గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, జులై 2024, సోమవారం

అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము) రచన. చింతా రామకృష్ణారావు

 

అష్టోత్తరశత సతీ అశ్వధాటి

)సతీ శతకము(

రచన. చింతా రామకృష్ణారావు

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ఓం శ్రీ సతీదేవ్యై నమః

 

    

పండితాభిప్రాయములు.

శ్రీ సూరం శ్రీనివాసులు గారి అభిప్రాయం.

అశ్వధాటి.

     సంస్కృత రూపకాలలో ప్రస్తావనలో ప్రరోచనాత్మక వచనాలుంటాయి ఒక వాస్తవికతను ప్రతిపాదిస్తూ.  అలాగే చింతా రామకృష్ణారావు గారి సతీశతకాన్ని గురించి ప్రస్తావించినప్పుడు నాలుగు మాటలు రాద్దా మనిపించింది.

     కవి చింతా రామకృష్ణారావుగారు భక్తి లోకానికి బంధ కవిత్వాన్ని నడిపించ గలవారు. నామాలకు రూపాన్ని కలిగించగలవారు.  రూపాలలో చైతన్యాన్ని నింపగలవారు.  ఎదుగుదలకూ ఒదుగుదలకూ రెండింటికీ తనలో తావు నివ్వగలవారు.  కవులకు తలలోని నాలుకవంటివారు.  నిరంతరాధ్యయన శీలి.  వాఙ్మయ తపస్సునకు అధిష్ఠానం.

 అనుద్వేగకరం వాక్యం, సత్యం ప్రియ, హితంచ యత్,

స్వాధ్యాయాభ్యసనంచైవ వాఙ్మయం తప ఉచ్యతే” ..అన్న గీతా వాక్యమే

ఆదర్శమైనవారు.                                                                                          

     ఇక శతక విషయం సతీదేవి పార్వతి పూర్వరూపం.

అథావమానేన పితుః ప్రయుక్తా 

దక్షస్య కన్యా భవ పూర్వపత్నీ

సతీ సతీ యోగ విసృష్టదేహా

తా జన్మనే శైలవధూం ప్రపేదే   అని కళిదాస వచనం.

కన్న తండ్రియే అవమానిస్తే భరించలేక దేహ త్యాగం చేసిన అభిమానవతి సతి.  ధనపతి సఖుఁడైనా తనకున్నదే తనదని తిరిపమెత్తే భర్త చూపిన బాటలోనే,  తన భర్త ఎంతటివాడైనా తన విలువయే తనదని నమ్మిన దేవి సతి.  సతీదేవి విషయమైనప్పుడు ఇక కవిత కదం త్రొక్కటానికి అభ్యంతరమేముంది.

     ఇక ఛందస్సు అశ్వధాటి. సంస్కృతంలో శిఖరిణి అశ్వధాటి విశిష్ట గతితో ఆకర్షించేవి. చేటీ భవన్నిఖిల ఖేటీ కదంబవనవాటీషు నాకిపటలీ మొదలైన అశ్వధాటి అందరినీ కదుపుతుంది.  వాదిరాజ తీర్థరు రచించిన దశావతార స్తుతి అశ్వధాటికే అందాలు అద్దుతుంది. ఆటువంటి ఛందస్సులో శతకం వ్రాయటం గతి తప్పని గతిలో తీర్చిదిద్దటం అంత తేలిక యేమీ కాదు.  అయినా చింతావారి ప్రయోగశీలత భాషా ఛందస్సులపై పట్టు అశ్వధాటివైపే వారిని నడిపాయి.  భక్తి భావానికి సామాజికతను కూడా జోడించి సతీదేవి శతకాన్ని ఆవిష్కరించారు రామకృష్ణారావుగారు.

12. లోకంబులో కృతులనేకంబులున్న విక నీకేల చింత యన కో

లోకేశ్వరీ కృతులు నీకై రచింపగను నాకిమ్ము శక్తి కృపతో,

నీకై రచింపగను లేకున్నచో బ్రతుకు నాకేలనమ్మ భువిపై,

చీకాకులన్ బడక నీకై రచించుటది నాకిచ్చు ముక్తిని సతీ!

ఇది చింతా వారి ముక్తి వాంఛ కృతి నిర్మాణంలో. ఇది వ్యక్తిగతం.

ఇక సామాజికంగా కూడా వారి చింత, చింతన ప్రత్యక్షర సత్యాలుగా కనిపిస్తాయి.

80. ధర్మానువర్తులిల మర్మంబెఱుంగరుగ ధర్మార్థమే బ్రతుకుచున్.

దుర్మార్గులట్టియెడ దుర్మార్గమున్ నెరపి ధర్మంబునే గెలుతురే 

ధర్మంబె యోడిన యధర్మంబురాజగును ధర్మంబునే నిలుపుమా.

మర్మజ్ఞులన్ దునుమ ధర్మంబునిల్చును సుకర్మల్ వెలుంగును సతీ!

     అశ్వధాటి అదే వేగంతో ప్రగతి పథంలో పయనించాలని ఆశిస్తూ  అభినందిస్తూ......

సూరం శ్రీనివాసులు.

26 . 11 . 2022.

అక్షరక్రమములో పద్యసంఖ్య.

