॥ శ్రీలక్ష్మీసహస్రనామావలిః ॥
శ్రీ
లక్ష్మీ సహస్ర
నామాంచిత పద్యసహస్ర
దళపద్మము.
రచన.
చింతా
రామకృష్ణారావు.
ఓం
శ్రీమహాలక్ష్మీం ఉపాస్మహే
సీ. ఆషాఢ బహుళపాడ్యమి నాడు యాదాద్రి
- నృహరిపాదార్చకుల్ మహిత నృహరి
దూరశ్రవణమునన్ కోరిమాటాడిరి. నన్ బ్రశం సించుచు నరహరి శత
కము ఘనంబనినారు, రమణీయ శ్రీ రమా నామసహస్రంబు స్వామి మెచ్చ
పద్యపుష్పములందు భాసిల్లగా నిల్పి
పదిదినంబులలోన వ్రాయమనిరి.
తే.గీ.
విదియ
మొదలు నేకాదశి వెడలులోపు
- వ్రాయ జేసెను శ్రీలక్ష్మి వాసి చూపి,
దినమునకు నూరు పద్యముల్ వినయముగను
- వ్రాసినాడను దైవంబు వ్రాయఁజేయ.
సద్విధేయుఁడు
- చింతా రామకృష్ణరావు.
స్వస్తిశ్రీ చాంద్రమాన శుభకృన్నామ సంవత్సర ఆషాఢ బహుళ ఏకాదశీ
భానువారం. ఆంగ్ల తేదీ. 24 - 7 - 2022
పండితాభిప్రాయములు.
అనపాయినీ వరివస్య
వాగ్విదాంవర బ్రహ్మశ్రీ నారుమంచి వేంకట అనంత కృష్ణ
శ్రీమన్నారాయణుడుధర్మస్థాపనప్రయోజనమునాశించి అనేక అవతారములను దాల్చి ఆనుషంగికముగా భక్తరక్షణ లీలను కూడా ప్రకటించెను.కానీ కేవలము భక్తరక్షణయే లక్ష్యముగా స్వామి స్వీకరించిన రూపు నారసింహావతారము. ఇతర అవతారముల వలె కాక నారసింహావతారము ఉపసంహారములేని నిత్యావతారము. అంటే సదా భక్తరక్షణ తత్పరుడన్న మాట. ఆ స్వామి ప్రేరణతో శ్రీ చింతా రామకృష్ణారావుగారు నారసింహ అష్టోత్తర శతనామాలకు ఆయా నామాలను పద్యపాదములలో నిలుపుచు, నిలువెత్తు భక్తితో పదికాలాలు నిలిచేశతకాన్నివెలయించి స్వామికి సమర్పించిన ధన్యులు. స్వామి ఉదరములో ప్రపంచాలన్నీ ఉన్నాయని గుర్తు చేయటానికేమో ప్రతి పద్యములో మరొక పద్యాన్ని దాచి ఉంచిన గర్భకవిత్వము ఈ శతకములోని మరొక విశేషము.
అది నేపధ్యం. ప్రకృతములో యాదాద్రి నారసింహక్షేత్రములో స్వామి ప్రధానార్చకులు శ్రీమాన్ నరసింహాచార్యులుగారి రూపములో స్వామి మరొక ఆదేశం పంపారుట, లక్ష్మీ సహస్రనామాలను కూడా పద్యస్థం చేయమని, అది కూడా 10 రోజుల్లో పూర్తి చేయమని. అంటే రోజుకొక శతకము. భాగవతుల ఆజ్ఞ భగవదాజ్ఞగా స్వీకరించి అమ్మపైన అచంచల విశ్వాసముతో చింతావారు నడుము బిగించి అనుకున్న పదిరోజులలో పద్యపుష్పసహస్రము సిద్ధము చేసారు. తాను వ్రాస్తున్నాను అనుకోలేదు అమ్మ వ్రాయించింది అన్నది భావన. అందుకే ముందు సహస్రనామములలో శ్లోకము, తరువాత ఆ శ్లోకాంతర్గత నామములకు అమ్మ నామముతో చతుర్ధ్యంతముగా నమస్కరించి, సంక్షిప్తముగా నామవిశేషము చెప్పి అమ్మదయతో పద్యము వ్రాసారు. ఇది కొత్త ప్రక్రియ. శ్లోకమును నామములుగా విభజించునప్పుడు కొంత కాఠిన్యము కలుగుతుంది. కనుక వివిధ విభజనలను సమన్వయపరుచుకొని సర్వజనామోదముగా స్థిరీకరించుకొనుట మరొక ఇబ్బంది.
ఛందోవిషయకముగా ఒక మాట చెప్పుకోవాలి. ప్రసిద్ధమైన పద్యలక్షణాలు కొన్ని మాత్రమే సాధారణ వినియోగములో ఉన్నాయి. అయితే పద్యపాదాక్షరాలను అనుగుణముగా 1 నుండి 26 ఛందస్సులుగాను, అలా ఒకొక్క ఛందస్సులో ప్రస్తారము వేయగా సుమారు 13 కోట్ల వృత్తాలు అవుతాయని లాక్షణికులు చెప్తారు. ఇక్కడ అమ్మ నామము యథాతథముగా పద్యములో ఉండాలన్న నియమము పెట్టుకున్నారు. అందుకు అనువైన కందము, తేటగీతి ఇత్యాది జాత్యుపజాత్యులను వినియోగించినారు. ఉత్పల, మత్తేభ, శార్దూల, పంచచామరాదులు కూడా విస్తృతముగా వినియోగించారు.అయితే కొన్ని నామాలు ప్రసిద్ధపద్యలక్షణాలలో ఇమడవు కనుక అలాంటి విశేషలక్షణాలు నిర్మించుకుని నామము వచ్చేలాగా పద్యనిర్మాణం చేసారు. అలాంటి నూతనముగా నిర్మించుకున్న పద్య లక్షణాలను ఉదాహరణగా 128వ పద్యములో చూడవచ్చు. ఇది అంత సులువు కాదు. పద్యము నడక, లయ గమనికలో ఉంచుకుని చేయాల్సిన జిలుగుపని. ఇది అమ్మ అనుగ్రహముతో జరిగినది అన్న భావనతో ఇలాంటి క్రొత్త వృత్తాలకు ఆ నామమునే లేక ఆయా నామములలోని ఒక భాగమునో వృత్తనామముగా వ్రాసి ‘స్వయంకల్పిత మృణాలి వృత్తము’ అని స్పష్టపరిచినారు. ఇలాంటి చాలా కొద్ది సంఖ్యలోనే ఉన్నాయి. పైన చెప్పినట్లు శ్లోకమునకు భిన్నమైన నామవిభజనలు కనబడ్డాయి అన్నాను కదా. వీరు అలాంటి భిన్నమైన విభజనలకు అన్ని రకాల పద్యాలు (క్రమసంఖ్య లేకుండా) వ్రాసినారు. అంటే ఎవరైనా తమకు నచ్చిన పద్యము చదువుకోవచ్చునన్నమాట. ఉదాహరణకి 77వ పద్యమునకు సంబంధించిన శ్లోకం గమనించవచ్చు. ఇక్కడ ‘కాలిమా’ అన్న శ్లోకపదాలు కాలి, మా అని రెండుగా కొందరైతే కాలిమా అని ఏకపదముగా కొందరు విభజించారు. చింతావారు కాలి, మా, కాలిమా అని మూడు నామాలకు మూడు పద్యాలు వ్రాసారన్నమాట. అలా అనేకమైన ఇబ్బందులను అమ్మదయతో అద్భుతముగా నిర్వహించబడినది.
శ్రీకారాదిగా పద్యసహస్రాన్ని క్షేమకరముగా ప్రారంభించారు. వేయి నామాలు వేయి పద్యాలు. ముందుమాట వ్రాయుటలో నిడివికున్న సంక్షిప్తతను దృష్టిలో ఉంచుకుని కొన్ని విశేషాలు, ఈ గ్రంథము చదువునప్పుడు గమనించవలసిన అంశాలు మాత్రమే ప్రస్తావిస్తాను. అమ్మ స్తుతి పద్యములో కవికి తన స్వకీయమైన భావమును పద్యము వ్రాసి ఈ నామమును సంబోధనగా చేయుట సులువైన పని. సాధారణముగా శతకకర్తలు ఆశ్రయించే విధానము కూడా. అదిదోషము ఎంతమాత్రము కాదు కూడా. కానీ చింతావారు ఈ తేలికమార్గమును స్వీకరించలేదు. పైన చెప్పినట్లు నామమునకు సంక్షిప్తమైన అర్థము చెప్పారు. పద్యములో అర్థము విస్తృతమైనదిగా ఆ నామవ్యాఖ్యగా ప్రకటించారు. అంటే పద్యలక్షణాన్ని ఎన్నుకోవటంలో ఈ వ్యాఖ్యాపదాలకు కూడా అనుగుణమైనవిగా గమనించుకోవాలి. కవి పరిశ్రమ ఎంతదో ఊహించవచ్చు. ఇన్ని జాగ్రత్తలతో వేయి పద్యాలు పది రోజులలో పూర్తిచేయడం అనితరసాధ్యము. అందుకు చింతావారికి ఎన్నిసార్లు నమస్కరించినా తక్కువే.
ఇలాంటి ఈ గ్రంథనిర్మాణమునకు కర్త, కారయితా, ప్రేరకుడు, అనుమోదకుడు కూడా ఆ నారసింహుడే, కేవలం వివిధరూపాలలో కనబడ్డాడు అంతే. చింతావారు ఈ పద్యరచనా తపస్సులో కృతకృత్యులయ్యారనుటకు ఎట్టి సందియము లేదు. తప్పక ఆద్యంతము చదువదగినది, పదే పదే చదువదగినది. అమ్మ పాఠకులకు అజ్ఞాతదోషనివృత్తిపూర్వకముగా సకల శుభములు తప్పక కలుగచేస్తుంది అన్నది నా ప్రగాఢ విశ్వాసము. ఇలాంటి మహద్గ్రంథాన్ని తొలి పాఠకుల జాబితాలో నేను కూడా ఉండటం నా అదృష్టము. అందుకు మా చింతారామకృష్ణారావు అన్నగారికి నమస్కరిస్తు, వారు మరింత సాహిత్యసేద్యము చేయుటకు ఆయురారోగ్యభాగ్యాలను అమ్మ అనపాయినీదేవి కలిగించాలని ప్రార్థిస్తూ.. స్వస్తి
హైదరాబాదు గురుపాదధూళి
తేది; 16.10.2022 నారుమంచి వేంకట అనంతకృష్ణ
డా. రాణి సదాశివ మూర్తిః…ఉపకులపతిః…రాష్ట్రియ సంస్కృత విశ్వవిద్యాలయః,…తిరుపతిః
నవరత్నమాలికా.
శ్రీలక్ష్మీ సహస్రనామాంచితపద్యసహస్రదళపద్మార్చనం
శ్రీ మహాగణాధిపతయే నమః …శ్రీ మాత్రే నమః…శ్రీ గురుభ్యోనమః
శ్లో. వికసితే
సహస్రారే - మోక్షద్వారస్య ఫుల్లతా।
కిం
వక్తవ్యం సహస్రాబ్జే
- ఫుల్లే యది సహస్రధా।।1।।
శ్లో. రామస్త్రేతాపతిర్భూత్వా - ధర్మమార్గమదర్శయత్।
కృష్ణో
ద్వాపర సంజాతో
- ముక్తిమార్గమదర్శయత్।।2।।
శ్లో. కలౌ
కాలుష్యకాంతారే - చింతాపనోదదీక్షితః।
రామకృష్ణ
కవీంద్రోऽయం
- భక్త్యుపాయం ప్రయచ్ఛతి।।3।।
శ్లో. చంద్రే
విలసితే పూర్ణే
- జ్యోత్స్నాశ్రీః ప్రసరేద్భువి।।
ఫుల్లే
కవిమనస్యద్య - కవితాశ్రీర్విభాసతే।।4।।
శ్లో. శ్రియః
స్తోత్రం చిత్రమార్గే - పద్యాధ్వన్యవతారయన్।
తారయత్యాశు
సల్లోకం
- శ్రీవాగేకసమర్చయా।।5।।
శ్లో. శ్రియః
పాదార్చనాసక్తః - ఆంధ్రపద్యవిభూషణః।
శ్రీ
చింతా రామ కృష్ణార్యః
- శ్రీచింతన తపఃప్రియః।।6।।
శ్లో. దశశతవర్త్మారూఢామ్ - ఏకవర్త్మని రూపయన్।
శ్రియం
శ్రీశే సుభక్తిమాన్ - కృతకృత్యః కృతీ కవిః।।7।।
శ్లో. స్వయం
దివ్యత్వ పాత్రం సత్
- సతామపి శుభప్రదః।
కవీంద్రో
రాజతే భూయో
- భూయస్తత్త్వార్థదర్శకః।।8।।
శ్లో. వర్ధతాం
భక్త్యధ్వైషో - వర్ధతాం కవిరాట్సుధీః।
వర్ధతాం
భక్తభూర్భూమిః - వర్ధతాం శ్రీః కవిగృహే।।9।।
ఇత్థం సనతితతిశతమ్ బుధజనవిధేయః రాణి
సదాశివ మూర్తిః
బ్రహ్మశ్రీ రాణి సదాశివ మూర్తి మహోదయులకు
నా కృతజ్ఞతాంజలి.
ఉ.
మాటలు చాలకుండెనయ మాన్యమహోదయ! మీ కృపన్ గనన్, -
కోటికి
యొక్కరుండుదురు కూర్మిని మీవలె చూపువారిలన్,
దీటుగ
వ్రాయనేర్వనయ దివ్యపు మీ కవితామృతమ్ముతో, - సాటియె
లేరు మీకు, మనసార నమస్కృతులందుడిమ్ముగన్.
నా మనసులో మాట.
ఓం
శ్రీమాత్రే నమః.
శ్రీ మహాలక్ష్మి మహిమలు చెప్పఁ జాల.
శ్రీమన్మంగళదివ్యతేజ శ్రీమల్లక్ష్మీ జగన్మాత అనుగ్రహ విశేషమున యాదాద్రి
శ్రీమల్లక్ష్మీనారసింహులనిరంతర సంసేవనా పునీత జన్ములయిన ప్రథానార్చకులగు శ్రీ
నారసింహాచార్యులవారు శ్రీ శుభకృత్ ఆషాఢబహుళ పాడ్యమినాడు నాతో దూరవాణిద్వారా
మాటాడుచు, శ్రీ
యాదాద్రి నారసింహ శతక పద్యములు మీరు వ్రాసిస్వామికి అర్పించుకొనినారు. చాలా బాగున్నవి.
మరి లక్ష్మీ అమ్మవారి సహస్రనామములకు పద్యములు వ్రాయండి. అమ్మవారికి ఆనందం కలిగించండి వారంపది రోజులలో పూర్తి చెయ్యండి అని ఆదేశించిరి. ఇది సాక్షాత్ అమ్మవారి ఆదేశంగా భావించి ఆశ్చర్య చకితుఁడనయ్యాను. పదిరోజులలో వేయి నామములకు పద్యములు వ్రాయుట నావంటి
సామాన్యునకు సాధ్యమెట్లగును? అని భావించి,
అంతా అమ్మే వ్రాసుకోనుందేమో అని, నా
ప్రత్నములో భాగంగా పాడ్యమినాడి సహస్రనామములు పొందుపరచుకొని ఉంచుకొనినాను.
మరునాడు విదియ రోజున నామములను
పద్యములలో నిక్షేపించుచు వ్రాయుట ప్రారంభించితిని.
అమ్మవారే స్వయముగా నాచే రోజునకు వంద
నామములకు పద్యములు వ్రాయించుకొని ఆషాఢబహుళ ఏకాదశి నాటికి పరిపూర్ణముగా రచన
చేయించుట, నేను
ఆచార్యస్వాములవారికి ఈ వైనము విన్నవించి ఆ పద్య సహస్రమును వారికి పంపుట చేసితిని. వారు నామములకు వివరణకూడా వ్రాసినచో ప్రయోజనకరముగా ఉండునని సూచించి మరికొంత
సమయము తీసుకొమ్మనిరి. నేను నామ వివరణవ్రాయుటతో పాటు ముద్రారాక్షసములను కూడా సరిచేసి వారికి ఈ ప్రతి
పంపుట జరిగినది.
శ్రీ యాదాద్రి
లక్ష్మీనరసింహస్వామి దయాంతరంగాన్ని కనీసము ఊహించుటకైననూ నేను సరిపోను. వారిపై అష్టోత్తర శత నామాంచితముగా అనేక ఛందస్సులు
గర్భమునందుండు సీసములను వ్రాయించుకొని,
ఇప్పుడు వారి హృదయేశ్వరి కడగంటి కాంతికిరణము నాపై ప్రసరింపఁజేయనెంచి
ఈ తలంపు కలిగించి ఈ మహత్కార్యమును నాపేర పూర్తి చేయించిరి.
ఏ నాటి నా పెద్దల, గురుదేవుల
పుణ్యఫలమో ఈనాటి ఈ మహద్భాగ్యమును నేననుభవించుట సంభవించినది.
నేను వ్రాసిన ప్రతిని సరిచూచు
పనిని శ్రీ మాచవోలు శ్రీధరరావు గారు, శ్రీ కటకం వేంకటరామ శర్మగారు, శ్రీఅన్నపరెడ్డి సత్యనారాయణరెడ్డిగారు శ్రమతో పూర్తి చేసిరి. శ్రీ యల్లాపంతుల సూర్యనారాయణ గారు యాదాద్రిలో ఒక ఉద్యోగి. వీరితో పరిచయము నా భాగ్యమని చెప్పవలెను. వీరి
మూలముననే ప్రథానార్చకుల పరిచయ భాగ్యము నాకు కలిగినది.
వారి ఆకంక్ష మేరకే ఈ గ్రంథ రచనకు బీజము పడుట, పదిరోజులలో సుసంపన్నమగుట తటస్థపడినది.
శ్రీ ప్రథానార్చకుశ్రీ
లక్ష్మీనరసింహాచార్యులవారికి, శ్రీ యల్లాపంతుల సూర్యనారాయణ గారికి, శ్రీ మాచవోలు
శ్రీధరరావుగారికి,
శ్రీ కటకం వేంకటరామ శర్మగారికి, శ్రీ అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి నా ధన్యవాదములు. నాకు కలిగిన సందేహములలో తన ఆలోచనలను
జోడించి సందేహనివృత్తి చేయుచు ముందుకు నడిపిన నా అర్థాంగి చి.ల.సౌ.విజలక్ష్మి గారికి నా ఆశీస్సులు.
రచనలో నా కెదురయిన సమస్యలు.
అమ్మవారి వేయి నామములూ నూట ఏభైనాలుగు శ్లోకములలో ఉన్నవి. ఈ నామములను
కొందరు కొన్నివిధములుగను, మరికొందరు మరికొన్ని విధములుగను విడదీసి యుండిరి. కొందరు
వేయి నామములుగా చూపిరి,
మరికొందరు వేయీ ఎనిమిది నామములుగా చూపిరి, మరికొందరయితే వేయీముప్పదినామములకు పైగా చూపిరి.
నేనుముందు అన్ని నామములకూ అందరి
మతములననుసరించి పద్యములు వ్రాసితిని. ఆతరువాత ఔచిత్యముగా ఉన్నవిధమును భావించి వేయీ యెనిమిది నామములను గుర్తించి
సంఖ్యలు నామములకు నిర్దేశించి పద్యములు వ్రాసియుంటిని.
మిగిలినమతములప్రకారము కూడా పద్యములు వ్రాసి చూపి యుంటిని. ఎవరికి కావలసిన విధముగా వారు అమ్మవారు తోపించినవిధముగా చేయుట జరిగినది.
కొన్ని నామములు అనేకపర్యాయములు శ్లోకములలో
ఉన్నప్పటికీ కేవలము ఒక నామమునకే సంఖ్యనొసగి మిగిలినవాటికి పద్యములు మాత్రము వ్రాసి
ఉంచితిని.
అన్ని నామములూ సుపరిచిత ఛందస్సులలో నప్పకపోవుచుండుటతో అమ్మవారి
ప్రేరణననుసరించి అటువంటి నామములకు ఛందస్సులు స్వయముగా కల్పించి పద్యరచనలొ ఆ నామములను
ఉంచి వ్రాయుట జరిగినది.
సహృదయులు దైవప్రేరణతో జేసిన ఈ
రచనలో నాదైన జ్ఞాన లేశమైననూ లేదనే విషయమును గుర్తించి గుణములన్నియూ అమ్మవారి
ప్రేరణ కారణముగా వ్రాయబడినవని గ్రహింతురుగాక.
దోషములున్న అవి నా అజ్ఞానముగా భావించి పెద్దమనసుతో భక్తిని మాత్రమే
స్వీకరింతురుగాక.
ఈ నా కృతిని భక్తితో పఠించి తమ
అమూల్యమయిన అభిప్రాయములను అందఁజేసిన వాగ్విదాంవర బిరుదాంకితులు బ్రహ్మశ్రీ నారుమంచి
వేంకట అనంత కృష్ణ సహోదరులకు నా ఆనందమును తెలియఁజేయుచున్నాను.
నాపై అవ్యాజానురాగమును
చూపెడి ఆచార్య రాణీ సదాశివమూర్తి మహోదయులు నాయొక్క ఈ గ్రంథమును ఆమూలాగ్రమూ
చదివి తమ అమూక్యమయిన అభిప్రాయమును చక్కని
మనోహరమయిన శ్లోక నవరత్నమాలిక రూపమున అందించియున్నారు.
వీరు చూపిన అభిమానమునకు నా హృదయపూర్వక
ధన్యవాదములు తెలియఁజేసుకొనుచున్నాను.
ఈ గ్రంథ ముద్రణను యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ దేవస్థాన ప్రథానాచార్యస్వాములవారి
ద్వారానే జరుగనున్నందున ముద్రించబోవు పుణ్యాత్ములకు,
వారికి ప్రేరణ కలిగించిన ఆచార్య మహోదయులకూ నా ధన్యవాదములు
తెలియఁజేసుకొనుచున్నాను.
ఓం వాసుదేవాయ నమః..
ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః.
సద్విధేయుఁడు
చింతా రామకృష్ణా రావు.
ప్రార్థన.
శా. శ్రీమన్మంగళ
భావనాచయముతో
శ్రీలక్ష్మిసన్నామముల్
ప్రేమన్
వేయి తెలుంగు పద్యముల దీప్తిన్ వ్రాయ శాసించె నా
శ్రీమద్రమ్య
రమాలలామ నను నో శ్రీ
విఘ్నరాజా కృపన్
నీమంబొప్పఁగ
వ్రాయఁ జేయుము లసన్నిర్విఘ్నధారాగతిన్.
శా. శ్రీవాణీ!
రచియింతు
పద్యములు
లక్ష్మీనామ
సాహస్రమున్
భావోద్భాససుధాస్రవంతిగఁ, గృపన్
వ్రాయించు
నాచేత, నా
కీవే
దిక్కు, రమాభిరామముగనాకిమ్మా! పదాళిన్ గృతిన్
జీవంబైవెలుగొందఁ జేయ,
జననీ! శ్రీ బాసరాంబా! నతుల్.
శా. శ్రీలక్ష్మీ! ననుఁ గన్న తల్లి! కృప నాశీర్వాదమందించి, స
ల్లీలన్
నామ సహస్రమున్ శుభగతిన్ క్లేశంబులన్ బాపుచున్
నాలోనుండి
రచింపుమా! కొలుతు నిన్, నవ్యార్థ సద్భావనల్
నీలోనుండి
జనించునమ్మ, జననీ! నీభక్తులే పొంగగన్.
మ. గురువౌ వేంకట
వీర రాఘవుని
నే
కూర్మిన్, సభక్తుండనై
చరణంబుల్
శరణంబు వేడెదను, భాషాయోష యుప్పొంగగా
స్థిరమౌ
నామ సహస్రమున్ నిలుపుచున్ దీపించు పద్యంబులన్,
కరిసంరక్షకునాలి మెచ్చునటులన్
కల్పించి
వ్రాయించగన్.
శా. నీమంబొప్పఁగ
వ్రాయఁజేయుచు
ననున్ నీవానిగాఁ జూడు మో
శ్రీ
మన్మంగళ నారసింహ! జయముల్ క్షేమంబుఁ జేకూర్చుమా
శ్రీమంతంపు
సహస్ర పద్య పఠనన్ శ్రీమద్రమన్ గొల్చు స
ద్ధీమాన్యాళికి శ్రీరమా
కృపను సత్తేజంబుఁ గల్పించుమా.
అంకితము.
శ్రీ,
మన్మంగళ దివ్య భాసుర శుభశ్రీపూర్ణ శ్రీదేవికిన్,
శ్రీమంతుండగు
విష్ణుమూర్తి
సతికిన్, జీవాళినే బ్రోవగా
ప్రేమన్
దివ్య ధనంబులిచ్చెడి జగద్విఖ్యాత శ్రీలక్ష్మికిన్,
శ్రీమంతంబుగనంకితంబిడితి భాసింపంగ నీ గ్రంథమున్.
శ్రీ లక్ష్మీ సహస్ర నామాంచిత పద్యసహస్ర దళపద్మము.
శ్లో.
నిత్యాగతానంతనిత్యా నందినీ జనరంజనీ ।
నిత్యప్రకాశినీ చైవ స్వప్రకాశస్వరూపిణీ ॥ 1 ॥
1. ఓం *నిత్యాగతా*యై నమః ।
నామ
వివరణ.
నిత్యమూ
వచ్చుచుండెడి తల్లి మన అమ్మ లక్ష్మీ మాత.
శా. శ్రీమన్మంగళ
భవ్యభాగ్యద రమా! శ్రీ రూప!
*నిత్యాగతా!*
ప్రేమోదార
గుణాలయా! శుభద! నీవే సృష్టిలో మూలమై
క్షేమంబున్
గలిగింప మాకు సతమున్, శ్రీదేవివై వత్తువే,
నీ
మాతృత్వమునెన్న నాకుఁ దరమా, నిన్నున్ సదా కొల్చెదన్.
2. ఓం *అనన్తనిత్యా*యై నమః ।
నామ
వివరణ.
అంతము
లేని శాశ్వతమయిన తల్లి రమామాత.
కం. పరమాత్ముని
నారాయణు
నరయుట
నీ కృపను గలుగు నమ్మా! శుభదా!
కరుణ
ననంతుని జూపెడి
నిరుపమ
జననీ! *యనంత
నిత్యా!*
కొలుతున్,
3. ఓం *నన్దిన్యై* నమః ।
నామ
వివరణ.
ఆనందమును
కలుగఁ జేయు తల్లి మన అమ్మ శ్రీదేవి.
తే.గీ.
వినుత
*నన్దినీ!*
యానంద మనుభవైక
వేద్యమమ్మరో
నీకృపన్ బ్రీతిఁ గనిన,
సతతమానందము
న్మదిన్ సదయ నిలిపి,
కాచి
రక్షించఁ, గొల్తు నిన్ గమల నయన!
4. ఓం *జనరఞ్జన్యై* నమః ।
నామ
వివరణ.
జనుల
మనసులకానందము కలుగజేయు తల్లి మన శ్రీదేవి.
తే.గీ.
దివ్య *జనరఞ్జనీ!* సన్నిధిగనె నీకు
నన్ను
నిలుపుకొనుము కృపన్, సన్నుతముగ
జనుల
రంజింప జేసెదన్ ఘనతనెన్ని
పద్యములు
వ్రాసి నీపైన భవహరముగ.
5. ఓం *నిత్యప్రకాశిన్యై* నమః ।
నామ
వివరణ.
ఎల్లప్పుడూ
ప్రకాశించు తల్లి లక్ష్మీదేవి.
తే.గీ.
జనని
*నిత్యప్రకాశినీ!*
జయము నీకు,
నీవె
నిత్యప్రకాశమై నిండి మదిని
నీదు
తేజంబు నాలోన నిండనిమ్ము
జ్ఞానసద్భాగ్య
దాయినీ! కరుణఁ గనుమ.
6. ఓం *స్వప్రకాశస్వరూపిణ్యై* నమః ।
నామ
వివరణ.
స్వయముగా
ప్రకాశించు స్వరూపము కల తల్లి.
తే.గీ.
*స్వప్రకాశస్వరూపిణీ!*
విప్ర పూజ్య!
నీ
ప్రకాశమ్ము నాలోన నిలువనిమ్ము,
జ్ఞాన
దివ్యప్రకాశమ్ము కలుగఁ జేసి,
కనఁగఁ
జేయుము
నీ
పతిన్ గాంక్షతీర.
శ్లో.
మహాలక్ష్మీర్మహాకాలీ మహాకన్యా సరస్వతీ ।
భోగవైభవసంధాత్రీ భక్తానుగ్రహకారిణీ ॥ 2 ॥
7. ఓం *మహాలక్ష్మ్యై* నమః ।
నామ
వివరణ.
గొప్ప
లక్ష్మీదేవి మన అమ్మ. అందరికీ జీవనాధారమయిన తల్లి మన
మహాలక్ష్మితల్లి.
తే.గీ.
నుత
*మహాలక్ష్మి!*
నినుఁ గొల్చు బ్రతుకు బ్రతుకు.
క్షితిజ
మానవ జాతికి బ్రతుకు నీవె,
నీవు
లేకున్న బ్రతుకులే లేవు జనని,
నీదు
కృపజూపి భక్తుల నాదుకొనుము.
8. ఓం *మహాకాల్యై* నమః ।
నామ
వివరణ.
మిక్కిలి
శక్తిస్వరూపిణి అయిన కాలీ స్వరూపము మన తల్లి. మిక్కిలి
నల్లగా
ఉండు
తల్లి ఈ జనని.
తే.గీ.
శ్రీ
*మహాకాలి!*
నిలుము నా చిత్తమందు,
నా
గృహంబున నీవుండి నన్ను గనుచు
నైహికంబును
బరము నాకందఁ జేసి
నన్ను
గాపాడుమమ్మరో సన్నుతముగ.
9. ఓం *మహాకన్యా*యై నమః ।
నామ
వివరణ.
మన
అమ్మ లక్ష్మీమాత గొప్ప కన్యక. కన్యకలయందు ప్రకాశించు మహాకన్యక
మన
అమ్మ.
తే.గీ.
కన
మహాకన్య వీవమ్మ కల్పవల్లి!
కొలిచెదన్
*మహా కన్య!* నిన్ గొప్పగాను,
కన్యకామణులందునఁ
గలిగి నీవు
వినుత
లక్ష్మీప్రదమ్ముగా వెలుగుదువుగ.
10. ఓం *సరస్వత్త్యై* నమః
నామ
వివరణ.
మన
అమ్మయగు లక్ష్మీ మాతయే సరస్వతీ స్వరూపము.
తే.గీ.
ఓ
*సరస్వతీ!*
నీకృపనొప్పిదముగ
జీవితము
సాగుచుండును సేవిత పద!
హంసవాహినివగుచు
నీవమరియుండి
చిత్తమునవెల్గు
చుందువే చిన్మయముగ.
11. ఓం *భోగవైభవసంధాత్ర్యై* నమః ।
నామ
వివరణ.
భోగమును
వైభవములను మనకు ప్రసాదించుజనని లక్ష్మీమాత.
తే.గీ.
*భోగవైభవ సన్ధాత్రి!* పూజలంది
భోగవైభవములనిమ్ము
పూజ్యముగను,
యోగమును
గొల్ప ముక్తికై, యోగ్యులకును,
నిన్ను
సేవించు యోగమే నిరుపమమిల.
12. ఓం
*భక్తానుగ్రహకారిణ్యై* నమః ।
నామ
వివరణ.
భక్తులపై
అనుగ్రహ కారణమయిన జనని లక్ష్మీమాత.
శా. *భక్తానుగ్రహకారిణీ!*
జయము, నీ భక్తాళి ధన్యాత్ములై
రక్తిన్
నిన్ మదిలోన నిల్పి సతమున్ బ్రార్థింతురోయమ్మ! నీ
శక్తిన్
మానసమందు నెంచి కృపకై సాంతంబు నిన్ గొల్తురే,
భక్తిన్
శక్తి నిహంబు సత్ పరము నా భాగ్యంబుగాఁ గొల్పుమా.
శ్లో.
ఈశావాస్యా మహామాయా మహాదేవీ మహేశ్వరీ ।
హృల్లేఖా పరమా శక్తిర్మాతృకాబీజరూపిణీ ॥ 3 ॥
13. ఓం *ఈశావాస్యాయై* నమః ।
నామ
వివరణ.
అంతటనూ
తానై యున్న తల్లి లక్ష్మీ మాత.
శా. *ఈశావాస్య! * జయోzస్తు తే, యనుచు నిన్నే కొల్తురోయమ్మ! స
ద్ధీశాలాగ్రణు
లెల్లవేళలను, స్వాధీ
నాత్ములై ధాత్రి, వా
గీశానీ
నుత సత్ స్వరూపిణివి దేవీ!
లోకమందంతటన్
నీ
శక్తిన్ గను నేర్పునిమ్ము కృపతో నిత్యంబు నిన్ గొల్చెదన్.
14. ఓం *మహామాయాయై* నమః ।
నామ
వివరణ.
అష్ట
లక్ష్మీ స్వరూపిణియైన జనని గొప్ప మాయా స్వరూపిణి.
శా. మాయామోహములన్
జయింపనయితిన్ మాయన్ ద్యజించన్
*మహా
మాయా!*
నీ పదపద్మముల్ కొలిచెదన్ మాయన్ విడన్ జేయుమా,
నీ
యాజ్ఞన్ శిరసావహించి నడచున్ నీ సృష్టి సర్వంబు, నీ
మాయన్
బాపుట నీకు లెక్కయగునా? మాతల్లివే, పాపుమా.
15. ఓం *మహాదేవ్యై* నమః ।
నామ
వివరణ.
గొప్ప
దేవత జహన్మాతయైన లక్ష్మీ మాత.
కం. భావాతీతవుగ
*మహా
దేవీ!*
మద్భాగ్యలబ్ధ దీపిత వీవే
కావక
యున్నను నాకిక
నేవారలు
ప్రోవఁగల రహీన దయాబ్ధీ!
16. ఓం *మహేశ్వర్యై* నమః ।
నామ
వివరణ.
గొప్ప
ప్రభ్విణి మన లక్ష్మీ మాత. మహేశ్వరుని అర్థాంగలక్ష్మి మహేశ్వరి.
కం. నీ
యనుఁగు భక్తుల కిలను
శ్రేయములిడు
శ్రీ *మహేశ్వరీ!* నినుఁ గొలుతున్.
నాయందు
కృపను నిలువుము
మాయను
పోకార్పి కావ, మహిలో జననీ!
17. ఓం *హృల్లేఖాయై* నమః ।
నామ
వివరణ.
హృదయమును తాకు జనని. హ్రీమ్ అనే అక్షరంలో ఉన్న జనని.
కం. *హృల్లేఖా!* నా మదిలో
కల్లోలములణచివేసి కారుణ్యముతోఁ
జల్లగ కావుము నన్నున్!
దల్లిగ నీ కృపను జూపి ధైర్యమునిమ్మా.
18. ఓం *పరమాయై*
నమః ।
నామ
వివరణ.
లక్ష్మీమాత
గొప్పదైన తల్లి.
కం. *పరమా* నిన్నే కొలిచెద
పరమార్థమునెన్ని
నేను ప్రఖ్యాతముగా,
నిరుపమ
సద్గుణ గణ్యా!
వరదాయిని
వీవె నీ ప్రభావము నెంతున్.
19. ఓం *శక్త్యై* నమః ।
నామ
వివరణ.
అమ్మ
శక్తి స్వరూపణి.
తే.గీ.
శక్తివోయమ్మ
శ్రీ పరా! *శక్తి! * నీవు
ముక్తి
భాగ్యప్రదాయివి! పూజ్య దేవి!
యుక్తమైనట్టివిమ్ము
నాకొప్పిదముగ,
వందనంబులు
చేసెద నందుకొనుము.
ఓం *పరమాయై శక్త్యై* నమః.
నామ వివరణ.
గొప్ప శక్తి స్వరూపిణి మన లక్ష్ని మాత.
కం.
ననుఁ గను *పరమా! శక్తీ! *
నిను నామది నిలిపి సతము నిన్నే కొలుతున్,
కనిపించు కంటికెదురుగ
వినయంబుగఁ బ్రణుతులిడుదుఁ, బ్రీతిగ జననీ!
కం. అమ్మా! *పరమా శక్తీ!*
సమ్మోదము తోడ నాదు సంస్తుతి వినుమా,
నెమ్మదిఁ బరమాశక్తిగ
నిమ్మది నివసింపుమో యహీన దయాబ్ధీ!
20. ఓం *మాతృకాబీజరూపిణ్యై* నమః ।
నామ
వివరణ.
