చ || (భాగవతం)

తే.గీ. నిత్యదూరమౌ దేహ సన్నిహితమైన

ధరను గృహము, పొలము, స్వర్ణ ధనములయెడ,

భ్రాంతి వీడక మూర్ఖుఁడు బ్రతుకుచుండు,

మోసపోవుచుండెనుండె తా నాస మునిగి.        

భావము.  వివేకంలేని మనిషి అనిత్యమైన మరియు అనేక బంధాలతో కలిగిన 

ఈ శరీరానికి సంబంధించిన ఇల్లు, భూమి, ధనం మొదలైన వాటిని మోహంతో 

శాశ్వతమైనవి అని తలుస్తాడు.

జైహింద్.

Rephrase with Ginger (Ctrl+Alt+E)
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.