101. అంగీకరించెద ననంగున్ జయింపమిని

105. అంబా విషాద వలయం బేల చుట్టె నను

59  అగ్రాహ్యముల్ విడిచి సుగ్రాహ్యముల్ గొను

 8. అజ్ఞాన దుశ్చరిత, లజ్ఞాన భావనల,

16. అబ్జాత పత్ర ముఖి కుబ్జత్వమున్

96. అమ్మా నినున్ దలవనిమ్మా నిరంతర

17. అమ్మా భవత్ పదము లిమ్మానసంబునను

5. అశ్రాంతమున్ జనుల సుశ్రేయమున్

95. ఆచారబోధిత సమాచారముల్ తెలిసి

64 ఆశావహంబయిన ధీశక్తి నే నడుగ,

14. ఆశావహుల్ జగతి నాశంబు చేయుదురు

24. ఆహారమీవె కన నాహార్యమీవె, కల

48. ఇల్లాలివై హరుని చల్లంగఁ గాచు

45. ఉత్సాహ మీవె కద ప్రోత్సాహ మిచ్చుచు

50. ఏనాటి పుణ్య ఫల మీనాడు కల్గుటిది

33. ఏలో సృజించితివి నీలాంబరంబచట

20.  ఓంకార రూపిణివి యోంకార భాసినివి

75. పార్వతీ. ప్రతిభనే పంచి పద్యములు

38. పార్వతీ! సుగుణమే పంచుచున్ జనుల

70. కన్నన్ నినున్ గలుగు మిన్నైన సత్ఫలము

43. కన్నార నిన్నుఁ గన నెన్నన్,  గనన్ జనమి

15. కల్లల్ కనన్ జగతి, నెల్లప్పుడున్ నిజము

68. కల్లోలముల్ ప్రబలె ముల్లోకముల్ కలఁగ

51. కర్ణామృతంబయిన స్వర్ణాక్షరాళినిడి

84. కష్టంబులేలనిల నష్టంబులేల పరి

103. కష్టాష్టకంబునిల సృష్టించి మమ్ములను

47. కాత్యాయనీ జనని సత్యస్వరూపిణివి

69. కాదంబ సద్వన ప్రమోద ప్రవాసినివి

87. కామాంధులీజగతి నేమాత్రమున్ వరుసలేమీ

107.కామేశ్వరీ! కృపను బ్రేమామృతంబు నిక

  4. కాయంబశాశ్వతము. కాయంబు లేని తరి

23. కాలంబు నీవనుచు నీలీలలం గనుచు

104. కాలప్రవాహమునకే లేదుగా తుదియె

39. క్షేత్రంబు నీవె కన క్షేత్రజ్ఞవీవె కన,

99. చింతా వరాన్వయుఁడ నంతా ననున్ గృపను

28. చిత్తంబులో గల మహత్తైన శక్తివి,

52. జాలిన్ సుధీవరు కపాలిన్ వరించితివి

40. జ్ఞానామృతంబు గొన మానావమానముల

71. తల్లీ జగజ్జనని! సల్లీలతో కృపను

56. దారుల్ గనంబరిచి నేరంబులన్ గొలిపి

91. దీనావనాభిరత మౌనంబదేల మము

97. దీనావనా! జనని. ప్రాణంబె నీవు కద

106. దీనాళి నేలెడి సుధీ నామొరన్ వినుమ

74. దేదీప్యమానమగు నీ దివ్య రూపము

21. దైవాంశ లేక నిను భావింపనెట్టులగు?

13. దోసంబులెన్నకుమ, భాసించు మంచిఁ

80. ధర్మానువర్తులిల మర్మంబెఱుంగరుగ

46. ధీశక్తి వీవగుచుఁ బ్రాశస్త్యమున్ గొలుపుమా

31. నిత్యారుణద్యుతిని సత్యప్రబోధవయి

27. నీ దివ్య తత్వమును సాధుస్వభావమును

7. నీ దివ్య నామమును నీ దివ్య రూపమును

49. నీ పాద సేవనము పాపాంధ వారణము

3. నీ రూపమే కనిన నేరూపమున్ గనఁగఁ

54. నీలాలకా! సుగుణ పాలా! త్రిలోక

18. నీలాల నింగినిటులేలీలఁ జేసితివి?

32. పంకేరుహానన! కుశంకల్ మదిన్ విడిచి

63 పంకేరుహాక్షివి! యుటంకింతు నీ మహిమ

9. పల్కంగ నేరవొకొ? యల్కన్ మదిన్ నిలిపి

94. పాపంబులన్ విడువ కోపంబులన్

53. పాలింపుమా సుకృతినాలింపుమా కృపను

26. పూర్ణంబు నీవె, యిల వర్ణంబులీవె

25. పూలన్ గనన్ గలవు, నేలన్ గనన్ గలవు

90. ప్రారబ్ధ కర్మ ఫలమేరీతిఁ బాయనగు

22. బాలార్క తేజమునఁ బాలింప భక్తులను

36. భద్రేభ గామిని! సుభద్రాక్షయాక్షర

29. భారంబు నీది శుభ తీరంబుఁ జేర్చగను

37.  భూజంబులే సుఫల రాజంబులున్ సుగుణ

76. భూమిన్ జనించు మము నీ మానసంబునను

100. భ్రాంతిన్ శివా శతకమంతా పఠించు గుణ

42.  మంత్రంబు లీవె కద, యంత్రంబు లీవెగ

66.  ముంజేతి కంకణమ! సంజీవి వీవె కద,

89. ముల్లోకముల్ కొలిపి యుల్లాసమొప్పగను

6.   రక్షించు మా జనని! రక్షించుమా, జన

86. రాజాధిరాజయిన పూజింపకున్న నిను

60. రాజాధిరాజులకు నేఁ జాలనీయఁగను

83. రాజిల్లఁ జేయ నను నీ జాతకం బెవరు

67. రాజేశ్వరీ! వినుత రాజీవ నేత్రి! నిను

55. రాత్రించరుల్ దురిత పాత్రుల్ దురాత్ములయి

92. రామాభిరామవుగ శ్రీమాతరో సుగుణ

82. లీలావినోదముగనేలో సృజించుటిది

12. లోకంబులో కృతులనేకంబులున్న

2.   వందారు భక్తజన మందారమా! నిలుమ

77. విజ్ఞానమీవె కద. విజ్ఞాన తేజము

65. విద్వన్నుతుండనని సద్వర్తనుండనని

10. విశ్రాంతి బోధకుఁడ, విశ్రాంతి కోరని

11. వేదాంత సారమ, ప్రమోదంబుతో కనుమ

58. వేదార్థ భాసివి, ప్రమోదంబు గొల్పుమిక

102. శక్తి ప్రదా గనుచు రక్తిన్ సదా జనుల

4.    శక్తి ప్రదాతవని ముక్తిప్రదాతవని భక్తిన్

41   శక్తిప్రదా! మహిత ముక్తిప్రదా! విమల

98.  శ్రీకల్వపూడి కుల రాకాసుధాకరులు

19.  శ్రీ కాళిదాసుమది నీ కాంతులుల్లసిల

85.  శ్రీచక్ర వాసినివి  శౌచంబుతోడ నినుఁ

72.  శ్రీభారతీ జనని! నా భావమున్ గనుచు

108.శ్రీమంగళాంగివి. సదామంగళంబులను

35. శ్రీమన్మహాభవుని ప్రేమార్ణవంబుఁ గొని

79. శ్రీమార్గమున్ గొలుప క్షేమంబుఁ గొల్పగను

1 .శ్రీ శాంభవీ! సుగుణులాశింత్రు నీ కృపకు

62 సంగీత సాహితులు ముంగొంగు పుత్తడిగ

30. సంతానమున్ గొలిపి సంతాపమున్ గొలుప

61  సంపూర్ణ భక్తినిడి, సంపూర్ణ శక్తినిడి

78. సారస్వతంబు కన నోరాజ్ఞి నీవె కద.