మాతృకా
వర్ణస్వరూపిణి మన అమ్మ.
తే.గీ.
*మాతృకాబీజరూపిణీ!*
మహితమయిన
మాతృకా
వర్ణమయముగా మదిని నిలిచి
పద్యసంస్తుతులందీవు
పరిఢవిల్లి
సంతసంబును
గొలుపుమా చదువరులకు.
శ్లో.
నిత్యానందా నిత్యబోధా నాదినీ జనమోదినీ ।
సత్యప్రత్యయనీ చైవ స్వప్రకాశాత్మరూపిణీ ॥ 4 ॥
21. ఓం *నిత్యానన్దాయై* నమః
నామ
వివరణ.
నిరంతరమూ
ఆనందమయమై భక్తులకు ఆనంద ప్రదాయినిగా వెలుగు తల్లి
మన
లక్ష్మీమాత.
కం. నిరుపమ
*నిత్యానందా!*
తరుగని
యానందమిమ్ము తలచిన నిన్నున్,
పరమానందమె
బ్రహ్మము,
తరణోపాయముగ
ముక్తిదా! మది నిలుమా.
22. ఓం *నిత్యబోధా*యై నమః ।
నామ
వివరణ.
నిరంతరమూ
బోధను గొలుపు మాతృదేవత లక్ష్మీమాత.
తే.గీ.
*నిత్యబోధా!*
నినుం గన్న నిత్యబోధ
నొందుచుండి
శుభావళిన్ బొందఁగలము,
నిత్యబోధన్
మదిన్ గొల్పి నిలుపు మమ్మ!
నిన్ను
స్మరియింప నిత్యమున్ నిరుపమాన!
23. ఓం *నాదిన్యై* నమః ।
నామ
వివరణ.
నాదమునకు
మూలమయి నాదమును కలిగించు తల్లి మన అమ్మ.
తే.గీ.
*నాదినీ!*
నీవె యోంకార నాదమెఱుఁగ,
నాదు
మదిలోన యోంకార నాదమీవె,
సేదఁ
దీర్చుచు నిహలోక బాధలుడుప
ఖేదమును
వాసి నీకు నేఁ గేలు మోడ్తు.
24. ఓం *జనమోదిన్యై* నమః ।
నామ
వివరణ.
జనులకు
సంతోషమును కలిగించు జనని మన అమ్మ.
కం. *జనమోదినీ!* వసుంధర
ఘనతర
శుభకర నిరుపమ కరుణామృతమై
మనఁ
జేయుచు జనపాళిని
వినుతంబుగ
నిలుతువు మది ప్రీతిగ శుభదా!
25. ఓం *సత్యప్రత్యయిన్యై* నమః ।
నామ
వివరణ.
సత్యమునకు
నిదర్శనముగా సత్యమై, సత్యము నిలుపు తల్లియైయొప్పు
జగజ్జనని
అమ్మ.
కం. *సత్యప్రత్యయినీ! ధర
స్తుత్యముగా
సత్యధనులతో నిలిచెదవే,
నిత్యము
నీదగు సుగుణౌ
న్నత్యము
సత్యముగ తెలిపి నతులందింతున్.
26. ఓం స్వప్రకాశాత్మరూపిణ్యై నమః ।
నామ
వివరణ.
స్వయముగా
ప్రకాశించు ఆత్మ స్వరూపము కల తల్లి లక్ష్మీ మాత.
తే.గీ.
*స్వప్రకాశాత్మరూపిణీ!*
సన్నుతింతు
నిన్ను,
నేనున్ బ్రకాశింతు నిన్ను దాల్చి
మానసంబందుఁ,
గృపతోడ మనుము నీవు,
నిన్నుఁ
దాల్చిన
నేనును
సన్నుతుఁడనె.
శ్లో.
త్రిపురా భైరవీ విద్యా హంసా వాగీశ్వరీ శివా ।
వాగ్దేవీ చ మహారాత్రిః కాలరాత్రిస్త్రిలోచనా ॥ 5 ॥
27. ఓం *త్రిపురాయై* నమః ।
నామ
వివరణ.
ముల్లోకముల
స్వరూపిణి మన అమ్మ. సర్వవ్యాపి మన అమ్మ. సర్వమూ తానే
అయిన
తల్లి లక్ష్మీ మాత.
కం. *త్రిపురా!* సర్వము నీవే
కృపఁ
జూపుచు నీవె మాకుఁ గేలొసగుచు మ
మ్మపమార్గదూరులగునటు
తపియించుచుఁ
జేయు నీకు
దండములమ్మా.
28. ఓం *భైరవ్యై* నమః ।
నామ
వివరణ.
భైరవిగా
నహీజ్వల ప్రకాశనుననుండి తల్లి లక్ష్మీ మాతయే.
తే.గీ. *భైరవీ!* దుష్టులను గూల్చి
భాతినిలుపు
భారతాంబకు,
నాత్మవై ప్రభను గొలుపు,
మంచివారిని
కాపాడు మహితముగను
దుష్ట
శిక్షణఁ జేయుము తోయజాక్షి!
29. ఓం *విద్యా*యై నమః ।
నామ
వివరణ.
సకల
విద్యా స్వరూపిణి జగన్మాతయగు లక్ష్మీదేవి.
తే.గీ. జనని!
*విద్యా! * ప్రణామముల్,
వినుము మొరల,
నైహికాముష్మికంబులనలరఁ
జేయు
విద్యలందఁగ
జేయుమా! విశ్వరూప!
విద్యగా
నీవె నాలోన వెలుగుమమ్మ.
30. ఓం *హంసాయై* నమః ।
నామ
వివరణ.
పరమహంస
మన లక్ష్మీ మాతయే.
తే.గీ.
జనని!
*హంసా!*
పరాశక్తి! ప్రణవమీవె,
యాత్మలో
హంసవైన నిన్నరయఁ దరమె?
జ్ఞాన
చక్షువు నాకిచ్చి కనఁబడుమిక.
వందనంబులు
చేసెదనందుకొనుము
31. ఓం *వాగీశ్వర్యై* నమః
నామ
వివరణ.
వాగీశ్వరి
అయిన భారతీ మాత మన అమ్మయే.
తే.గీ.
ప్రణుత
*వాగీశ్వరీ!*
నీదు పదయుగమ్ము,
నాదు
చిత్తమందున నిల్పి నీదు సేవ
చేయగన్
వాక్కులందించు జీవమిడుచు
వాక్ప్రభాసంపు
కవితలన్ వరల నిలుము.
32. ఓం *శివా*యై నమః ।
నామ
వివరణ.
శుభమే
అస్మ్మ.శుభాకారమే మన అమ్మ, శుభాధారమే అమ్మ.
తే.గీ.
ఓ
*శివా!*
శుభాకారమా! లేశమైన
నీదు
శివతత్వముల్ తెల్ప నేను జాల
ననుపమాన
శుభాస్పదా! కనుము నన్ను,
శుభకరంబగు
జీవన
శోభనిమ్ము.
33 ఓం *వాగ్దేవ్యై* నమః ।
నామ
వివరణ.
పలుకులకు
మూలాధారమయిన జనని మన అమ్మయే.
కం. ఓ
*వాగ్దేవీ!*
శుభకర
భావంబులు
వాగ్గరిమను వరలింపగ నన్
నీవే
యొసగుమ నాకున్,
జీవాత్మను
పరమమునను జేర్చగ నిమ్మా.
34. ఓం *మహారాత్ర్యై* నమః ।
నామ
వివరణ.
అమ్మ
మహారాత్రి స్వరూపము. చీకటిలో కొట్టుమిట్టాడు భక్తులకు అండగా
నిలుచు
తల్లి.
ఉ.
శత్రు చయంబు చేతి కిల చక్కగ చిక్కి, గణింప నిన్,
*మహా
రాత్రి!* గ్రహింపు
నా వినతి, రక్షణఁ గొల్పుము, శత్రు షట్కమున్
,ధాత్రిని
మాపి, నామదికి దక్కుము నీవు ప్రపూజ్యమానవై,
యాత్రముతోడ
కోరితి నహర్నిశలున్ నిను గొల్వనెంచుచున్.
35. ఓం *కాలరాత్ర్యై* నమః ।
నామ
వివరణ.
దుష్ట
భయంకర రూపమయిన కాలరాత్రి జగజ్జనని అయిన మన తల్లియే.
చం. కరుణను
జూపఁబోకుమిక కల్మష హారిగ *కాళరాత్రి!* దు
స్తర
దురహంకృతుల్ సుజన సత్తములన్ గలగించుచుండుటన్
దురితములాచరించు
పలుదుష్టులపాలిట కాలరాత్రివై
నెరపుము
నీ విధానమును నివ్వెరపోవగ లోకమంతయున్.
36. ఓం *త్రిలోచనా*యై నమః ।
నామ
వివరణ.
సూర్యచంద్రాగ్నులనే
త్రిలోచనములుగా కల తల్లి లక్ష్మీదేవి.
తే.గీ.
సూర్య
చంద్రాగ్నులను గల్గి చూడ్కులొప్ప
వరలుచున్న
*త్రిలోచనా! * భరమొ
నీకు
నన్ను
గావంగ మది నిల్చి? సన్నుతాత్మ
దివ్యసామ్రాజ్ఞి!
కావనందిమ్ము కరము.
శ్లో.
భద్రకాలీ కరాలీ చ మహాకాలీ తిలోత్తమా ।
కాలీ కరాలవక్త్రాంతా కామాక్షీ కామదా శుభా ॥ 6 ॥
37. ఓం *భద్రకాల్యై* నమః ।
నామ
వివరణ.
భద్రమునకు,
మంగలమునకు స్థానమయిన తల్లి, భద్రమును కల్యాణ
ప్రదయు
అయిన తల్లి మన భద్ర కాలి.
తే.గీ.
*భద్రకాలీ!*
కృపన్నాకు భద్రదవయి
మానసంబున
నెలకొని మసలుచున్న
నిన్ను
మహనీయ యుక్తితో నెన్ని కొల్తు
భక్తి
భావంబుతో
నాదు
శక్తి కొలది.
38. ఓం *కరాళ్యై* నమః ।
నామ
వివరణ.
దుష్ట
సంహరూపిణి కరాలి మాత శిష్టులకు మంగలప్రద.
తే.గీ.
మహితమౌ
భీకర *కరాళి!* మానసమున
నిన్ను
నిలుపు టసాధ్యంబు, నిజము కనగ,
నీవె
నాలోన రహియించు నేర్పు మీర
నిత్య
మంగళ కారివై నిష్ఠతోడ.
39. ఓం *మహాకాల్యై* నమః ।
నామ
వివరణ.
అమ్మ
మహాకాలీ స్వరూపమే. అంతు లేని కాలస్వరూపము అమ్మయే.
తే.గీ.
శ్రీ
*మహాకాలి*!
నీ దివ్య చేతన మది
లోకమునఁ
గల్గు జనులకు, శ్రీకరమగు,
నా
మదిన్ జేతనంబీవె, నన్ను లోక
మందు
వెలయింతు వీవమ్మ, సుందరముగ.
40. ఓం *తిలోత్తమా*యై నమః ।
నామ
వివరణ.
అమ్మ
తిలోత్తమ. సర్వశ్రేష్ఠురాలు. దివ్యాత్మ అయిన తిలోత్తమ అమ్మయే.
అత్యంత
సౌందర్య వారాశి అయిన తిలొత్తమ అమ్మయే.
చం. సుగుణ
*తిలోత్తమా! * జగతి
శోభిలు నీ పదపంకజప్రభన్,
సగుణసురూపధారిణుల
సంస్కృతి వీవె దయా సుధాంబుధీ!
యగణిత
సత్య సత్ పథ మయాచితరీతిని గల్గు నీ కృపన్,
నిగమ
సువేద్యవీవు, గణనీయ శుభంబులు నాకుఁ గొల్పుమా.
41. ఓం *కాల్యై* నమః
నామ
వివరణ.
కాల
వర్ణముననొప్పు కాలీస్వరూపము కూడా అమ్మయే.
తే.గీ.
గౌరి!
నీవె యీ సృష్టిలో కలిని పెంచు
టేలను?
హరించుమమ్మరో! *కాళి!* దుష్ట
కలిని
బాపుము నా లోనఁ గలిగి నీవు,
కలిత
సద్గుణ సన్నుతా! సలలితాత్మ!
42. ఓం *కరాలవక్త్రాన్తా*యై నమః ।
నామ
వివరణ.
కరాలవక్త్రాంతము
అనగా భయంకరమయిన నోరు కలతల్లి మన అమ్మ
లక్ష్మీదేవియే.
ఉ. సంతత
సత్య సన్నుత లసద్గుణదాయిని! యో *కరాల
వ
క్త్రాంత! * శుభాస్పదా! జయము కల్గగఁ జేయుచు మంచివారికిన్,
చింతలఁ
ముంచు దుష్టులను జీల్చుచు నీ శుభ నామధేయమున్
సాంతము
నిల్పుకొందువు, ప్రశాంతతఁ గూర్చగ లోకమందునన్
43. ఓం *కామాక్ష్యై* నమః ।
నామ
వివరణ.
భక్తుల
కోరికలు తీర్చెడి కామాక్షీమాత మన అమ్మలక్ష్మీదేవియే.
కం. *కామాక్షీ!* శుభ దృష్టిని
క్షేమము
కలుగంగఁ జేసి కీర్తిని గనుచున్.
శ్రీమన్మంగల
సుజనుల
కైమోడ్పులు
గొనెడి నీకు కైమోడ్తునిటన్!
44. ఓం *కామదాయై* నమః ।
నామ
వివరణ.
కోరికలను
తీర్చు జనని కామద, మన అమ్మ. కమేశ్వర దర్శన భాగ్య ప్రదాత
మన
అమ్మ.
కం.
*కామద!*
నీ సద్భక్తుల
కామములగు
భుక్తి, ముక్తి, కరుణనొసగుచున్,
క్షేమము
గొలిపెదవమ్మా!
యేమని
నిన్ గోరువాడ నిమ్ము శుభాళిన్.
45. ఓం *శుభా*యై నమః ।
నామ
వివరణ.
శుభమనిన
మన అమ్మ్యే. ఈ కారణముగనే అమ్మ శుభా అను పేరు
గడించగలిగినది.
తే.
గీ.
వర
*శుభా! * సుజనాళికిన్ వరములొసగి
మంచినెన్నుచు
కాచెదవెంచి చూడ,
నేను
నీ దాసుడఁ, గనుచు నీవె నన్నుఁ
గాచి
రక్షించుమమ్మరో కనికరించి.
శ్లో.
చణ్డికా చండరూపేశా చాముండా చక్రధారిణీ ।
త్రైలోక్యజయినీ దేవీ త్రైలోక్యవిజయోత్తమా ॥ 7 ॥
46. ఓం *చణ్డికా*యై నమః ।
నామ
వివరణ.
చండప్రచ్ండ
క్రోధాకార్ముతో శత్రి భయంకర చండిక.
తే.గీ.
*చణ్డికా*
నీదగు ఘన ప్రచండ దృష్టి
దుష్టపాళిపై
పడనిమ్ము, సృష్టిలోన
మంచివారిని
కాపాడ మంచు నిన్ను
కోరుచుంటిని,
తీర్చుమా కోరికనిఁక.
47. ఓం *చణ్డరూపేశా*యై నమః ।
నామ
వివరణ.
శిష్ఠులపాలిట
కరుణాంఋత మూర్తి అయిన మన తల్లిదుష్టులపాలిట
చండరూపిణి.
తే.గీ. *చండ
రూపేశ!*
నీదైన చండ రూప
మనితరంబగు
శుభకారి వినయధనుల
కనుగుణంబుగ
దుష్టులనణచివేయు,
ఘనతరంబుగ
నిన్ను నే గాంచనుంటి.
48. ఓం *చాముణ్డా*యై నమః ।
నామ
వివరణ.
చాముండేశ్వరి
మన అమ్మ లక్ష్మీదేవియే.
కం. *చాముణ్డా*!
దురితాత్ములు
భూమిన్
ప్రళయాంతకులయి పుట్టుట గనితే?
ధీమంతులఁ
గాపాడగ
నీ
మహిమన్ ద్రుంచుమమ్మ నీచులనెలమిన్.
49. ఓం *చక్రధారిణ్యై* నమః ।
నామ
వివరణ.
అమ్మ
ధర్మచక్రమును ధరించిన జనని.
తే.గీ.
*చక్రధారిణీ!*
నీ కాలచక్రమందు
నెవ్వరున్
శాశ్వతంబుగా నివ్వసుధను
నిల్చి
యుండరు. నిల్చెద నేను నీదు
పాదపద్మమ్ములన్
జేరి పరవశమున.
50. ఓం *త్రైలోక్యజయిన్యై* నమః ।
నామ
వివరణ.
ముల్లోకములనూ
జయించిన తల్లి ఈ త్రైలోక్య జయినని మన అమ్మయే.
తే.గీ.
మహిత
*త్రైలోక్య జయినీ!* నమస్కరింతు
నీకు
భక్తితో సాగిలి, నీదు కృపను
పొందకున్నచోఁ బరమెట్లు
పొందగలను?
భువిని
నున్నట్టి నన్ గను పూజ్యవీవు.
51. ఓం *దేవ్యై* నమః.
నామ
వివరణ.
దివ్యత్వము
ఉన్న దేవతా స్వరూపిణి మన దేవీమాత.
కం. దేవీ నిను నా మదిలో
భావింతును మోక్షదవని,
పరమేశ్వరి! నా
కీవే
దిక్కై యుంటివి,
కేవల
మోక్షంబొసంగ కీర్తింతు నినున్.
52. ఓం *త్రైలోక్యవిజయోత్తమా*యై నమః
నామ
వివరణ.
ముల్లోకములనూ
జయించిన ప్రథమ గణ్య త్రైలోక్య
విజయోత్తమ
మనకు శుభద.
కం. క్షేత్రంబేనెఱుఁగ
నటులె
క్షేత్రజ్ఞుఁడ
నెఱుగనమ్మ! కీర్తింతును ని
న్నే
త్రైలోక్యాధిష్ఠగ
మా
*త్రైలోక్య విజయోత్తమా!* నిను గొలుతున్.
శ్లో.
సిద్ధలక్ష్మీః క్రియాలక్ష్మీర్మోక్షలక్ష్మీః ప్రసాదినీ ।
ఉమా భగవతీ దుర్గా చాంద్రీ దాక్షాయణీ శివా ॥ 8 ॥
53. ఓం *సిద్ధలక్ష్మ్యై* నమః ।
నామ వివరణ.
అంతులేని
లక్ష్మీ తల్లి. ప్రసిద్ధమయిన మన తల్లి, భక్తులకోరికలను
సిద్ధింపజేయు
తల్లి.
తే.గీ.
*సిద్ధ లక్ష్మీ!* నినున్ గొల్చి సిద్ధి పొంది
యిహ
పరంబుల సౌఖ్యంబు మహితముగను
పొందవచ్చును నీకృపఁ
బొందవచ్చు,
శిష్ఠ
భక్తులన్ రక్షించి సిద్ధి నిమ్ము.
54. ఓం *క్రియాలక్ష్మ్యై* నమః ।
నామ
వివరణ.
అన్ని
పనులకూ వెనుకనుండి సాగఁజేయుక్రియాలక్ష్మి
మన లక్ష్మీజననియే.
తే.గీ.
ఓ
*క్రియాలక్ష్మి*! కార్యంబులొప్పిదముగఁ
జరుగఁ
జేయుచు మమ్ము నీవరయుమమ్మ
యిహపరంబులసౌఖ్యంబులిచ్చు
నిన్ను
పొగడ
నాతరంబగునొకో? పుణ్యలబ్ధ!
55. ఓం *మోక్షలక్ష్మ్యై* నమః ।
నామ
వివరణ.
నిరంతర
సాధనతో అమ్మను కొలుచు మోక్షార్థులకు మోక్షమును ప్రసాదించు
జనని
మోక్షలక్ష్మి.
తే.గీ.
ఎన్ని
జన్మలనెత్తిననేమి ఫలము
కడకు
సన్మోక్షలబ్ధిచేఁ గలుగు సుఖము.
*మోక్షలక్ష్మీ!* నినున్
గొల్వ మోక్షమబ్బు.
పూజ
చేయుదు నీకు సన్ ముక్తినిడుమ.
56. ఓం *ప్రసాదిన్యై* నమః ।
నామ
వివరణ.
భక్తులయెడ
ప్రసన్నముగా అనుగ్రహముతో నుండు జనని మన తల్లి
ప్రసాదిని.
తే.గీ.
శాంత
రూపా! *ప్రసాదినీ!* సదయ నీవు
భక్తులన్
జూచుచుండుటన్ శక్తి పెరిగి
భక్తులెన్నుచు
నిను గొల్త్రు ముక్తిఁ గోరి,
నీదు
ప్రాసాదగుణము గణింపలేను.
57. ఓం *ఉమా*యై నమః ।
నామ
వివరణ.
పరమ
శాంత స్వభావ ఉమ మన జనని లక్ష్మీదేవియే.
తే.గీ.
సుజన
సన్నుత శ్రీ *యుమా!* నిజము కనగ
నీదు
మాహాత్మ్యమెన్నంగ లేదు భాష,
మేటి
శరదిందుచంద్రికల్ సాటిరావు
నీదు
శాంతంబునకు, నన్ను నీవు కనుము.
58. ఓం *భగవత్యై* నమః ।
నామ
వివరణ.
ప్రకాశవంతముగా
జ్ఞానప్రభా భాసమనముగా నొప్పునట్టిది మన అమ్మ భగవతి
తే.గీ.
*భగవతీ!*
నినుఁ చేరెడి భాగవతులు
ధన్య
జీవుల్, పునర్జన్మ తప్పి వారు
ముక్తి
సాధింతురిద్ధరన్ భక్తి నిలిపి
నీదు
పదపంకజములపై నేర్పు మీర.,
59. ఓం *దుర్గా*యై నమః ।
నామ
వివరణ.
ఎవ్వరికినీ
తనను అధిగమింప సాధ్యము కానితల్లి దుర్గ.
కం. భర్గునకైనను
కుదరదు
*దుర్గా!* నిన్నధిగమింప, దుస్తరరిపుష
డ్వర్గము,
నిన్ లెక్కింపని
మార్గమునన్
నన్ను జేరె, మాపుము కృపతో.
60. ఓం *చాన్ద్ర్యై* నమః ।
నామ
వివరణ.
చన్ద్ర
కాంతులతో ప్రకాఇంచు చాంద్రీ మాత కరుణకు పెట్టినది పేరు.
కం. *చాన్ద్రీ!* పాలకడలియే
చన్ద్రునకున్
నీకు తండ్రి, చల్లని శోభల్
సన్ద్రంబు
నుండి గొనితో?
సాన్ద్రప్రభ
శశి కొసగితొ? చల్లగ నుండన్.
61. ఓం
*దాక్షాయణ్యై శివాయై*
నమః!
నామ
వివరణ.
దక్షుని
తనయ మన తల్లి దాక్షాయణి, శివప్రదాయిని మన అమ్మ శివా.
కం. *దాక్షాయణీ!
శివా! * నను
రక్షింపఁగ
నుంటివమ్మ ప్రాణప్రదవై,
మోక్షమునొందఁగ
నాకున్
శిక్షణనిడి
ప్రోవుమమ్మ శ్రీమంతముగా.
ఓం *దాక్షాయణ్యై* నమః ।
కం. *దాక్షాయణీ!* సుధాంబుధి!
రక్షింపుము నన్ను సతము, ప్రార్థింతును ని
న్నక్షయ శుభదవు నన్నున్
సుక్షేమము బడయఁజేసి శోభిలఁ గనుమా.
ఓం *శివా*యై నమః.
తే.గీ.
ఓ *శివా!
* దివ్య శుభద! మహోన్నతంబు
నీదు భావంబు పరికింప, లేదు తిరుగు,
సృష్టినే చేసి కాపాడు దృష్టి నీది,
వందనంబులు చేసెద నందుకొనుము.
శ్లో.
ప్రత్యంగిరా ధరావేలా లోకమాతా హరిప్రియా ।
పార్వతీ పరమా దేవీ బ్రహ్మవిద్యాప్రదాయినీ ॥ 9 ॥
62. ఓం *ప్రత్యఙ్గిరా*యై నమః
నామ
వివరణ.
హిరణ్య
కశ్యప వధానంతరము కూడా నరసింహుని కోపము శాంతించనందున
శివుఁడు
శరభేశ్వరుఁడుగా యుద్ధము చేయుటకు రాగా అమ్మవారు, శూలిని,
మహాప్రత్యంగిర,
అను రెండు రూపములలో ప్రభవించి శరభేశ్వరునకు రెండు
రెక్కలుగా
మారెను. ఆమెను ప్రప్రథమముగా చూచవారు ప్రత్యంగుడు
అంగిరసుడు
ను. కావున ఈ తల్లికి
ప్రత్యంగిరస అను నామము కలిగెను.
ప్రత్యంగిరా
అనగా ఎదురుతిరిగే దేవత అని కూడా అర్థమున్నందున అమ్మ
ప్రత్యంగిరస
సార్థక నామధేయ యినది.
కం. ప్రత్యఙ్గుడు,
నంగిరసుఁడు
*ప్రత్యఙ్గిర!* కనుటను నిను ప్రప్రథమముగా
ప్రత్యఙ్గిరగా
నిలిచితి
వత్యంతశుభాళినిడ
మహాత్ములకెపుడున్.
63. ఓం *ధరా*యై నమః ।
నామ
వివరణ.
సమస్థమును ధరించునది
కావున ధరా మన జనని.
కం. పరమాద్భుత
చిత్రంబిది,
ధరియింతువు
నీవఖిలము,
*ధర!*కనుమన్నన్
కరుణింపవప్పుడప్పుడు
చరణంబులు
పట్టితి నను సదయ కను, రమా!
64. ఓం *వేలా*యై నమః ।
నామ
వివరణ.
కాలస్వరూపిణి
అమ్మ, అందువలననే ఆమె వేళ అయినది.
కం. *వేలా!* నన్నున్ గనుగొన
వేలన్?
నా పయిని కృప యదేలఁ గలుఁగదో?
వేళ
గతించుచునుండెను,
జాలిని
గని ముక్తి నీయ జాలవొ? జననీ!
65. ఓం *లోకమాత్రే* నమః ।
నామ
వివరణ.
లోకములన్నింటికినీ
తల్లి మన లోకమాత.
తే.గీ.
*లోకమాతా! * దయోపేత!
శోక తప్త
జగతిలో
బాధలన్ దీర్చి ప్రగణితముగ
మంచి
బ్రతు కీయ రావమ్మ! మంచిఁ గొలిపి,
సంచితము
వాపి రక్షించు చక్కగాను.
66. ఓం *హరిప్రియా*యై నమః ।
నామ
వివరణ.
విష్ణుమూర్తియొక్క
ప్రియురాలు హరిప్రియ.
పంచచామరము.
*హరిప్రియా!* నమోస్తు
తే, మహాత్ములైన భక్తులన్,
నిరంతరంబు
కావుమమ్మ, నిన్ను నమ్మి యుండి నీ
దరిన్
శుభాళి కల్గునంచు తత్ శుభాళిఁ గోరుచున్
పరంబునందవేడువారి
పాలిటన్ కృపాబ్ధివై.
67. ఓం *పార్వత్యై* నమః ।
నామ
వివరణ.
పర్వతరాజ
పుత్రి మన పార్వతీ మాత.
తే.గీ.
*పార్వతీ*మాత నీ కృపన్ బ్రతుకుచున్న
నన్ను
దయఁజూచి పెంచిన సన్నుత మతి!
జన్మ
సార్థకంబగునట్లు సన్మనోజ్ఞ
ముక్తి
మార్గసుదర్శివై భక్తినిమ్ము.
68. ఓం
*పరమాదేవ్యై*
నమః.
కం. కృపఁ
గను *పరమా!
దేవీ! *
యపవిత్రము
కాను నే నహంబుగ నీవే
సుపవిత్రతఁ
గొలుపగను న
నుపమ!
మదిని నిలిచితేని యొప్పుగ, జననీ!
ఓం పరమాయై నమః.
నామ వివరణ.
ఉత్కృష్టమైన, ప్రథానమైన,ఆద్ద్యయైన పరమేశ్వరస్వరూపము పరమ.
కం. *పరమా!*
నినువివరింపగ
తరమా కవినైన గాని, దాక్షిణ్యముతో
నిరతము లోకము లేలుచు
పరిపరివిధములను కాచి వరలింతువుగా.
ఓం *దేవ్యై* నమః.
కం. *దేవీ!* నీ సౌభాగ్యము
భావింపగ సాధ్యమగునె? భాగ్యద జననీ!
నీవేగా నా దైవము,
రావమ్మా నన్ను కావ రసరమ్య గుణా!
69. ఓం
*బ్రహ్మవిద్యాప్రదాయిన్యై* నమః ।
నామ
వివరణ.
బ్రహ్మవిద్యను
ప్రసాదించు తల్లి బ్రహ్మవిద్యాప్రదాయిని.
తే.గీ.
*బ్రహ్మవిద్యాప్రదాయినీ!* బ్రహ్మమెఱుగ,
నిన్నె
బ్రహ్మంబుగా నేను నిత్య మెన్ని
కొలుచుచుందును,
నీలోన కలవనుందు
నాకు
బ్రహ్మైక్యసిద్ధిని నయత నిమ్ము.
శ్లో.
అరూపా బహురూపా చ విరూపా విశ్వరూపిణీ ।
పంచభూతాత్మికా వాణీ పంచభూతాత్మికా పరా ॥ 10 ॥
70. ఓం *అరూపా*యై నమః ।
నామ
వివరణ.
రూప
రహిత అరూప మన అమ్మ.
తే.గీ.
రూపమెన్నగ
లేని *యరూప!* జనని!,
నిన్ను
నిర్గుణ తత్వమంచెన్నవలయు,
మానసమ్మున
నిను దల్వ మధురమగును
పూర్ణమైన
స్వరూపిణీ! స్వర్ణమయమె.
71. ఓం *బహురూపా*యై నమః ।
నామ
వివరణ.
అమ్మ
అన్నిరూపములలోను విరాజిల్లుచున్నందున ఆమె బహురూపిణి.
కం. *బహురూపా!* నీ యునికిని
బహురూపములలరుచుండె
ప్రఖ్యాతముగా
నిహపర
సాధకమార్గము
బహురూపా
నీవె కాదె? భావనఁ జేయన్.
72. ఓం *విరూపా*యై నమః
నామ
వివరణ.
ముక్కంటి
విరూప.
విశిష్ఠనయిన
రూపము కలది అమ్మ.
కం. పరమాద్భుతదర్శనమిడు
*విరూప!* కృపతో
కనఁబడు! విశ్వంభరవే
తరమా
గాంచుట నిన్ మది?
పరమేశ్వరి!
కృపను గనుము ప్రఖ్యాతముగా.
73. ఓం *విశ్వరూపిణ్యై* నమః ।
నామ
వివరణ.
అమ్మ
విశ్వమే తన రూపముగా కలది.
తే.గీ.
*విశ్వ రూపిణీ!* కాదిల శాశ్వతమ్మ
దేదియున్
జూడ,
నీదగు
పాద పద్మ
ములె
కనంగను ముక్తిదములు నిజంబు,
కొమ్ము
నా సేవ పాదమ్ములిమ్ము కొలుతు..
74. ఓం *పఞ్చభూతాత్మికా*యై నమః ।
నామ
వివరణ.
అమ్మ
పంచభూత స్వరూపిణి.
తే.గీ.
*పఞ్చభూతాత్మికా* యీ ప్రపంచమెన్న
నీదు
రూపంబె, యన్నిటన్ నీవె కలవు,
పఞ్చభూతంబులీవేను,
భద్రమీవె
భక్తి
నినుఁ గొల్తు కను నన్ను ముక్తిదవయి.
75. ఓం *వాణ్యై* నమః ।
నామ
వివరణ.
వాగ్రూపిణి
అయిన అమ్మ వాణియే.
తే.గీ.
వాక్సుధాస్రవంతిగ
నోట వరల రమ్ము,
జ్ఞాన
సద్భాగ్యదా! *వాణి!* కరుణఁ గనుము,
ప్రాణమీవేను
నాలోని జ్ఞానమీవె,
వందనమ్ములు
గొనుమమ్మ
బ్రహ్మరాణి!
76. ఓం
*పంచ భూతాత్మికా పరా*యై నమః
నామ
వివరణ.
భౌతిక
ప్రపంచమే రూపముగా కల పరా స్వరూపిణి మన తల్లి.
తే.గీ.
*పంచ
భూతాత్మికాపరా!* సంచిత ఫల
మగుచు
లభియించి తీవు నా కనుపమముగ
నీదుపాదాబ్జములఁబట్టి
నేను విడువ
ముక్తిసామ్రాజ్యదాయినీ!
శక్తినిమ్ము.
ఓం * పంచ భూతాత్మికా *యై
నమః ।
నామ వివరణ.
భౌతిక ప్రపంచమే రూపముగా కల తల్లి.
తే.గీ.
*పంచ భూతాత్మికా!* నీ ప్రపంచమందు
నేను జన్మించియుంటిని, నీదు సేవఁ
జేయు భాగ్యమ్ము కల్పించి చేదుకొమ్ము,
నీవు కాదన్న దిక్కేది? నీరజాక్షి!
ఓం *పరా*యై నమః ।
నామ వివరణ.
పరాశక్తి స్వరూపిణి అమ్మ
తే.గీ.
ఓ
*పరా!* నీదు పదసేవ నొప్పు బ్రతుకు
బ్రతుకనంబడు, కానిచో బ్రతుకు కాదు,
పరము నందంగఁ జేయు నీ పదయుగళము,
నాదు భక్తిలో నిలిచి నన్నాదుకొనుము.
ఓం *పరమాత్మికా*యై నమః
తే.గీ. వినుత *పరమాత్మికా!
* నీవు ప్రేమతోడ
నీదు వేయి నామంబులన్ నేర్పు మీర
పద్యములలోన పొదిగించి, పది దినముల
లోన వ్రాయించనుంటివా? జ్ఞాన భాస!
శ్లో.
కాలి మా పంచికా వాఙ్మీ హవిఃప్రత్యధిదేవతా ।
దేవమాతా సురేశానా దేవగర్భాఽంబికా ధృతిః ॥ 11 ॥
77. ఓం
*కాల్యై*
నమః
నామ
వివరణ.
కాలస్వరూపిణి
అయిన తల్లి కాలిమాత.
తే.గీ.
*కాలి*!
మా! నీదు కృపచేత మేలుఁ గనెద,
నీదు
సద్రూపమున్ జూతు నిత్యము మది,
కల్మషంబులు
వీడుదు కవితలల్లి
నిన్ను
మురిపింపఁ జేయుదున్ నేర్పు తనర.
78. ఓం
*మా*యై నమః.
నామ
వివరణ.
లోకములకే
తల్లి మన మాత.
తే,గీ.
కాలి!
*మా*!
నీదు కృపచేత మేలుఁ గనెద,
నీదు
సద్రూపమున్ జూతు నిత్యము మది,
కల్మషంబులు
వీడుదు కవితలల్లి
నిన్ను
మురిపింపఁ జేయుదున్ నేర్పు తలర.
ఓం *కాలిమ్న్యై* నమః
।
నామ వివరణ.
కాలస్వరూపిణి అయిన తల్లి కాలిమాత.
తే.గీ.
*కాలిమా!* నుతమౌ దయాశాలివమ్మ,
కాల గమనంబు నీవే, ప్రకాశమీవె,
లిప్తలిప్తయున్ సత్ఫల ప్రాప్తికగుచు
నిన్ను జేర్చుత నన్నునాపన్న రక్ష!
79. ఓం *పఞ్చికా*యై నమః ।
నామ
వివరణ.
పంచ
భూతములచే వ్యాప్తమయి యున్న జనని పంచిక.
తే.గీ.
*పఞ్చికా!*
నీవు వెలుఁగు భావాఞ్చితముగ
నాదువాక్కులన్
సతతంబు నవ్యగతుల,
నిన్ను
ప్రాప్తింపఁ జేసెడి నిరుపమాన
వాగ్భవంబగు
దైవంబు ప్రాప్తమగుత.
80. ఓం *వాఙ్మ్యై* నమః ।
నామ
వివరణ.
వాఙ్నైపుణ్యము
కల తల్లి
వాఙ్మి
తే.గీ.
*వాఙ్మి!* దివ్య
ప్రభాన్విత బంధ గర్భ
చిత్ర
కవితలన్ జేయంగఁ జేయుమమ్మ,
దివ్య
వాగ్ధాటి నొసగుచు భవ్యమయిన
నీదు
చరితంబు పలికించు నేర్పుఁ గొలిపి.
81. ఓం *హవిషే* నమః ।
నామ
వివరణ.
