గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, జులై 2024, శుక్రవారం

భవన్తి నమ్రాస్తరవః ఫలోద్గమైః. ... మేలిమిబంగారం మన సంస్కృతి.

 జైశ్రీరామ్.

ఓం శ్రీమాత్రే నమః.🙏🏼

శ్లో.  భవన్తి నమ్రాస్తరవః ఫలోద్గమైః

నవాంబుభిర్భూరి విలంబినో ఘనాః

అనుద్ధతాః సత్పురుషాః సమృద్ధిభిః

స్వభావ ఏవైష పరోపకారిణామ్.

తే.గీ. పండ్లతోనున్న వృక్షము వంగియుండు,

నీటితోనున్న మేఘంబు నింగి వ్రేలు,

జ్ఞానసంపన్నులణకువఁ గలిగియుంద్రు,

పరులకుపకారగుణులిట్లె వరలుదురుగ.

భావము. ఫలములతో నిండిన వృక్షము, నీటితో నిండిన మేఘము, 

జ్ఞానంతో పండిన సత్పురుషుడు ఎల్లప్పుడూ వినయశీలురై వంగి

(అణగి)వుందురు.🙏🏼

చింతా రామకృష్ణారావు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.