44. సాహిత్యమున్ మిగుల సౌహార్ద్రమున్ గలుగు

93. సృష్టించి లోకములు సృష్టించి బంధనలు

57.  హృద్యాద్భుతంబయిన  పద్యంబులన్ సుజన వేద్యా

73. హే దేవదేవి! పరమోదార సద్గుణమె

88. హేమాద్రి పుత్రివగు శ్రీమాత నీ చరణ

81. హేమాద్రి పుత్రివయి మామీద సత్కృపను

 

 

అష్టోత్తరశత సతీ అశ్వధాటి

)సతీ శతకము(

రచన. చింతా రామకృష్ణారావు.

1 .శ్రీ శాంభవీ! సుగుణులాశింత్రు నీ కృపకు నీ శక్తినెన్నుచు సదా.

ధీశాలియౌ శివునికాశావహంబువయి నీ శక్తినే గొలిపితే.

నీ శక్తినే బొగఁడ నాశక్తి చాలదుగ ధీశక్తినిమ్ము జననీ!

ఆశాంతముల్ వెలుగు ధీశాని నీ ప్రతిభ లేశమ్ము గాంచుదు సతీ!

భావము.

సతీమాతా! సద్గుణు లయిన మహాత్ములు ఎల్లప్పుడూ నీ శక్తిని గుర్తించుచు

నీ కృపకై ఆశించుచూ ఉందురమ్మా. జ్ఞానపూర్ణుడయిన శివునికి ఆశ

గొలుపు చున్నదాని వయి నీ యొక్క శక్తినే పరమేశ్వరునిలో

కలుగుచేసితివికదా తల్లీ! నీలో గల శక్తిని ప్రశంసించుటకు నాకు ఉన్న శక్తి

చాలదు కదా మాతా. కావున నాకు ధీశక్తిని ప్రసాదించుమమ్మా.

దిగంతముల వరకు ప్రకాశించు నీ ధీశక్తిని కొంచెమయినను చూచుదును .

 

2. వందారు భక్తజన మందారమా! నిలుమ డెందంబునన్ గరుణతో,

సౌందర్య రాశివయి డెందంబునన్ నిలువ నెందైన నిన్నె కననా.

కందున్ నినున్ సతము, కందున్ ద్వదీయ కృపఁ, గందున్ శుభంబుల నిలన్.

వందే జగజ్జనని ముందుండి నా  కనుల విందై కనంబడు సతీ!

భావము.

నమస్కరించుచున్న భక్తజన మందారమయిన సతీ మాతా! కరుణతో నా

హృదయములో నిలిచియుండుము. గొప్ప సౌందర్యపు రాశిగా నా

హృదయమునందే నీవు నిలిచి యున్నచో అంతటనూ నిన్నే చూడకుండా

ఉందునా తల్లీ! నిన్ను ఎల్లప్పుడూ చూచుచుందును, నీ కృపను

చూచుచుందును. శుభములనే భూమిపై చూచుచుందును. నా

కనులముందే ఎల్లప్పుడూ ఉండి కనిపించు నా తల్లీ! నీకు వందనమమ్మా.

 

3. నీ రూపమే కనిన నేరూపమున్ గనఁగఁ గోరంగ లేము ధరణిన్,

ధారాళ సత్ కవిత పారున్ నినుం గనిన శ్రీరమ్య తేజ నిలయా.

పారాడు దుర్గతుల నేరీతిఁ బాపుదువొ చేరంగ నిన్ శుభ మతిన్,

వారాహి నిన్ దలచు వారే మహాత్ములిల వారిన్ నుతింతును సతీ!

భావము.

సతీమాతా! నీ దివ్యమయిన రూపమును చూచినచో భూమిపై మరే

రూపమును చూడవలెనని కోరలేమమ్మా. లక్ష్మీప్రదమయిన కాంతికి

నిలయమయిన తల్లీ!నిన్ను చూచినచో ధారాళమయిన మంచి కవిత్వము

ఉరకలు వేయుచు వచ్చును.ంఅంచి మనసుతో నిన్ను నేను చేరుట కొఱకు

నడచుచున్న దుర్గతిని నీవు విధముగాపోగొట్టుదువో కదా. తల్లీ!నిన్ను

భూమిపై నిన్ను తలచునటువంటివారే మహాత్ములమ్మా.

 

4. శక్తి ప్రదాతవని ముక్తిప్రదాతవని భక్తిన్ నినున్ గొలిచెదన్

భక్తాగ్రగణ్యులు విముక్తిన్ గనన్ మిగుల రక్తిన్ నినున్ గొలుతురే.

రక్తాక్షివై దురిత శక్తిప్రపూర్ణులను రక్తంబు చిందఁ గనుమా.

యుక్తంబు లిచ్చుచు నయుక్తంబులన్ దరుము యుక్తిప్రదా వర సతీ!

భావము.

శ్రేష్టురాలివైన సతీమాతా! నీవు శక్తిని, ముక్తిని కలుగఁజేయు తల్లివని భక్తితో

నిన్ను కొలిచెదను. గొప్ప భక్తులు సంసార బంధములనుండి విముక్తి

పొందుట కొఱకు మెక్కిలి అనురక్తితో నిన్ను సేవించుదురు కదా. దుర్మార్గుల

విషయమున నీవు కన్నులు కోపములురక రక్తము చిందువిధముగా

శిక్షింపుము. యుక్తిని ప్రసాదించు తల్లీ! మాకు అనుభవింపఁదగినవే

ప్రసాదింపుము. అయుక్తములయినవాటిని పోఁగొట్టుము.

 

5. అశ్రాంతమున్ జనుల సుశ్రేయమున్ గని గుణశ్రీదవై నిలుతువే.

సుశ్రీ పదోజ్వలిత సుశ్రావ్యకావ్యపు శుభశ్రీగ నీవు నిలుమా.