యజ్ఞమున
హవిస్సు అమ్మయే. అటువంటి హవిస్సుకు నమస్కారము.
తే.గీ.
ఓ
*హవీ!*
యజ్ఞఫలముల నొప్పునొసగ
హవిగ
రూపొంది నీ కృపనందఁజేసి
మమ్ము
కాపాడు చున్న మా మాతృ దేవి!
వందనంబులు
చేసెద నందుకొనుము.
82. ఓం *ప్రత్యధిదేవతా*యై నమః
నామ
వివరణ.
దేవతలు
అధిదేవతలతో పాటు దేహమానసములకు శక్తిని పెంచు
ప్రత్యధిదేవత
మన జనయిత్రి.
తే.గీ.
దేహ
మానస శక్తుల దీప్తిఁ బెంచు
సౌమ్య
*ప్రత్యధిదేవతా!*
సంస్తుతింతు,
నిరుపమాధిక
శక్తి సునిశ్చితముగ
నీదు
కృపచేత లభియించు
నిరుపమాన!
83. ఓం *దేవమాత్రే* నమః ।
నామ
వివరణ.
దేవతలకు
తల్లి మన అమ్మ దేవతామాత. మాతృప్రేమను పంచి చూచుటలో తల్లివంటి దేవత.
తే.గీ.
దీప్తమౌ
తల్లి వీవమ్మ *దేవమాత!*
దేవతా
వర తత్వమౌ దీప్తివీవు,
నీవు
కృపతోడఁ గాంచుమా నిరుపమాన!
నీదు
కృపకంజలించెద మోదమునను.
84. ఓం *సురేశానా*యై నమః ।
నామ
వివరణ.
సురలకు
దేవత సురేశాన.
తే.గీ.
ఓ
*సురేశాన!*
నీలోననున్న మహిమ
వర్ణనంబును
చేయగ పదము లేవి?
నీ
పదంబులు పట్టిన నిర్ణయముగ
పదములందును,
గొల్తు నీ పదయుగంబు.
85. ఓం *వేదగర్భా*యై నమః ।
నామ
వివరణ.
వేదములను
తన గర్భమునందే కలిగియున్న జనని వేద గర్భ.
తే.గీ.
*వేదగర్భా!* సువిదితమౌ వేదమీవె,
వేద
గర్భాననిండి యవేద్యవైన
నీ
ప్రభావంబు
నెఱిగింప
నేరనమ్మ.
విదితముగ
నాదు మదిలోన వెలుగుమమ్మ.
86. ఓం *అమ్బికా*యై నమః ।
నామ
వివరణ.
అంబికామాత
సృష్టికే తల్లి కావుననే అంబికగా లోకరక్షణ చేయుచున్నది.
తే.గీ.
*అంబికా!*
కన నీవే కృపాంబుధివిగ,,
తల్లిగా
మమ్ము కాపాడి తనియుదీవు,
నిన్ను
గౌరవింపగ లేని నిరుపయోగ
జన్మమీయకుమెవరికిన్,
జయనిధాన!
87. ఓం *ధృత*యే
నమః ।/
ఓం
*ధృత్యై నమః ।
నామ
వివరణ.
ధైర్య
సంతోష సౌఖ్యప్రద ధృతి మాత.
తే.గీ.
మహితవగు
*ధృతీ!* ధరియించి మమ్ము సతము
కంటి
పాపగా
చూచుచు
కాతువీవు,
కనులకున్నట్టి ఫలమును
కలుగఁ జేసి
నిన్ను
దర్శించుకోనిమ్ము కన్న
తల్లి!
శ్లో.
సంఖ్యా జాతిః క్రియాశక్తిః ప్రకృతిర్మోహినీ మహీ ।
యజ్ఞవిద్యా మహావిద్యా గుహ్యవిద్యా విభావరీ ॥ 12 ॥
88. ఓం *సంఖ్యా*యై నమః ।
నామ
వివరణ.
దేహ
విలక్షణమయిన ఆత్మజ్ఞానమే సంఖ్యగా పిలువబడు మన అమ్మ.
తే.గీ.
ఆత్మ
సుజ్ఞాన రూపిణీ!
యాసురగుణ
బాహ్యునిగఁ
జేయుమో *సంఖ్య!* భక్తిఁ గొలుతు,
నీవె
సుజ్ఞాన దీప్తివై నిత్యముగను
నిలుమ
నామది లోగిలిన్ నిండంకృపను.
89. ఓం *జాతా* యై నమః ।
నామ
వివరణ.
సృష్టికి
పూర్వమే జాతమయిన తల్లి
జాత.
తే.గీ.
*జాత!*
కననిమ్ము నీలోని భాతి కృపను,
నా
తరంబౌనె
నిన్
దెల్ప నయ నిధాన!
ఖ్యాతిఁ
గాంచగ నీ దివ్య ఘనత వ్రాసి
లోకులకుదెల్పనిమ్ము
నా లోననుండి.
90. ఓం
*క్రియాశక్త్యై* నమః ।
నామ
వివరణ.
సృష్టి
క్రియా శూన్యమై యుండకుండుటకు జగన్మాత క్రియాశక్తిగా జీవకోటిలో
చైతన్యరూపమున
ఉండును, కావుననే ఈ తల్లి క్రియా శక్తి.
తే.గీ. ఓ *క్రియాశక్తి!* నిన్ గనుటొప్పు నాకు,
నిన్ను
దర్శించుకోనిమ్ము నీదు శక్తి
నాకు
ప్రేరకమగునమ్మ నమ్ముమమ్మ.
వందనమ్ములు
చేసెదనందుకొమ్మ.
91. ఓం *ప్రకృత్యై* నమః ।
నామ
వివరణ.
అమ్మ
ప్రకృతిస్వరూపిణి.ప్రకృతి అమ్మయే.
తే.గీ.
దివ్య
సంభాసవగు *ప్రకృతీ!* మదంబ!
నాదు
ప్రకృతిలో సుగుణముల్ మోదమలర
నీవె
దయతోడఁ జేర్చుమా నిరుపమాన!
వందనమ్ములు
చేసెద వనజ నయన!
92. ఓం *మోహిన్యై* నమః
నామ
వివరణ.
శ్రీమన్నారాయణుని
మోహింపఁజేయు జనని మోహిని,
తే.గీ.
*మోహినీ*!
లోకమందున మోహమేల
సృష్టి
చేయఁబడెనొ కాని స్పష్టమమ్మ
మోహమున
మద మత్సరాల్ పూని మతిని
పాడుచేయుటన్
నినుఁ గనన్ వలనుపడదు.
93. ఓం *మహ్యై* నమః ।
నామ
వివరణ.
అమ్మ
మహిగా సుప్రసిద్ధ.గోరూపమునను, భూ రూపమునను గల తల్లి మహి.
తే.గీ.
మహిమలకు
నిలయంబైన *మహి!* నుతింపఁ
జాలనమ్మరో
నిన్ను, నీ మ్రోల నిలిచి
సంతసంబును
పొందెదన్ జక్కనయిన
నీదు
సద్రూపమున్ గాంచి,
నిఖిలవేద్య!
94. ఓం *యజ్ఞవిద్యా*యై నమః ।
నామ
వివరణ.
జ్ఞాన
మోక్షప్రదమయిన యజ్ఞములకు సంబంధించిన విద్య మన అమ్మ,
తే.గీ.
*యజ్ఞవిద్యా!*
ప్రభాపూర్ణ యజ్ఞ మహిమ
నరయఁజేసి
నిన్ గనఁ జేసి,
పరమపథము
నొందు
మార్గము సూపుమా! సుందరముగ
నీకు
ఋణపడియుందును నిన్ నుతింతు.
95. ఓం *మహావిద్యా*యై నమః ।
నామ
వివరణ.
మహా
విద్యా స్వరూపిణి మన అమ్మ.
తే.గీ.
ఓ
*మహావిద్య!* పరము
నాకోర్పుతోడ
ఘన
మహావిద్యలంద నేన్,
మనము
పెట్టి
నేర్పుమోయమ్మ
పరమంద నేర్చుకొందు,
నిన్నుఁ
జేరగ నాకగు నేర్పుతోడ.
96 ఓం *గుహ్యవిద్యా* యై నమః ।
నామ
వివరణ.
అతి
రహస్యమయిన గుహ్యమయిన విద్య ఏది కలదో ఆ గుహ్యవిద్య అమ్మయే.
తే.గీ.
*గుహ్యవిద్యా!* మహామాత!
కూర్మితోడ
గుహ్యమైనట్టి
సద్విద్య కోరి నేర్తు,
చెప్పుమోయమ్మ
నాకది గొప్పగాను,
నిన్ను
చేరంగ నాకగున్ నేర్చుకొనిన.
97. ఓం *విభావర్యై* నమః ।
నామ
వివరణ.
పసుపు
మన జననియ్. రాత్రి అను గుణము జనని విభావరియే.
తే.గీ.
కనగ
లేను *విభావరీ!* గాఢ
తమస
మలముకొన్నట్టి
బుద్ధిచే నరసి నిన్ను,
నాదు
తమసమ్ము బాపుచున్ నీదు తేజ
మును
గనంజేయుమమ్మరో! ముచ్చటగను.
శ్లో.
జ్యోతిష్మతీ మహామాతా సర్వమంత్రఫలప్రదా ।
దారిద్ర్యధ్వంసినీ దేవీ హృదయగ్రంథిభేదినీ ॥ 13 ॥
98. ఓం *జ్యోతిష్మత్యై* నమః ।
నామ
వివరణ.
జనని
జ్యోతిష్మతి అనగా మెఱుపు తీగయే అమ్మ.
తే.గీ.
తగును
*జ్యోతిష్మతీ!*
నీకు దాసుడనని
కాచి
రక్షించుటన్నది కచ్చితముగ,
దారితెన్నులు
కనరాని
దారిఁ
బాపి
వినుత
జ్యోతిర్లతా! నాకు వెలుగునిమ్ము.
99. ఓం *మహామాత్రే* నమః ।
నామ
వివరణ.
ఈ
సృష్టిలోనే గొప్ప తల్లి మహామాత..
తే.గీ.
జలధి
జాతా! *మహామాత!* జయము
నీకు,
నిలువరించుము
నా మదిన్, నిశ్చలముగ
నుండఁ
జేయుము, భక్తితో
నిండు
మదిని
నిన్ను
సేవింపఁ జేయుము,
నిరుపమాక్షి!
100. ఓం *సర్వమన్త్రఫలప్రదా*యై నమః ।
నామ
వివరణ.
సర్వ
మంత్రముల ఫలితమును కలిగించు జనని సర్వమంత్రఫలప్రద.
తే.గీ.
*సర్వ మంత్రఫలప్రదా!* సన్నుతముగ
నిన్ను
సేవించు భక్తుల నెన్ని నీవు
సర్వమంత్రఫలంబులన్
సరగున నిడి
కాచి
రక్షించుచుందువో కమల నయన!
101 ఓం
*దారిద్ర్యధ్వంసిన్యై* నమః ।౧౦౦
నామ
వివరణ.
తనను
నమ్మి భజించు సాధకుల దరిద్రమును రూపుమాపు తల్లి
దారిద్ర్యధ్వంసినీ
మాత.
కం. చేరుచు
నిను నిజ భక్తులు
కోరుచు
భజియింప, వారు కోరకముందే
దారిద్ర్యమణచి
తీర్తువు,
*దారిద్ర్యధ్వంసినీ!* ముదంబున కోర్కెల్.
ఓం *దేవ్యై* నమః
కం. *దేవీ!* నీ శుభ తేజము
భావింపగనైన నాకు వశమా జననీ?
సేవాదృక్పథమిమ్మా,
సేవించెద నిన్ను సతము క్షేమంబొందన్.
102. ఓం *హృదయగ్రన్థిభేదిన్యై* నమః
నామ
వివరణ.
హృదయగ్రంధిని
భేదించు జనయిత్రి హృదయగ్రంధి భేదిని.
తే.గీ.
సాధకుని
చిత్తమరయుచు సాధనమున
సత్ఫలంబులు
కొల్పెడి సౌమ్యవీవు,
సాధనము
చేయ నేర, నన్ సాకుము విను
త *హృదయగ్రన్థిభేదినీ!* తప్పదమ్మ.
శ్లో.
సహస్రాదిత్యసంకాశా చంద్రికా చంద్రరూపిణీ ।
గాయత్రీ సోమసంభూతిస్సావిత్రీ ప్రణవాత్మికా ॥ 14 ॥
103. ఓం *సహస్రాదిత్యసఙ్కాశా*యై నమః ।
నామ
వివరణ.
వేయిమంది
సూర్యులతో సమానమయిన ప్రభాపూర్ణ మన లక్ష్మీమాత.
మ. అరిషడ్వర్గమునే
యడంచెడి
*సహస్రాదిత్య సంకాశ!* నీ
సరియెవ్వారలు
భక్త రక్షణమునన్ సారస్వతోద్భాసితా!
పరమేశాని
నినున్ మదిన్ సతతమున్ బ్రార్థించువాడన్, ననున్
దరిచేర్చంగను
చాలుదీవె కృపతో ధాత్రిన్ ననున్ బ్రోవుమా.
104 ఓం *చన్ద్రికా*యై నమః ।
నామ
వివరణ.
చల్లని
ప్రకాశమగు వెన్నెల ఏది కలదో అది మన అమ్మయే.
మ. చలువల్
పంచెడి *చన్ద్రికా!* హరి నుతా! సంస్కార సత్ సంపదన్
గలుగన్
జూడుము నాకు నెప్పుడును, రాకాచంద్ర సంకాశ! నీ
తలపే
పాప నివారణంబు కనగన్, ధర్మార్థసంసిద్ధికై
తలతున్
నిన్ సతతంబు, కావుము కృపన్ ధైర్యప్రదా! సన్నుతుల్.
105. ఓం *చన్ద్రరూపిణ్యై* నమః ।
నామ
వివరణ.
చంద్రుని
యొక్క రూపము ఏది కలదో అది అమ్మయే, చంద్రుని రూపమున
ఉన్న
తల్లి మన అమ్మ.
తే.గీ. *చన్ద్ర
రూపిణీ!*
నీ ముఖ చంద్రబింబ
మునకు
దాసోహమను హరి ముద్దుగాను,
బంధనములకు
లోనైతి పాప గతుల
నుంటిఁ
గాపాడుమా నమ్మియుంటి నిన్ను.
106. ఓం *గాయత్ర్యై* నమః ।
నామ
వివరణ.
సాధకులచే
గానము చేయఁబడుచు రక్షించఉ జనని
మన
అమ్మ గాయత్ర్రీ
స్వరూపిణి.
శా. *గాయత్రీ!* పరదేవతా! భగవతీ! కల్యాణ సంపత్కరీ!
శ్రేయోదాయక
సత్యమార్గ ముననే చిత్తంబు నే నిల్పుచున్
మాయామోహములన్
విడన్ గొలిచెదన్ మాన్యా! నినున్ నిత్యమున్,
నా
యజ్ఞానము పారద్రోలుచు కృపన్ నన్ గావుమా నిత్యమున్.
కం. *గాయత్రీ!*
జపియించెద
శ్రేయంబును
బొందఁ గోరి శ్రీకరమౌ నా
మాయను
బాపెడి మంత్రము,
నాయజ్ఞానమును
బాపి నను గావుమిలన్.
107. ఓం *సోమసమ్భూత్యై* నమః ।
నామ
వివరణ.
సోమునిఫాలమున
ధరించిన జ్ఞాని.
చంద్రమండల
మధ్యస్థ అమ్మ. ఉమా పరమేశ్వరుల వలన సంభూతమయిన జనని.
తే.గీ.
*సోమ
సమ్భూతి!* వర సతీ! శుభ నిధాన!
ప్రేమతో
నిన్నుఁ గొలువనీ విశ్వవేద్య!
చంద్రవంకను
దాల్చిన చక్కనమ్మ!
వందనంబులు
చేసెద నందుకొనుము.
తే.గీ.
*సోమ సమ్భూతి!* నాపైన బ్రేమ జూపి
నీ సహస్రనామావళిన్ నేర్పు మీర
వ్రాయఁజేసెదవోయమ్మ పద్యములను.
వందనంబులు చేసెద నందుకొనుము.
108. ఓం *సావిత్ర్యై* నమః ।
నామ
వివరణ.
సవితుని
ప్రకాశముతో విరాజిల్లు తల్లి సావిత్రి.
శా,
*సావిత్రీ! * కరుణామయీ! శుభనిధీ! శాంతిన్ బ్రసాదించుమా,
సేవాభావము
నీపయిన్ గొలుపుమా, చిద్భాసవై వెల్గుమా,
నీవాడన్,
సుతుడన్, దయాన్వితవు, నిన్నే గొల్చు నన్ గావుమా,
భావావేశముతోడ
పద్యముల నిన్ వర్ణింపఁగాఁ జేయుమా.
109. ఓం *ప్రణవాత్మికా*యై నమః ।
నామ
వివరణ.
ప్రణవమునే
ఆత్మగా కలది మన అమ్మ.
శా. సేవింతున్
*బ్రణవాత్మికా*
సతతమున్ సిద్ధిన్ గనన్ నిన్ను నేన్,
భావంబందున
నిల్చియుండుమ కృపన్ పద్యాళిలోఁ బ్రేమతో,
జీవాత్మన్
బరమాత్మలోన కలుపన్ సిద్ధంబుగానుంటి సద్
భావంబున్
వరసేవనా కుశలతన్ వర్ధిల్లనిమ్మా భువిన్.
శ్లో.
శాంకరీ వైష్ణవీ బ్రాహ్మీ సర్వదేవనమస్కృతా ।
సేవ్యదుర్గా కుబేరాక్షీ కరవీరనివాసినీ ॥ 15 ॥
110. ఓం *శాఙ్కర్యై* నమః
నామ
వివరణ.
శంకరుని
అర్థాంగి మన అమ్మ.
తే.గీ.
*శాంకరీ! * నీదు కృపచేత శంక లుడిగి
నిత్య
సంస్కారమున్ గల్గి నేను సతము
వెలుగు
నట్లుగ చేయు నావేల్పు వీవె,
వందనంబులు
చేసెద నందుకొనుము.
111. ఓం *వైష్ణవ్యై* నమః ।
నామ
వివరణ.
విష్ణు
సంబంధమయిన తల్లి మన అమ్మ వైష్ణవి.
తే.గీ.
*వైష్ణవీ! * నీవె నాయింట వరలుమమ్మ,
నిన్ను
సేవించు భాగ్యమున్ నేను గనుదు,
కన్నవారికి
సంతస కారణమగు
నన్ను
నమ్మిన వారికిన్ మన్నననిడు.
112. ఓం *బ్రాహ్మ్యై* నమః ।
నామ
వివరణ.
భ్రహ్మ
యొక్క అంశతో నొప్పారు జ్న్ని మన అమ్మ.
కం. *బ్రాహ్మీ!* నీ కృప కలిగిన
బ్రహ్మయు
తల వ్రాత మార్చి బ్రతుకఁగఁ జేయున్,
బ్రహ్మోపదేశమప్పుడు
బ్రాహ్మణులే
నిన్నుఁ జూపి వర్ధిలఁ గనిరే.
113. ఓం *సర్వదేవనమస్కృతా*యై నమః ।
నామ
వివరణ.
అందరు
దేవతలచేత నమస్కరింపబడు తల్లి.
తే.గీ.
*సర్వ
దేవ నమస్కృతా! * సహజ సుగుణ
భాసితులనిలఁ
గావుమా,
వరలఁ
జేయ,
దుష్ట
దుర్మార్గవర్తులన్ దునిమి, ధర్మ
రక్షణంబును
జేయుమా, ప్రస్తుతింతు.
ఓం *తస్మై* నమః.
నామ వివరణ.
కం. వందనమందుమ *తస్మై!*
సుందర సుకుమార గాత్ర! సుజనోద్భాసా!
మందస్మితమున సృష్టికి
విందగు దైవముగ నుండి, ప్రీతిఁ గనెదవే.
114. ఓం
*సేవ్య
దుర్గా*యై నమః.
నామ
వివరణ.
సేవింపఁబడు
దుర్గమమయిన తల్లి మన అమ్మ.
తే.గీ. *సేవ్య
దుర్గా!*
మహాదేవి! చిత్తమందు
నాకు
నీవుండుమోయమ్మ! శ్రీకరముగ,
సేవలందింతు
మదిని సద్భావపూర్ణ!
వందనంబులు
చేసెద నందుకొనుము.
ఓం *దుర్గాసేవ్యా*యై నమః ।
నామ వివరణ.
సేవించుచున్న దుర్గ కలది మన అమ్మ.
కం. *దుర్గాసేవ్యా!* ఖలు సం
సర్గంబులు పాపుమమ్మ! సదయను గనుచున్,
దుర్గతి పాపుదు వీవే
మార్గము నీవే సుగతికి మహిత గుణాఢ్యా!.
115. ఓం *కుబేరాక్ష్యై* నమః ।
నామ
వివరణ.
కేవలం
తన చూపుతో మనిషిని ధనవంతులను చేయగల తల్లి మన అమ్మ.
తే.గీ. ఓ
*కుబేరాక్షి*నీ చూపు లొంద లేక
పేదలై
జనులిద్ధరన్ వెతలఁ దేల
నీవు
చూడకయుండుట నీకు తగదు,
పేదవారిని
కరుణించి యాదుకొనుము.
116. ఓం *కరవీరనివాసిన్యై* నమః ।
నామ
వివరణ.
గన్నేరు
పూలను నివాసముగా కలది మన అమ్మ.
కం. శుభ
*కరవీర నివాసిని!*
యభయము
నీ వలన నాకు, ననుపమ వరదా!
శుభ
సంహతి చేకూర్చుచు
నభిమానులఁ
గావుమీ వహర్నిశలందున్.
శ్లో.
జయా చ విజయా చైవ జయంతీ చాఽపరాజితా ।
కుబ్జికా కాలికా శాస్త్రీ వీణాపుస్తకధారిణీ ॥ 16 ॥
117. ఓం *జయా* యై నమః ।
నామ
వివరణ.
జయమే
తానుగా అయియున్నది మన అమ్మ.
కం. నయమార్గంబున
వెల్గు వి
నయశీలురనెన్ని
జయము, నైతిక శక్తిన్
దయతో
నొసగెడి *జయ!* ని
శ్చయముగ
నన్ గాతువమ్మ, జయము లొసగుచున్.
118. ఓం *విజయా* యై నమః ।
నామ
వివరణ.
నిరంతర
విజయ స్వరూపిణి లక్ష్మీమాత.
కం. *విజయా!* నీ శుభ నామమె
విజయంబులు
కూర్చునమ్మ విజ్ఞులకెపుడున్,
నిజమిది,
నిన్ గొలిచెడి న
న్నజయ్యునిగ
చేసి కావు మద్భుత శక్తిన్.
(క్షయ్యజయ్యౌ శక్యార్థే...సూత్రం
మేరకు జయింపవీలు గానివాడు అజయ్యుడు . ఇది శక్తిని తెలుపుతుంది. క్షయ్య, జయ్య, శబ్దములు శక్యార్థములు:2
క్షయింప శక్యమైనది క్షయ్యము: జయింప శక్యమైనది జయ్యము. శక్యార్థముకాక యోగ్యార్థము గలిగినప్పుడు క్షేయము, జేయము, అనురూపములు గలుగును.
'క్రయ్యమనగా కొనువారు కొందురనుబుద్ధి నంగడియం దుంచబడినది. 'క్రేయ' మనగా విక్రయించుట కర్హమైనది.)
119. ఓం *జయన్త్యై* నమః
నామ
వివరణ.
నిరంతర
జయములతో ప్రకాశించు తల్లి.
పంచ
చామరము.
*జయన్తి!
* నీకసాధ్యమా
నిజంబుగా జయంబిడన్,
నయంబుతోడ
వెల్గుచు న్ననారతంబు కాతువే,
ప్రియంబుగా
కవిత్వమున్ భవిష్యవాణి యై మనన్
జయంబు
గొల్పు రీతిలో ప్రశస్తిగా నొసంగుమా.
120. ఓం *అపరాజితా* యై నమః ।
నామ
వివరణ.
ఇతరులచే
ఓడింప బడని తల్లి.
కం. *అపరాజితా! * మదంబా!
సుపవిత్ర
చరిత్ర కలిగి శోభిలు భక్తుల్
జపియింతురు
నిను నార్తిని,
ప్రపవై
నీవాదుకొని, పిపాస నడచుమా.
121. ఓం *కుబ్జికా*యై నమః ।
నామ
వివరణ.
ఆమె
ఎనిమిదేళ్ల బాలిక. ముడుచుకుని నిద్రపోవుచున్న జనని.
తే.గీ.
*కుబ్జికా!*
మాపుమా మరుగుజ్జుతనము
నాదు
దుర్భావ మిళితమౌ మేధ యందు,
నిన్ను
సేవించు నా బుద్ధి నిశ్చయముగ
నిన్ను
మెప్పించు నటులుండనిమ్ము జనని.
122. ఓం *కాలికా*యై నమః ।
నామ
వివరణ.
కాలికారూపమున
ఉన్న తల్లి మన అమ్మ.
తే.గీ.
*కాలికా! * నీదు రూపమున్ గలయఁ జూచి
యైహికాముష్మికములంది
యలరుదురుగ
నీదు
భక్తులు, నేనును నిన్నుఁ గొలిచి
భక్తి
యుక్తుఁడనై పొంది శక్తి , మనుదు.
123. ఓం *శాస్త్ర్యై* నమః ।
నామ
వివరణ.
జ్ఞానమును
శాసించు తల్లి.
తే.గీ.
శాస్త్ర
విజ్ఞాన ఖనివైన శాస్త్రివమ్మ,
నీవు
*శాస్త్రీ! * నిజంబిద్ది,, నేర్పు మీర
శాస్త్ర
విజ్ఞానమందించి చక్కగ నను
చూడుమమ్మరో
పుత్రుఁడన్, శుభద వగుచు.
124. ఓం *వీణాపుస్తకధారిణ్యై* నమః ।
నామ
వివరణ.
వీణను,
పుస్తకమును ధరించు జనని, నాద బ్రహ్మమును, జ్ఞానబ్రహ్మమును
తనలో
ధరించుతల్లి.
కం. *వీణాపుస్తక ధారిణి! *
కాణాచివి
విద్యలకును, కల్పకమీవే,
క్షోణిని
నిను స్మరియించిన
ప్రాణములను
నిలుపు విద్యఁ బడయగవచ్చున్.
శ్లో.
సర్వజ్ఞశక్తిశ్శ్రీశక్తి(సర్వజ్ఞః)ర్బ్రహ్మవిష్ణుశివాత్మికా ।
ఇడాపింగలికామధ్యమృణాలీతంతురూపిణీ ॥ 17 ॥
125. ఓం *సర్వజ్ఞశక్త్యై* నమః ।
నామ
వివరణ.
సమస్తమును
తెలిసిన శక్తి స్వరూపిణి అమ్మ.
కం. *సర్వజ్ఞ శక్తి! * వినుమా.
నిర్వేదము
నిన్నుఁ గొలువనీయదు జననీ!
పర్వంబులందునైనను
గర్వము
విడనాడి నిన్ను గాంచఁగనిమ్మా.
126. ఓం
*శ్రీశక్త్యై*
నమః.
నామ
వివరణ.
మంగలప్రపూర్ణమయిన
శక్తి అమ్మయే.
తే.గీ. మంగలప్రద *శ్రీ
శక్తి!* మాతృదేవి!
లోక
కల్యాణ కారిణీ! లోకమాత!
మంగలప్రద
శక్తిని మాకొసగుము,
వందనంబులు
చేసెద నందుకొనుము.
ఓం *సర్వజ్ఞా*యై నమః ।
కం.
సర్వము నీవే యనుచు న
ధర్వుని వేదమ్ము చెప్పు, తత్వజ్ఞులు నిన్
సర్వజ్ఞా యని కొలుతురు,
*సర్వజ్ఞా! * ననునొనర్పు సర్వజ్ఞునిగా.
127. ఓం *బ్రహ్మవిష్ణుశివాత్మికా*యై నమః ।
నామ
వివరణ.
సృష్టి
స్థితి లయకారకులయిన త్రిమూర్తుల ఆత్మ అమ్మయే.
తే.గీ.
*బ్రహ్మవిష్ణుశివాత్మికా* పరమ పథము
బ్రహ్మ
జిజ్ఞాసచే గాంచి పరగునట్లు
చేయు
తల్లివి, నన్నింక చేదుకొనుము,
బ్రహ్మజీవైక్యసిద్ధిని
వరల నిమ్ము.
128. ఓం *ఇడాపిఙ్గలికామధ్యమృణాలీతన్తు రూపిణ్యై* నమః ।
నామ
వివరణ.
మనలోనుండు
ఇడ, పింగల, అను
నాడుల మధ్యనుండెడి
సుషుమ్నాడి
తామరతూడుదారముఆకారములో
ఏది యుండునో ఆ రూపము
అమ్మయే.
స్వయంకల్పిత మృణాలి వృత్తము.
గణములు. …..య స భ మ జ గ … యతి 9వ అక్షరము. ప్రాస
కలదు.
*ఇడాపిఙ్గలికామధ్యమృణాలీతన్తు రూపిణీ!*
వడిన్
నీవిక రావమ్మ! భవానీ! భాసురాంబికా!
కడన్
నిల్పగ నేలమ్మ! గణించమ్మా ననున్ సతీ!
కడున్
గౌరవ తత్వం బిఁక నీవేయిమ్ము గొప్పగా!
శ్లో.
యజ్ఞేశానీ ప్రథా దీక్షా దక్షిణా సర్వమోహినీ ।
అష్టాంగయోగినీ దేవీ నిర్బీజధ్యానగోచరా ॥ 18 ॥
129. ఓం *యజ్ఞేశాన్యై* నమః
నామ
వివరణ.
యజ్ఞమునకు
ప్రభ్విణి అమ్మయే,
కం. *యజ్ఞేశానీ!* సమ్య
గ్విజ్ఞాననిధానమనుచు
విశ్వమునందున్
విజ్ఞులు
మెచ్చగఁ జేయుము
సుజ్ఞానము
కలుగఁజేసి, చూపుము సుగతిన్.
130. ఓం *ప్రధా*యై నమః ।
నామ
వివరణ.
సృష్టిలో
సుప్రసిద్ధ అమ్మ.
పంచ
చామరము
*ప్రధా!* ప్రసిద్ధవమ్మ నీవు భక్తిఁ గొల్చు వారికిన్
ప్రదాతవై
శుభాళి గొల్పి భవ్య జీవనమ్ముచే
సదా
ముదంబు గొల్పుచున్ బ్రశాంతినిచ్చు తల్లిగా
మదంబ
నీదు పుత్రుఁడేను, మంచిఁ గొల్పి
ప్రోవుమా.
131. ఓం *దీక్షా*యై నమః ।
నామ
వివరణ.
యజ్ఞాదులాచరించుటకు
స్వీకరించు దీక్షయే జనని.
ఉ. దీక్షను
బూని తీవు గణుతించుచు భక్తుల ముక్తి సాధనన్
శిక్షణ
నిచ్చి సత్ పథము చేర్చుదునంచును, నీదు సత్ కృపన్
రక్షణ
పొంది భక్తతతి రమ్య సుధామయ భక్తి తత్వమున్
*దీక్ష! * గ్రహించి తీరుదురు, దివ్యము నీదగు దీక్ష శ్రీ సతీ!
132. ఓం *దక్షిణా*యై నమః ।
నామ
వివరణ.
సృష్టికి
దక్షురాలుగా కలిగిన తల్లి,
అన్నిటా
నైపుణ్యము కలిగిన జనని.
తే.గీ.
దక్షురాలవు
నీవమ్మ
శిక్షణనిడ,
*దక్షిణా!* గొల్తు భక్తితో శిక్షణనిడి,
యక్షయంబగు
సుజ్ఞాన మందఁజేసి
యిహపరమ్ములఁ
గను వరంబిమ్ము కృపను.
133. ఓం *సర్వమోహిన్యై* నమః ।
నామ
వివరణ.
సృష్టిలోని
సమస్తమూ తానె అయి మోహమును కలిగించు తల్లి.
తే.గీ.
మోహమది
ముంచు నన్ను సందేహమేల?
*సర్వమోహినీ!* మోహపు గర్వమణచి
నన్ను
రక్షింపుమమ్మరో నయనిధాన!
నిన్నె
నమ్మితిన్ మొరవిను మన్ననమున.
134. ఓం *అష్టాఙ్గయోగిన్యై* నమః ।
నామ
వివరణ.
అణిమాది
అష్టాంగ యోగి మన జనని.
కం.
అష్టాంగ యోగ నిరతులు
కష్టంబును
గనరు నిన్ను గాంచుట కొఱకో
*యష్టాంగయోగినీ!*,నా
కష్టంబులు
బాపి కావఁగాఁ దగు నీకున్.
ఓం
*దేవ్యై* నమః.
కం.
*దేవీ!*
నీ కృపచేతను
శ్రీవిష్ణువు
దర్శనమగు చిత్తము మురియన్,
నీవే
మము గను తల్లివి,
జీవాత్మను
బ్రహ్మమందుఁ జేర్చుదు వీవే.,
ఓం *అష్టాఙ్గయోగినీదేవ్యై* నమః ।
కం. శ్రీవాణీ! నా జననీ!
నీవే *యష్టాంగయోగినీదేవీ*! నా
భావనలో విహరింతువు
సేవలనందుచును సతము చిత్తేజముతోన్.
ఓం *అష్టాఙ్గయోగినీదేవ్యై* నమః ।
తే.గీ.
తెలుపు *మష్టాఙ్గయోగినీదేవి*! నీన్ను
తెలిసి పూజించుటెట్టులన్, దీనరక్ష!
భక్తి భావంబు కలిగియు భక్తులు నిను
చూడలేకుండిరేలనో? చూడనిమ్ము.
135. ఓం *నిర్బీజధ్యానగోచరా*యై నమః ।
నామ
వివరణ.
(ధ్యానావ స్థిత తద్గ తేన మనసా ప శ్య o తి యం యోగినః అని భాగవతము) ఏకాగ్రత తో
కూడిన
తీవ్రమైన ధ్యాన స్థితి నిర్బీజ ధ్యానము. అట్టి
ధ్యానములోనున్న
సాధకులకు గోచరించు జనని.
కం.
ప్రగణిత *నిర్బీజ ధ్యా
నగోచరా!*
గాంతు నిన్ను, నా ధ్యానమునన్
నిగమాంత
సారమీవే,
నగుచున్
గనిపించుమమ్మ నా కన్నులకున్.
శ్లో.
సర్వతీర్థస్థితా శుద్ధా సర్వపర్వతవాసినీ ।
వేదశాస్త్రప్రభా దేవీ షడంగాదిపదక్రమా ॥ 19 ॥
136. ఓం *సర్వతీర్థస్థితా*
యై నమః ।
నామ
వివరణ.
అన్ని
తీర్థములయందూ ఉండునట్టితల్లి.
తే.గీ.
*సర్వ తీర్థ
స్థితా!*
నేను
చక్కగ
నిను
మనసులో
కనినంత సమస్త తీర్థ
సేవనా
ఫలమొదవును చిత్రమిదియె,
నిన్ను
భావింపనిమ్మింక సన్నుతముగ.
137. ఓం* శుద్ధా*యై నమః ।
నామ
వివరణ.
అత్యంత
శుద్ధముగానుండు జనని మన అమ్మ.
కం. *శుద్ధా!* భక్తి సమృద్ధిని,
శ్రద్ధను
నీపైన నాకు
చక్కగ
నిపుడే,
రాద్ధాంతము
చేయక నా
బుద్ధిని
కరుణించి నిలుపు,
ప్రోచుట
కొఱకై.
138. ఓం *సర్వపర్వతవాసిన్యై* నమః ।
నామ
వివరణ.
సమస్తమగు
పర్వతములపైననూ వసించు లోకమాత.మత్తకోకిల.
మ.కో. *సర్వపర్వత వాసినీ!* నిను చక్కగా మది నిల్పనా?
గర్వహీనుఁడనమ్మ!
నన్నిఁక కాంచవచ్చును చక్కగా
నిర్వివాదము
నీ కృపామతి, నీవె నన్నిఁక కాంచుమా,
సర్వరక్షణ
భారవాహిని! సన్నుతింతును నీదయన్.
139. ఓం
*వేద శాస్త్రప్రభా*(దేవ్యై)యై నమః
నామ
వివరణ.
వేదప్రకాశ
స్వరూపిణి యగు దేవి ఈ లోకమాత.
తే.గీ.
*వేద శాస్త్రప్రభా!* దేవి! విశ్వ వేద్య!
నీదు
ప్రభలతో కవితలన్ నిండనిమ్ము,
నీదు
ప్రభలను వర్ణింప నేను జాల,
వందనంబులు
చేసెద నందుకొనుము.
ఓం *వేదశాస్త్రప్రమాణ్యై* నమః
తే.గీ.
వేద శాస్త్ర ప్రమాణిగా విదితమీవు,
*వేద శాస్త్రప్రమాణి!*
నిన్ బోధఁ గలిగి ,
సాధనము చేయ లభియించు చక్కగాను
నీదు దర్శన భాగ్యమ్ము, నిశ్చయముగ.
ఓం
*దేవ్యై* నమః.
తే.గీ. *దేవి!* నీ పాద సన్నిధిన్ దివ్యమయిన
భావనంబులు
పొందుచు భవ్యమైన
కావ్యకర్తగా
నగుదును కరుణఁ జూపి
నీవె
కావ్యమై వెల్గుమా, నీరజాక్షి!
140. ఓం *షడఙ్గాదిపదక్రమా*యై నమః ।
నామ
వివరణ.
శిక్ష,
నిరుక్తి, ఛందస్సు, జ్యోతిషము, వ్యాకరణము, కల్పకము, అను
షడంగములను
క్రోడీకరించు జనని.
ఉ.
వేద పవిత్ర తేజ! సుమపేశల సన్నుత దేహవౌ *షడ
ఙ్గాదిపదక్రమా!*
శరణు,
కంజదళాయత నేత్ర! యీ షడ
ఙ్గాదిపదక్రమం
బెఱుఁగ, కాంచగ నేర షడంగ సారమౌ
నీదగు
దివ్య తేజమును, నీవె కనంబడు చిత్త భాసివై.
శ్లో.
శివా ధాత్రీ శుభానందా యజ్ఞకర్మస్వరూపిణీ ।
వ్రతినీ మేనకా దేవీ బ్రహ్మాణీ బ్రహ్మచారిణీ ॥ 20 ॥
141. ఓం
*శివా*యై నమః.
నామ
వివరణ.
శుభములను
క్లుఁగఁజేయు జనని శివా మన అమ్మ.
తే.గీ.
వర
శివానందమున్ *శివా!* భక్తులకును
గొలిపి
సంతోషమొప్ప నిన్ గొలువనిమ్మ.
నిన్ను
పూజించి తరియింతు సన్నుతముగ,
వందనంబులు
చేసెద నందుకొనుము.
142. ఓం *ధాత్ర్యై* నమః ।
నామ
వివరణ.
సమస్తమును
ఇచ్చు జనని.
కం. *ధాత్రీ!* మాతవు
నీవే
ధాత్రీమాతవును
నీవె దయ కల తల్లీ!
యాత్రముతో
కోరెదను ప
విత్రా!
నిను, గనబడుమిక వేగమె నాకున్.
ఓం
*శివాధార్త్యై* నమః.
తే.గీ.
ఓ
*శివా ధాత్రి!* కాశీ మహోత్తమమగు
పురివి తలపన్! గృపాసాంద్ర! పూజ్యపాద!
శుభములను గొల్ప నాలోననభయదవయి
యున్న నిన్ గొల్తు నమ్మరో కన్నతల్లి!
143. ఓం *శుభానన్దా*యై నమః ।
నామ
వివరణ.
శుభములతో
ఆనందముగా ఉం డు జనని.
కం. దయఁ
గనుమ *శుభానందా*!
జయమార్గమునందు
నడిపి చక్కగ నన్నున్
లయయుత
పద్య సుకవిగా
ప్రియమున
నొనరించుమమ్మ వేడెదనిన్నున్.
144. ఓం *యజ్ఞకర్మస్వరూపిణ్యై* నమః ।
నామ
వివరణ.
యజ్ఞకర్మలయొక్క
స్వరూపము అమ్మ.
తే.గీ.
*యజ్ఞకర్మస్వరూపిణీ! * యమర వినుత
వాత్మలో
యజ్ఞసత్కర్మ నమరఁజేసి
యజ్ఞ
ఫలితంబునందించి యనుపమముగ
నీవె
సతతంబు నిలు మదిన్ నీరజాక్షి!
145. ఓం *వ్రతిన్యై* నమః ।
నామ
వివరణ.
తపస్సు
చేయు తల్లి
కం. *వ్రతినీ!* వ్రతములనెఱుగను,
మతిమంతులలోన
నిన్నుమాత్రమె కనుదున్
స్తుతమతివి
కానరావా?
యతులితప్రజ్ఞా
విభూతినందించంగన్.
146. ఓం *మేనకా*యై నమః ।
నామ
వివరణ.
మేన
కుమార్తె మన జనని.
కం. సారసనేత్రా!
*మేనక!*
తీరుగ
నిను కొలుతునమ్మ దీవించు ననున్,
శ్రీ
రమణీ! నా మదిలోఁ
గోరుచు
వసియింపుమమ్మ కూర్మిని జననీ!
ఓం
*దేవ్యై* నమః.
తే.గీ.
దేవివే
కాదు మా దివ్య భావివీవు,
సత్యసన్ముక్తి,
సద్భావి, సదయనొసగు
దివ్య
దేవతా నిన్ను మదిన్ స్మరింతు,
వందనంబులు
చేసెద నందుకొనుము.
147. ఓం *బ్రహ్మాణ్యై* నమః ।
నామ
వివరణ.
బ్రహ్మ
యొక్క శక్తి మన అమ్మ.
కం. శరణము
*బ్రహ్మాణీ!*
నీ
స్మరణము
విజయాక్షరఫల మార్గము కనగన్,
సరిరారెవ్వరు
నీకిల,
భరమా
ననుఁ గావ నీకు? బ్రహ్మానందా!
148. ఓం *బ్రహ్మచారిణ్యై* నమః ।
నామౌచిత్యము.
బ్రహ్మధ్యాన
నిమగ్న మన అమ్మ.
తే.గీ.
*బ్రహ్మచారిణీ!*
సృష్టియె బ్రహ్మమయము,
జీవుఁడాబ్రహ్మమును
జేరు భావముననె
బ్రహ్మమున
జీవమైక్యమౌన్ ప్రకృతివీవె
బ్రహ్మచారిణివై
యొప్పు బ్రహ్మమీవె.
శ్లో.
ఏకాక్షరపరా తారా భవబంధవినాశినీ ।
విశ్వంభరా ధరాధారా నిరాధారాఽధికస్వరా ॥ 21 ॥
149. ఓం *ఏకాక్షరపరా*యై నమః ।
నామ
వివరణ.
ఓం
అనెడి ఏకాక్షరమే పరముగా కలిగిన తల్లి.
కం. *ఏకాక్షర
పర!*
నీ పతి
లోకేశుఁడు
నిన్ భజించి లోకము లేలున్,
శ్రీకారమైన
చుట్టడు
నీకృపయే
లేనినాడు, నిశ్చయమమ్మా.
150. ఓం *తారా*యై నమః
నామ
వివరణ.
దుఃఖ
సాగరమునుండి సాధకులను తరింపఁజేయు తల్లి.
కం. తారాడునాకసమ్మునఁ
దారలనంతముగ
నుండి ధాత్రికి వెలుగౌ
తారవు
నీవేనమ్మా!
*తారా*
నను బ్రోవుమమ్మ ధన్యుఁడనగుదున్.
151. ఓం *భవబంధవినాశిన్యై* నమః ।
నామ
వివరణ.
ఐహిక
భవ బంధములనునశింపఁ జేయు తల్లి మన అమ్మ.
ఉ. బంధనఁ
జిక్కినాము *భవబంధవినాశిని!
మాదు బంధముల్
ముందుగ
త్రుంచు తల్లివి ప్రమోదముతోడ, దయా స్వరూపిణీ!
కుందుచునుంటి
నేను నిటఁ గోర్కెలతో భవబంధనంబుచే
నెందుకుపేక్ష
చేసెద వహీన దయామతిఁ బాపు బంధముల్.
152. ఓం *విశ్వమ్భరా*యై నమః ।
నామ
వివరణ.
విశ్వముయొక్క
సమస్త భారమును భరించు జనని మన అమ్మ.
అశ్వధాటి.
*విశ్వంభరా*!
మదిని విశ్వాసమున్ గొలిపి శశ్వచ్ఛుభంబరయనీ,
విశ్వేశ్వరీ!
కృపను నాశ్వాసవై నిలిచి విశ్వంబునన్ నిలిపితే,
విశ్వప్రసిద్ధమగు
విశ్వేశు గాధలను శశ్వత్ ప్రభన్ గొలువనీ,
విశ్వాత్మ
నీవె కద, విశ్వాస మొప్ప కృతి నశ్వోద్ధతిన్ గొలుపనీ
153. ఓం *ధరాధారా*యై నమః ।
నామ
వివరణ.
ధర్కు
ఆధారమయిన తల్లి.
కం. జగమేలు
*ధరాధారా! *
నిగమాంత
సువేద్య! మదిని నిన్ను నిలుపనీ.
మొగమాటమేల
కావగ
నగుమోమున
మదిని నిలిచి నను గావగదే.
154. ఓం *నిరాధారా*యై నమః ।
నామ
వివరణ.
ఆధారము
లేని స్వావలంబ మన జనని.
సీ. ఆధార
మీవే *నిరాధార!*
మాకున్, సు రాధీశ్వరీ! రమ్ము! హరిణ నేత్రి!
మేధావులున్
నిన్ బ్రమోదంబుతో నెంచి, ప్రార్థింతురధ్యాత్మ! ప్రకృతివంచు,
ఖేదంబుఁ
బాపన్ ప్రమాదంబులన్ బాప మాదైవమైనిల్చి మమ్ముఁ గనెడి
నీదౌ
కృపన్ గాంచ బోధన్ మదిన్ గొల్పు దీవేకృపాసాంద్ర భావనమున,
తే.గీ.
నీదు
కృపనెంచగానౌనె మోదమునను
బాధలను
బాపి కాపాడు భవ్య తేజ!
శ్రీధరుండును
నిన్ గొల్చు చిత్తమలర,
నో
దయానిధీ! నా మదినుండుమమ్మ.
155. ఓం *అధికస్వరా*యై నమః ।
నామ
వివరణ.
స్వరమునకు
మించిన అధిక స్వర మన అమ్మఽమ్మను స్వరరూపమున
వర్ణింపశక్యము
కాదు.
కం. అధికస్వర
మోంకారం
*బధికస్వర*!
యదియు నీవె యరయగ సృష్టిన్,
మధురంబగు
ప్రణవస్వర
సుధనంబుగ
మదిని నిలుము,
శోభిల
నేనున్.
శ్లో.
రాకా కుహూరమావాస్యా పూర్ణిమాఽనుమతిర్ద్యుతిః ।
సినీవాలీ శివాఽవశ్యా వైశ్వదేవీ పిశంగిలా ॥ 22 ॥
156. ఓం *రాకా*యై నమః ।
నామ
వివరణ.
పూర్ణిమ
చంద్రుడు మన అమ్మయే.
కం. *రాకా!* నిన్నే నమ్మితి,
రా
కావగ నన్నునిపుడె, రమ్యా! కృతికిన్
శ్రీకారముగా
నిలుము శు
భాకారవు
కావ్యమునకు భాస్వన్మణివై.
157. ఓం *కుహ్వే* నమః ।
నామ
వివరణ.
అమావాస్య
రోజున దేవత మన అమ్మ.
చం. వినుత
కుహూరవంబగుచు వీనుల విందుగ నుందువో *కుహూ!!*
ఘనతరమౌ
మహోంకృతికి కమ్మగ నిల్చు ప్రతిధ్వనిప్రభన్
మనములలోన
నిల్చి మము మన్ననఁ గాంచు నమాస దేవి! యే
మని
నిను సన్నుతింపనగు? హాయిగ నా యెద నుంచెదన్ సదా.
158. ఓం *అమావాస్యా*యై నమః ।
నామ
వివరణ.
అమావాస్య
అమ్మయే.
సీ. భయము
గొల్పెడి యమావాస్యాంధకారాననలమటించుచునుండ
ననుపమముగ
మానస
వీధిలో మహనీయమౌ *యమావాస్య! * మాతగ నిల్చి భయము వాపి,
తేజోమయంబుగా దీపించు
నిన్ గొల్చి నా జీవితమున ఘనముగ నిలుతు,
ప్రార్థింతు
నిన్ మదిన్ భాసింపుమంచును ప్రఖ్యాతినే గొల్ప పద్యములకు
తే.గీ.
నీవమావాస్యవయియున్న
నిండు జాబి
లివిగ
నిజముగ నా మదిన్ గవన గతిని
శాశ్వతంబుగా
వెలిగెడి సత్య రూప!
వందనంబులు
చేసెద నందుకొనుము.
159. ఓం *పూర్ణిమా*యై నమః ।
నామ
వివరణ.
పూర్ణిమ
అమ్మయే.
కం. నిలుతువు
మది పూర్ణిమగా!
కొలుతును
నిను నీవు చూపు కూర్మిని కనుచున్,
నిలుపుము
ప్రజలను *బూర్ణిమ! *
సలలితపదపద్యములను
చక్కగఁ మనుచున్.
160. ఓం *అనుమత్యై* నమః
నామ
వివరణ.
ప్రేరణఁ
గొలిపి సాధన కొఱకు అనుమతినిచ్చు తల్లి,
కం. అనుమతినిమ్ము
రచింపగ
*ననుమతి! * నీ పయిన కవిత ననుపమరీతిన్
వినయముతో
వినిపించెద
ఘనతరముగ
నిన్ను నేను కాదనకమ్మా.
161. ఓం *ద్యుత*యే నమః ।
నామ
వివరణ.
అమ్మ
కాంతి స్వరూపిణి.
చం. అమిత
భవాంధకారమున నద్భుతమౌ ద్యుతి వీవెగా *ద్యుతీ!*
యమలిన
సాధనాపటిమ నందగఁ జేయ కృపార్ణవంబనన్
బ్రమదముతోడ
వెల్గెదవు భవ్యముగా వెలుగొంద నా మదిన్,
సుమధుర
భావపూర్ణమగు సూనృత సత్పద జాల మీవెగా.
162. ఓం *సినీవాల్యై* నమః ।
నామ
వివరణ.
చంద్రకళ
కానవచ్చెడి అమావాస్య ముందురోజు, బహుళచతుర్ధశి. అమ్మయే.
కం. భవబంధాంధపు
నా మది
ని
వసించుచు వెలుగులీను నిర్మల తేజా!
నివసించు
*సినీవాలీ! *
కవితామృతమై
వెలుగుము కారుణ్యముతో.
ఓం *శివా* యై నమః
తే.గీ.
నీ
శివాకారమున్ జూచి నేను పొంగి
కవిత
లొలికింతునా *శివా!* ప్రవరముగను,
చెంతనే
యుండి వ్రాయించు చింత తీర్చు.
వందనంబులు
చేసెదనందుకొనుము.
163. ఓం *అవశ్యా*యై నమః ।
నామ
వివరణ.
ఎట్టి
వారికినీ వశము కాని అవశ్య మన అమ్మ.
తే.గీ.
వశ్యవయినట్లు
తోచు నవశ్యవీవు,
వశ్యమగుదును
నీకు *నవశ్య* నిజము,
దృశ్యమగునవి
భ్రమలే యదృశ్యవీవె
శాశ్వతమ్మగు
శక్తివి, సదయగనుమ.
ఓం
*వశ్యా*యై నమః.
తే.గీ.
*వశ్య! * సన్మార్గమును నా కవశ్యమిడుము
పశ్యమానవై కృపఁగను పరవశింతు,
నీకు పుణ్యంబు నన్ గన్న నిరుపమాన!
వందనంబులు చేసెద నందుకొనుము.
164. ఓం *వైశ్వదేవ్యై* నమః ।
నామ
వివరణ.
విశ్వదేవతల
రూపము అమ్మయే.
తే.గీ.
*వైశ్వదేవీ! * ప్రభా పూర్ణ! విశ్వమునను
నీవె
సృష్టించి నాశన మీవె చేసి
మరలసృష్టించుటేలను?
మర్మమెఱుగ
నమ్మ
తెలుపుము నాకుననంత విభవ!
165. ఓం *పిశఙ్గిలా*యై నమః ।
నామ
వివరణ.
మృదువగు
శరీరముతో ప్రకాశించు జనని.
కం. పుత్తడివో
యిత్తడివో
లత్తుకవో
కన *పిశఙ్గిలా! * నీవరయన్,
క్రొత్తగనుందువు
సతతము
మత్తనువున
నీవు జనని!
మహిమాన్వితవై.
శ్లో.
పిప్పలా చ విశాలాక్షీ రక్షోఘ్నీ వృష్టికారిణీ ।
దుష్టవిద్రావిణీ దేవీ సర్వోపద్రవనాశినీ ॥ 23 ॥
166. ఓం *పిప్పలా*యై నమః ।
నామ
వివరణ.
త్రిమూర్తి
స్వరూపమగు (అశ్వత్థ)పిప్పల(రావి) వృక్షము అమ్మయే.
తే.గీ.
కన్న
తల్లిగ *పిప్పలా*!
కాతువీవు
మన్ననముతోడ
తోడుండి మనుజులనిల
చిన్ననాడీవె
నన్ జేరి మన్ననముగ
శక్తి
నిచ్చియు నేటికిన్ జయద వయితి.
167. ఓం *విశాలాక్ష్యై* నమః ।
నామ
వివరణ.
సువిశాల
నేత్ర సంభాస మన అమ్మ.
తే.గీ.
చింత
లేదమ్మ నేను నీ చెంతనున్న
నో
*విశాలాక్షి! * నామది నుండుమమ్మ,
నీ
విశాలనేత్రప్రభ నిత్యము మది
నింపుకొందును
కృపతోడ నీవె కనుమ.
168. ఓం *రక్షోఘ్న్యై* నమః ।
నామ
వివరణ.
రాక్షసులను
స్ంహరించు జనని మన అమ్మ.
కం. *రక్షోఘ్నీ! * నా మదిలో
రక్షోగణమే
మెదలు పరంబును గననీ
వక్షీణ
దయామతి! నన్
రక్షింపుము
వీటి నుండి ప్రాణ ప్రదవై.
169. ఓం *వృష్టికారిణ్యై* నమః ।
నామ
వివరణ.
వర్షమునకు
కారణమగునది మన అమ్మయే.
కం. సృష్టించితి
వీసృష్టిని
వృష్టిని
కల్పించి నావు
పృథ్విని
పంటల్
తుష్టుగపండఁగఁ
జేయగ,
నిష్టముతో
*వృష్టి
కారిణీ! *నినుఁగొలుతన్.
170. ఓం *దుష్టవిద్రావిణ్యై* నమః
నామ
వివరణ.
చెడ్డవారిని
తరిమి కొట్టు జనని మన అమ్మ.
తే.గీ.
*దుష్ట విద్రావిణీ!* నాదు దురిత గతిని
నీవె
పాపుమా రక్షింప నీరజాక్షి!
దుష్ట
సంహారిణీ!
కృపన్ దోచి మదిని,
కాచి
రక్షింపుమమ్మరో కరుణఁ జూపి.
ఓం
*దేవ్యై నమః.
తే.గీ.
దేవలోకంబు
గొలిపెడి *దేవి!* నిన్ను
భావనంబున
సేవింతు భక్తితోడ,
నీవె
నాకింక రక్షణ, నిరుపమాన!
వందనంబులు
చేసెద నందుకొనుము.
ఓం *దుష్టవిద్రావిణీదేవ్యై* నమః
తే.గీ.
*దుష్టవిద్రావిణీదేవి*! శిష్ట రక్ష!
మానసంబున నీవుండి మహిమఁ జూపి
దుష్టచింతనలెడఁబాపి శిష్టభావ
పూర్ణునిగ నన్నుఁ జేయుచుఁ బ్రోవుమమ్మ!
171. ఓం *సర్వోపద్రవనాశిన్యై* నమః ।
నామ
వివరణ.
సమస్తమగు
ఉపద్రవములను నశింపఁజేయు జనని.
శా. *సర్వోపద్రవ నాశినీ!* కనుమిటన్ జ్ఞానార్జనా దృష్టితో
సర్వంబీవ
యటంచు నిన్నె గనుచో సర్వత్ర నా కిత్తరిన్
సర్వోపద్రవరాశి
యడ్డమగుటన్, సాధింప లేకుంటినే,
సర్వోపద్రవముల్
విడన్ గనుమ, భాషా యోష! నిన్ గొల్చెదన్.
శ్లో.
శారదా శరసంధానా సర్వశస్త్రస్వరూపిణీ ।
యుద్ధమధ్యస్థితా దేవీ సర్వభూతప్రభంజనీ ॥ 24 ॥
172. ఓం *శారదా*యై నమః ।
నామ
వివరణ.
జ్ఞానమును
ఇచ్చు తల్లి మన అమ్మ.
తే.గీ.
*శారదా*! మాత!
నిన్ గొల్తు చక్కగాను,
చక్కనైనట్టి
పదములన్ సరగుననిడి
నిన్ను
వర్ణింపనీయుమా నేర్పు మీర,
వందనంబులు
వాణి! నీవందుకొనుము.
173. ఓం *శరసన్ధానా*యై నమః ।
నామ
వివరణ.
శరములను
సంధించు తల్లి మన అమ్మ.
తే.గీ.
చూడు
మో *శరసంధాన!* చుట్టిముట్టి
యాత్మలోనున్న
శత్రువులందరినిఁక
శరముఁ
బట్టి యడంచుమా, సంస్తుతముగ,
నిన్ను
దర్శింపనీయుమా నిక్కముగను.
174. ఓం *సర్వశస్త్రస్వరూపిణ్యై* నమః ।
నామ
వివరణ.
సమస్తమగు
శస్త్రముల స్వరూపమూ అమ్మయే.
తే.గీ.
*సర్వ శస్త్ర
స్వరూపిణీ!
* చంద్రవదన!
శత్రుషట్కమున్,
బాపుమా! సన్నుతముగ,
నిన్ను
దర్శింపఁగలిగెడి నేర్పునిమ్మ!
నిన్ను
చేరంగనగు నాకు నిక్కముగను.
175. ఓం *యుద్ధమధ్యస్థితా*యై నమః ।
నామ
వివరణ.
యుద్ధము
మధ్యలో ఉండు జనని మన అమ్మ.
తే.గీ.
*యుద్ధమధ్యస్థితా!* యాత్మశుద్ధినొసఁగు
మాత్మలోయుద్ధరంగాన
నలసి యున్న
నన్నుకాపాడుమమ్మరో!
మన్ననమున
నోపలేనింక
నీవె నా కాపువమ్మ.
ఓం
*దేవ్యై* నమః.
తే.గీ.
*దేవి!
* నిన్
గొల్చెదన్ నాకు దీవనలిడు,
భక్తి
భావంబు మనసులో ప్రబలనిమ్ము,
యుక్తినే
గొల్పి భువిపైననుండనిమ్ము,
వందనంబులు
చేసెదనందుకునుము.
ఓం *యుద్ధమధ్యస్థితాదేవ్యై*
నమః ।
తే.గీ.
*యుద్ధమధ్యస్థితాదేవి*! యుక్తినిమ్మ,
నిన్ను మనమున నిరతంబు నిలుపనిమ్మ,
యాత్మలో యుద్ధమాపుమా యహము పాపి
నీవె నిజమని బోధించి నిలుము మదిని.
176. ఓం *సర్వభూతప్రభఞ్జన్యై* నమః ।
నామ
వివరణ.
అన్ని
భూతములను మిక్కిలి నశింపఁజేయు తల్లి మన అమ్మ.
తే.గీ.
*సర్వభూత ప్రభంజనీ! * సదయ నీవు
భూత
తతినుండి కావుమా, ఖ్యాతిగ నను,
నిన్నె
నిత్యమున్ గొలుచుచునున్నవాఁడ,
నీవెనాలోన
నుప్పొంగు భావమమ్మ
శ్లో.
అయుద్ధా యుద్ధరూపా చ శాంతా శాంతిస్వరూపిణీ ।
గంగా సరస్వతీవేణీ యమునా
నర్మదాపగా ॥ 25 ॥
177. ఓం *అయుద్ధా*యై నమః ।
నామ
వివరణ.
యుద్ధ
రహిత మన అమ్మ.
తే.గీ.
యుద్ధబాహ్యా!
*యయుద్ధా! మహోపకార
మగును
యుద్ధముల్ నిలిపిన ననుపమముగ
శాంతి
సౌభాగ్యదాయినీ సన్నుతింతు
నాత్మలన్
యుద్ధయోచనలాపుమమ్మ.
178. ఓం *యుద్ధరూపా*యై నమః ।
నామ
వివరణ.
యుద్ధరూపము
అమ్మయే.
తే.గీ.
*యుద్ధరూపా*!
దురాచారబద్ధులిలను
శాంతి
మార్గమున్ విడనాడి చంపుకొనుటె
మార్గముగఁ
జేసియుండిరి, మాపుమమ్మ!
ధర్మబాహ్యులన్
దురితులన్, దండనమున.
179. ఓం *శాన్తాయై* నమః ।
నామ
వివరణ.
శాంతమనే
స్వభావము అమ్మయే.
తే.గీ.
శాన్తి
యొక్కటె ప్రగతికి చక్కనయిన
మార్గమగుటను
*శాన్త!*
సన్మార్గమందు
నడువనెంచితి
శాన్తినే నడుపుమమ్మ.
నాదు
మదిలోన నీవుండి నయ నిధాన.
180. ఓం *శాన్తిస్వరూపిణ్యై* నమః
నామ
వివరణ.
శాంతికి
రూపము అమ్మయే.
తే.గీ.
నిఖిల
*శాన్తిస్వరూపిణీ!*
నీవె యుండి
పాపు
మీవే యశాన్తిని పన్నిదముగ
నీదు
భక్తులు నిన్ గొల్త్రు నిత్యముగను
శాన్తి
సౌభాగ్య వర్ధనన్, సదయ గనుమ.
181. ఓం *గఙ్గా*యై నమః ।
నామ
వివరణ.
గంగామాత
అమ్మయే.
కం. *గంగా*!
దేవీ!
నిను గని
పొంగునటుల
పాపముడిపి ముక్తిదవగుమా,
బెంగలలోకమునందున
నెంగిలిపడు
బ్రతుకదేల నేర్పడచెపుమా.
182. ఓం *సరస్వత్యై* నమః ।
నామ
వివరణ.
సరస్వతీ
మాత అమ్మయే.
ఉ. జ్ఞాన
సుధాస్రవంతిగ ముఖంబుల వెల్గెడి యో *సరస్వతీ*!
ధీనిధులైన
పెద్దలు మదిన్ నినుఁ గొల్చెడి భాగ్యవంతులై
జ్ఞానముఁ
గొల్పు భక్తిని, ప్రకాశము చేయుచు సజ్జనాళిలో
మానిత
మూర్తులౌదురిట మన్ననలందుచు నీదు సత్కృపన్.
183. ఓం *వేణ్యై* నమః ।
నామ
వివరణ.
కృష్ణవేణి
అమ్మయే.
కం. *వేణీ!*
నాలో నీవే
జ్ఞానముగా
నురకలిడుచు కవితా రీతిన్
మౌనముగా
ప్రవహింతువు,
నేనున్
నిన్ననుసరించి నిలుచుదునమ్మా.
184. ఓం *యమునా*యై నమః ।
నామ
వివరణ.
యమునా
స్వరూపము అమ్మయే.
కం. *యమునా!* జననిగఁ బ్రజలను
సముచితముగ
కాచుచున్న చక్కని తల్లీ!
ప్రమదముతోడ
భజింతును
సముదంచిత
కవన ధార జయదా! యిమ్మా.
185. ఓం *నర్మదా*యై నమః ।
నామ
వివరణ.
నర్మదా
స్వరూపము అమ్మయే.
తే.గీ.
*నర్మదా!*
దయఁ జూపి నన్ నడుపుమమ్మ,
నర్మగర్భంపు
సత్కల్పనా కవిత్వ
ధారలందించి
పలికించు తరళ నయన!
వందనంబులు
చేసెద నందుకొమ్మ.
186. ఓం
*అపగా*యై నమః.
నామ
వివరణ.
నీరుగా
ప్రవహించు గంగామాత అమ్మయే.
తే.గీ.
*అపగ!*
జ్ఞానామృతంబు నాకందఁజేసి
యపగగా
లోన వెల్గు నిన్నరయ నిమ్ము,
ప్రపవు
ముక్తిదాహార్తుల కుపకరించు
జ్ఞానజలము
నందించుచు కాచెదవుగ.
శ్లో.
సముద్రవసనావాసా బ్రహ్మాండశ్రేణిమేఖలా ।(శ్రోణి)
పంచవక్త్రా దశభుజా శుద్ధస్ఫటికసన్నిభా ॥ 26 ॥
187. ఓం *సముద్రవసనావాసా*యై నమః ।
నామ
వివరణ.
సముద్రమనెడి
వస్త్రమునే ఆవాసముగా కలిగిన తల్లి.
కం. అసమానవు!
ధీ జలధిని
వసనముగా
కల *సముద్రవసనావాసా!*
వసుధను
నీ సేవకునిగ
రసరమ్య
కవిత్వ ఖనిగ ప్రబలింపుము నన్.
188. ఓం *బ్రహ్మాణ్డశ్రేణిమేఖలా*యై నమః ।
నామ
వివరణ.
విశ్వశ్రేణిని
మొలత్రాడుగా కలిగిన జనని.
కం. బ్రహ్మజ్ఞానాసక్తుల్
*బ్రహ్మాణ్డశ్రేణిమేఖలా!*
నినుఁ గనినన్
బ్రహ్మజ్ఞానము
కలుగును,
బ్రహ్మజ్ఞానంబు
నాకుఁ బట్టుగ నిమ్మా.
189. ఓం *పఞ్చవక్త్రా*యై నమః ।
నామ
వివరణ.
విశాలమయిన
ఐదు ముఖములు కలిగిన జనని.
పంచచామరము.
విశాలపంచవక్త్రవమ్మ!
విశ్వశాంతిఁ గొల్పుమా.
విశిష్ట!
*పఞ్చవక్త్ర!*
నీకు ప్రీతినంజలించెదన్,
ప్రశాంత
చిద్విరాజమాన భవ్య భావన ప్రభల్
ప్రశస్తిగానొసంగుమా, నిరంతరంబు
గొల్చెదన్.
190. ఓం *దశభుజా*యై నమః ।
నామ
వివరణ.
పది
భుజములు కలిగిన తల్లి మన అమ్మ.
కం. దశదిశలన్
భుజములుగా
*దశభుజ!* నీవొప్పుచుండి ధరియించితె యీ
నశియించు
దేహమందున
నశియింపని
నీవు కలిగి నన్ గృపఁ గనితే.
191. ఓం *శుద్ధస్ఫటికసన్నిభా*యై నమః
నామ
వివరణ.
స్వచ్ఛమయిన
పటిక్వలె శుద్ధమయినది మన అమ్మ.
కం. ఆశలు
చెలరేగుచు నా
శ్రీశునిపై
ధ్యాసఁ దప్పఁజేయుచునుండెన్,
శ్రీ
శక్తీ! కావగ రా
వా!
*శుద్ధస్పటిక సన్నిభా!* ననుఁ బ్రోవన్
శ్లో.
రక్తా కృష్ణా సితా పీతా సర్వవర్ణా నిరీశ్వరీ ।
కాళికా చక్రికా దేవీ సత్యా తు వటుకాస్థితా ॥ 27 ॥
192. ఓం *రక్తా*యై నమః ।
నామ
వివరణ.
భక్తులయెడ
అనురక్తి కలిగిన జనని. రక్తముగ మనలో నుండు జనని. ఎఱుపు
వర్ణముతో
ప్రకాశించు తల్లి.
కం. *రక్తా!* భక్తిగ ని న్నను
రక్తుఁడనై
కొలుతునమ్మ! రమ్య గుణాఢ్యా!
భక్తుల
కల్పకమీవే,
భుక్తిని
ముక్తిని నొసగుచుఁ బ్రోవుము జనులన్.
193. ఓం *కృష్ణా*యై నమః ।
నామ
వివరణ.
నలుపు
రంగుతో ప్రకాశించు జనని.
తే.గీ.
కృష్ణ
నామంబు జపియింపఁ గీడు తొలఁగు,
కృష్ణ
రూపంబు గాంచినన్ దృప్తి కలుగు,
*కృష్ణ!* నీవు దీవించ సత్కృతియె కలిగి
విష్ణు
సాయుజ్యమొదవును విదితముగను.
194. ఓం *సితా*యై నమః ।
నామ
వివరణ.
తెల్లని
వర్ణముతో ప్రకాశించు జనని.
తే.గీ.
అంబుజాసనవు
*సిత!*నీ వమర మదిని
కోరికలు
కడఁదేరెడునేరికైన,
సిత
మహద్జ్ఞాన సముపేత! భూతలాన
ననఘవిజ్ఞానమందించుమతులితముగ.
195. ఓం *పీతా*యై నమః ।
నామ
వివరణ.
బంగారు
రంగుతో ప్రకాశించు జనని.
తే.గీ.
*పీత!*
నీ వర్ణమే నాకు ఖ్యాతి గొలుపు,
కాంతినొప్పెడి
ముక్తిపై భ్రాంతిఁ గొలుపు,,
శాంతచిత్తంబె
పుత్తడి, చక్కనైన
క్రాంతిమార్గంబు
చూపించు ఘనతఁగొలుపు.
196. ఓం *సర్వవర్ణా*యై నమః ।
నామ
వివరణ.
అన్ని
వర్ణములూ అమ్మయే.
తే.గీ.
*సర్వవర్ణా!*
శుభాకార! సగుణ సాక్షి!
సర్వ
వర్ణంబులైన ప్రశాంతరూప!
నిన్ను
సేవింప శుభదవై నన్నుఁ గాచి
ముక్తి
సన్మార్గమునుఁజేర్పఁ బూనుదువుగ,
197. ఓం *నిరీశ్వర్యై* నమః ।
నామ
వివరణ.
అమ్మ
నిరీశ్వరి. అమ్మయే ఈశ్వర స్వరూపము.
తే.గీ.
ఈశ్వరివి
నీవె, యీశ్వరుఁడేలనీకు,
నో
*నిరీశ్వరీ!*సృష్టినే
జ్ఞాన
మతిని
సృష్టి
చేసెడి తల్లివి దృష్టి పెట్టి,
నన్ను
నడిపింపుమమ్మరో! సన్నుతముగ.
198. ఓం *కాలికా*యై నమః ।
నామ
వివరణ.
భయంకరమగు
కాలికా స్వరూపిణి అమ్మయే.
తే.గీ.
కాలికాదేవివీవు,
సత్ కావ్య రచనఁ
జేయఁ
జేయుము నాచేతఁ జేవతోడ,
దుష్టభావాళిఁ
బాపి నీ త్రోవలోన
నడుపుమా
నన్ను *కాళికా!* విడువకమ్మ.
199. ఓం *చక్రికా*యై నమః ।
నామ
వివరణ.
శ్రీచక్రమున
నుండు జనని. చక్రధారిణి మన అమ్మ, చక్రస్థుఁడగువానికి సంబంధించినది
మన
జనని చక్రిక.
తే.గీ.
మహిత
శ్రీచక్ర మందుండి మన్నన నిల
వెలుగు
శ్రీచక్రికా! నిన్నుఁ గొలుతునమ్మ,
నా
మనోభావనల్ గాంచి నన్ను గాచు
నిన్ను
ప్రార్థింతు, చేకొను నిరుపమముగ.
ఓం *దేవ్యై* నమః ।
నామ
వివరణ.
దేవత్వముతో
నొప్పారు జనని మన అమ్మ.
కం. *దేవీ!* నీ ప్రాభవమును
భావించగఁ
జాల నేను, భద్రతఁ గొలుపన్
నీవన్నను
నాకిష్టము,
నీవే
నను గావుమమ్మ
నిత్యంబిలపై.
ఓం *చక్రికాదేవ్యై* నమః ।
తే.గీ.
*చక్రికాదేవి*! నాలోని వక్రబుద్ధి
నీవు కల్పించినది కాదు, నిన్ను గనక
వక్రతనుబొందె, పాపుమీ వక్ర బుద్ధి.
నీవె సక్రమముగ మదిన్ నిలుము జనని!
200. ఓం *సత్యా*యై నమః
నామ
వివరణ.
సత్యము
యొక్క స్వరూపిణి మన అమ్మ.
కం. *సత్యా!* నిన్ గొలిచెద నౌ
న్నత్యంబును
గొలుపుమమ్మ, నన్నిలఁ గనుచున్
నిత్యము
నే నివసించెద,
నిత్యత్వముఁ
గొలుపు నాకు నిర్మల రూపా!
201. ఓం *వ(బ)టుకా*యై నమః ।
నామ
వివరణ.
అమ్మ
బ్రహ్మచారిణి నిరంతరము బ్రహ్మమున చరించుచు ఆమెయే బ్రహ్మముగా సృష్టి
మూలమయిన
జనని.