యశ్రద్ధనే విడిచి విశ్రాంతినే మరచి సుశ్రీద నిన్ గొలువనా.

సుశ్రోతలన్, కవుల సుశ్రేయమున్ గను దవిశ్రాంత మీవిల సతీ!

భావము.

సతీమాతా! ఎల్లప్పుడూ జనుల యొక్క గొప్ప క్షేమమునే

చూచి సద్గుణలక్ష్మిని ప్రసాదించు దానివై నీవు వెలుఁగుచుందువమ్మా! మంచి

మంగళప్రదమయిన పదములతో ప్రకాశించుచున్న మంచి వినసొంపయిన

కావ్యమున శుభశ్రీనొసంగుదానివై నిలుము తల్లీ! అశ్రద్ధను పూర్తిగా

విడిచిపెట్టి, విశ్రాంతి యనునదే మరచిపోయి, మంచి మంగళములు

కలుగఁజేయుదానివైన నిన్ను నేను సేవించనా తల్లీ? భువిపై మంచి

శ్రోతలను, కవులయొక్క మంచి శ్రేయమును అవిశ్రాంతముగా నీవు

చూచుచుందువమ్మా.

 

6. రక్షించు మా జనని! రక్షించుమా, జన నిరీక్షన్ మదిన్ దలచుమా.

రక్షింతువీవని నిరీక్షించు సజ్జనులు మోక్షప్రదా! కనుమికన్.

సాక్షాత్కరింప కిటు శిక్షింపగా తగున? దాక్షాయినీ! కను మమున్,

లాక్షారుణప్రభల శిక్షించు దుష్టులను రక్షించు మమ్మిక సతీ!

భావము.

సాతీ మాతా! రక్షించుము తల్లీ! నీ రక్షణ కొఱకై జనుల ఎదురు చూపులను

మనసులో తలచుకొని, గుర్తించి, రక్షించుము. మోక్షప్రదా!  నీవు

రక్షించుదువని మంచివారైన నీ భక్తులు ఎదురు చూచుచుండిరి. అది నీవు

గమనించి రక్షించుము. వారికి నీ సాక్షాత్కారమును కలుగుఁజేయక

విధముగా శిక్షించుట నీకు తగదు. దాక్షాయనీ! మమ్ము చూడుము. నీ

ఎఱ్ఱని ప్రభలతో దుష్టులను శిక్షించుము. మమ్ములను రక్షించుము.

 

7. నీ దివ్య నామమును నీ దివ్య రూపమును నీ దివ్య శక్తిని మదిన్

శోధించి నే కనుదు వేదింపకింక నను బోధన్ మదిన్ గొలుపుమా.

మేధన్ ప్రపూర్ణవయి మోదంబుతో నిలిచి యీ దాసునిన్ గరుణతో

బాధా విదూరునిగ బోధా ప్రపూర్ణునిగ సాధించి చూపుము సతీ!

భావము.

సతీమాతా! నీమహత్తరమయిన నామమును, మహత్తరమయిన

రూపమును, గొప్ప శక్తిని, నా మనసున శోధించి, నేను చూచెదను. నన్ను

బాధింపక నాకు బోధను కలుగఁజేయుము. నా మేధయందు నీవు పూర్తిగా

నిండి, ఇష్టముతో అచ్చటనే ఉండి, నీ దాసుడ నయిన నన్ను కరుణతో

బాధలకు దూరముగా పరిపూర్ణమయిన బోధపొందినవానిగా నీవు చేసి

చూపుము.

 

8. అజ్ఞాన దుశ్చరిత, లజ్ఞాన భావనల, నజ్ఞాన చైదము లికన్

విజ్ఞాన తేజమున విజ్ఞేయ! నిన్ గనుచు సుజ్ఞానినై విడుచుదున్.

సుజ్ఞేయునై వెలుఁగ విజ్ఞుల్ ననున్ దలప ప్రాజ్ఞుండనై నిలువనీ

సుజ్ఞాన తేజము మహాజ్ఞాన మీయు మిక విజ్ఞుండుగాఁ గను సతీ!

భావము.

సతీమాతా! నిన్ను చూచుచు మంచి జ్ఞానముపొంది, అజ్ఞానపు

దుష్ప్రవృత్తిని, అజ్ఞాన భావనలను, అజ్ఞానపు నడవడికను

విడిచిపెట్టుదును. నేను తెలియఁదగిన వాడినయి,వెలుగునట్టులుగా,

విఞానవంతులు నన్ను తలచు విధముగా ప్రజ్ఞావంతుడనయి

నిలుచునట్లు చేయుము. మంచి జ్ఞాన తేజమును, గొప్పజ్ఞానమును,

విజ్ఞుం_డుగా ఉండి నిన్ను కనుటకు ఇంక నాకు ప్రసాదించుము.

 

9. పల్కంగ నేరవొకొ? యల్కన్ మదిన్ నిలిపి, కల్కీ! హృదబ్జ నిలయా!

పల్కంగనే వరము లొల్కంగఁ దప్పదని మేల్కొంచు పల్క వెరపా?

కల్కి ప్రభావమిల మేల్కాంచె చూడు మిక మేల్కొల్పు శిష్ట జనులన్, 

పల్కించు పద్యములు చిల్కించు సన్నుతులు పల్కించు మెల్లెడ సతీ!

భావము.

నా హృదయ పద్మాసీనవైయున్న సతీమాతా! నాపై అలకఁ బూని నాతో

మాటాడ లేకున్నావా? ఒకవేళ పలుకరించినట్లయిన వరములు నా కొసగ

తప్పదని భయముతో పలుకరించుట లేదా? కలి యొక్క మాయా ప్రభావము

మేలుకొన్నది చూడుము. మంచివారిని నీవిక మేలుకొలుపుము తల్లీ!

కలిప్రభావమును మాపు విధముగా పద్యములు పలుకజేయుము, మంచి

మాటలను చిలుకు నట్లు చేయుము. అవి అంతటా వ్యాపించునట్లు ఆమంచిని

చేయుము.

 

10. విశ్రాంతి బోధకుఁడ, విశ్రాంతి కోరని యవిశ్రాంత సేవకుఁడ నీ

సుశ్రావ్య సత్ కృతులు  సుశ్రేయమున్ గొలుపఁగా శ్రద్ధతో నొనరుతున్.