కం. *వ(బ)టుకా! * యెప్పుడదెచ్చట
నెటునేర్చితొబ్రహ్మచర్య
మేవిధి నాకున్
పటువుగ
నేర్పుదొ?, కావలె
నిటలాక్షుఁడు
మెచ్చ నేర్తు నీకృప యున్నన్.
202. ఓం *స్థితా*యై నమః ।
నామ
వివరణ.
సృష్టిల్
ఏదయినా ఉన్నదనుచు ఉన్నచో అది అమ్మయే. కావున అమ్మ స్థిత.
తే.గీ.
స్థిరత లేదమ్మ
మనసున కరసి నీవు
స్థిరతఁ
గలిగించి మీవైపుచేర్చుకొనుము,
*స్థిత*! మనంబందు నీవున్న శ్రుతులవేల?
పరమదొక్కటే
చాలును పంచవదన.
శ్లో.
తరుణీ వారుణీ నారీ జ్యేష్ఠాదేవీ సురేశ్వరీ ।
విశ్వంభరాధరా కర్త్రీ గళార్గళవిభంజనీ ॥ 28 ॥
203. ఓం *తరుణ్యై* నమః ।
నామ
వివరణ.
అమ్మ
నిత్య యౌవన.
తే.గీ.
తరుణమిదె
ననుఁగావగ *తరుణి! * కృపను
పరమనోహర
మార్గాన వరలఁజేసి
నిరుపమానందసామ్రాజ్య
నేతగ నను
చేయుమోయమ్మ
కృపఁ జూపి చిద్విభాస.
204. ఓం *వారుణ్యై* నమః ।
నామ
వివరణ.
అమ్మ
వరుణ స్వరూపిణి,వారుణి అమ్మయే.
తే.గీ.
*వారుణీ!*మాత! నాయందు వరలుమమ్మ,
భక్తిసుధనాకుదయనిచ్చి
ముక్తి కనెడి
మార్గమందున
నడపుమామహితముగను.
నిన్ను
సేవింతునమ్మ నేన్ నెమ్మితోడ.
205. ఓం *నార్యై* నమః ।
నామ
వివరణ.
సృష్టికి
మూల ప్రకృతి అయిన స్త్రీ అమ్మయే. శత్రు భజన చేయునపుడు వింటి నారి
శక్తియు అమ్మయే.
కం. *నారీ! * నీవే దారిగఁ
గోరుచు
నిను జేరితమ్మ, కూర్మిని నాకున్
వారిజనాభుని
జూపుము
వారికి
నే నంజలింతు భక్తిగనిపుడున్.
206. ఓం
*జ్యేష్ఠాదేవ్యై* నమః ।
నామ
వివరణ.
జ్యేష్ఠాదేవి
అమ్మయే.
తే,గీ,
వినుము
మొరను *జ్యేష్ఠా దేవి* విశ్వసించి
కలుగు కష్టంబులన్
గని కనికరించు,
పాపుమీ
కష్టముల్ నీవు ప్రాపువగుచు.
వందనంబులు
చేసెద నందుకొనుము.
ఓం *జ్యేష్ఠాయై* నమః ।
నామ
వివరణ. సృష్టికే జ్యేష్ఠురాలు అమ్మ.
తే.గీ.
జ్యేష్ఠగా
నీవు నాలోని
చిలిపి
దౌష్ట్య
భావజాలంబు
తుడిచి స్వభావ సిద్ధ
ధర్మ
సన్మార్గ గామిగా దయను చేసి
కాచి
రక్షించుమా *జ్యేష్ఠ! * కరుణతోడ.
ఓం *దేవ్యై* నమః.
నామ
వివరణ.
కం. *దేవీ!* దీవింపుము నన్
భావనలో
నిలువుమమ్మ వరలఁగఁ జేయన్,
సేవానిరతినికొలుపుము
సేవించెద
నమ్మ నిన్ను, శ్రితజన పోషా!
207. ఓం *సురేశ్వర్యై* నమః ।
నామ
వివరణ.
దేవతలకు
అధిపతి అమ్మయే
కం. సర్వాత్మ!
*సురేశ్వరి!* మా
సర్వేశ్వరి!
సర్వ జగతి సన్మయముగ, సత్
పర్వముగా
నడిపించుమ,
గర్వాంధము
వాపి ప్రజను కాయుము జననీ!
208. ఓం *విశ్వమ్భరా*యై నమః ।
నామ
వివరణ.
సృష్ఠి
మొత్తమును భరించు తల్లి అమ్మయే.
తే.గీ.
విపుల
*విశ్వమ్భరా*దేవి! వినుత కీర్తి!
గాంచి
యున్నట్టి నిను కృపన్ గాంచనిమ్ము,
ముక్తిసాధన
మార్గంబు రక్తినొసగి
భక్తితోపాటు
ముక్తిని వరల నిమ్ము.
209. ఓం *ధరా*యై నమః ।
నామ
వివరణ.
సృష్టి
మొత్తమును ధరించు జనని అమ్మయే.
తే.గీ.
విను
*ధరా! * నాదు మొరలను వీనులార,
కనుమ
మదిలోని వేదనన్ గరుణతోడ,
మనగఁ
జేయుము నీ దరిన్ మన్నన గన,
ప్రణతులందుము
చేసెద భక్తితోడ.
210. ఓం *కర్త్ర్యై* నమః
నామ
వివరణ.
సమస్త
సృష్టి కార్యమునకు కర్త అమ్మయే. శత్రిభంజక ఖడ్గము అమ్మయే.
తే.గీ.
కార్యకర్తవు
నీవెగా *కర్త్రి! * యరయ
కర్మఫలములననుభవమర్మమెఱుగ
కర్మ
మాచేత చేయించు కర్త్రివి కని
కర్మఫలములు
బాపుమా మర్మదూర!
211. ఓం *గలార్గలవిభఞ్జన్యై* నమః ।
నామ
వివరణ.
సమస్యలను
ఛేదించు అమ్మ. శివుని గలమునవిషప్రభావమును ఆపినది మన అమ్మయే.
తే.గీ.
మొర
విను *గలార్గలవిభఞ్జని! * రయమునను
నన్ను
కాపాడగారమ్ము మన్ననమున
శివుని
కంఠాన గరళమున్ జేవచూపి
మ్రింగుటాపి
జగాలకు మేలు కనవె?
శ్లో.
సంధ్యారాత్రిర్దివాజ్యోత్స్నా కలాకాష్ఠా నిమేషికా ।
ఉర్వీ కాత్యాయనీ శుభ్రా సంసారార్ణవతారిణీ ॥ 29 ॥
212. ఓం *సన్ధ్యా*యై నమః ।
నామ
వివరణ.
త్రిసంధ్యలూ
అమ్మయే. మానవుని జీవితమున సంధ్యలన్నియు అమ్మయే.
కం. *సంధ్యా! * కాలము గతమగు,
మాంద్యమునెడఁ
బాపి బుద్ధిమంతునిగా నన్
బంద్యంబనకునికిక
ప్రాక్
స్సంధ్యగ
మేల్గొలుపుమమ్మ మేదినిపైనన్.
213. ఓం *రాత్ర్యై* నమః ।
నామ
వివరణ.
రాత్రి
స్వరూపము అమ్మయే.
తే.గీ.
*రాత్రి! * యజ్ఞానతిమిరమే రాత్రి కనఁగ,
రాత్రి
వేళల మము ప్రోవ రాత్రివయితె?
యాత్మ
సుజ్ఞాన తేజంబునమరఁజేసి
జ్ఞాన
సంపత్తితో ముక్తి కాంతనిడుమ.
214. ఓం *దివా*యై నమః ।
నామ
వివరణ.
పగలు
అమ్మ రూపమే.
తే.గీ.
ఓ
దివా!
నీదు తేజమే యొప్పగ మది
వెలుగుగా
నిమ్ము వాగ్ఝరిన్ వేల్పువగుచు,
మాయ
తిమిరంబు నీ కృపన్ మాయఁజేసి
వ్రాయగానిమ్ము
సత్కృతుల్ వాసిగాను.
215. ఓం *జ్యోత్స్నా*యై నమః ।
నామ
వివరణ.
వెన్నెల
అమ్మయే.
కం. చల్లగ
వెలిగెడి *జ్యోత్స్నా!*
యుల్లంబున
నీవె కలుగ నోంకృతివగుచున్
మల్లెల
సౌరభములతో
కల్లలు
లేనట్టి కవిత కల్పింతునుగా.
216. ఓం *కలా*యై నమః ।
నామ
వివరణ.
చంద్రవంక
అమ్మయే. అమ్మ కళలస్వరూపమే.
కం. కలకాలము
నిలిచెడి సత్
కలవై
ప్రభవించుమ *కల!* కావ్యాకృతిగా
సులలిత
పదచయమున మన
సులనే
గొనునటులను భువిజులుగని మెచ్చన్.,
217. ఓం *కాష్ఠా*యై నమః ।
నామ
వివరణ.
కాలమున
కాష్ఠ పరిమితి అమ్మయే.
తే.గీ.
కాష్ట
భాగంబు నా కృతిన్ గలిగి నీవె
యున్న
శేషంబు పూరింతు మన్ననముగ,
*కాష్ట!* నినుఁ
గొల్తు నటులుండు గౌరవమిడ,
నీదు
ప్రేమకు జయమమ్మ, నిర్వివాద!
218. ఓం *నిమేషికా*యై నమః ।
నామ
వివరణ.
రెప్పపాటు
కాలము అమ్మయే.
పంచచామరము.
*నిమేషికా!* సతంబు నేను, నిన్నుఁ గొల్తు సమ్మతిన్,
సమంచితప్రభన్
వెలింగి చక్కగాను నా మదిన్
ప్రమోదమందఁ
జేయుచున్ నిరంతరంబు భక్తితో
నమస్కరింతునమ్మ నీకు, నన్ను తీర్చి దిద్దుమా.
219. ఓం *ఉర్వ్యై* నమః ।
నామ
వివరణ.
విశాలమయిన
భూభాగము అమ్మయే.
కం. *ఉర్వీ!* నీ దయ కలిగిన
సర్వంబును
సాధ్యమగునసామాన్యముగన్,
గర్వంబణచుము,
నన్నున్
బర్వంబులలోన
ముంచి వర్ధిలనిమ్మా!.
220. ఓం *కాత్యాయన్యై* నమః
నామ
వివరణ.
కాత్యాయన
మహర్షి కుమార్తె అయిన కాత్యాయని అమ్మయే.
కం. నిత్యానందకరీ! మా
*కాత్యాయని!*
నిన్ను నేను గణియింతు మదిన్,
నిత్యంబు
నాత్మతేజము
నత్యుత్తమమంచునెంచి,
యలరగ నిమ్మా.
221. ఓం *శుభ్రా*యై నమః ।
నామ
వివరణ.
పవిత్రత
అనునది అమ్మయే.
తే.గీ.
*శుభ్ర!*
సత్ పూజ్య! నిన్ను నా శుద్ధ మతిని
నిలిపి
కొలిచెద నెమ్మితో నిష్కలంక!
కనెద
పరమాత్మ శుభ్రతన్, కన్నులలయ,
మన్ననముననీవుండుమా
మదిని కృపను.
222. ఓం *సంసారార్ణవతారిణ్యై* నమః ।
నామ
వివరణ.
సంసార
సాగరమును దాటించు జనని అమ్మయే.
కం. *సంసారార్ణవ తారిణి! *
హంసవు
మదిలోన నీవహమ్మన నీవే,
హింసా
దూరునిచేసి, ప్ర
శంసార్హునిగా
నొనర్చి చక్కగ కనుమా.
శ్లో.
కపిలా కీలికాఽశోకా మల్లికానవమల్లికా । [ మల్లికానవమాలికా ]
దేవికా నందికా శాంతా భంజికా భయభంజికా ॥ 30 ॥
223. ఓం *కపిలా*యై నమః ।
నామ
వివరణ.
అమ్మ
కపిలవర్ణ శోభిత.
కం. *కపిలా!*
నాలో
నిలుచుచు
విపరీతములున్న
నణచు వేల్పువు జననీ!
యపవిత్రుల
దరి చేరక
సుపవిత్రునిగ
నను నిలిపి శోభిలనిమ్మా.
224. ఓం *కీలికా*యై నమః ।
నామ
వివరణ.
అన్నిటికీ
కీలకమయిన అక్షము అమ్మయే.
కం. కీలకమగు
వేళలలో
*కీలక!*నీవుండి నీదు కేలునొసగుచున్,
జాలిని
కావుమ నన్నున్,
నాలోనున్నాత్మవీవె
నా జనయిత్రీ!
225. ఓం *అశోకా*యై నమః ।
నామ
వివరణ.
అమ్మ
శోకమనునది లేని జనని.
కం. శోకరహిత*వశోక! * యశోకునిగను
నన్ను
నిరతంబు చేయుమా నిన్నుఁ గొలుతు,
దైవమానందరూపుడై
భావనమున
వెలుగునట్టుల
చేయుమా వేల్పువగుచు.
226. ఓం *మల్లికానవమల్లి(మాలి)కా*యై నమః ।
నామ
వివరణ.
అమ్మ
మల్లిక, మల్లెలమాలను ధరించు జనని.
తే.గీ.
*మల్లికా నవమల్లి(మాలి)కా!* మదిని కలిగి
మధుర
భావాళికీవె సన్మార్గమగుచు
ప్రేరణంబును
గొలిపి సంప్రీతితోడ
జీవనము
సాగఁ జేయుమా! చిత్స్వరూప!
ఓం *మల్లి(మాలి)కా* యై
నమః ।
నామ వివరణ.
తే.గీ.
*మల్లి(మాలి)కా!* సౌరభంబు హృన్మందిరమున
నీవు వసియించుటన్ గల్గు నిత్యపూజ్య
భావనాకాశమందీవు భద్రగతిని
యుండి వెరియింపుమానందమొప్పుగ నిఁక.
ఓం *నవమల్లి(మాలి)కా* యై
నమః ।
నామ వివరణ.
అప్పుడే వికసించిన మల్లికా మాలిక మన జనని.
ఉ. ఓ *నవ మల్లి(మాలి)కా! * ఘన మహోన్నత భావ మనోజ్ఞ గీతికా!
జ్ఞాన విశేషసౌరభము కల్గగఁ జేయుచునెల్లవేళలన్
భానుని తేజమై మదిని వర్ధిలు నీకు నమస్కరించెదన్,
మానక ప్రేరణన్ గొలిపి మాధవసేవకు దారిఁ జూపుమా.
227. ఓం
*దేవికాయై* నమః.
నామ
వివరణ.
అమ్మ
దేవీ స్వరూపిణి.
తే.గీ.
*దేవికా!* జ్ఞాన సంపూర్ణ దీప్తిఁ గొలుప
నాత్మలోనుండుమోయమ్మ,
హాయిగాను
చెలగి
జీవాత్మ
పరమాత్మఁ
జేర్చుటకును
నీవె
మార్గంబుగా లోన నిలువుమమ్మ.
228. ఓం *నన్దికా*యై నమః ।
నామ
వివరణ.
సంతోషమును
కలిగించు కుమార్తె రూపిణి మన అమ్మ.
తే.గీ.
*నందికా!
* నీవు
నా కావ్య నందికవయి
బోధఁ
గొలుపుచునుండుము పూజ్యురాల!
గడచు
జీవిత సారమే కావ్యమమ్మ,
కృతిని
వెలిగెడి నా పుణ్య సుతవు నీవు.
229. ఓం *శాన్తా*యై నమః ।
నామ
వివరణ.
శాంతము
యొక్క రూపము అమ్మయే.
కం. *శాన్తా! * నీవే మదిలో
శాంతిగ
వసియింపుమమ్మ, సన్నుతవగుచున్,
భ్రాంతిని
పోకార్పుచు నా
చింతలు
తొలగింపుమమ్మ! సేవింతు నినున్.
230. ఓం *భఞ్జికా*యై నమః ।
నామ
వివరణ.
దౌష్ట్యములను
భంజించు జనని అమ్మ.
తే.గీ.
*భఞ్జికా! * వ్యర్థ భావనా భంజికవయి
సార్థకంబగు
భావాళిఁ జక్కనిమ్ము,
నీవె
నాలోని వెలుగువై నిరతముండి
నన్నుఁగాపాడుచుండుమా
నందినివయి.
231. ఓం *భయభఞ్జికా*యై నమః
నామ
వివరణ.
భయమును
పారద్రోలు జనని అమ్మ.
కం. *భయభఞ్జికా!* మనంబున
భయమును
పోకార్పుమమ్మ! భద్రద వగుచున్,
జయ
కారణమగుమీ య
క్షయ
ధైర్యము నిడుచు నన్నుఁ గావుము కృపతోన్.
శ్లో.
కౌశికీ వైదికీ దేవీ సౌరీ రూపాధికాఽతిభా ।
దిగ్వస్త్రా నవవస్త్రా చ కన్యకా కమలోద్భవా ॥ 31 ॥
232. ఓం *కౌశిక్యై* నమః ।
నామ
వివరణ.
పార్వతీకేశ
సంభవ కౌశికి అమ్మయే.
సుగంధివృత్తము.
పార్వతీశిరోజజాత!
పద్మనేత్ర *కౌశికీ! *
గర్వభంజనంబు
చేసి కావుమా! ననున్ సదా,
నిర్వికార
నిష్కళంక! నీ కృపా కటాక్షమే
సర్వసిద్ధి
సత్ఫలంబుఁ జక్కగా నొసంగునే.
233. ఓం *వైదిక్యై* నమః ।
నామ
వివరణ.
వైదిక
సాంప్రదాయ స్వరూపిణి వైదికి మన అమ్మయే.
తే.గీ.
దివ్య
రూపిణి! వైదికీ! దేవి! కనుమ.
చిత్తమందున
నినుగాంచి మత్తు వీడి
సత్తు
చిత్తులన్ లోఁ గని శాంతితోడ
మసలుకొందును,
నిన్ను నే మదిని గనుచు.
ఓం *దేవ్యై* నమః.
నామ
వివరణ.
దేవీ
స్వరూపిణి అమ్మయే.
తే.గీ.
కృపను
గాంచుమా *దేవి*!
నన్ క్షితిని వెలుగఁ
జేయ,
నినుఁ గొల్తునోయమ్మ! శ్రేయములిడ!
నీవు
లేకున్న దిక్కేది? నీరజాక్షి!
వందనంబులు
చేసెద నందుకొనుము.
కం. దేవీ నీ శుభ నామము
భావింతును మనమునందు భవ్యఫలదవై
దీవించుము నిరుపమముగ
జీవము నీవౌచు నిలుము శ్రీమన్ మాతా!
ఓం *వైదికీదేవ్యై*
నమః ।
నామ వివరణ.
వైదిక సాంప్రదాయ స్వరూపిణిఅయిన దేవి వైదికీదేవి మన అమ్మయే.
తే.గీ.
దివ్య రూపిణి! *వైదికీదేవి*! కనుమ.
చిత్తమందున నినుగాంచి మత్తు వీడి
సత్తు చిత్తులన్ లోఁ గని శాంతితోడ
మసలుకొందును, నిన్ను నే మదిని గనుచు.
234. ఓం
*సౌర్యై* నమః.
నామ
వివరణ.
సూర్యుని
యొక్క స్వరూపము అమ్మయే.
తే.గీ.
*సౌరి! * సూర్యప్రతాపంబు శాంతిలఁ గని
లోకులను
గను, నిన్ గొల్తు శ్రీకరముగ,
నీవె
మా ప్రాణమోయమ్మ! నీలవేణి!
వందనంబులు
చేసెద నందుకొనుము.
ఓం
*శౌర్యై* నమః.
నామ వివరణ.
పరాక్రమము యొక్క స్వరూపము అమ్మయే.
తే.గీ.
సౌర తేజంబునొప్పెడి సౌరివమ్మ.
నాదు హృదయంబునన్ వెల్గు నయ నిధాన!
*శౌరి!* నీ తేజమున్ జూడఁ జాలనమ్మ,
జ్ఞాన నేత్రంబునిమ్ము నే కనెద నిన్ను.
ఓం *గౌర్యై* నమః ।
నామ వివరణ.
గౌర వ్ర్ణముతో ప్రకాశించు జనని మన అమ్మ.
తే.గీ.
*గౌరి!*
నీ దివ్య రూపమున్ గనగనిమ్ము
భవ్యమైనట్టి నీపేరు పలకనిమ్ము,
చల్లనైనట్టి నీ దృష్టి సరిగ బరిపి
రక్షణమునిమ్ము భువిపైన క్రాలనిమ్ము.
235. ఓం *రూపాధికా*యై నమః ।
నామ
వివరణ.
అధికమయిన
రూపము కలిగిన జనని అమ్మ.
తే.గీ.
మహిత
*రూపాధికా!
* నీదు
మహిమ నెన్న
నాకసాధ్యంబు,
నీవె సుజ్ఞానమిచ్చి
వ్రాయఁ
జేయుము నిన్ గూర్చివాసిగొల్ప,
అందుకొనుమమ్మ
నీవు నా వందనములు.
236. ఓం *అతిభాసే* నమః ।
నామ
వివరణ.
మిక్కిలి
ప్రకాశించు తల్లి మన అమ్మ.
కం. *అతిభాసా! * నీకెవ్వరు
క్షితిపై
గలరమ్మ సాటి? క్షేమప్రద వో
స్తుతమతి!
నీ యౌదార్యము
నుతియింపగఁ
జాలనమ్మ! నోములపంటా!
237. ఓం *దిగ్వస్త్రా*యై నమః ।
నామ
వివరణ.
దిగంతములవరకూ
వ్యాపించి దిక్కులే వస్త్రములుగా కలిగిన తల్లి.
తే.గీ.
నీవు
వ్యాపించి యంతటన్ నేర్పు మీర
భక్తులన్
గాచు *దిగ్వస్త్ర!* ప్రణతులమ్మ.
నా
మనంబున వెలుగుచు క్షేమమిడుచు
సన్నుతంబుగ
కాచెడి కన్నతల్లి!
238. ఓం *నవవస్త్రా*యై నమః ।
నామ
వివరణ.
నిత్య
నూతన వస్త్ర ధారణి అమ్మ.
కం. *నవవస్త్రా!* సతతంబును
నవవస్త్రములీయఁ
జాల నవ వస్త్రము లీ
కవనంబులె,
కృపతోఁ గొను,
ప్రవిమలభావప్రభలను
వరలింతు నినున్.
239. ఓం *కన్యకా*యై నమః ।
నామ
వివరణ.
అమ్మ
నిత్య కన్యకా స్వరూపిణి.
ఉ. సాగర
కన్యకామణివి సంస్తుత *కన్యక!* సన్నుతప్రభా
వాగమృతంబు
నీవొసగి, పద్యకవిత్వము పండఁ జేసి, నా
యోగమె
మార్చినావు, వరయోగసమృ ద్ధిని గొల్పు నిన్ను
నే
నేగతి
నిర్వచించెద నహీన దయానిధి! నిన్ నుతించెదన్.
240. ఓం *కమలోద్భవాయై* నమః ।
నామ
వివరణ.
కమలమునుండి
జనించిన తల్లి అమ్మ.
తోటక
వృత్తము.
*కమలోద్భవ!* నీ కృప కల్గినచో
ప్రముదంచిత
కావ్యము వ్రాయనగున్,
సుమకోమల
చిద్వర శోభలతోఁ
గమనీయ
కవిత్వము కల్పితమౌన్.
శ్లో.
శ్రీస్సౌమ్యలక్షణాఽతీతదుర్గా సూత్రప్రబోధికా ।
శ్రద్ధా మేధా కృతిః ప్రజ్ఞా ధారణా కాంతిరేవ చ ॥ 32 ॥
241. ఓం *శ్రీస్సౌమ్యలక్షణా*యై నమః
నామ
వివరణ.
మృదు స్వభావము కల
తల్లి మన అమ్మ.
తే.గీ.
వినుత
*శ్రీ
స్సౌమ్య లక్షణా! * వినుము మొరను,
సౌమ్య
సత్వస్వభావంబు చాలినంత
యొసగియుంటివి,
నీ కృపన్ మసలుచుంటి
నీవె
నాలోననుండుటన్ నీరజాక్షి!
ఓం *శ్రీ*యై నమః ॥
నామ వివరణ.
మంగళప్రదమయిన శ్రీకారముగా ఉన్న తల్లి అమ్మ.
కం. *శ్రీ! * దేవీ! వందనముల్,
వేద ప్రభవీవె కనగ విశ్వాత్మా! స
మ్మోదంబున నన్ గనుమా,
బాధలు వారించి, భవ్య పథము నొసగుమా.
ఓం *సౌమ్యలక్షణా*యై నమః ॥
నామ వివరణ.
సౌమ్య స్వభావగుణ సంపన్న మన జనని.
తే.గీ.
*సౌమ్య లక్షణా!*
శ్రీమత్ప్రశాంతరూప!
నాకు సౌన్య స్వభావంబు శ్రీకరముగ
నీవొసంగుచు కృపఁగని నిలిపినావు,
వందనంబులు చేసెద నందుకొనుము.
242. ఓం *అతీతదుర్గా*యై నమః ।
నామ
వివరణ.
ఎవరికినీ
అధిగమింప శక్యము కాని దుర్గమమయిన తల్లి మన అమ్మ.
తే.గీ.
దీప్తి
వీవమ్మ జగతి *నతీత
దుర్గ! *
దుర్గమంబగు
దైవత్వ మార్గమందు
నన్ను
నడిపింపఁ బూనిన సన్నుతాత్మ!
వందనంబులు
చేసెద నందుకొనుము.
243. ఓం *సూత్రప్రబోధికా*యై నమః ।
నామ
వివరణ.
వేద
సూత్రములను బోధించు జనని.
తే.గీ.
వినుత
*సూత్రప్రబోధికా! * వేదసూత్ర
సారమీవేను
నిజమిది, సత్ప్రబోధ
నీదు
కృపచేతఁ గల్గును, మోదమునను
వందనంబులు
చేసెద నందుకొనుము.
244. ఓం *శ్రద్ధా*యై నమః ।
నామ
వివరణ.
మనకు
కలిగెడి శ్రద్ధ అనునది అమ్మ స్వరూపమే.
కం. *శ్రద్ధా! * సన్నుత లక్ష్మీ!
శ్రద్ధగ
నినుఁ గొలుచు శక్తి చక్కగనిమ్మా,
శ్రద్ధారూపవుకద, య
శ్రద్ధను
విడఁజేసి నాకు
శ్రద్ధనొసగుమా.
245. ఓం *మేధా*యై నమః ।
నామ
వివరణ.
మనకు
కలిగెడి మేధా శక్తి అమ్మయే.
కం. *మేధా! మేధా రూపవు,
సాధనమున
మేధ పెఱుగు చక్కగ నీవే
మోదముతో నొసగుచు,
నా
బాధలనెడబాపి
శ్రద్ధ వరలగనిమ్మా.
246. ఓం *కృత*యే నమః ।
నామ
వివరణ.
కూర్పబడిన
సృష్టి అమ్మయే.
కం. కృతి
వీవే *కృతి! * సన్నుత
గతివీవే,
నాకు చూడ, కంజదళాక్షీ!
నుతకృతులను
వెలయించగ
మతిలోనీవుండుమమ్మ
మార్గము చూపన్.
247. ఓం *ప్రజ్ఞా*యై నమః ।
నామ
వివరణ.
నైపుణ్యము
అనెడిది అమ్మయొక్క శక్తియే.
కం. ప్రజ్ఞా
రూపవు *ప్రజ్ఞా!*
యజ్ఞానము
పారద్రోలి యనుపమరీతిన్
బ్రజ్ఞను
గొలుపుమ నాకున్,
సుజ్ఞేయము
సేసెద నిను సుకృతిని జగతిన్.
248. ఓం
*ధారణా*యై నమః ।
నామ
వివరణ.
మనకు
కలిగెడి ధారణ అనెడి శక్తి అమ్మయే.
తే.గీ.
ధారణా
రూపవౌ నీదు తత్వమరయ
ధారణాశక్తి
ప్రబలును తప్పక భువి,
*ధారణా!* ధారణాశక్తి దయనొసంగి,
నిన్ను
నుతియింపఁ జేయుమా నిరుపమముగ.
249. ఓం *కాన్త*యే నమః ।
నామ
వివరణ.
వెలుగు
అనెడిది ఏది కలదో అది అమ్మయే.
తే.గీ.
*కాన్తి!* నీరూపరేఖలన్ గాంతు మదిని
వర్ణనంబును
జేయఁగ భక్తితోడ,
శాంతిసౌభాగ్యదాయినీ!
జయ నిధాన!
వందనంబులు
చేసెద నందుకొనుము.
శ్లో.
శ్రుతిః స్మృతిర్ధృతిర్ధన్యా భూతిరిష్టిర్మనీషిణీ ।
విరక్తిర్వ్యాపినీ మాయా సర్వమాయాప్రభంజనీ ॥ 33 ॥
250. ఓం *శ్రుత*యే నమః ।
నామ
వివరణ.
వేదస్వరూపమేది
కలదో అది అమ్మయే.
కం. శ్రుతి
రూప! *శ్రుతీ! * నీవిక
మతిలో
నిలుమమ్మ నాకు, మన్ననమున నిన్
నుతియింతునెల్లవేళల
నతులితమగు
పద్యములను, హాయిగ చదువన్.
251. ఓం *స్మృతయే* నమః
నామ
వివరణ.
జ్ఞాపకము
అనెడిది ఏది కలదో అది అమ్మయే.
తే.గీ.
*స్మృతి!*
వివర్ధన చేయుమా స్మృతిని నాకు,
నీ
మహత్వంపు స్మృతులతో నీదు చరిత
కవిత
గా వ్రాసి నీకిత్తు కాన్కగాను,
కావ్య
కన్యగా నిను గాంతు ఘనతరముగ.
252. ఓం *ధృత*యే నమః ।
నామ
వివరణ.
ధైర్యమను
శక్తి ఏది కలదో అది అమ్మయే.
తే.గీ.
*ధృతి!
* మతిన్
గాంచెదన్ నీదు దీప్తి నరసి,
క్షితిజులన్
ముక్తి మార్గాన కేలుపట్టి
నడుపుదున్
నీవు తోడున్నఁ, దడయకమ్మ
నాదు
సంకల్పమున్ గూర్చి నన్ను నడుపు.
253. ఓం *ధన్యా*యై నమః ।
నామ
వివరణ.
తాను
అనుకొనినట్లు సృష్టి చేయుతలో కృతకృత్య అయిన అమ్మ ధన్య.
తే.గీ.
ధన్యునిగఁ
జేయు మో *ధన్య! * మాన్య చరిత!
గణ్యముగ
నిన్నుఁ జెప్పి నే గణుతిఁ గనుదు,
పుణ్యముండును
మది నుండి ప్రోవుమమ్మ
వందనంబులు
చేసెద నందుకొనుము.
ఓం *శ్రుతిః స్మృతిర్ధృతిర్ధన్యా*యై నమః.
ఆ.వె.
శ్రుతిని, స్మృతిని ధృతిని మతిలోన నిలుపుమా
నిత్య ఉండునట్లు, నీవు భార
తీ!
*శ్రుతిః స్మృతిర్ధృతిర్ధన్య*! నన్ గావుమా!
వదలఁబోకు నాదు మదిని నిలుమ.
254. ఓం *భూత*యే నమః ।
నామ
వివరణ.
సమస్త
సంపదలకు కారణమయిన తల్లి భూతి.
తే.గీ.
*భూతి*! నీ పవిత్రత
నాకు పొగడ తరమ?
నీ
విభూతియె సృష్టిలో
నిలుచు
సతము,
నీవు
నాలోననున్నచో నేను కూడ
పూత
చరితుడనగుదును, పూర్తిగాను.
255. ఓం *ఇష్ట్యై* నమః ।
నామ
వివరణ.
అమ్మ
యాగ స్వరూపిణి.
తే.గీ.
*ఇష్టి! * యజ్ఞస్వరూపిణీ! దృష్టి పెట్టి
యాత్మలోయజ్ఞ
సాధనమమరఁ జేసి
నిన్ను
దర్శింతునమ్మరో నన్నుఁ గాచు,
ముక్తి
మార్గంబు నీవెగా పుణ్య చరిత!
256. ఓం *మనీషిణ్యై* నమః ।
నామ
వివరణ.
జ్ఞానమునిచ్చు
తల్లి మన అమ్మ.
తే.గీ.
ఓ
*మనీషిణీ!* గణియించి నీ మనీషఁ
దెల్ప
భాషయే చాలదనల్పమగుట
నద్భుతంబునసాధ్యమో
యనుపమాన!
వందనంబులు
చేసెద నందుకొనుము.
257. ఓం *విరక్త్యై* నమః ।
నామ
వివరణ.
నిర్లిప్తముగా
ఉండు జనని మన అమ్మ.
తే.గీ.
ఓ
*విరక్తీ! * మహాభక్తి నొప్పిదముగ
నిన్ను
గొల్చెడి మాకేల నెన్న రక్తి?
నిజము
నీపైన రక్తినే నిన్నుఁ గనుచు
ముక్తినొందెడి
భాగ్యమ్ము పొందగలము
258. ఓం *వ్యాపిన్యై* నమః ।
నామ
వివరణ.
అంతటనూ
వ్యాపించియుండు తల్లి మన అమ్మ.
తే.గీ.
*వ్యాపినీ! * నీవు వ్యాపింతువన్నియెడల,
నాదు
మదిలోన వ్యాపించి నన్ను నడుప
నీకసాధ్యంబు
కాదుగా, నీరజాక్షి!
చేయుమట్టులఁ
జేసి నన్ జేదుకొనుము.
259. ఓం *మాయా*యై నమః ।
నామ
వివరణ.
అమ్మ
మాయాస్వరూపిణి. మాయ అమ్మ యొక్క శక్తియే.
తే.గీ. *మాయ! * నీ సృష్టియే చూడ మాయ, నిజము.
నీవదేలను
మాయలో నిత్యమిటుల
మమ్ము
మ భ్యపెట్టుట తల్లి? సమ్మతించి
మాయ
తెర తీసి మమ్మేలుమా! మదంబ!
260. ఓం *సర్వమాయాప్రభఞ్జన్యై* నమః ।
నామ
వివరణ.
సమస్తమయిన
మాయనూ నశింపఁ జేయు తల్లి అమ్మ.
తే.గీ.
సర్వ
*మాయా
ప్రభఞ్జనీ*! గర్వమణచి
మాయ
యునికినే మాపెడి మాయవీవు,
మాయలోపడి
నేనునున్ మ్రగ్గుచుంటి,
మాయనుండి
నన్ బ్రోవుమా మన్ననముగ.
శ్లో.
మాహేంద్రీ మంత్రిణీ సింహీ చేంద్రజాలస్వరూపిణీ ।
అవస్థాత్రయనిర్ముక్తా గుణత్రయవివర్జితా ॥ 34 ॥
261. ఓం *మాహేన్ద్ర్యై* నమః
నామ
వివరణ.
మహేంద్రునికన్నను
గొప్ప తల్లి మహేంద్రి.
తే.గీ. వినుము *మాహేన్ద్రి! * నాదగు విన్నపమ్ము,
నీవె
సర్వమ్ము సృష్టిలో నేర్పు మీర
నన్ను
రక్షింప తగదొకో? మన్ననమున,
కన్నులన్
బెట్టి చూడుమాపన్న రక్ష!
262. ఓం *మన్త్రిణ్యై* నమః ।
నామ
వివరణ.
ఆమె
సమస్తమునకు మంత్రి.
తే.గీ.
*మన్త్రిణీ!* సృష్టి నడిపించు మంత్రివీవు,
నన్ను
నడిపించు వేళలో నాకు ముక్తిఁ
గొలుపు
మార్గాన నడిపించఁ గోరితి నిను,
నీదు
సాన్నిధ్యమున్ గొల్పి యాదుకొమ్ము.
263. ఓం *సింహ్యై* నమః ।
నామ
వివరణ.
ఆడుసింహము
అమ్మయే.
తే.గీ.
*సింహి*! నాలోని పశువును సంహరించు.
కలుగుషట్ఛ్ఛత్రులన్
జంపి వెలుగు నింపు
నాదు
మదిలోన, నచ్చట మోదమునను
నీవె
వసియింపు మమ్మరో నీరజాక్షి!
264. ఓం *ఇన్ద్రజాలస్వరూపిణ్యై* నమః ।
నామ
వివరణ.
ఇంద్రజాలము
యొక్క స్వరూపము అమ్మయే.
తే.గీ.
*ఇంద్రజాలస్వరూపిణీ!* యింద్రియముల
కేను
లొంగుచునుంటి, నహీనశక్తి
మనసునకునిమ్ము,
గెలిచెద ఘనతరముగ,
నింద్రియంబులన్,
నినుఁ గొల్తు నిందువదన!