ధీశ్రీ భవత్ కరుణ సుశ్రోతలందునను సుశ్రావ్య గాన గరిమన్

సుశ్రీలిడన్ నిలిపి విశ్రాంతిగాఁ గొలిపి శుశ్రూష నందుము సతీ!

భావము.

సతీమాతా! నేను విశ్రాంత కళాశాల ఉపన్యాసకుడను. వీశ్రాంతి కోరని

అవిశ్రాంత సేవకుడను. నీకు సంబంధించునట్టి చక్కగా విన దగిన మంచి

రచనలు మంచి లోకక్షేమమును కలుగజేయు విధముగా శ్రద్ధతో

చేయుదునమ్మా. నాకు సంప్రాప్తించిన జ్ఞానలక్ష్మి యనునది

నీకృపాలబ్ధము. మంచిశ్రోతలలో నన్ను మంచి పాడేగొప్పదనముతో

మంచి కలుగ జేయునట్లు నిలిపి, విశ్రాంతిగా ప్రశాంతిని కలుగజేసి,నా

సేవలనందుమమ్మా.

 

11. వేదాంత సారమ, ప్రమోదంబుతో కనుమ. పేద ప్రజన్ నిరతమున్.

కాదన్నచో ప్రజల కేదున్నదింక తరి సాదంబుకే కరువగున్.

నీ దివ్య సత్ కరుణనే దారిగాఁ దలచి మోదంబుతోఁ గొలుతురే

బాధావహంబు కద మోదంబుతోఁ గనమి నేదారి కానరు సతీ!

భావము.

వేదాంత సారమా! సతీ మాతా! మొక్కిలి ఇష్టముతో పేదప్రజలను

యెల్లప్పుడూ చూడుమమ్మా! నీవు కాదు అని అన్నచో ఇంక ప్రజలకు ఉన్న

మార్గమేమిటమ్మా? తిండికే కరువు అగునుకదా తల్లీ! నీ యొక్క గొప్పదయిన

మంచి కరుణయే మార్గముగా భావించి, చాలా యిష్టముతో నిన్ను

సేవించుదురు కదా, నీవు మోదముచో కనకున్నచో బాధకు స్థానమయి

మార్గము లేనివారగుదురుకద్సా అమ్మా!.

 

12. లోకంబులో కృతులనేకంబులున్న విక నీకేల చింత యన కో

లోకేశ్వరీ కృతులు నీకై రచింపగను నాకిమ్ము శక్తి కృపతో,

నీకై రచింపగను లేకున్నచో బ్రతుకు నాకేలనమ్మ భువిపై,

చీకాకులన్ బడక నీకై రచించుటది నాకిచ్చు ముక్తిని సతీ!

భావము.

  సతీమాతా! లోకములోనాపై రచింపబడిన రచనలు అనేకము ఉన్నవి

కదా, నీకింక చింత ఎందుకు అనకుండా లోకమాతా నీపై క్ఉతులు

వ్రాయుట కొఱకు కృపతో నకు శక్తినొసగుముంఈపై కృతి రచింపలేనినాడు

భూమిపై నాకీ బ్రతుకు వ్యర్థమే కదా. చికాకు పడకుండా నీ కొఱకు

రచనలు చేయుట అనునది నాకు ముక్తినొసగును సుమా. 

 

13. దోసంబులెన్నకుమ, భాసించు మంచిఁ గని, ధ్యాసన్ ననున్ నిలుపుమా.

నా సేవలం గొనుమ నా సత్కృతిన్ గనుమ భాసింపఁ జేయుమ కృతిన్.

మోసంబులన్ బడక నీ సేవలన్ మనఁగ నాసింతు నేను జననీ,

ధీసద్గుణంబులిడి నీ సన్నిధిన్ మదిని నిత్యంబు నిల్పుము సతీ!

భావము.

సతీమాతా! దోషములను పరిగణింపవలదు. మలో ప్రకాశించెడి మంచిని

గుర్తించుము. నన్ను ధ్యాసతో నిలఁబెట్టుము. నా సేవలను స్వీకరించుము. నా

యొక్క సత్ కృతిని చూడుము. నా యొక్క రచనను వెలుగులీనునట్లు

చేయుము. జననీ! ఏవిధమయిన మోసములకు తావు కాకుండా, నీ సేవలతో

బ్రతుకు సాగదీయుచు జీవించవలెనని నేను కోరుకొంద్సును. బుద్ధి మంచి

గుణములు ఒసగి, నీ సన్నిధిలోనే నిత్యమూమనసు నిత్యమూ

ఉండునట్లు చేయుమమ్మా.

 

14. ఆశావహుల్ జగతి నాశంబు చేయుదురు, నీ శక్తితో నిలుపుమా.

దేశాధినాథులు దురాశాపరుల్ కలరు, దేశంబె నాశనమగున్.

కాశీపురంధ్రివి, ప్రకాశంబు నిల్పు మిక దేశ ప్రభన్ నిలుపుమా,

హేశాంభవీ! జనని! హే శక్తి రూపిణి! మహేశాని! ధీవర సతీ!

భావము.

ఓభవానీ! అమ్మా! శక్తిరూపిణీ! మహేశ్వరీ!శ్రేష్టమయిన

జ్ఞానపూర్ణవయిన సతీ మాతా! లోకమున ఆశాపరులు ఉండిరి వారి లోకమునే

నాశనము చేయుదురమ్మా. నీ శక్తి చూపి వారిని నిలువరింపుము

తల్లీ!దేశాధ్నాథులలో కూడా ఆశాపరులు ఉండిరమ్మా. వారి వలన దేశమే

నాశనమగును తల్లీ! కాశీపురాధీశ్వరీ! దేశప్రకాశమును నిలుపుమమ్మా.

దేశమునకున్న వైభవమును తగ్గనీయకుము.

 

15. కల్లల్ కనన్ జగతి, నెల్లప్పుడున్ నిజమునుల్లంబు పొంగ కనఁగన్

తల్లీ వరంబిడుమ, సల్లాపమందయిన కల్లల్ ప్రవర్తిలకనే

యుల్లాసమున్ గొలిపి సల్లోచనంబులిడి యుల్లంబునన్ మెలఁగుచున్

ఫుల్లాబ్జ నేత్రవుగ ముల్లోకముల్ నడుపు తల్లీ కృపం గను సతీ! 