తే.గీ. చంచలత్వంబుతో మది చెలగు *నిన్ద్ర
జాలరూపిణీ!* మాపు చాంచల్య
గుణము,
నీదు
పదపద్మములపైన నాదు చిత్త
మమరి
యుంచునట్లుగఁ జేయుమా మదంబ!
265. ఓం *అవస్థాత్రయనిర్ముక్తా*యై నమః ।
నామ
వివరణ.
జాగ్రత్స్వప్నసుషుప్తావస్థలనుండి
బయట పడవేయు తల్లి మన అమ్మయే.
కం. జయమోయమ్మ
*యవస్థా
త్రయ నిర్ముక్తా!* సుబోధితంబగుమమ్మా!
ప్రియముగ
భక్తి నొసంగుమ,
నయమార్గమునందు
గొలుతు నా జనని నినున్.
266. ఓం *గుణత్రయవివర్జితా*యై నమః ।
నామ
వివరణ.
సత్వరజస్తమోగుణములను
పూర్తిగా వర్జించిన తల్లి మన అమ్మ.
కం. కోరెద
సత్వగుణంబును
చేరగవాఛించి
నిన్ను శ్రీకరముగ నో
స్మేర
ముఖాంభోజ! మహో
దార!
*గుణత్రయవివర్జితా!* కృప గనుమా.
శ్లో.
ఈషణాత్రయనిర్ముక్తా సర్వరోగవివర్జితా ।
యోగిధ్యానాంతగమ్యా చ యోగధ్యానపరాయణా ॥ 35 ॥
267. ఓం
*ఈషణాత్రయనిర్ముక్తా*యై నమః.
నామ
వివరణ.
దారేషణ,
పుత్రేషణ, ధనేషణ, అను ఈషణత్రయమునుండిపూర్తిగా
విముక్తి పొందియున్న
తల్లి
మన అమ్మ
తే.గీ.
*ఈషణాత్రయ నిర్ముక్త! * భాష
చాల
దమ్మ
నిన్ను వర్ణించగా నమరవినుత!
నన్ను
నీషణత్రితయంబు నలిపివేసె
నోర్వ
లేనమ్మ కావు నన్నుర్విపైన.
268. ఓం
*సర్వరోగవివర్జితా* యై నమః.
నామ
వివరణ.
సమస్త
రోగములనూ విడిచిన తల్లి మన జనని.
తే.గీ.
*సర్వ
రోగ వివర్జితా! *యుర్విపైన
నున్నవారికి
రోగములుండి తీరు,
నీవె
కాపాడవలయు మాకీవె శరణు,
రోగబారిని
పడకుండ ప్రోవుమమ్మ.
ఓం ఈషణాత్రయనిర్ముక్తా సర్వరోగవివర్జితాయై నమః.
నామ వివరణ.
దారేషణ, పుత్రేషణ, ధనేషణ, అను ఈషణత్రయమునుండిపూర్తిగా విముక్తి పొందియున్న
తల్లి మన అమ్మ, సమస్త రోగములనూ విడిచిన తల్లి మన జనని.
స్వయంకల్పిత రోగవివర్జ వృత్తము.
గణములు …. స జ య
త భ ర. యతి..11వ అక్షరము.. ప్రాస కలదు.
సతి!
యీషణాత్రయనిర్ముక్తా సర్వరోగవివర్జితా!
క్షితిపై ధనాదుల నాశింపన్ కీడు ప్రాప్తమగున్ గదా,
స్తుతియింతు నిన్ త్రయనిర్ముక్తిన్ సుప్రదా కలిగించుమా
నుతమార్గమందు మదంబా నిన్నున్ స్తుతింపగఁ జేయుమా.
269. ఓం *యోగిధ్యానాన్తగమ్యా*యై నమః ।
నామ
వివరణ.
యోగులకు
ధ్యానాంతమున గమ్యముగా ఉన్న తల్లి మన జనని.
కం. మా
గతి యోగము మార్చును,
యోగంబున
ధ్యానమొప్పియుండుననుచునే
యోగులు
గాంచెదరమ్మా!
*యోగి
ధ్యానాన్త గమ్య! * యొసగుము
సిద్ధిన్.
270. ఓం *యోగధ్యానపరాయణా*యై నమః ।
నామ
వివరణ.
యోగము,
ధ్యానము, పరాయణముగా కల జనని మన అమ్మ.
కం. *యోగధ్యానపరాయణ!*
వేగమె
నా యోగమగుచు. ప్రీతిని గనుమా
రాగల
కాలమునందున
యోగమె
సన్ముక్తిదముగ నుంచుమ జననీ!
శ్లో.
త్రయీశిఖా విశేషజ్ఞా వేదాంతజ్ఞానరూపిణీ ।
భారతీ కమలా భాషా పద్మా పద్మవతీ కృతిః ॥ 36 ॥
271. ఓం *త్రయీశిఖా*యై నమః ।
నామ
వివరణ.
మూడు
వేదములందూనిపుణత కలిగిన తల్లి మన అమ్మ.
కం. ప్రాకటముగ
వేదత్రయ
మేకరణి
గ్రహింపనౌ మహేశ్వరి? నీవే
నాకిట
చక్కగఁ దెల్పుట
శ్రీకరము
*త్రయీ శిఖా!*
విశేషజ్ఞ!
నతుల్.
272. ఓం *విశేషజ్ఞా*యై నమః ।
నామ
వివరణ.
సృష్టికి
సంబంధించిన విశేషమయిన జ్ఞానము కలిగిన అమ్మ.
కం. లోకవిశేషజ్ఞానము
శ్రీకరముగను గలిగిన *విశేషజ్ఞా!* నన్
నీ కరుణను కాపాడుమ,
నీకున్ దాసుఁడను నేను
నీరజ నేత్రా!
తే.గీ. శ్రీ *విశేషజ్ఞ*
నిన్ను నా చిత్తమందు
శాశ్వతంబుగ నిలుపగ చక్కనైన
సాధనాశక్తి నిమ్మని సాగిలపడి
మ్రొక్కుచుంటిని, వరమిమ్ము చక్కనమ్మ!
కం. ప్రాకటముగ వేదత్రయ
మేకరణి గ్రహింపనౌ మహేశ్వరి? నీవే
నాకిట చక్కగఁ దెల్పుట
శ్రీకరము త్రయీ శిఖా! *విశేషజ్ఞ!* నతుల్.
ఓం *త్రయీశిఖావిశేషజ్ఞా*యై నమః ।
నామ వివరణ.
మూడు వేదములందూనిపుణత కలిగిన తల్లి మన అమ్మ.
కం. ప్రాకటముగ వేదత్రయ
మేకరణి గ్రహింపనౌ మహేశ్వరి? నీవే
నాకిట చక్కగఁ దెల్పుట
శ్రీకరము *త్రయీ శిఖా విశేషజ్ఞ!* నతుల్.
273. ఓం *వేదాన్తజ్ఞానరూపిణ్యై* నమః ।
నామ
వివరణ.
వేదాంత
జ్ఞానమే రూపముగా ఉన్న తల్లి మన అమ్మ.
కం బాధలనెడఁ
బాపుము భువి,
సాదరముగ
చూడుమమ్మ! సన్నుత జననీ!
మోదమునఁ
గావ నన్నున్
*వేదాంత జ్ఞాన
రూపిణీ!
* నినుఁ
గొలుతున్.
274. ఓం *భారత్యై* నమః
నామ
వివరణ.
మిక్కిలి
ప్రకాశవంతమయిన తల్లి మన అమ్మ. అక్షర జ్ఞానప్రదాయిని మన అమ్మ.
తే.గీ.
*భారతీ!*
నీదు పదములే పట్టుకొమ్మ,
వాక్సుధామయ
మూర్తుల భాగ్యమవియె,
పట్టి
సేవింతు నీ పద పంకజములు,
నాదు
జిహ్వాగ్రవర్తినీ! యాదుకొనుము.
275. ఓం *కమలా*యై నమః ।
నామ
వివరణ.
కమలమువలె
మనోజ్ఞాముగా ప్రకాశించు జనని మన అమ్మ.
తే.గీ. *కమల!* సుకుమార సుందర కల్పవల్లి!
నాదు
మదిలోన వెల్గుమా! మోదమునను,
జ్ఞాన
సూర్యప్రకాశమే కలదు నీకు,
పొంగిపోవుచునుండిట
రంగుగాను.
276. ఓం *భాషా*యై నమః ।
నామ
వివరణ.
భాష
యొక్క స్వరూపము అమ్మయే.
తే.గీ. వినుత! భాషా!
మదంబా! సవినయముగను
నిన్ను
సేవింతు నోయమ్మ, నెమ్మనమున
వరలఁజేయు
మా భాషను భద్రతనిడి,
వందనంబులు
చేసెద నందుకొనుము.
277. ఓం *పద్మా*యై నమః ।
నామ
వివరణ.
అమ్మ
కమలోద్భవి.
కం. సేవింతును
నిను *పద్మా!*
భావించుచు
మానసమున భక్తిగ నెలమిన్,
నీవే
మానస హంసగ
భావిని
నడిపించుమమ్మ, భద్రత
నిడుచున్.
278. ఓం *పద్మవత్యై* నమః ।
నామ
వివరణ.
కమలాసన
మన అమ్మ.
తే.గీ.
తీరమును
జేర్చు *పద్మవతీ!* నమామి,.
హృదయ
పద్మమ్ముపైన నీవేర్పడంగ
వాసముండుము
నాలోని ధ్యాసనెఱిగి,
వందనములు పద్మాసనా! యందుకొనుము.
279. ఓం *కృతయే* నమః ।
నామ
వివరణ.
క్రియాఫలమయిన
కృతి అమ్మయే.
తే.గీ.
సత్
*కృతీ!*
నీవు నాలోని సత్యమగుచు
నాదు
కృతులందు వసియించు మోదమునను,
కృతికి
సత్కృతి నీవుసంస్తుతిగ నిండ,
వందనంబులు
చేసెద నందుకొనుము.
శ్లో.
గౌతమీ గోమతీ గౌరీ ఈశానా హంసవాహినీ ।
(వాహనీ)
నారాయణీ ప్రభాధారా జాహ్నవీ శంకరాత్మజా ॥ 37 ॥
280. ఓం *గౌతమ్యై* నమః ।
నామ
వివరణ.
గౌతముని
కుమార్తె మన అమ్మ.
తే.గీ.
*గౌతమీ!*
పుణ్యరాశివి! కవుల కృతుల
నాట్యమాడెడు
తల్లివి, నయ నిధాన!
నీవె
నాలోని కవితవై నిరతమిటులె
కవిత
రూపాన ప్రవహించు గౌరవముగ.
281. ఓం *గోమత్యై* నమః ।
నామ
వివరణ.
గోమతీ
నది మన అమ్మయే.
తే.గీ.
*గోమతీ!
* నిన్నుకొలిచి,
నే కోరుచుంటి
భరతభూమిపై
ప్రవహించి పచ్చదనము
సతతమున్
గొల్పుచుండుమా, సత్కవిత్వ
ధారలట్టుల
నుర్విపై, తప్పదమ్మ.
282. ఓం *గౌర్యై* నమః ।
నామ
వివరణ.
గౌర
వర్ణముతో విరాజిల్లు జనని మన అమ్మయే.
తే.గీ.
వినుత!
*గౌరీ!*
శుభాకార! వెలయుము మది,
ఘనత
గాంచెద నీవున్న కవిగ నేను,
సత్
కవిత్వము మరుమల్లె సౌరభములు
నీకె
యందింతుమదిలోన నీవె కలుగ.
283. ఓం *ఈశానా*యై నమః ।
నామ
వివరణ.
ఈశ్వరుని
సతీమణి మన అమ్మయే.
తే.గీ.
వినుతి
గాంచితి *వీశాన*!
విశ్వనాథు
దేహభాగముగా
నుండి దీప్తిదవయి,
లోకపాలనఁ
జేయుచున్ శ్లోకరూపి
ణీ!
చిదానందమిమ్మమ్మ, నిన్నుఁ గొలుతు.
284. ఓం *హంసవాహిన్యై* నమః
నామ
వివరణ.
హంసను
వాహనముగా కలిగిన తల్లి మన అమ్మ.
తే.గీ.
*హంసవాహినీ*!
నాలోన హంస కలదు
దానినేవాహనమ్ముగా
దయను గొనుమ,
జ్ఞానమున
హంసతేజమున్ గనగనిమ్ము,
వందనంబులు
చేసెద నందుకొనుము.
285. ఓం
*నారాయణీ ప్రభాధారా*యై నమః
నామ
వివరణ.
నరులకు
ఆశ్రయమిచ్చే నారాయణి మన అమ్మ. నారాయణుని కాంతి ప్రవాహమే అమ్మ.
కం. జ్ఞానప్రద!
శ్రీనారా
యణీ ప్రభాధార! నిలువు మమ్మా మదిలో,
నీ
నామమె ప్రభఁ గొలుపును,
నా
మదిలో నుండి సతము, నా జనయిత్రీ!
ఓం *నారాయణ్యై*
నమః ।
నామ వివరణ.
నరులకు ఆశ్రయమిచ్చే నారాయణి మన అమ్మ.
తే.గీ.
వినుత *నారాయణీ! * నిన్ను విశ్వసింతు,
ప్రనుత సత్కావ్యములు గొల్పు ప్రాభవమును
నాకుఁ గలిగింపుమమ్మరో లోకమునను
వందనంబులు చేసెద నందుకొనుము.
ఓం *ప్రభాధారా*యై నమః ।
నామ వివరణ.
నారాయణుని కాంతి ప్రవాహమే అమ్మ.
తే.గీ.
నుత!
*ప్రభాధార!* నీకు సన్నుతులు జనని!
ప్రభను ధారగా కురిపించు పద్యములను
వ్రాయగాఁ జేసి కీర్తివై ప్రబలుమమ్మ.
వందనంబులు చేసెద నందుకొనుము.
286. ఓం *జాహ్నవ్యై* నమః ।
నామ
వివరణ.
జాహ్నవీ
నది అమ్మయొక్క రూపమే.
తే.గీ.
*జాహ్నవీ!* నిన్ను
నుతియింత్రు సత్ కవులిల
జీవకోటిని
బ్రతుకంగ చేయుదీవు,
దేవలోకముగా
భువి నీవె చేయ
వర్ధనంబగు
చుండెనో భక్త వినుత!
287. ఓం *శఙ్కరాత్మజా*యై నమః ।
నామ
వివరణ.
శంకరుని
యొక్క ఆత్మజ అమ్మ.
తే.గీ.
*శఙ్కరాత్మజా! * నాలోని
జంకుఁ బాపి,
పంకజాక్షుని
సేవలోఁ బరగనిమ్ము,
నేను
భక్తితోఁ బూజించి నిన్ను గనుదు,
వందనంబులు
చేసెద నందుకొనుము.
శ్లో.
చిత్రఘణ్టా సునందా శ్రీర్మానవీ మనుసంభవా ।
స్తంభినీ క్షోభిణీ మారీ భ్రామిణీ శత్రుమారిణీ ॥ 38 ॥
288. ఓం *చిత్రఘణ్టా*యై నమః ।
నామ
వివరణ.
ఈ
తల్లి శిరమున ఘంటాకారంలో ఉన్న చంద్రుని ధరించిన కారణంగా చంద్రఘంటగా ప్రసిద్ధమయింది. ‘‘ప్రసాదం తనుతే మహ్యం చన్ర్డఘణ్టేతి విశ్రుతా’’సుందరమయిన మెడ కలిగిన తల్లి మన అమ్మ.
తే.గీ.
*చిత్రఘణ్టా!* సునందాఖ్య!
చిత్స్వరూప
మీవె
నాలోన, నిజమిది, భావమెఱిఁగి,
నాదు
హృదయాన నిల్చి నన్నాదుకొనుము,
వందనంబులు
చేసెద నందుకొనుము.
289. ఓం *సునన్దా*యై నమః ।
నామ
వివరణ.
ఆనందము
కలిగించు కుమార్తె రూపముననుండునది అమ్మయే.
తే.గీ.
మనసుకానందమును
గూర్చు మా *సునన్ద!*
మానసంబున
నీవున్న మధుర కవిత
లద్భుతంబుగా
ప్రభవించు ననుపమగతి,
నిలిచి
నామదిన్, రక్షించు నిలకడగను.
ఓం *చిత్రఘణ్టా సునందా*యై నమః ।
నామ వివరణ.
సుందరమయిన మెడ కలిగిన తల్లి మన అమ్మ. ఆనందము కలిగించు కుమార్తె
రూపముననుండునది అమ్మయే.
తే.గీ.
*చిత్రఘణ్టాసునందా*ఖ్య! చిత్స్వరూప
మీవె నాలోన, నిజమిది, భావమెఱిఁగి,
నాదు హృదయాన నిల్చి నన్నాదుకొనుము,
వందనంబులు చేసెద నందుకొనుము.
290. ఓం *శ్రి*యై నమః ।
నామ
వివరణ.
మంగళస్వరూపిణి
మన అమ్మ సర్వ సంపత్ప్రద.
తే.గీ.
*శ్రీ!* దయానిధీ! మదిలో వసించరమ్ము,
స్వపర
భేదంబునే పాపి సన్నుతిఁ గను,
శ్రిత
జనానీక సత్పోష శ్రీ ప్రకాశ!
వందనంబులు
చేసెద నందుకొనుము.
291. ఓం *మానవ్యై* నమః ।
నామ
వివరణ.
మానవత్వము
కలిగిన మానవి మన అమ్మ.
తే.గీ. మనుజ!
*మానవీ!*
కృపఁ గను మంగళాంగి!
మానవత్వము
నశియించె మనుజులందు,
నీవు
శిక్షించు ధూర్తులన్, నిత్య భాస!
వందనంబులు
చేసెద నందుకొనుము.,
292. ఓం *మనుసమ్భవా*యై నమః ।
నామ
వివరణ.
అమ్మ
మనువునుండి సంభవించిన తల్లి.
కం. *మనుసమ్భవ*! నా
ప్రార్థన
వినుమమ్మ!
దయా సముద్ర! వినిపింతును నేన్
క్షణమొక
యుగముగ గడుపుచు
మనఁజాలను
నీవు లేక మదిలో జననీ!
293. ఓం *స్తమ్భిన్యై* నమః
నామ
వివరణ.
స్థంభించి
యుండు జనని మన అమ్మ.
తే.గీ.
*స్తమ్భినీ!*
నిలు మదిలోన స్తంభమట్లు
సంబరంబుగ
నిను గొల్తు సన్నుతపద!
పద్యకవితలన్
బ్రభవించు, పరవసింతు,
వందనంబులు
చేసెద నందుకొనుము.
294. ఓం *క్షోభిణ్యై* నమః ।
నామ
వివరణ.
క్షోభను
కలుగఁజేయు తల్లి అమ్మ.
తే.గీ. *క్షోభిణీ!*
మదినున్ననా
క్షోభఁబాపు
క్షోభ
వాసిన నీదగు శోభ నిలుచు,
శోభ
నిలిచిన కొలుచుట సులభమగును,
వందనంబులు
చేసెద నందుకొనుము.
295. ఓం *మార్యై* నమః ।
నామ
వివరణ.
అసుర
సంహారము చేయు తల్లి మన అమ్మ.
తే.గీ.
అసుర
సంహారిణీ *మారి! * మసలుదు రిల
రాక్షసాంశులా
యనదగు భ్రష్టులరెరె
మంచివారిని
హింసించు వంచితులగు
వారి
సంహారమొనరించు వీరమాత!
296. ఓం *భ్రామిణ్యై* నమః ।
నామ
వివరణ.
భ్రమణము
కలుగఁ జేయు జనని.
తే.గీ.
*భ్రామిణీ!* సృష్టి చేయును బ్రహ్మ నీవు
తనదు
ముఖమునఁ గల్గుటన్ దర్పమలర,
సృష్టి
చేయించు నీపైన దృష్టి పెట్టి
కవితలల్లెదనా
నీదు కరుణనొంది.
297. ఓం *శత్రుమారిణ్యై* నమః ।
నామ
వివరణ.
శత్రువులను
సంహరించు జనని అమ్మ.
తే.గీ. *శత్రు
మారిణీ! * నీ ప్రియ పుత్రుఁడఁ, గని
శత్రు
రహితునిగాఁ జేసి సదయ నిలుపు
మన్యమైనట్టివానిపై
యాశ లుడుపు,
వందనంబులు
చేసెద నందుకొనుము.
శ్లో.
మోహినీ ద్వేషిణీ వీరా అఘోరా రుద్రరూపిణీ ।
రుద్రైకాదశినీ పుణ్యా కల్యాణీ లాభకారిణీ ॥ 39 ॥
298. ఓం *మోహిన్యై* నమః ।
నామ
వివరణ.
మోహమును
కలుగజేయు తల్లి మన అమ్మ.
తే.గీ.
*మోహినీ!* జగత్ సృష్టిలో మోహమేల
కల్పనంబాయె?
నిజమును కనగలేము
మోహవిభ్రాంతిచేఁ,
గాన,
మోహముడిపి,
లోకమును
వెల్గఁ జేయుమా శ్రీకరముగ.
299. ఓం *ద్వేషిణ్యై* నమః ।
నామ
వివరణ.
ద్వేషమునకు
మూలమయిన తల్లి మన అమ్మ.
తే.గీ. *ద్వేషిణీ*! దుర్జనులపైన ద్వేషమూని
నాశనంబొనరింపుము
నయ నిధాన!
ద్వేష
శూన్యునిగా నన్ను తీర్చిదిద్ది
కాచి
రక్షించు మోయమ్మ! కన్నతల్లి!
300. ఓం *వీరా*యై నమః ।
నామ
వివరణ.
పరాక్రమము
కలిగిన వీరా మన అమ్మ.
తే.గీ. భీతినే పాపు *వీరా! * ప్రపూత చరిత!
ఖ్యాతిగా
మదిలోపలఁ గలిగియుండి
వీర
సంస్కారములు కొల్పి ప్రీతిఁ గనుమ
వందనంబులు
చేసెద నందుకునుము.
301.. ఓం *అఘోరా*యై నమః ।
నామ
వివరణ.
ఏమాత్రము
ఘోరముగా ఉండని జనని అఘోరా మన అమ్మ.
తే.గీ.
ఘోర
దూర! నన్ గాంచు *మఘోర* కృపను,
ఘోర
కృత్యముల్ చేసినఁ గూల్చుమమ్మ,
సార
హీన మీ సంసార భారమరయ,
ఘోర
భవబంధముల్ బాపి కూర్మిఁ గనుము.
302. ఓం *రుద్రరూపిణ్యై* నమః ।
నామ
వివరణ.
రుద్రుని
యొక్క రూపమున ఉండు జనని మన అమ్మ.
తే.గీ.
*రుద్ర
రూపిణీ!* నాలోని రౌద్రమీవె
శాంతముగఁ
జేసి, నిల్పితి చక్కగ నను
క్షుద్రులన్
బరిమార్చుమా రుద్రరూప!
వందనంబులు
చేసెద నందుకొనుము.
303. ఓం *రుద్రైకాదశిన్యై* నమః
నామ
వివరణ.
ఏకాదశ
రుద్రులూ మన అమ్మయే.
కం. *రుద్రైకాదశినీ!* నన్
భద్రంబుగ
కావుమమ్మ, భయదూర! కృపన్,
సద్రచనలు
చేయించుమ,
ముద్రితమవ
నీ ప్రశస్తి, పూజింతు నినున్.
304. ఓం *పుణ్యా*యై నమః.
నామ
వివరణ.
పుణ్యకార్యములను
ప్రశంసించు పుణ్యాత్మురాలు మన అమ్మ.
కం. *పుణ్యా!* కొలిచెద
నిన్నున్
గణ్యంబుగ
శుభకరముగ
గౌరవమొప్పన్,
బుణ్యాత్ములకెల్లప్పుడు
సన్యాయము
నడుపుమమ్మ సంస్తుతి గనగన్.
305. ఓం *కల్యాణ్యై* నమః.
నామ
వివరణ.
మంగళప్రదమయిన
తల్లి మన అమ్మ.
కం. *కల్యాణీ!* భూజనులిక
కల్యాణప్రదముగ
నిను గణియించుచు, సా
కల్యంబుగ
సత్ఫలితము
లౌల్యంబును
వీడి గనుత, లక్ష్యముతోడన్.
306. ఓం *లాభకారిణ్యై* నమః.
నామ
వివరణ.
లాభములకు
కారణభూతురాలు మన అమ్మ.
తే.గీ.
*లాభకారిణీ*!
నినుఁగొల్చి లాభములను
పొందు
గావుత జనపాళి భువిని సతము,
నేను
నిన్ గొల్తు నిత్యంబు నీవె నాదు
చిత్తపద్మమ్ముపైనుండి
చేదుకొమ్ము
శ్లో.
దేవదుర్గా మహాదుర్గా స్వప్నదుర్గాఽష్టభైరవీ ।
సూర్యచంద్రాగ్ని నేత్రా(రూపా) చ గ్రహనక్షత్రరూపిణీ ॥ 40 ॥
307. ఓం *దేవదుర్గా*యై నమః.
నామ
వివరణ.
నిద్రలో
ఉన్న దుర్గామాత మన అమ్మ.
తే.గీ.
*దేవదుర్గా! * సదానంద
దివ్యతేజ!
భావమందున
నిత్యమున్ ప్రబలుమమ్మ,
జీవకోటిని
కాపాడు శ్రీద! కృపను!
నన్ను
కాపాడు కృపఁజూపి సన్నుతముగ.
308. ఓం *మహాదుర్గా*యై నమః.
నామ
వివరణ.
మిక్కిలి
దుర్గమమయిన జనని మన అమ్మ.
తే.గీ.
ఓ
*మహాదుర్గ!* నా
మదినొప్పియుండి
నీదు
తేజంబునే గొల్పి మేదురముగ
భక్తిభావంబునే
గొల్పి శక్తి నిచ్చి
నన్ను
కాపాడు చుండుమా సన్నుతముగ.
309. ఓం *స్వప్నదుర్గా*యై నమః.
నామ
వివరణ.
కలలో
కూడా దుర్గమమయిన జనని మన అమ్మ.
తే.గీ.
*స్వప్నదుర్గా! * మహా
సాధ్వి! సన్నుతింతు
స్వప్నమందైన
కనిపించి సదయఁ గనుమ,
నీదు
రూపంబు కనినంత మేదురమగు
కవనసుధలొల్కు,
నెరవేరు కామితములు.
310. ఓం *అష్టభైరవ్యై* నమః.
నామ
వివరణ.
అష్టభైరవులూ
మన అమ్మయే.
తే.గీ.
*అష్టభైరవీ! * తీర్చు
నా కష్టములను,
కష్టములనుండియున్
నేను దృష్టి నిలిపి
నిన్నె
కొలిచెదనోయమ్మ నీరజాక్షి!
భక్తి
భావంబు విడనీకు భవ్య చరిత.
311. ఓం *సూర్యచన్ద్రాగ్ని(నేత్రా)
రూపా*యై నమః.
నామ
వివరణ.
సూర్యుఁడు,
చంద్రుఁడు, అగ్ని ఈ తల్లియొక్క రూపమే, ఈ తల్లియొక్క నేత్రములే.
తే.గీ.
*సూర్యచంద్రాగ్ని(నేత్రా)
రూపా! * వసుంధరపయి
సూర్యచంద్రాగ్ని
రూపిణీ! చొక్కి మదిని
వెలుగుచుండుము
నాలోన వేల్పువగుచు
వందనంబులు
చేసెద నందుకొనుము.
312. ఓం *గ్రహనక్షత్రరూపిణ్యై* నమః.
నామ
వివరణ.
గ్రహముల
నక్షత్రముల రూపములు మన అమ్మయే
తే.గీ.
ఓ
దయానిథీ! కొల్తు నిన్నొప్పిదముగ
నీదు
కృపఁ జూపి వసియించు నాదుమనము
న
*గ్రహ
నక్షత్ర రూపిణీ! * నన్నుఁ
గావ.
వందనంబులు
చేసెద నందుకొనుము.
శ్లో.
బిందునాదకళాతీతా బిందునాదకళాత్మికా ।
దశవాయుజయాకారా కలాషోడశసంయుతా ॥ 41 ॥
313. ఓం *బిన్దునాదకలాతీతా*యై నమః
నామ
వివరణ.
బిందుస్థానమునకు,
నాదమునకు, కళలకు అతీతమయిన తల్లి మన అమ్మ.
తే.గీ.
కనెద *బిన్దుకలాతీత! * కాంచనిమ్ము
నీదు
సద్రూప సంస్కృతుల్ సందడిగను,
కనిన
సత్కల్పనాశక్తి కవితకబ్బు
వందనంబులు
చేసెద నందుకొనుము.
314. ఓం *బిన్దునాదకలాత్మికా*యై నమః
నామ
వివరణ.
బిందువు,
నాదము, కళలకు ఆత్మ అమ్మయే.
తే.గీ.
*బిన్దునాదకలాత్మికా!
* విన్దుఁ
గొలుపు
మెందునున్నను
కనులకు సుందరమగు
నాదమైయొప్పి
చెవులకు మోదమునను
వందనంబులు
చేసెద నందుకొనుము.
ఓం *బిందునాదకళాతీతా బిందునాదకళాత్మికా* యై నమః.
నామ వివరణ.
బిందుస్థానమునకు, నాదమునకు, కళలకు అతీతమయిన తల్లి మన అమ్మ.
బిందువు, నాదము, కళలకు ఆత్మ అమ్మయే.
స్వయం కల్పిత బిందునాద కళావృత్తము.
గణములు. ర
స మ జ
జ గ….యతి 9వ అక్షరము. ప్రాస కలదు.
*బిందునాదకళాతీతా బిందునాదకళాత్మికా !*
మందగించెడి నా బుద్ధిన్ మాత! నీ కృప కాచునే,
సుందరంబగు నీరూపున్ చూచినంస్పృహ కల్గెడున్
బిందునాదకలన్నాకున్ విందుచేయుము శాంభవీ!
315. ఓం *దశవాయుజయా(జయోం)కారా*యై నమః.
నామ
వివరణ.
పంచ
వాయువులు
1. ప్రాణము
హృదయముననుండియు నాసికముండియు వెలువడును
2. అపానము
పొత్తికడుపునకు దిగువనుండి మలమూత్రాదుల వెడలింపజేయును
3. వ్యానము
శరీరము నందంతటను వ్యాపించి యుండును
4. ఉదానము
కంఠమునుండి మాటలాడ వీలుగలుగ చేయును
5. సమానము
అన్నాశయమున జఠరాగ్నికి సమీపమున యుండును
పంచ
ఉపవాయువులు
1. నాగము
వాక్కు నందుండునది
2. కూర్మము
కంటిరెప్ప లందుండునది
3. కృకరము
నేత్రము లందుండునది
4. దేవదత్తము
కంఠద్వారమున నుండునది
5. ధనంజయము
హృదయముననుండునది..
ఈ
దశ వాయువులను జయించిన ఓంకార స్వరూపిణి మన అమ్మ.
కం. *దశవాయుజయా(జ
యోం)కారా! *
నిశితముగా
నిన్నెఱింగి నీ కృపఁ గొనగా
సశరీరులు
యత్నింతురు,
దశమార్చుదువంచు
నిన్ను, ధన్యులు వారల్.
316. ఓం *కలాషోడశసంయుతా*యై నమః.
నామ
వివరణ.
పదునారు
కలలతో పూర్తిగా నిండియున్న తల్లి మన అమ్మ
పదునారు
కళలతో కూడియున్న జనని.
ఉ. వీడని
భక్తితత్వమును విస్తృతిగా మది గొల్పు మో *కలా
షోడశ సంయుతా!* మహిత
శోభన సద్వర భాసమానవై
నీడగ
నిల్చి నాకు వరణీయ మహత్వ కవిత్వ తత్వమున్
తోడనె
నేర్పుమమ్మ, వినుతుల్, జననీ! గణియించి మ్రొక్కెదన్.
శ్లో.
కాశ్యపీ కమలాదేవీ నాదచక్రనివాసినీ ।
మృడాధారా స్థిరా గుహ్యా దేవికా చక్రరూపిణీ ॥ 42 ॥
317. ఓం *కాశ్యప్యై* నమః.
నామ
వివరణ.
కాశ్యపి అనగా భూమి. భూమాత
మన అమ్మయే.
తే.గీ.
*కాశ్యపీ! * భక్తి
ముక్తులఁ గలుగఁ జేయు
నిన్ను కనుఁగొని
నీ శక్తి నెన్న తరమ?
మన్ననను
నినున్ గొల్తు నే సన్నుతముగ
నన్ను
దీవించు మమ్మరో! కన్నతల్లి!
318. ఓం *కమలాదేవ్యై* నమః.
నామ
వివరణ.
కమలమువలె కోమలమగు దేవియైన
కమలాదేవి అమ్మయే.
కం. *కమలాదేవీ!*నా మది
విమలంబది
నిన్ను దాల్చుఁ బ్రీతిగ నీవే
సుమధుర
భావములీయగ
సముదంచిత
రీతి రమ్ము సంస్తుతమతివై.
ఓం *కమలా*యై
నమః.
నామ వివరణ.
కమలము హృదయకమలము అమ్మయే.
కం. *కమలా!
* దేవీ! నా మది
విమలంబది నిన్ను దాల్చుఁ బ్రీతిగ నీవే
సుమధుర భావములీయగ
సముదంచిత రీతి రమ్ము సంస్తుతమతివై.
ఓం * దేవ్యై* నమః.
కం. కమలా! *దేవీ!*నా మది
విమలంబది నిన్ను దాల్చుఁ బ్రీతిగ నీవే
సుమధుర భావములీయగ
సముదంచిత రీతి రమ్ము సంస్తుతమతివై.
319. ఓం *నాదచక్రనివాసిన్యై* నమః.
నామ
వివరణ.
ఓంకార
నాదభరిత శ్రీచక్రమున నివసించు జనని
తే.గీ.
*నాదచక్ర నివాసినీ! * మేదుర
గతి
నా
దరిని నిల్చి వెల్గుమా, బోధ గొలుప,
శ్రీదవౌ
నిన్నుఁ గనియెద నాద చక్ర
మందు
భక్తితో, వర్ణింతు సుందరముగ.
320. ఓం *మృడాధారా*యై నమః.
నామ
వివరణ.
పరమేశ్వరునకు
ఆధారభూతమయిన జనని.
శివునకు
ఆధారమయిన తల్లి మన అమ్మయే.
తే.గీ. ఓ *మృడాధార!* నివసించుమొప్పిదముగ
నాదు
మదిలోన మృడునితో మేదురగతి,
ఖేదమును
బాపి కృపను నన్నాదుకొనుము,
వందనంబులు
చేసెద నందుకొనుము.
321. ఓం *స్థిరా*యై నమః.
నామ
వివరణ.
సర్వకాల
సర్వావస్థలయ్ందును స్థిరముగా ఉండు జనని.
స్థిరముగా
ఎన్నటికీ ఉండు జనని మన అమ్మ.
కం. స్థిరముగ
నామది నుండుము
వరమై
సతతంబు
నీవు
వర్ధిలఁజేయన్
గరుణను
నన్నున్, జననీ
*స్థిరా!* చిదానంద
తేజ! శ్రీకరమగుచున్.
322. ఓం *గుహ్యా*యై నమః.
నామ
వివరణ.
రహస్యమయిన
గూఢమయిన తల్లి మన అమ్మ.
తే. *గుహ్య!*
నా యహంబును బాపి కూర్మితోడ
నిన్ను వర్ణించనిమ్మమ్మ!
నిత్యమిటుల,
నైహికంబులనిత్యముల్,
మోహబాహ్య
మోక్షపథమిచ్చు
నీపదములను కనగ.
323. ఓం
దేవికాయై నమః.
నామ
వివరణ.
అమ్మ
దేవికా రూపిణి.
తే.గీ.
*దేవికా! * నిన్ను
గొల్వనీ దీక్షఁబూని
శ్రీ
వదాన్యుల బోధనల్ భావమందు
నిలిపి,
నినుచూడ నేర్వనీ, నిరుపమముగ,
వందనంబులు
చేసెద నందుకొనుము.
324. ఓం *చక్రరూపిణ్యై* నమః.
నామ
వివరణ.
శ్రీచక్ర
రూపమున వెలుగొందుచుండు తల్లి మన అమ్మ.
తే.గీ.
*చక్రరూపిణీ!
* సంసార
చక్రముపయి
తిరుగు
చుండుచు విసిగితి, పరమ పథము
నిన్ను
కోరితి నొసగుమాపన్న రక్ష
వౌచు
నాయమ్మ! నిన్ గొల్చి వేచియుంటి.
శ్లో.
అవిద్యా శార్వరీ భుంజా జంభాసురనిబర్హిణీ ।
శ్రీకాయా శ్రీకలా శుభ్రా కర్మనిర్మూలకారిణీ ॥ 43 ॥
325. ఓం *అవిద్యా*యై నమః.
నామ
వివరణ.
అజ్ఞానము
వెనుకనున్న శక్తి మన అమ్మయే.
తే.గీ.
కను
*మవిద్యా!*పరా
దేవి!
కరుణతోడ,
వినుము
నామొరలన్నియు వీనులార,
కనగనిమ్మమ్మ
నిన్ను నా కనులతోడ,
వందనంబులు
చేసెద నందుకొనుము.
326. ఓం *శార్వర్యై* నమః.
నామ
వివరణ.
రాత్రి
స్వరూపము అమ్మయే.
తే.గీ.
*శార్వరీ! * రాత్రివేళలో
జయనిధాన!
నిన్నుఁ
గొలిచెద నిద్రలోఁ గన్నతల్లి!
మాయఁ
జేయక మనసులో మధురమయిన
వెలుగు
నింపుము నిన్ గాంతు కలలనైన.
327. ఓం *భుఞ్జా*యై నమః.
నామ వివరణ.
సకల సుఖములను అనుభవించిన జనని మన అమ్మ.
కం. *భుఞ్జా!* నీ
శుభతేజము
భఙ్జించును
పాతకములు భక్తిని పలుకన్,
రఙ్జింపఁ
జేయుమా మది
కఞ్జాతా!
కరుణఁ జూపి కావుము నన్నున్.
328. ఓం *జమ్భాసురనిబర్హిణ్యై* నమః.
నామ
వివరణ.
ఇంద్ర
రూపంలో ఉన్న జంభాసురుని సంహరించిన తల్లి.
కం. నా
జన్మాంతము నిన్నే
రాజిల్లగఁ గోరి
కొలుతు రాజీవాక్షీ!
పూజింపనుంటి,
నిన్ గన
నీ! *జమ్భాసురనిబర్హిణీ!*
కృపఁ
గనుమా.
329. ఓం *శ్రీకాయా*యై నమః.
నామ
వివరణ.
సంపదయే
దేహముగా జన్మించిన జనని.
కం. *శ్రీకాయా! * నినుఁ
దలచుచు
శ్రీకారము
చుట్టినాడ చిత్రకవితకున్,
నీ
కారుణ్యమునను నను
లోకులు
గుర్తించిరమ్మ, శ్లోకాధిష్ఠా!
330. ఓం *శ్రీకలా*యై నమః.
నామ
వివరణ.
పవిత్రమయిన
కలారూపమమ్మయే.
తే.గీ.
*శ్రీకళా! * నీదు
కళలెన్న శ్రీకరములు,
నిండుకళలతో
నామది నుండుమమ్మ!
పండువెన్నెలగా
కృతుల్ పండఁ జేయ,
వందనంబులు
చేసెద నందుకొనుము.
331. ఓం *శుభ్రా*యై నమః.
నామ
వివరణ.
అన్నివిధములా
పవిత్రమయిన జనని.
కం. *శుభ్రా! * శోభన
రూపా!
విభ్రాంతిని
పొందె శివుఁడు వీక్షించి నినున్,
విభ్రాజిత
సత్కృతియగు
శుభ్రవు
నిన్ గొలుతుఁ గృతిని సుందర రూపా!
332. ఓం *కర్మనిర్మూలకారిణ్యై* నమః.
నామ
వివరణ.
సంచిత
కర్మలు నిర్మూలింపనడుటకు కారణభూతురాలు మన అమ్మ.
తే.గీ.
*కర్మ
నిర్మూల కారిణీ! * కనుదు
నిన్ను,
కర్మ
నిర్మూలనార్థిని, కనగనిమ్ము,
ధర్మసంస్థాపనార్థినీ! దయను మదిని
నిలిచి
కవితాకృతిన్ వెల్గు నిరుపమముగ.
శ్లో.
ఆదిలక్ష్మీర్గుణాధారా పంచబ్రహ్మాత్మికా పరా ।
శ్రుతిర్బ్రహ్మముఖావాసా సర్వసంపత్తిరూపిణీ ॥ 44 ॥
333. ఓం *ఆదిలక్ష్మ్యై* నమః.
నామ
వివరణ.
ప్రప్రథమ
లక్ష్మీమాత మన అమ్మయే.
తే.గీ.
ఆదిలక్ష్మీ! మహాదేవి!
యమర వినుత!
మోదమున
నాదు మదిలోన పూజ్యముగను
నిలిచి,
భాసింపఁ జేయుమా, నిర్వికల్ప,
వందనంబులు
చేసెద నందుకొనుము.
334. ఓం *గుణాధారా*యై నమః.
నామ
వివరణ.
సమస్త
గుణములకూ ఆధారము మన అమ్మయే.
తే.గీ.
వర
*గుణాధార! * భక్తి
సంభరిత మతిని
నిన్ను
సేవింపనుంటినో కన్నతల్లి!
నన్ను
గృపఁ జూడుమోయమ్మ, మన్ననమున,
వందనంబులు
చేసెద నందుకొనుము.
335. ఓం *పఞ్చబ్రహ్మాత్మికా*యై నమః .
నామ
వివరణ.
బ్రహ్మ,
విష్ణు, ఈశ్వర, సదాశివ, రుద్ర, అను పంచబ్రహ్మలను తనలో కలిగిన జ్నని.
కం. శ్రీ
*పఞ్చబ్రహ్మాత్మిక! *
దీపింపుము
నాదు మదిని దీనశరణ్యా!
యే
పాప ఫలమొ పుట్టితి
నే
పాపిగ,
కావుమమ్మ నీవే కృపతో.
336. ఓం *పరా*యై నమః.
నామ
వివరణ.
అన్నిటికీ
పైనుండు పరాదేవత మన అమ్మ.
తే.గీ.
ఓ
*పరా! * శక్తి
వీవమ్మ! నాపయి దయ
చూపి
పరమును గొల్పుమా, సుగుణపోష
వగుచు
నన్నేలుమ, శుభదవయిన జనని!
వందనంబులు
చేసెద నందుకొనుము.
337. ఓం *శ్రుత*యే నమః.
నామ
వివరణ.
వేదములు
అమ్మయే.
తే.గీ.
*శ్రుతి! * మహోదార
గుణపూర్ణ! శుభము నీకు,
గతివి
నీవమ్మ నాకు సద్గతిని గొలిపి
బ్రతుకు
పండించుమమ్మరో! భవ్యముగను,
వందనంబులు
చేసెద నందుకొనుము.
338. ఓం *బ్రహ్మముఖావాసా*యై నమః.
నామ
వివరణ.
బ్రహ్మ
ముఖమునే ఆవాసముగా కలిగిన తల్లి.
తే.గీ.
వినుత
*బ్రహ్మ
ముఖావాస! * వినుము మొరలు,
పద్య
ధారలలో నీవు వరలుమమ్మ
పద్యనైవేద్యమందుమా,
భక్తసులభ!
వందనంబులు
చేసెద నందుకొనుము.
339. ఓం *సర్వసమ్పత్తిరూపిణ్యై* నమః.
నామ
వివరణ.
సమస్త,అయిన సంపదలూ స్వరూపముగా కలిగిన తల్లి.
తే.గీ.
*సర్వసమ్పత్తి రూపిణీ!* నిర్వికల్ప!
సర్వసంపదలన్
గొల్పి సదయ గనుమ
భూమిపైనున్న
జనులను,మ్రొక్కుదు నిను,
వందనంబులందించెదనందుకొనుము.
శ్లో.
మృతసఞ్జీవనీ మైత్రీ కామినీ కామవర్జితా ।
నిర్వాణమార్గదా దేవీ హమ్సినీ కాశికా క్షమా ॥ 45 ॥
340. ఓం *మృతసఞ్జీవిన్యై* నమః.
నామ
వివరణ.
మృత్యువునకు
సంజీవిని అమ్మ.
తే.గీ.
అతులిత
మృత సఞ్జీవినీ! యమరవినుత!
మృతియె
భవమెన్న, గొలుతు నమృత పథంబు
నందు
నన్ నిల్పుమా సతీ! సుందరముగ,
వందనంబులు
చేసెద నందుకొనుము.
341. ఓం *మైత్ర్యై* నమః.
నామ
వివరణ.
అమ్మ
స్నేహ స్వరూపిణి.
కం. నినుఁ
గొలిచెద నో *మైత్రీ! *
ఘనముగ
నీవున్న చాలు గౌరవమొప్పన్
మనమున,
సంబరమొందుదు,
గుణపోషవు,
కరుణఁ గనుమ, కూరిమి తోడన్.
342. ఓం *కామిన్యై* నమః.
నామ
వివరణ.
కోరికల
స్వరూపము అమ్మయే.
తే.గీ.
*కామినీ! * నీవు
నాలోని కామములను
తుడిచి
ముక్తిని గొలుపుమా తోయజాక్ష!
క్షేమమీవేను కరుణించు
కీర్తి సాంద్ర!
వందనంబులు
చేసెద నందుకొనుము.
343. ఓం *కామవర్జితా*యై నమః.
నామ
వివరణ.
కోరికలను
విడనాడిన తల్లి అమ్మ.
తే.గీ.
*కామవర్జితా*! ముక్తిపై
కామమునిడి,
నిన్ను
దర్శింపనిమ్మమ్మ, సన్నుతముగ,
సొమ్ములేలను
నిలుమ నా నెమ్మనమున.
వందనంబులు
చేసెద నందుకొనుము.
344. ఓం *నిర్వాణ మార్గదా దేవ్యై*
నమః.
నామ
వివరణ.
మోక్షమార్గమును
ప్రసాదించు తల్లి.
తే.గీ.
దివ్య!
*నిర్వాణ మార్గదా దేవి! * నిన్ను
మదిని
నిలిపిన నిర్వాణ మార్గమమరు,
నిన్ను
మించిన దైవమున్ నేను గనను,
వందనంబులు
చేసెద నందుకొనుము.
ఓం *నిర్వాణమార్గదా*యై
నమః.
తే.గీ.
వినుత *నిర్వాణ మార్గదా!
* వేల్పువీవె
నన్ను రక్షింపనున్నట్టి నయనిధాన!
మహిత నిర్వాణ మార్గమును మహిమనొసగు
మమ్మరో నిల్చి మనమున నెమ్మితోడ.
ఓం *దేవ్యై* నమః.
తే.గీ.
దివ్య! నిర్వాణ మార్గదా! *దేవి!
* నిన్ను
మదిని నిలిపిన నిర్వాణ మార్గమమరు,
నిన్ను మించిన దైవమున్ నేను గనను,
వందనంబులు చేసెద నందుకొనుము.
ఓం *నిర్వాణమార్గదాదేవ్యై* నమః.
తే.గీ.
దివ్య *నిర్వాణ మార్గదాదేవి*! నీవె
నన్ను రక్షింపనున్నట్టి నయనిధాన!
మహిత నిర్వాణ మార్గమును మహిమనొసఁగు
మమ్మరో నిల్చి మనమున నెమ్మితోడ.
345. ఓం *హంసిన్యై* నమః .
నామ
వివరణ.
ఆడ
హంస స్థితిలోనుండు జనని.
తే.గీ.
*హంసినీ! * కన
నాలోని హంసవీవె,
రాజహంసగ
మది నిల్చి రక్షణనిడి
ముక్తి
సన్మార్గమున్ గొల్పు పొలుపుగాను,
వందనంబులు
చేసెదనందుకొనుము.
346. ఓం *కాశికా*యై నమః.
నామ
వివరణ.
ప్రకాశించు
తల్లి మన అమ్మ
తే.గీ.
జనని!
*కాశికా! * నినుఁ
గొల్వఁ జాలనమ్మ!
కాశికాపురి
ప్రభ్విణీ!
కరుణఁ
గనుచు
మమ్ము
రక్షించుచుంటివి మాననీయ!
వందనంబులు
చేసెద నందుకొనుము.
347. ఓం *క్షమా*యై నమః.
నామ
వివరణ.
అమ్మ
సహన స్వరూపిణి.
తే.గీ.
ఓ
*క్షమా! * గుణోద్ధామ! నా రక్ష నీవె,
నాదు
మదిలోన క్షమవయి యాదుకొనుము,
బాధలను
బాపి లోకానఁ బరగనిమ్ము,
వందనంబులు
చేసెద నందుకొనుము.
శ్లో.
సపర్యా గుణినీ భిన్నా నిర్గుణా ఖండితాఽశుభా ।
స్వామినీ వేదినీ శక్యా శాంబరీ చక్రధారిణీ ॥ 46 ॥
348. ఓం *సపర్యా*యై నమః.
నామ
వివరణ.
నిరతమూ
సాధకుల సపర్యలనందుకొను జనని.
కం. వినుత
*సపర్యా!* ప్రణతులు,
గొనుమా
నాదగు సపర్య,కూర్మిని జననీ!
మనమున
నీవుండినను సు
గుణములు
వర్ధిల్లునమ్మ గొప్పగ మదిలో.
349. ఓం *గుణిన్యై* నమః.
నామ
వివరణ.
సద్గుణ
నిధానము అమ్మ.
కం. *గుణినీ! * నా
భక్తిని మది
గణియింపుము,
కృపను గనుచు కరుణామయివై.
ప్రణతులు
చేసెద నమ్మా!
గుణగణనాభాస!
నిన్ను గూరిమిఁ గొలుతున్.
350. ఓం *భిన్నా*యై నమః.
నామ
వివరణ.
భిన్న
స్వరూపిణి అమ్మ.
కం. *భిన్నా! * నాబ్రతుకే
వి
చ్ఛిన్నంబగు,
కనవొ నీవు? చిత్రము గనెదో?
యున్నానని
రావమ్మా!
మన్ననతో
నీవు నాకు మంచిని కొలుపన్.
351. ఓం *నిర్గుణా*యై నమః.
నామ
వివరణ.
అమ్మ
గుణరహిత.
తే.గీ.
*నిర్గుణా! * జగదీశ్వరీ!
నిరుపమాన
సద్గుణంబులు
నాకిమ్ము సదయ హృదయ!
నిన్ను
వర్ణింప యత్నింతు నిరుపమాన!
వందనంబులు
చేసెద నందుకొనుము.
352. ఓం *అఖణ్డితా*యై నమః.
నామ
వివరణ.
ఖండింప
నలవికాని శక్తి సమన్విత అమ్మ.
తే.గీ.
దయను
గనుమో *యఖణ్డితా! * నయ
నిధాన
మీవె
నాలోన భాసించు జీవనముగ,
ఖండితంబుగ
చెప్పుమఖండిత! నిజ
శక్తి
నెన్నుచు తెలియగా, ముక్తినీయ.
353. ఓం *శుభా*యై నమః.
నామ
వివరణ.
అమ్మ
శుభముల స్వరూపిణి.
తే.గీ.
నుత
*శుభా! * నాదు
మదిలోన నతులితగతి
నుండి
వర్ధిల్లఁజేయుమా పండువగుచు,
శుభద
సత్కావ్య కల్పనా విభవమిచ్చి
నిన్ను
వర్ణింపఁ జేయుమా! మన్ననమున.
354. ఓం *స్వామిన్యై* నమః.
నామ
వివరణ.
అమ్మ
యజమాన స్వరూపిణి.
తే.గీ.
*స్వామినీ! * నీవె
జగతికి స్వామివమ్మ,
నిన్నె
పూజింతుఁ గృపఁ గను కన్నతల్లి!
జన్మ
సార్ధక్యమగుటకై జయనిధాన!
వందనంబులు
చేసెద నందుకొనుము.
355. ఓం *వేదిన్యై* నమః.
నామ
వివరణ.
విదితమగు
జనని వేదినీమాత మన అమ్మ.
తే.గీ.
*వేదినీ! * కన
జగతి యవేద్య మీవె
లేనినాడౌను,
నిజమమ్మ! ధీనిధాన!
వేద్యవగుమమ్మ
నాకు సువేద్య! కృపను.
వందనంబులు
చేసెద నందుకొనుము.
356. ఓం *శక్యా*యై నమః.
నామ
వివరణ.
సాధకులకు
శక్యమగు జనని.
కం. *శక్యా!* నిను
మదినిలుపుట
శక్యంబా?
కాదు మాకు, సద్గుణమతికిన్
శక్యంబగు,,
నాకదియును
శక్యంబగునట్లు
చేసి చక్కగ గనుమా.
357. ఓం *శామ్బర్యై* నమః.
నామ
వివరణ.
అమ్మ
మాయా స్వరూపిణి. కనుకట్టు అమ్మయే.
తే.గీ.
*శామ్బరీ! * మాయలోఁ
జిక్కి
జయ
నిధాన!
నిన్నుఁ
గొలుచుట మరచితిన్,
నేర్పు
మీర,
మాయ
తొలగించి, జ్ఞాన సంబంధమయిన
విద్యనందించు
నాకు నో విశ్వజనని!
358. ఓం *చక్రధారిణ్యై* నమః.
నామ
వివరణ.
చక్రమును
ధరించిన జనని.
తే.గీ.
చక్రధారిణీ!* యీ కాలచక్రమునను
నలిగిపోవుచు
నుంటిని నన్ను కాచి
రక్షణము
గొల్పుమమ్మరో! రాజిత పద!
వందనంబులు
చేసెద నందుకొనుము.
శ్లో.
దండినీ ముండినీ వ్యాఘ్రీ శిఖినీ సోమసంహతిః ।
చింతామణిశ్చిదానందా పంచబాణప్రబోధినీ ॥ 47 ॥
359. ఓం *దణ్డిన్యై* నమః.
నామ
వివరణ.
దోషులను
దండించు తల్లి మన అమ్మ.
తే.గీ.
*దణ్డినీ!* దేవి!
నీవు నా దణ్డనున్న
దండిగా
కవితాసుధల్ తరలివచ్చి
చేరునాకృతులందున
నేరుగాను,
దండిగా
నాకు నీకృపనుండనిమ్ము.
360. ఓం *ముణ్డిన్యై* నమః.
నామ
వివరణ.
పుర్రెలమాల
ధరించిన తల్లి.
తే.గీ.
*ముణ్డినీ! * రక్షవై
నాకునుండు నిన్ను
నెట్లు
వర్ణింప గలనమ్మ? యిందు వదన!
మండనంబుగ
కవితలోనుండుమమ్మ.
వందనంబులు
చేసెదనందుకొనుము.
361. ఓం *వ్యాఘ్ర్యై* నమః.
నామ
వివరణ.
అమ్మ
ఆడపులి.
తే.గీ.
*వ్యాఘ్రి! * దుర్గుణ
మృగములు ప్రబలు చుండె
నమ్మరో
నామదిన్, చంపుమమ్మ, నీవు
నన్ను
రక్షించుచుండుమా మన్ననమున,
వందనంబులు
చేసెదనందుకొనుము.
362. ఓం *శిఖిన్యై* నమః.
నామ
వివరణ.
అమ్మ
ఆడనెమలి
తే.గీ.
*శిఖిని! * నాకిమ్ము
సర్వతోముఖజయంబు,
లసదృశమ్ముగ,
నిన్ గొల్తు ననుపమాన!
దీప్తమౌనట్టి
సద్గుణవ్యాప్తిఁ గొల్పి
నిరతమున్
నన్ను రక్షించు నీరజాక్షి.
363. ఓం
*సోమ
సంహత్యై*
నమః.
నామ
వివరణ.
అనేకచంద్రుల
సమూహము అమ్మ. అంతటి చల్లని తల్లి.
తే.గీ.
*సోమ
సంహతీ!*కృపతోడ చూడు నన్ను,
చల్లగా
కావ నాలోన నెల్లవేళ
లందు
నీవుండి, కృపఁ జూపు,మమ్మ దయను,
వందనంబులు
చేసెద నందుకొనుము౭.
ఓం *సోమహన్త*యే
నమః.
తే.గీ.
*సోమహన్త!
* గుణోపేత శుభ చరిత్ర
వీవు, నిన్ గొల్తు భక్తితో నెంచి, నాదు
మనసులో సోములుండిరి, మరువకమ్మ
కూల్చి వారిని, కావు నన్ కువలయాక్షి.
364. ఓం *చిన్తామణ్యై* నమః.
నామ
వివరణ.
అనుకొన్నదంతయూ
ప్రసాదించు తల్లి మన అమ్మ.
కం. *చిన్తామణీ!*మదంబా!
సాన్తము
తోడుండి నడుపు చక్కగ నన్నున్,
చిన్తావంశజుడను,
ని
శ్చిన్తగ
నీ వలననుంటి, చేదుకొనుమిలన్
365. ఓం *చిదానన్దా*యై నమః.
నామ
వివరణ.
నిరంతర
చిదానందస్వరూపిణి మన అమ్మ.
తే.గీ.
ఓ
*చిదానన్ద!* తేజా!
సముద్ధరింప
జగతి
కానంద దీప్తులు చక్కగాను
పంచుచున్నట్టి
నిన్ను నే నంచితముగ
కొలిచెదన్
మదిలోపలన్ గొలువు
తీరు.
ఓం *చిన్తామణిచిదానన్దా*యై
నమః.
నామ వివరణ.
అనుకొన్నదంతయూ ప్రసాదించు నిరంతర చిదానందస్వరూపిణి మన అమ్మ.
స్వయంకల్పిత చింతితానంద వృత్తము.
గణములు. త
స త స
య….
యతి 9వ అక్షరము. ప్రాస కలదు.
*చిన్తామణిచిదానన్దా* శివ నుతా! మదమ్బా!
చిన్తా కులజుడన్ నేనీ క్షితిని రామకృష్ణన్,
శాన్తిన్ గనగ లేకుంటిన్, సరగునన్ భవానీ!
చిన్తల్ విడును నీవున్నన్ క్షితిని గావు నన్నున్.
366.. ఓం *పఞ్చబాణప్రబోధిన్యై* నమః.
నామ
వివరణ.
పరమేశ్వరునకు
పంచబాణప్రబోధిని మన అమ్మ.
తే.గీ.
*పఞ్చబాణప్రబోధినీ! * సఙ్చితముల
నెటులనెడబాపుదో
నీవహీన గతిని,
శివునిమెప్పించి
పొందిన చిత్ప్రభాస!
నన్ను
రక్షింప వేడుచు నిన్నుఁ గొలుతు.
శ్లో.
బాణశ్రేణిస్సహస్రాక్షీ సహస్రభుజపాదుకా ।
సంధ్యావలిస్త్రిసంధ్యాఖ్యా బ్రహ్మాండమణిభూషణా ॥ 48 ॥
367. ఓం *బాణశ్రేణ*యే నమః.
నామ
వివరణ.
బాణముల
వరుసను కలిగియున్న జనని మన అమ్మ
కం. *బాణశ్రేణీ! * దురితుల
క్షోణిన్
బడఁ జేయుమమ్మ కూర్మిని నన్నున్
వాణీ
భక్తుఁడనంచును,
ప్రాణంబుగ
చూచుకొనుము, బ్రతిమాలెద నిన్.
368. ఓం *సహస్రాక్ష్యై* నమః.
నామ
వివరణ.
వేయి
కన్నులు కల తల్లి మన అమ్మ.
కం. సురవినుత
*సహస్రాక్షీ*!
ధరలోనన్
సుగుణ తతిని తప్పక కనుమా,
నిరతము
నీ సేవలలో
పరమార్థము
గొనుదునమ్మ! పావన చరితా!
369. ఓం *సహస్రభుజపాదుకా*యై నమః.
నామ
వివరణ.
వేయిభుజములూ
పాదములూ కలిగిన తల్లి మన అమ్మ.
కం. సకలము
*సహస్రభుజపా
దుక! * నీవే,
కద మదంబ! తోయజ ముఖి! నా
కిక
నీవే తోడగుచున్
సకలము
సరి చూడుమమ్మ! చక్కగ జననీ!
370. ఓం *సన్ధ్యావలయే* నమః.
నామ
వివరణ.
నడుమ
భాగమున ముడుతలు కలిగిన జనని.
కం. *సన్ధ్యావలి! * గొలుతు
నుభయ
సన్ధ్యలలో
మదిని నిన్ను చక్కగఁ గనుచున్,
నిన్ద్యమగు
భావనుడుపుము,
సంధ్యాసమయంబులందుఁ
జక్కగఁ గనుమా.
371. ఓం *త్రిసన్ధ్యాఖ్యా*యై నమః.
నామ
వివరణ.
ఉదయ,
మధ్యాహ్న, సాయం సంధ్యా స్వరూపిణి అమ్మ.
తే.గీ.
ఘన
*త్రిసన్ధ్యాఖ్య!
* నీద్యుతిఁ
గనగనిమ్ము,
పాగడగా
నేర నిన్నెంచి పూర్తిగాను,
సంధ్యవేళల
నిన్నెంచి ప్రస్తుతింతు,
వందనంబులుచేసెదనందుకొనుము.
372. ఓం *బ్రహ్మాణ్డమణిభూషణా*యై నమః.
నామ
వివరణ.
బ్రహ్మాండము
అనెడి మణిని అలంకారముగా కలిగిన తల్లి.
తే.గీ.
అలరు *బ్రహ్మాణ్డమణిభూషణా! * మనమున
వెలయఁజేయుము
బ్రహ్మాండ విశ్వవినుత
పద్యజాలమున్
నానుండి భవ్యముగను,
వందనంబులు
చేసెద నందుకొనుము.
శ్లో.
వాసవీ వారుణీసేనా కులికా మంత్రరంజనీ ।
జితప్రాణస్వరూపా చ కాంతా కామ్యవరప్రదా ॥ 49 ॥
373. ఓం *వాసవ్యై* నమః.
నామ
వివరణ.
ఇంద్రుని
యొక్క శక్తి స్వరూపిణి అమ్మ.
తే.గీ.
*వాసవీ! * ఘన
నుత భాస! భాగ్యమగుచు
నామనంబున
కొలువుండి ప్రేమ మీర
సద్గుణంబులఁ
గొల్పుమా సరస మతిని,
వందనంబులు
చేసెద నందుకొనుము.
374. ఓం *వారుణీసేనా*యై నమః.
నామ
వివరణ.
పడమటదిక్కున
భయంకరమైన సైన్యమును కలిగియున్న్ అజనని మన అమ్మ.
తే.గీ.
*వారుణీసేన! * దుష్టులన్
బ్రబలనీక
నీవు
వారించుమమ్మరో! భావనలను
దుష్టదూషితముల్
బాపు నిష్టతోడ,
వందనంబులు
చేసెదనందుకొనుము.
375. ఓం *కులికా*యై నమః.
నామ
వివరణ.
ఉత్తమ
కులీన అమ్మ.
కం. *కులికా!* చింతావంశజ
కలిదూరుఁడ
రామకృష్ణ కవినమ్మా నా
యిలవేల్పువీవె,
కనుచున్
వెలయింపుము
భక్తి కవిత వెల్లువకాగన్.
376. ఓం *మన్త్రరఞ్జన్యై* నమః .
నామ
వివరణ.
మంత్రముచే
రంజించు తల్లి మన అమ్మ.
తే.గీ.
*మన్త్రరఞ్జనీ! * నీ నామ మంత్రములను
మనసునందున
భావించి మనన జేసి
నీకునర్పింతునమ్మ!
గణించి నిన్ను,
వందనంబులు
చేసెద నందుకొనుము.
377. ఓం *జితప్రాణస్వరూపా*యై నమః.
నామ
వివరణ.
జయించఁబడిన
ప్రాణ స్వరూపము కలది అమ్మ.
కం. పరమాత్మవె
నీవమ్మా!
కరుణామయివమ్మ
మమ్ము కాపాడుమిలన్,
నిరతము
నిన్నే గొలిచెద
వర
*జితప్రాణస్వరూప!* వందనమమ్మా!
378. ఓం *కాన్తా*యై నమః.
నామ
వివరణ.
తేజస్స్వరూపిణి
మనఅమ్మ.
కం. అన్తా
నిన్నే కొలుతురు,
*కాన్తా!* మనసార,
శుభము కాదనకిమ్మా,
సన్తోష
మొసగు తల్లివి,
సాన్తము
నను కావుమమ్మ సజ్జన భాసా!
379. ఓం *కామ్యవరప్రదా*యై నమః.
నామ
వివరణ.
కోరిన
కోరికలను ప్రసాదించు జనని మన అమ్మ.
తే.గీ.
గౌరవంబుగ
నిను మదిన్ గలయఁ జూచి
యాత్మలో
సేవ చేయగ నాశపడుదు,
కనుచు *కామ్యవరప్రదా!* కనికరించు,,
వందనంబులు
చేసెద నందుకొనుమ.
శ్లో.
మంత్రబ్రాహ్మణవిద్యార్థా నాదరూపా హవిష్మతీ ।
ఆథర్వణిః శ్రుతిః శూన్యా కల్పనావర్జితా సతీ ॥ 50 ॥
380. ఓం *మన్త్రబ్రాహ్మణవిద్యార్థా*యై నమః.
నామ
వివరణ.
బ్రహ్మ
మంత్రాభ్యాసము చేయు తల్లి.
కం. *మన్త్రబ్రాహ్మణవిద్యా
ర్థా*న్త్రములన్ బిగియఁ బట్టి ప్రఖ్యాతిగ నీ
మన్త్రంబులు
చదువు ఘనుల
కున్త్రాసము
కలుగనీకు, కొలిచెద నిన్నున్. (అంత్రములు=ప్రేగులు)
381. ఓం *నాదరూపా*యై నమః.
నామ
వివరణ.
ఓంకార
నాద స్వరూపిణి అమ్మ.
తే.గీ.
*నాదరూపా! * మహాదేవి! బోధఁ
గొలుపు
మాత్మలోనుండి
నాకిల నతులితముగ.
నాదరూపాత్మ
నేను నీ కాదరమున
వందనంబులు
చేసెద నందుకొనుము.
382. ఓం *హవిష్మత్యై* నమః.
నామ
వివరణ.
హోమగుండమునవేయు
హవిస్సులు అమ్మయే.
తే.గీ.
విను
*హవిష్మతీ! * కృపతోడ
వీనులార,
పద్యపాదమ్ములన్
హవిర్భాగముగను
నీకు
నర్పించుటెఱుఁగను, నీవె కనుచు
స్వీకరింపుము
పద్యాల చిత్ర గతులు.
383. ఓం *ఆథర్వణ్యై* నమః.
నామ
వివరణ.
అధర్వణ
వేదము అమ్మయే.
తే.గీ.
మహిత
*యాథర్వణీ! * నీవు
మహిమ తోడ
పద్య
రూపాన ప్రభవించు, పరవశింతు,
వెలుగ
పద్యమధర్వణ వేద సరణి
నందఁ
జేసెద నీ కృపనంది నీకు.
384. ఓం *శృత*యే నమః.
నామ
వివరణ.
అమ్మ
వేదముల రూపమే.
తే.గీ.
*శ్రుతి! * యనుశ్రుతంబుగ
వెల్గు చుండె జగతి,
శ్రుతులు,
నీరూపమగుటచే నతులితముగ,
కృత
మహాపుణ్య ఫలముచే శ్రుతులు దొరుకు
ప్రభవమొందెడి
పద్యముల్ వరలు శ్రుతియె
ఓం *ఆథర్వణిః శ్రుతయే* నమః.
తే.గీ.
నిరుప*యాధర్వణిఃశ్రుతీ!
* నిన్నుఁ గొలుతు
వేద విజ్ఞానమే లేని సాధకుఁడను,
నీవె నాకు వేదంబులు నిజము తల్లి!
వందనంబులు చేసెద నందుకొనుము.
385. ఓం *శూన్యా*యై నమః.
నామ
వివరణ.
ఆరంభము
ముగింపు లేని శూన్య మన జనని.
తే.గీ.
*శూన్య! * లోకంబు
శూన్యమే, చూడకున్న
నిన్ను
మనసార మదిలోన మన్ననమున,
మాన్య!
హృదయంబులో చేరు, ధన్యునగుదు,
వందనంబులు
చేసెద నందుకొనుము.
386. ఓం *కల్పనావర్జితా*యై నమః. ॥ ౩౮౦ ॥
నామ
వివరణ.
కల్పననుండి
వర్జింపబడిన అకల్ప మన అమ్మ.
తే.గీ.
*కల్పనావర్జితా! * స్వ
సంకల్పమదియె
సృష్టి
జరుగఁగఁ జేయునే, దృష్టి పెట్టి
కల్పనంబును
చేయవు, కమల నయన!
వందనంబులు
చేసెద నందుకొనుము.
387. ఓం *సత్యై* నమః.
నామ
వివరణ.
సదీదేవి
మన అమ్మయే.
తే.గీ.
*సతి! * పరాశక్తి
నాలోన సన్నుతముగ
నిత్యమున్
వెల్గు చుంటివి, భృత్యులెల్ల
సేవలందింపఁ
గొనుటకై, సేవ్య పాద
పద్మములు
నీవె పద్య సంభాస! నతులు.
శ్లో.
సత్తాజాతిః ప్రమాఽమేయాఽప్రమితిః ప్రాణదా గతిః ।
అవర్ణా పంచవర్ణా చ సర్వదా భువనేశ్వరీ ॥ 51 ॥
388. ఓం *సత్తాజాత*యే నమః.
నామ
వివరణ.
గొప్పబ్రహ్మ
కుటుంబమునకు చెందిన జనని మన అమ్మ.
తే.గీ.
నతులు
వినుత *సత్తాజాత! * గతిని
మార్చి,
నన్ను
సన్మార్గమున నిల్పి, మన్ననమున
కన్నతల్లివై
రక్షింపు కరుణఁ జూపి,
వందనంబులు
చేసెద నందుకొనుము.
389. ఓం *ప్రమా*యై నమః.
నామ
వివరణ.
భక్తులను
అంచనా వేయగలిగిన తల్లి మన అమ్మ.
తే.గీ.
ఓ
*ప్రమా! * మాత!
భక్తుల నొనరఁ గనుచు,
వారి
శక్తిని మతినెంచి ప్రణవ తేజ
మందఁ
జేయుచు శుభదవై ముందు నడుపు
నిన్ను
మతినెంచి చూచెద సన్నుతముగ.
390. ఓం *అమేయా*యై నమః ।
నామ
వివరణ.
ఎటువంటి
సరిహద్దులూ లేని జనని.
తే.గీ.
కను
*మమేయా! * మహిత
భక్త కామ్యదవయి,
కని
యమేయమౌ నినుఁ గను కామితమును
తీర్చు
మాత్మ సువర్చవై తీరుగాను,
వందనంబులు
చేసెద నందుకొనుము.
ఓం *మేయా*యై
నమః.
తే.గీ.
భక్తులకు మేయవీవమ్మ, భవ్య*మేయ!
*
భక్తసులభవు కావునన్ భజన చేతు
భక్తి గొలుపుచు మదిలోన వరలుమమ్మ,
వందనంబులు చేసెద నందుకొనుము.
391. ఓం *అప్రమిత*యే నమః.
నామ
వివరణ.
ప్రమితమేమాత్రమూ
కాని జనని మన అమ్మ.
తే.గీ.
ప్రమిత
మన్నది లేని *యప్రమితి! * నతులు,
వేద
సంభాసితా నీదు వెలుగు తీరు
కనగ
నప్రమితమ్ముగా, ప్రణుతులమ్మ!
వందనంబును
చేసెద నందుకొనుము.
ఓం *ప్రమితయే* నమః
తే.గీ.
వేద మూలసూత్రములచే విదితమగుచు,
*ప్రమితి!
* నా నుతులంది, నా భ్రమలు పాపు
మమ్మరో! నీదు మది కడుఁ గమ్మనమ్మ,
వందనంబులు చేసెద నందుకొనుము.
392. ఓం *ప్రాణదా*యై నమః.
నామ
వివరణ.
ప్రాణములను
ప్రసాదించు జనని.
తే.గీ.
*ప్రాణదా! * నీవె
నాకున్న ప్రాణమమ్మ!
ప్రణవ తేజంబె
ప్రాణమై ప్రబలు లోన,
జీవమేబ్రహ్మమైక్యమై
చెలగునట్లు
చేయుమమ్మరో నీకృపన్
జిత్తమలర.
393. ఓం *గత*యే నమః.
నామ
వివరణ.
గమ్యమయిన
తల్లి మన అమ్మయే.
తే.గీ.
*గతి! * శుభాకార
వీవమ్మ కరుణ తోడ
గతివగుచు
నాకు ముక్తిని
కలుగఁ
జేయు
మమ్మ!
పూజింతు నిన్ను నే నెమ్మితోడ,
వందనంబులు
చేసెద నందుకొనుము.
394. ఓం *అపర్ణా*యై నమః.
నామ
వివరణ.
పార్వతీ
మాత మన అమ్మయే.
తే.గీ. అక్షయంబగు శివదీక్ష నలరి నీవు
పర్ణమైనను
గొనని యపర్ణవమ్మ,
కను
*మపర్ణ! * నన్
సతతంబుఁ గరుణతోడ,
వందనంబులు
చేసెద నందుకొనుము.
395. ఓం *పఞ్చవర్ణా*యై నమః.
నామ
వివరణ.