భావము.

సతీమాతా! వికసించిమపద్మనేత్రవుకదా ముల్లోకములనూ నడిపెడి

తల్లివే కదా,  నేను అబద్ధమును చూడఁ జాలను, లోకమున ఎల్లప్పుడూ

మనసుపొంగే విధముగా నిజమునే గ్రహించు విధముగా నాకు

వరమొసగుమమ్మా.  సల్లాపములాడు సమయమునందైననూ సరే

అబద్ధములు ప్రవర్తిల్లకుండునటుల చేసి ఉల్లాసమును నాకుఁ గొలిపి,

మంచినే చూచునట్టి కనులను ప్రసాదించి, నా మనసులోనే నీవు ఉంటూ

నన్ను కృపతో చూడుము.

 

16. అబ్జాత పత్ర ముఖి కుబ్జత్వమున్ మదికి నబ్జోద్భవుండొసఁగెనే.

కుబ్జత్వమేలనిది? యబ్జోద్భవున్ గెలుతు నబ్జాక్షి నీవు కనిన్,

యబ్జాసనా! కృపఁ గరాబ్జంబులన్ గొనుమికబ్జోద్భవాంశజుని నన్

కుబ్జత్వమున్ దరిమి యబ్జాత్మ! లో నిలువు మజ్జేశుఁడెన్నగ సతీ!

భావము.

పద్మముఖివయిన సతీమాతా! బ్రహ్మ నాకు

హృదయవైశాల్యమును ఈయకుండా పొట్టితనమును ఒసగినాడమ్మా. నా

మనసునకు కుబ్జత్వము ఎందులకమ్మా. పద్మాక్షీ నీవు నన్ను దయతో

చూచినచో నేను బ్రహ్మను గెలిచెదను. పద్మాసనా! బ్రహ్మవంశ

సంజాతుఁడనయిన నన్ను నీవు నీ చేతులతో చేపట్టి రక్షింపుము.

పుష్పసుకుమార మానసవయిన తల్లీ! నాలోని

కుబ్జభావములను తుడిచివేసి విశాలభావములొసగి లోకబాంధవుఁడయిన

సూర్యభగవానుఁడే మెచ్చు విధముగా నా లోపల నిలిచియుండుమమ్మా.

 

17.  అమ్మా భవత్ పదము లిమ్మానసంబునను ముమ్మాటికిన్ నిలువనీ.

పొమ్మన్న నేమిగతి? చిమ్మున్ కనుల్ జలము, లమ్మా కృపన్ గనుమికన్.

సమ్మోదమున్ దెలిపి రమ్మంచు నీ సుతుని నెమ్మిన్ గృపన్ నిలుపుమా.

యిమ్మేను భారమది ముమ్మాటికిన్ తమది సొమ్మీవెగా కన సతీ!

భావము.

అమ్మా! సతీమతా! ముమ్మాటికీ నీ పాదములను నా మనసున

నిలువనిమ్ము తల్లీ.  నీవు కాదని పొమ్మన్నచో నాకు వేరే గతి లేదమ్మా. నా

కన్నులలో నీరు క్రమ్ముకొనును. ఇంక నీవు నన్ను కృపతో చూడుమమ్మా. నీ

యొక్క సమ్మతిని తెలియఁజేసి, రమ్మని నీ కుమారుఁడనయిన నన్ను

ప్రేమతో దయతో నిలుపుము తల్లీ! నా శరీర భారమింక మీదేనమ్మా, నాకు

అన్ని విధములా ధనమనచో అది వే సుమా.

 

18. నీలాల నింగినిటులేలీలఁ జేసితివి? చాలన్ మదిన్ దలఁపగా,

నీ లాలితంబు గని శూలిన్ మదిన్ గనిన పోలంగలాడె? యనరా?

యేలీల పత్నివయి నీలో సగంబొసఁగి పాలింపఁగా నిడితివో?

నీలాల నింగినట నీ లీల కానఁబడు మాలోనఁ గల్గిన సతీ!

భావము.

సతీమాతా! అనంత నీలకాశమును నీవు విధముగా చేసితివమ్మా? నేను

విషయమును మనసులో ఆలోచించుటకైనను సరిపోను. నీ లాలిత్యమును

చూచి శివునిమనసులో ఊహించుకొన్నచో నీతో సరిపోలేడు అని

అనుకొనకుందురా. నీవు విధముగా ఆతనికి భార్యవయి నీ శరీరమున

సగభాగ మతని కొసగి అతనికి లోక పాలనాధికార మిచ్చావో కదా. మాలోపలనే

కలిగిన తల్లీ! వినీలాకాశమున అక్కడ నీ లీల నాకు కనిపించునమ్మా.

 

19. శ్రీ కాళిదాసుమది నీ కాంతులుల్లసిల నేకాంతమందునఁ గనెన్

శ్రీకారమే కృతుల కాకారమున్ గొలుప శ్రీ కావ్యముల్ వెలిసెగా.

శ్రీకారమీవెయని యా కాళిదాసెఱిఁగి చేకొంచు నిన్ నిలిపెనే 

కాళికా! హృదయమేకాగ్రతన్ నిలుప నాకిమ్ము బాసను సతీ!

భావము.

సతీ మాతా! మంగళస్వరూపుఁడయిన కాళిదాసు మహాకవి నీ

మహత్తరమయిన కాంతులు మనసు ఉల్లసిల్లగా ఏకాంతములో మదిలో తాను

చూచెను. శ్రీ కారమే తన రచనలకు ఆకారమును గొలుపగా

మంగళప్రదమయిన కావ్యములు అతనిద్వారా వెలసినవి కదా. నీవే

శ్రీకారమని, కాళిదాసు  గ్రహించి హృదయపూర్వకముగా స్వీకరించి నిన్ను

నిలిపెను.  కాళికా మాతృ స్వరూపిణీ! హృదయము ఏకాగ్రమగు విధముగా

చేసి, నాకు చక్కని భాషను ప్రసాదించుము తల్లీ!.

 

20.  ఓంకార రూపిణివి యోంకార భాసినివి యోంకార భూషిణివిగా.

ఓంకారమున్ గనుదు నోంకారమైన నిను, నోంకార వర్తివగుటన్

ఓంకారమే తమకు సంకేతమమ్మ గన నోంకార పూర్ణవు కదా.

ఓంకార తేజము నహంకారమే తొలఁగు నింకేల నా కిడు సతీ..

భావము

సతీమాతా! ఓంకారము యొక్క తేజస్సు కారణంగా మా లోని

అహంకారమన్నది తొలఁగిపోవునమ్మా.  ఇక ఆలస్యమెందులకు? ఓంకార

తేజస్సును నాకు ప్రసాదించుమమ్మా,  నీవు ఓంకార స్వరూపిణివి.

ఓంకారమునందు భాసిల్లు తల్లివి, ఓంకారముచే అలంకరింపబడిన అమ్మవు

కదా. నీవు ఓంకారమునందు సంచరించుచ్గుందువుగాన  ఓంకార

స్వరూపిణివైన నిన్ను ఓంకారమునందు చూచుదునమ్మా.

తమకు ఓంకారమే సంకేతముకదా తల్లీ. చూడగా ఓంకారపూర్ణస్వరూపిణివి

నీవే నమ్మా.

 

21. దైవాంశ లేక నిను భావింపనెట్టులగు? దేవీ మదాత్మ నిలయా!

జీవాత్మవీవగుచు జీవించువారిఁ గని భావింతు నిన్ సుజనులన్

సేవాపరత్వమున నీవే ప్రభాసిలఁగ నీవౌచు నా ఘనులుగా

శ్రీవాణి సత్ కృపను భావించి పద్యములు నీవే రచింతువు సతీ!.

భావము.

నా ఆత్మయే  నిలయముగా కలిగియున్న సతీమాతా! దేవీ! మాలో

దైవాంశ లేనిచో నిన్ను చూచ్ట ఎట్లు సాధ్యపడునమ్మా. నీవే జీవాత్మగా

ఉండిన కారణముగా సుజనులై జీవించేవారిని చూచి వారిలో నేను నిన్నే

భావింతునమ్మా.  సేవయే పరమార్థముగా కలిగిన కారణము చేత నీవే

ప్రకాశించుచుండుట కొఱకు ఆఘనులుగా నీవే యగుచు, వారిని నేను

చూచినతోడనే శ్రీశారదామాతకు నాపై ఉన్న మంచి కృపను భావించి నీవే

నాలోనుండి పద్యములు  రచించుచుందువుకదా తల్లీ!

 

22. బాలార్క తేజమునఁ బాలింప భక్తులను స్త్రీలన్ వెలుంగుదె యిలన్?

నీలీలలన్ గనఁగ చాలంగలారెవరు? నీలాలకా భగవతీ!

నాలోని మాయ నిఁక నీ లీలచేఁ దునిమి పాలించు నన్నిలఁ గృపన్.

భూలోక వాసుల కహో, లోన మాయనిడి నీ లీలఁ జూపితె? సతీ!

భావము.

సతీమాతా! భూమిపై బాల సూర్య ప్రకాశముతో నీ భక్తులను పాలించుట

కొఱకు నీవు ఆడువారియందు ప్రకాశించుచుందువా తల్లీ? నల్లని

ముంగురులతో నొప్పుచున్న లోక మాతా! నీ లీలలను చూడఁగలిగినవారీ

భూమిపై ఎవ్వరునూ లేరు కదా. నా లోన ఉండెడి మాయను నీ లీలచే పోఁ గొట్టి

కృపతో నన్ను పాలించుమమ్మా. భూజనులలో మాయను ప్రవేశపెట్టి నీ

లీలను కనఁబరచితివా జగజ్జననీ?

 

23. కాలంబు నీవనుచు నీలీలలం గనుచు లోలోన పొంగుదునుగా.

నీలాల మేఘముల నీ లీలలే కనుదు నాలోన గాంచెద నినున్.

నీలాల మేఘమది నాలోని మాయ కన పాలింతు వీవటులనే

శ్రీలాలితీ సుగుణ జాలంబు నీవె కద,  యీ లీలఁ  గాంచెద సతీ!

భావము.

సతీమాతా! నీవే కాలముగా ఉన్న దానివని భావించుచు, నీ లీలలను

మనసులోఁ జూచుచు, నాలో నేను పొంగిపోవుచుందును. నీల మేఘములలో నీ

లీలలనే చూచుదును. నేను చెప్పిన నీల మేఘము నాలో ఉన్న

మాయయే. నీవు విధముగనే నన్ను పాలించుచుంటివి కదా మంగళప్రద

మయిన, లలితమయిన సుగుణజాలము నీవే కదా తల్లీ! లీలను నేను

నిరంతరమూ చూచుదును.

 

24. ఆహారమీవె కన నాహార్యమీవె, కల మోహంబు నీవె జననీ!

మోహంబు నీవయిన మోహార్తినే తరిమి స్నేహంబుతో మెలఁగనీ.

దేహంబు నీవగుచు స్నేహంబు నీవగుచు మోహంబుపై నుతమతీ!

రాహిత్యముం గొలిపి దేహంబులోనిలిచి సాహాయివై నిలు సతీ!

భావము.

సతీమాతా! ప్రాణశక్తినొసగు ఆహారము నీవేనమ్మా. ఆహ్లాదజనకమయిన

అలంకారములూ నీవే తల్లీ.  అమ్మా! ఆత్మలో పుట్టేటువంటి మోహము కూడ

నీవేనమ్మా.. నీవే మోహమయియున్ననాడు మాలోని మోహార్తిని

తరిమివేసి,స్నేహ భావముతో మమ్ములను మసలనిమ్ము. నుత మయివయిన

జగన్మాతా! మా దేహమూ నీవే అయియుండి, మాలోని స్నేహమూ నీవే

యగుచు మోహమును పూర్తిగా వీడునట్టుల జేసి, మా దేహములో నీవే నిలిచి

యుండి మాకు సహాయపడుము తల్లీ!

 

25. పూలన్ గనన్ గలవు, నేలన్ గనన్ గలవు మ్రోలన్ గనన్ గలవుగా.

చాలింపుమింక, మొరలాలింపుమింక, పరిపాలింపుమా కరుణతో.

గాలింప లేను నిను, జాలిన్ ననున్ గనుచు, మేలున్ దయన్ గొలుపుమా.

బాలా! సదా వినుత హేలా! మహత్ సుజన పాలాపరాజిత సతీ! 

భావము.

గొప్ప మంచివారిని పరిపాలించెడి అపరాజితా! సతీ మాతా! బాలా!

ఎల్లప్పుడూ పొగడఁబడెడి విలాసము కలిగిన తల్లీ! పూలను చూచినా నీవే

ఉంటివి. నేలను చూచినా నీవే ఉంటివి, ఎదురుగా చూచినా నీవే ఉంటివి కదా.

నీ పంతమింక సరిపెట్టుము. ఇంక నా మొరలను వినుము. కరుణతో నన్ను

పాలింపుమమ్మా. నిన్ను నేనింక వెదకలేను. జాలితో నన్ను చూచుచు దయతో

నాకు మేలు కలుగఁ జేయుము తల్లీ.

 

26. పూర్ణంబు నీవె, యిల వర్ణంబులీవె, శశి పూర్ణాకృతిన్ గలవుగా.

కర్ణామృతంబయిన పర్ణంబులీవెకద పూర్ణేందుబింబ వదనా.

స్వర్ణంబు నీవె కద స్వర్ణంబు లీవెకద ఘూర్ణించు మేఘుఁడవుగా.

చూర్ణంబు చేయుమిక దుర్నీతులన్ కని యపర్ణా! కృపం గను సతీ!

భావము.

కృపతో చూచెడి సతీమాతా! భూమిపైనీవు పూర్ణ స్వరూపవు. సప్త

వర్ణములు నీవే. చంద్రుని పూర్ణ స్వరూపమున కూడా నీవే

ఉంటివి కదా. పౌర్ణమి చంద్రునిపోలు ముఖము కల తల్లీ!

వినసొంపుగానుండు వేదమంత్రములు నీవే కదా. బంగారము నీవే

కదా,  మంచిని వెలువరించు అక్షరములు నీవే కదా, ఘూర్ణించునటువంటి

మేఘము నీవే కదా. ఓ యపర్ణా! దుర్నీతులయిన పాపులను సంహరింపుము.

 

27. నీ దివ్య తత్వమును సాధుస్వభావమును బోధన్ గనన్ గొలుపుమా,

శోధించి చూచినను నీ దీప్తి యన్యులను లేదన్నదే నిజముగా.

మాధుర్య భావము ప్రమోదంపు జీవనము నీ దీవనన్ గలుఁగుగా,

హే దీన బాంధవి! ప్రమాదంబులన్ దుడిచి యీదీను గావుము  సతీ.

భావము.

సతీమాతా! నీ యొక్క గొప్ప తత్వమును, నీ సాధుస్వభావమును, జ్ఞానము

పొంది చూచునట్లుగా చేయుమమ్మా. ఎంతగా పరిశోధించి చూచినప్పటికీ

నీలోని తేజస్సు అన్యులకెవరికీ లేదను మాట సత్యము.ంఅధుర

భావనలుసంతోషకరమయిన జీవితము నీ యొక్క దీవన వలననే

సాధ్యమగునమ్మా. దీనబంధూ! నాకు వెఆసియున్న ప్రమాదములను

తుడిచివేసి దీనుడనైన నన్ను కాపాడుము తల్లీ!

 

28. చిత్తంబులో గల మహత్తైన శక్తివి, ప్రవృత్తిన్ సదా మెలుఁగుమా.

మత్తున్ మదిన్ విడిచి చిత్తంబు నీ పయి మహోత్తుంగ భక్తి నిలుపన్

సత్తెంబుగాఁ గొలిపి యెత్తీరునైనను లసత్తేజమున్ గొలుపుమా.

హత్తన్ మదిన్ నిజము లెత్తీరుఁ గొల్పెదవొ, చిత్తేజమై కల సతీ!  

భావము.

నా మనసులో చిత్తేజమై నిలిచి యున్న సతీమాతా! నా మనసులో ఉన్న

గొప్ప మాహాత్మ్యముగల శక్తిస్వరూపిణివి. నా ప్రవృత్తిలో నీ వెల్ల వేళలా

నిలిచియుండుమమ్మా. నాలోని మత్తును విడిచిపెట్టి, నీ మీద మనస్సును

గొప్ప ఉన్నతమగు  భక్తితో నిలుపునట్లుగా నిజముగా నీవు చేసి,

విధానముచేతనైనను గొప్పదైన నీ తేజమును నాలో కొలుము తల్లీ నా

మనసున సత్యము నాటుకొని పోవునట్లుగా విధముగా చేసెదవో కదా.

 

29. భారంబు నీది శుభ తీరంబుఁ జేర్చగను లేరన్యులీ వసుమతిన్.

గోరంగనేల నినుఁ జేరంగనున్నపుడు తీరంబుఁ జేర్చు జననీ.

శ్రీరమ్య తేజసవు శ్రీరామ రక్షవయి వారింపుమా దురితముల్.

కోరన్ నినున్ ధనము కారుణ్యమున్ గనెడి ధీరాత్మవీవెగ సతీ!

భావము.

సతీ మాతా!శుభముల తీరమునకు చేర్చెడి భారము నీదేనమ్మా. భూమిపై

నీకన్న అన్యులు లేరు.ఒడ్డునకు నన్ను చేర్చెడి తల్లీ! నెన్ను చేరవలెనని

మనసున్నప్పుడు ఇన్ను కోరవలసిన పని యేమున్నదమ్మా. నీవే చేర్చుదువు.

మంగలప్రదమయిన తేజస్సు ఉన్న తల్లివి నాకు శ్రీరామ రక్షవయి నా

దురితములను నివారింపుమమ్మా. నిన్ను ధనములు కోరనమ్మా. కరుణతో

చూచెడి ధీరాత్మవు నీవేకదా.

 

30. సంతానమున్ గొలిపి సంతాపమున్ గొలుప చింతేకదా ఫలితమౌన్.

సంతాపమున్ విడిచి సంతానమిచ్చిన సుఖాంతంబెగా జననమే.

సంతాన హీనులకు సంతానమున్ గొలిపి శాంతంబుగా బ్రతుకనీ.

సంతాప హీన మదినంతేసువాసివయి సాంతంబు కాంచుము సతీ!

భావము.

సతీ మాతా! నీవు మాకు సంతానమునిచ్క్ష్చి వారిని గూర్చి సతాపమును కూడా

యిచ్చుట వలన చింతయే కదా మాకు దక్కెడి ఫలితము.

సంతాపమునిచ్చుట