నమశ్శివాయ
అను ఐదు వర్ణముల స్వరూపము అమ్మయే. విస్తారమై యొప్పు వర్ణ
సముదాయము
అమ్మయే.
తే.గీ.
*పఞ్చవర్ణా! * సువిదిత
ప్రపంచమైన
భవుని
పఞ్చాక్షరిన్ గల్గు వర్ణములవి
నీవె
గణియింప, నిజమిది నీరజాక్షి!
వందనంబులు
చేసెద నందుకొనుము.
396. ఓం *సర్వదా*యై నమః. ॥ ౩౯౦ ॥
నామ
వివరణ.
సమస్తమునూ
ప్రసాదించు జనని అమ్మయే.
తే.గీ.
సర్వమిచ్చెడి
*సర్వదా! * సవినయముగ
నిన్నుఁ
గొలిచెడి భక్తులే సన్నుతులిల,
ముక్తి
నీవెయై యొసగెడి శక్తివమ్మ
నిన్ను
కోరగానేల నాపన్న రక్ష!
397. ఓం *భువనేశ్వర్యై* నమః.
నామ
వివరణ.
చతుర్దశ
భువనములకూ ప్రభ్విణి మన అమ్మయే.
తే.గీ.
మహిత
*భువనేశ్వరీ! * జయ
మార్గ మీవె,
నాదు
దేహంబె భువనము, మోదమొసగు
నీవె
యీశ్వరి విచ్చటన్, నిన్నుఁ గొలుతు,
వందనంబులు
చేసెద నందుకొనుము.
శ్లో.
త్రైలోక్యమోహినీ విద్యా సర్వభర్త్రీ క్షరాఽక్షరా ।
హిరణ్యవర్ణా హరిణీ సర్వోపద్రవనాశినీ ॥ 52 ॥
398. ఓం *త్రైలోక్యమోహిన్యై* నమః.
నామ
వివరణ.
మూడులోకములకూ
మోహమును కలుగఁజేయు తల్లి.
తే.గీ.
తలప *త్రైలోక్యమోహినీ! * దారి నీవె
ముక్తిపై
మోహినైయుంటి భుక్తితోడ
ముక్తినొసగుము,
నినుఁ గొల్చి పూజ చేసి
వందంబులు
చేసెద నందుకొనుము.
399. ఓం *విద్యా*యై నమః.
నామ
వివరణ.
విద్యా
స్వరూపిణి అమ్మ.
తే.గీ.
మహిత
*విద్యా! * శుభాకార!
స్పృహను గొలిపి
పద్య
విద్యవై నాలోన ప్రబలు నీవు
ముక్తి
గొలిపెడి విద్య నాసక్తి నిమ్ము,
వందనంబులు
చేసెద నందుకొనుము.
400. ఓం *సర్వభర్త్ర్యై* నమః.
నామ
వివరణ.
సమస్తమును
భరించు జనని అమ్మ.
తే.గీ.
*సర్వభర్త్రీ! * సదాచార!
సర్వ మీవె,
చూచి
పూరించు తల్లివి,
వేచితి
నిట,
భుక్తి
ముక్తుల నిచ్చు నిన్ బూజ చేయ,
వందనంబులం
జేసెదనందుకొనుము.
401. ఓం
*క్షరా*యై నమః.
నామ
వివరణ.
నశింపఁజేయగల
తల్లి మన అమ్మ.
తే.గీ.
సతి!
*క్షరా! * సుధాసింధు!
నిన్ నుతులు సేయ
నాదు
శక్తి చాలదుకదా!
మోదమలర
మదిని
భావించు నా భక్తి, మన్ననమున,
వందనంబులు
చేసెద నందుకొనుమ.
402. ఓం *అక్షరా*యై నమః.
నామ
వివరణ.
నాశ
రహిత అమ్మ.
తే.గీ.
క్షరము
కానట్టి తల్లి*వక్షర! * మదంబ!
స్థిరముగా
నీవు నా మదిన్ వరలుమమ్మ!
నిన్ను
సేవించి కృతినౌదు మన్ననమున,
వందనంబులు
చేసెద నందుకొనుము.
ఓం*క్షరాక్షరా*యై
నమః.
నామ వివరణ.
నశింపఁజేయగల నాశ రహిత అమ్మ.
తే.గీ.
ఓ *క్షరాక్షరా!
* మదిలోన నుండుమమ్మ!
క్షరముగానున్న దేహాన కరుణ తోడ
నక్షరంబుగ వెలుగుదువమ్మ నీవు
వందనంబులు జేసెద నందుకొనుము.
403. ఓం *హిరణ్యవర్ణా*యై నమః.
నామ
వివరణ.
స్వర్ణ
స్వరూపిణి అమ్మ.
తే.గీ.
అనుపమ
*హిరణ్యవర్ణా! * ప్రియంబు
తోడ
నీవు
మాలోన వెలుగుచు నేర్పు మీర
భవ్య
సంస్కారమనియెడి స్వర్ణమిచ్చి,
నిలుపుచుంటివి
నీలోనఁ గలుపుకొనగ.
404 ఓం *హరిణ్యై* నమః.
నామ
వివరణ.
దుఃఖహారి
మన అమ్మ.
తే.గీ.
*హరిణి! * మా
బాధలన్ బాపు నిరుపమవని
నిన్ను
సేవించుచుంటి నాపన్న రక్ష!
నాదు
బాధలన్ హరియించి యాదుకొనుము,
వందనంబులు
చేసెద నందుకొనుము.
405. ఓం *సర్వోపద్రవనాశిన్యై* నమః.
నామ
వివరణ.
సమస్తమయిన
ఉపద్రవములను హరించు తల్లి.
కం. *సర్వోపద్రవ నాశిని! *
గర్వాంధ
తమమ్ము బాపు కరుణామూర్తీ!
నిర్వక్ర
ముక్తి మార్గము
నుర్విన్
దయ చేయుమమ్మరో! నినుఁ
గొలుతున్.
శ్లో.
కైవల్యపదవీరేఖా సోమమండలసంస్థితా ।
సూర్యమండలమధ్యస్థా వహ్నిమండలసంస్థితా ॥ 53 ॥
406. ఓం *కైవల్యపదవీరేఖా*యై నమః.
నామ
వివరణ.
మోక్షమార్గము
మన జనని.
స్వయం కల్పిత కాంతిపుంజ వృత్తము.
గణములు….
త స మ
య జ గ…..
యతి 9వ అక్షరము.
*కైవల్యపదవీరేఖా! * కాంతిరేఖా!
మనోహరీ!
భావంబునను
నీవేగా ప్రాణమై కాంతి చిందుదే,
జీవాత్మవయి
నీవే
నా
చిత్తమందున్ వెలుంగుదే,
దేవీ!
గొలుపుమా నీదౌ దీప్తి నాలో, నమోస్తు తే.
407. ఓం *సోమమణ్డల సంస్థితా*యై నమః.
నామ
వివరణ.
చంద్ర
మండలమున ఉండు తల్లి.
తే.గీ. *సోమ
మండలసంస్థిస్థ! * శుభదవీవు,
చల్లనైనట్టి
చంద్రికల్ సదయనీవు
నాదు
కవితలన్ వెలయించు నాదు జనని!
నీ
కృపన్బ్రజ నేలుమా నిరతమీవు.
408. ఓం
*సూర్యమణ్డల మధ్యస్థా*యై నమః.
నామ
వివరణ.
సూర్యమండల
మధ్యప్రదేశమున ఉండు జనని.
తే.గీ. *సూర్యమణ్డల మధ్యస్థ! * శోభలొలుకు
దివ్య
కవితా మహాద్యుతిన్ భవ్యముగను
నాకుఁ
దయచేయుమమ్మరో! ప్రాకటముగ
వందనంబులందించెద
నందుకొనుము.
ఓం *సూర్యమణ్డలసంస్థితా*యై
నమః ॥ ౪౦౦ ॥
నామ వివరణ.
సూర్యమండలమున ఉండు తల్లి మన అమ్మ.
తే.గీ.
*సూర్యమణ్డలసంస్థితా!
* శుభ నిధాన!
లోక కల్యాణకాంతులన్ బ్రాకటముగ
మాకునందింపఁ జేరితే శ్రీకరముగ
వందనంబులు చేసెద నందుకొనుము.
ఓం *సోమమణ్డలమధ్యస్థా*యై
నమః.
నామ వివరణ.
తే.గీ. *సోమ మణ్డల మధ్యస్థ!
* శుభ నిధాన!
చల్లనైనట్టి వెన్నెల నుల్లమలర
నాకు దయచేసి, కవితలోన వెలిగి యిట
పాఠకుల మతికెక్కుమా భవ్యముగను.
409. ఓం *వహ్నిమణ్డలసంస్థితా*యై నమః.
నామ
వివరణ.
అగ్నిమండల
మధ్యమున ఉండు జనని మన అమ్మ.
తే.గీ. *వహ్నిమణ్డలసంస్థితా!
* యాహ్నికముల
నంతరాత్మలో
జరుగనీ శాంతినలర
కర్మబంధముల్
విడఁజేసి ధర్మవర్త
నంబు
కలిగించు కృపతోడ నయ నిధాన!
శ్లో.
వాయుమండలమధ్యస్థా వ్యోమమండలసంస్థితా ।
చక్రికా చక్రమధ్యస్థా చక్రమార్గప్రవర్తినీ ॥ 54 ॥
410. ఓం *వాయుమణ్డలమధ్యస్థా*యై నమః.
నామ
వివరణ.
వాయుమండల
మధ్యమున ఉండు జనని లక్ష్మీదేవి.
తే.గీ. *వాయుమణ్డలమధ్యస్థ!
* పాయక
నను
నాత్మలోనుండి
వెలుగుమా, యహరహంబు,
ప్రాణవాయువై
జగతికి ప్రభను పెంచు,
వందనంబులందించెద
నందుకొనుము.
411. ఓం *వ్యోమమణ్డలసంస్థితా*యై నమః.
నామ
వివరణ.
ఆకాశమండలమున
ఉండు తల్లి మన అమ్మ.
తే.గీ. *వ్యోమ
మండల సంస్థితా*!వ్యోమమదియు
కలిగె
నాలోన నీ వట వెలుగుమమ్మ,
కవితవై
ప్రభవించి యాకాసమంత
జ్ఞానసంపత్తి
నొసగుమా కమల నయన!
412. ఓం *చక్రికా*యై నమః.
నామ
వివరణ.
దివ్యమయిన
చక్రము కలిగిన తల్లి, శ్రీచక్రస్వరూపిణి అమ్మ.
తే.గీ. *చక్రికా! * గనుమమ్మ
సంసార చక్ర
మధ్యమున
నేను నలుగుచు మహితవయిన
నిన్ను
సేవింప లేకుంటి సన్నుతముగ,
నన్ను
గాపాడుమా కృపన్ మిన్నగాను.
413. ఓం *చక్రమధ్యస్థా*యై నమః.
నామ
వివరణ.
శ్రీచక్ర
మధ్యభాగమున ఉండు జనని.
తే.గీ. చక్రమధ్యస్థ! యీ కాల
చక్రమునను
నలుగు
సామాన్య జనులకు వెలుగుఁ జూపి
నీవె
కాపాడుమమ్మరో భావగమ్య!
వందనంబులందించెద
నందుకొనుము.
414. ఓం *చక్రమార్గప్రవర్తిన్యై* నమః.
నామ
వివరణ.
శరీర
చక్రముల మధ్య ప్రయాణించు తల్లి.
కం. *చక్రమార్గ ప్రవర్తినీ! * వక్రగతిని
నిలిపి, నాలోన
కృపతోడ నిలువుమమ్మ,
నిత్యమాత్మన్
బ్రకాశించు సత్యమీవు,
వందనంబులందించెద
నందుకొనుము.
శ్లో.
కోకిలాకులచక్రేశా పక్షతిః పంక్తిపావనీ ।
సర్వసిద్ధాంతమార్గస్థా షడ్వర్ణావరవర్జితా ॥ 55 ॥
415. ఓం *కోకిలాకులా*యై నమః.
నామ
వివరణ.
చక్కని
గత్రము తోపాడెడి కోకిలసమూహము అమ్మయే
తే.గీ. *కోకిలాకులా! * నీవిలఁ
బ్రాకటముగ
కోకిలలతోడ
నిండి యేకాకులకిల
నూరటన్
గూర్తువమ్మరో ధీరురాల!
వందనంబులు
చేసెద నందుకొనుము.
416. ఓం *చక్రేశా*యై నమః.
నామ
వివరణ.
శ్రీచక్రాధిదేవత
అమ్మయే.
తే.గీ.
వినుత
*చక్రేశ*
నీ కృపన్ విశ్వసింతు,
కాలచక్రాల
క్రింద నన్ గరగనీక
కాచి
రక్షింపుమోయమ్మ కరుణ చూపి,
వందనంబులం
జేసెద నందుకొనుము.
ఓం *కోకిలాకులచక్రేశా*యై నమః.
నామ వివరణ.
సృష్టిలోకోకిలకులానికి ప్రభ్విణి మన అమ్మ.
తే.గీ. *కోకిలాకుల చక్రేశ!
* కోకిల కుల
మహిత చక్రేశవీవు, సమస్త సృష్టి
కోకిలారావములతోడ కూడియుండి
నిత్యము వసంత శోభతో నెగడనిమ్ము,
417. ఓం *పక్షత*యే నమః .
నామ
వివరణ.
చంద్రునిహేతువుగా
మనము గ్రహించు ఉభయపక్షములూ అమ్మయే.
తే.గీ.
*పక్షతీ! * మాసములలోని పక్షములుగ
నీవె
వెల్గుచు మాలోన నీ వెలుగులు
పంచుచుంటివి
నిన్ను వర్ణించ తరమ?
వందనంబులం
జేసెద నందుకొనుము.
418. ఓం *పఙ్క్తిపావనా*యై నమః.
నామ
వివరణ.
ప్రపంచమును
శుద్ధి చేయు తల్లి అమ్మ.
తే.గీ. *పఙ్క్తి పావనీ! * నా
పద్యపంక్తులనిల
పావనముచేసి
యలరించు పావనివిగ
నిన్ను
వర్ణింప జాలను నేను జనని!
వందనంబులం
జేసెద నందుకొనుము.
419. . ఓం *సర్వసిద్ధాన్తమార్గస్థా*యై నమః.
నామ
వివరణ.
అన్ని
సిద్ధాంత మార్గములందునూ ఉండు జనని.
తే.గీ. *సర్వ
సిద్ధాంత మార్గస్థ! * యుర్విపయిన
సర్వ
సిద్ధాంతమార్గాలఁ జక్కగ నిను
మేము
గ్రహియించి మనెదము మేలుగాను,
వందనంబులం
జేసెద నందుకొనుము.
420. ఓం *షడ్వర్ణా*యై నమః.
నామ
వివరణ.
షడ్వర్ణములూ
అమ్మయే.
తే.గీ.
కనగ
షడ్వర్ణములు నీవె కామితదవు!
వినుము
*షడ్వర్ణ!
* నేఁ
జేయు విన్నపములు,
శత్రు
షడ్వర్గమును బాపి చక్కగ నను
నాదుకొమ్మమ్మ,
నన్నింక చేదుకొనుమ.
421. ఓం *వరవర్జితా*యై నమః.
నామ
వివరణ.
తనకు
ఎటువంటివరములూ అవసరము లేక విడిచియున్న తల్లి.
తే.గీ.
ప్ర
*వరవర్షితా! * వర్షించు
ప్రవరులకిల
సర్వ
సంపదల్, శుభములున్ సతతమీవు,
జ్ఞానసంపన్నులై
జనుల్ ధీనిధులుగ
వెలుగఁ
జేయుమా నీకృపన్, విశ్వవేద్య!
ఓం *షడ్వర్ణా వర వర్జితా*యై నమః.
నామ వివరణ.
శా. *షడ్వర్ణా వర వర్జితా!*
శుభ నిధీ! సద్భాగ్యదా! సత్ ప్రదా!
యీడ్వంజాలను దేహమన్ శకట మీవే కాచి రక్షింప నీ
షడ్వర్గంబుగనున్న శత్రువుల నాశంబొందగాఁ జేయుమా,
షడ్వర్గోద్ధతి లేనిచో కనెద నిన్ సంస్కార యుక్తుండనై.
శ్లో.
శతరుద్రహరా హంత్రీ సర్వసంహారకారిణీ ।
పురుషా పౌరుషీ తుష్టిస్సర్వతంత్రప్రసూతికా ॥ 56 ॥
422. ఓం *శతరుద్రా*యై నమః.
నామ
వివరణ.
శతరుద్ర
స్వరూపిణి అమ్మ.
కం. *శత
రుద్రా! * నినుఁ గొలిచెద
నతి
భక్తిని శుభనుతవని హాయిగ మదిలో,
క్షితిపై
సదయులు వెలుగుత,
మతిమాలిన
చేష్టులింక మాయంగ వలెన్.
423. ఓం
*హరా*యై నమః.
నామ
వివరణ.
పాపములను
హరించు లోకమాత మన అమ్మ.
తే.గీ.
హరణ
చేయుమపాపముల్ *హర*!
మదంబ!
నిన్ను
నిరతంబు మదినిల్పి మన్ననమున
కొలుచు
పుత్రుండనోయమ్మ! నిలుపుము
నను,
వందనంబులు
చేసెద నందుకొనుము.
ఓం *శతరుద్రహరా*యై నమః.
నామ వివరణ.
శతసంఖ్యాకరుద్ర శక్తితో కూడిన హరస్వరూపిణి అమ్మ. బాణములతాకిడికి కలిగిన బాధను
హరించు తల్లి మన అమ్మ.
కం. *శతరుద్రహరా!
* దేవీ!
మతిలో నిలుమమ్మ నీవు మాన్యతఁ గొలుపన్
క్షితిఁ గెల్తు, నీవె కలిగిన
నుతియించఁగఁ జాల నే మనోజ్ఞ సునామా!
424. ఓం *హన్త్ర్యై* నమః.
నామ
వివరణ.
దుష్ట
సంహారము చేయు జనని అమ్మ.
కం. *హన్త్రీ! * కృపఁగను
నన్నున్,
మన్త్రార్థము
లెఱుగ నేను, మాన్యా! కృపతో
మన్త్రార్థంబులఁ
దెలిపి కు
తన్త్రంబులనుండి
కావుదయతో నీవే.
425. ఓం *సర్వసంహారకారిణ్యై* నమః.
నామ
వివరణ.
సమస్త
సంహారమునకు మూలకారణము అమ్మయే.
తే.గీ.
*సర్వ
సంహార కారిణీ!* గర్వమణచి
నన్ను
రక్షింపుమా భువిన్ మిన్నగాను,
సర్వమున్నీవె,
దుష్టులన్ సంహరించి
కావుమా
శిష్టులన్ నీవు కరుణఁ జూపి.
426. ఓం *పురుషా*యై నమః.
నామ
వివరణ.
అతిపురాతనమయినది
మన అమ్మ.
కం. పురుషాహంకృతిఁ
బాపుచు
పురుషులకున్
జ్ఞానమిచ్చు పుణ్యద!
జననీ!
*పురుషా! * కొలిచెద
నిన్నున్
గరుణను
మతి నుండుమమ్మ కావగనెపుడున్.
427. ఓం *పౌరుష్యై* నమః.
నామ
వివరణ.
పౌరుష
లక్షణము అమ్మయే.
తే.గీ. *పౌరుషీ! * నీకు
నున్నట్టి పౌరుషంబె
నాకునున్
గొల్పి నిలుపుమా శ్రీకరముగ,
జీవి
పౌరుష హీనుడన్ భావ మదియె
తలపగాలేను
నను నీవె నిలుపుమమ్మ.
428. ఓం *తుష్ట*యే నమః .
నామ
వివరణ.
నిత్యమూ
సంతోషముగా తృప్తిగా ఉండు జనని.
తే.గీ. తుష్ఠి నాత్మకుఁ గొల్పెడి *తుష్ఠి!
* నీవె
తుష్ఠి
రూపాన మదినుండి తుష్ఠినొంద
సంతసంబిక
నేముండు? సాంత మీవె
ప్రేమతోడుత
మదినుండి ప్రీతిఁ గనుము.
429. ఓం *సర్వతన్త్రప్రసూతికా*యై నమః.
నామ
వివరణ.
అన్ని
తంత్రములకూ జనని అమ్మ.
తే.గీ. *సర్వ
తన్త్ర ప్రసూతికా!* సాక్షివీవె
సర్వతంత్రంబులకునెల్ల,
సాధ్వి! నీవె
సర్వతంత్రంబులును
నాకు , సత్వ రూప!
వందనంబులం
జేసెద నందుకొనుము.
శ్లో.
అర్ధనారీశ్వరీ దేవీ సర్వవిద్యాప్రదాయినీ ।
భార్గవీ యాజుషీవిద్యా సర్వోపనిషదాస్థితా ॥ 57 ॥ [ భుజుషీవిద్యా ]
430. ఓం *అర్ధనారిశ్వర్యై* నమః.
నామ
వివరణ.
అమ్మ
అర్థనారీశ్వరి.
తే.గీ. *అర్థ
నారీశ్వరీ! * జన్మ సార్థకమగు
నీవు
శివునితో నాలోన నిండి యున్న,
తల్లిదండ్రులయిన
మిమ్ము తలచుకొనుచు
సేవలన్
జేసి తరియింతు శ్రీకరముగ.
ఓం *దేవ్యై* నమః.
కం. *దేవీ!* నీ
పద సన్నిధి
భావించిన
చాలునమ్మ భక్తి మనమునన్
శ్రావించునమృతమటులను,
జీవించెద
మిము దలచుచు స్థిరమతినిడుమా.
ఓం *అర్ధనారిశ్వరీదేవ్యై* నమః.
తే.గీ. *అర్థ నారీశ్వరీదేవి!
* సార్థకమగు
నాదు జన్మంబు, నీవున్న నా మనమున,
నీవు శివునితో నాలోన నిండి యున్న,
సేవలన్ జేసి తరియింతు శ్రీకరముగ.
431. ఓం *సర్వవిద్యాప్రదాయి*న్యై నమః.
నామ
వివరణ.
సమస్త
విద్యలనూ ప్రసాదించు జనని.
తే.గీ. *సర్వ
విద్యాప్రదాయినీ! * సకల విద్య
లుర్విపైనుండియున్
నిన్ను గర్వపడుచు
చూడఁ
జేసెడి విద్యయే చూడ విద్య
వందనంబులం
జేసెద నందుకొనుము.
432. ఓం *భార్గవ్యై* నమః.
నామ
వివరణ. భృగుమహర్షికుమార్తె మన అమ్మ.
తే.గీ. *భార్గవీ! * కృపఁ
జూడుమా! భర్గురాణి!
మార్గమీవౌచు
ముక్తి సన్మార్గమిడుము.
ముక్తి
నీయగలేని నా భక్తి యేల
భక్తి
నెన్నుచు నాకింక ముక్తినిమ్ము.
433. ఓం *యాజుషీవిద్యా*యై నమః. (భూజుషీ
విద్యా)
నామ
వివరణ.
యజ్ఞవిద్యాస్వరూపిణి
అమ్మ.
తే.గీ. వినుమ *యాజుషీవిద్యా!* ప్రవణవు
నీవు
కావునన్
మది యజ్ఞాదికంబులకును
తావలము
చేసి మదిలోన తనియు మీవు
వందనంబులు
చేసెదనందుకొనుము.
ఓం
*భూజుషీ
విద్యా*యై నమః.
నామ
వివరణ.
భూమిని
సంరక్షించుకొను విద్యనెరిం గిన జనని
తే.గీ. వినుత *భూజుషీవిద్యా!*ప్రవీణ
వీవు
భూమినే
మది కాపాడు పూర్ణ రూప!
రక్షణమ్మిమ్ము
నాదు నిరీక్షనరసె,
వందనంబులు
చేసెదనందుకొనుము.
434. ఓం *సర్వోపనిషదాస్థితా*యై నమః.
నామ
వివరణ.
సమస్త
ఉపనిషత్తులలోఉన్న తల్లి మన అమ్మ.
కం. భాషలలో
వెలిగెడి మా
తా!
*సర్వోపనిషదాస్థితా!* జయమమ్మా!
నీసరి
లేరిల తెలుఁగను
బాసను
కావంగ జనని! వరలగనిమ్మా.
శ్లో.
వ్యోమకేశాఽఖిలప్రాణా పంచకోశవిలక్షణా ।
పంచకోశాత్మికా ప్రత్యక్పంచబ్రహ్మాత్మికా శివా ॥ 58 ॥
435. ఓం
*వ్యోమకేశా*యై నమః
నామ
వివరణ.
ఆకాశమే
కేశపాశముగా కలిగిన జనని మన అమ్మ.
తే.గీ.
*వ్యోమకేశ! * సదాచార
ధీ మనోజ్ఞ!
శ్రీమతీమణులైనట్టి
స్త్రీలకీవు
రక్ష
గొలుపగ నుండు పరీక్ష మాని,
వారి
యబలతఁ బాపుమా! వారిజాక్షి!
436. ఓం *అఖిలప్రాణా*యై నమః.
నామ
వివరణ.
సమస్త
ప్రాణికోటియు అమ్మయే.
కం. విను
మొర *లఖిల
ప్రాణా!*
కనుమా
భూజనుల వెతలు, కాదనకమ్మా,
విని
కావనెవ్వరుండిరి?
గుణగణ్యవు
నీవె కాక కువలయమందున్.
437. ఓం *పఞ్చకోశవిలక్షణా*యై నమః.
నామ
వివరణ.
ప్రాణమయాది
పంచకోశములప్రభావముఏమాత్రమూ
లేని విలక్షణ అమ్మ.
తే.గీ. *పఞ్చ
కోశ విలక్షణా! * పరవశింతు
సఞ్చితంబులఁ
బాపినన్ సదయ నీవు,
పఞ్చఁబోకుము
కష్టముల్, భక్తి నొసగి,
నిన్ను
పూజించ నిమ్మింక నేర్పు మీర.
438. ఓం *పఞ్చకోశాత్మికా*యై నమః .
నామ
వివరణ.
శరీరమున
ఐదుకోశములందును ఉండు తల్లి మన అమ్మ.
తే.గీ. *పఞ్చకోశాత్మికా! * యీ
ప్రపంచమంత
పఞ్చకోశాత్మ
రూపె భావిఞ్చి చూడ,
పఞ్చ
కోశప్రదీప్తుల నెఞ్చి చూచి
కావుమో
మాత సతతము కరుణతోడ.
439. ఓం *ప్రతీచే* నమః. (ప్రత్యక్)
నామ వివరణ.
అదృశ్యముగా అన్నిటనూ ఉండు జనని.
తే.గీ. శ్రీ *ప్రతీచి* దినకరుఁడు చేరి నిన్ను
హాయిఁ
గొలుపుచు నుండు సాయంత్ర వేళ,
ప్రాక్ ప్రతీచీల మధ్యను పడి వసించు
మమ్ము
కాపాడుమని చెప్పు మంగళాంగి!
440. ఓం *పఞ్చబ్రహ్మాత్మికా*యై నమః.
నామ
వివరణ.
పంచబ్రహ్మలయొక్క
ఆత్మగా ఉన్న తల్లి.
కం. సకలవు
*పఞ్చబ్రహ్మా
త్మికా!*
నినుఁ గొలుతును పరిణతి నిడుమ, జ్ఞానం
బకళంక!
యొసగి కావుము,
ముకుళిత
హస్తములతోడ ముందుగఁ గొలుతున్.
441. ఓం *శివా*యై నమః.
నామ
వివరణ.
శుభములకు
ఆలవాలమగు జనని.
తే.గీ.
శ్రీ
*శివా!* దైవసన్నిధిన్
జేరఁ జేసి
ముక్తి
మార్గంబుఁ గొలుపుమా భక్తులకును,
ధ్యాసతో
నిన్నుఁ గొలిచెద తల్లివీవె
కావ
నుంటివటంచును గమలనయన!
ఓం *పఞ్చబ్రహ్మాత్మికాశివా*యై
నమః.
కం. సకలవు *పఞ్చబ్రహ్మా
త్మికా శివ! కొలుతును పరిణతి నిడుమ, జ్ఞానం
బకళంక! యొసగి కావుము,
ముకుళిత హస్తములతోడ ముందుగఁ గొలుతున్.
శ్లో.
జగజ్జరాజనిత్రీ చ పంచకర్మప్రసూతికా ।
వాగ్దేవ్యాభరణాకారా సర్వకామ్యస్థితాస్థితిః ॥ 59 ॥
442. ఓం *జగతే* నమః.
నామ
వివరణ.
సృష్టి
స్వరూపిణి అమ్మ.
తే.గీ.
*జగతి!* కావగనెంచుమీజగతిని
కృప,
నాదు
దేహమే జగతిగా నమ్మి సతము
నిన్ను
లోపలన్ గననెంతు సన్నుతముగ,
వందనంబులు
చేసెద నందుకొనుము.
443.ఓం *జరాజనిత్ర్యై* నమః.
నామ
వివరణ.
వృద్ధురాలయిన
జగజ్జనని.
తే.గీ.
ఓ
*జరాజనిత్రీ!* నిన్
మహోపకారి
వందురందరున్
నిజమైన ననితర గతి
నా
మనంబున నిలువుమా నమ్మకముగ.
వందనంబులు
చేసెదనందుకొనుము.
ఓం *జగజ్జరాజనిత్ర్యై* నమః
తే.గీ. లోకములు కొల్పి వాటి నేలుచు *జగజ్జ
రాజనిత్రీ! * మముంగూడ రమ్య గతిని
యేలుచుంటివి, నా మది నేలుమమ్మ,
హృదయ పద్మాన వసియించు హృద్యముగను.
444. ఓం *పఞ్చకర్మప్రసూతికా*యై నమః.
నామ
వివరణ.
సృష్ట్యాది
పంచ కర్మలను కల్పించిన తల్లి
తే.గీ. *పఞ్చకర్మప్రసూతికా*
పంచ విహిత
కర్మలన్
జేయఁ జేయుచున్ కర్మభువిని
వరలునట్లుగఁ
జేయుమా యురుతరముగ,
వందనంబులు
చేసెదనందుకొంఉము.
445. ఓం *వాగ్దేవ్యై* నమః.
నామ
వివరణ.
వాక్కునకు
దేవత అమ్మ.
తే.గీ.
చక్కనైనట్టి యమృతంపు
వాక్కులిచ్చి,
చిత్రకవితా
మహాశక్తి చేతికిచ్చి,
నన్ను
కాచు *వాగ్దేవి! * నిన్
సన్నుతింతు
వందనంబులు
చేసెద నందుకొనుము.
446. ఓం *ఆభరణాకారా*యై నమః.
నామ
వివరణ.
ాలంకారములతో
ప్రకాశించు జనని అమ్మ.
కం. *ఆభరణాకారా! * యీ
లోభికి
యాభరణ మీవె, లోకము నన్నున్
లోభిగ
ననుకొన వచ్చును
లోభని,
నిన్ వదలనట్టి లోభిని తల్లీ!
447. ఓం *సర్వకామ్యస్థితా*యై నమః.
నామ
వివరణ.
సమస్తమయిన
కోరికలయందూ కలిగిన జనని.
తే.గీ.
*సర్వ
కామ్యస్థితా!* స్థిత! సర్వ కామ్య
ద
వయి తీర్చుము, నా లోన దయను నిలిచి
యాత్మతేజంబువగుమమ్మ,
యహరహంబు
గొలుచుచుందును
భక్తితో కోర్కె తీర.
448.ఓం *స్థిత*యే
(స్థిత్యై) నమః .
నామ
వివరణ.
స్థిరముగా
ఎల్లప్పుడూ ఉండు జనని అమ్మ.
తే.గీ.
హృదయ
కమల సంస్థితవమ్మ కదలక
నిలు
ప్రాణమై
యున్న ఓ *స్థితా!* భక్తిఁ
గొలుతు
నిన్ను
కవితామృతముతోడ మన్ననమున
వందనంబులు
చేసెద నందుకొనుము.మున
శ్లో.
అష్టాదశచతుష్షష్ఠిపీఠికా విద్యయా యుతా ।
కాలికాకర్షణశ్యామా యక్షిణీ కిన్నరేశ్వరీ ॥ 60 ॥
449. ఓం *అష్టాదశచతుఃషష్టి-పీఠికా*యై నమః.
నామ
వివరణ.
స్వయంకల్పిత మృదయపీఠికా వృత్తము.
గణములు.
… త స ర జ న త ర. యతి…12వ అక్షరము.,, ప్రాస నియమము
కలదు.
*అష్టాదశ చతుష్షష్టి పీఠికా!*
యనుపమ
విజ్ఞాన పేటికా!
కష్టంబులనుపోవంగఁ
జేయుమా, కమలదళాక్షీ, నితాంతమున్,
సృష్టిన్ జనుల
రక్షింతు వీవెగా శ్రితజనమందార! సన్నుతుల్,
నష్టంబులనుపోఁగొట్టి,
కావుమా, ననుగను తల్లీ! ప్రశాంతిగా.
450. ఓం
*విద్యయాయుతా*యై నమః ।
నామ
వివరణ.
అన్ని
విద్యలూ తానే అయియున్న తల్లి.
తే.గీ.
*విద్యయాయుతా!
* నీకు
నైవేద్యమగుత
నాదు
సద్గుణ ఫలములు మోదమలర,
నిన్నుఁ
దెలిపెడి విద్యను మన్ననమున
నేర్చుకొందును
నేర్పుమా నేర్పు మీర.
ఓం *అష్టాదశచతుష్షష్ఠిపీఠికా విద్యయా యుతా*యై నమః.
నామ వివరణ. అష్టాదశపీఠములుగా చతుష్షష్టిపీఠములుగా విద్యా సమన్వితయై
యొప్పుచున్న జనని.
స్వయంకల్పిత వృత్తము.
గణములు. స
భ య జ
త ర. యతి. 11వ అక్షరము.
ప్రాస నియాము కలదు.
*విదితాష్టాదశచతుష్షష్ఠి పీఠికా విద్యయా యుతా!*
సదయన్ గాంచుమిక నన్నున్ ప్రశాంతిగానుండఁ జేయుమా,
హృదయంబందునవసించంగహృద్యమౌ పద్యముల్ సుధీ!
సుధలంజిందగరచింతున్విశుద్ధ!నీపై శుభాకృతీ!
451. ఓం *కాలికా*యై నమః.
నామ
వివరణ.
కాలస్వరూపిణియు
కాలికా స్వరూపిణియు అయియున్న తల్లి.
తే.గీ.
కాల
రూపిణీ! *కాలికా! * కనగనిమ్ము
నిన్ను
నామదిన్ నిలుపుచు నిత్యముగను,
నిన్ను
బంధ చిత్రములలో సన్నుతింప
శక్తినీయుమా
మాయమ్మ, భక్తిఁ గొలిపి.
452. ఓం *కర్షణ్యై* నమః.
నామ
వివరణ.
జగత్తులో
ఆకర్షణీయమయిన జనని.
కం. మహితా!
*కర్షణ!* మొరవిను,
సహనము
కలిగించు నాకు చక్కగ నిను నే
నహరహమును
ప్రార్థించన్
స్పృహతోడ
సభక్తికముగ, చిద్వర తేజా!
ఓం *ఆకర్షణ్యై నమః.
నామ వివరణ.
జగత్తులో ఆకర్షణీయమయిన జనని.
కం. ఆకర్షణీ!
* మనోజ్ఞా!
నీకిల నెవరమ్మ సాటి? నిర్భర కరుణా!
శ్రీకరముగ నినుఁ గొల్తును,
ప్రాకటముగ కావుమమ్మ! వందనమమ్మా!
453. ఓం *శ్యామా*యై నమః.
నామ
వివరణ.
శ్యామల
వర్ణ ప్రకాశిని మన జనని.
కం. *శ్యామా!* శ్రీమజ్జగదభి
రామా!
సన్నామ! వినగ రమ్మా మొరలన్,
నామానసమున
నిండుమ,
నీమంబుగఁ
గొలుతునమ్మ నిన్నున్ జననీ!
454 ఓం *యక్షిణ్యై* నమః.
నామ
వివరణ.
అమ్మ
యక్షురాలు.
తే.గీ.
*యక్షిణీ! * జగదీశ్వరీ!
రక్ష నీవు
సృష్టికంతటికిన్,
నన్ను సృజన చేసి
రక్షణమునీయకుండినన్
దక్షులెవరు
నన్ను
కాపాడుటకిలను, కన్నతల్లి!
455. ఓం *కిన్నరేశ్వర్యై* నమః.
నామ
వివరణ.
కిన్నరులకు
దేవత మన అమ్మ.
తే.గీ.
*కిన్నరేశ్వరీ! * పాహిమాం
కృపను గనుమ,
కనులతో
నిన్ను గనలేక కలగుచుంటి
నిన్ను
నా మదిన్ గృపతోడ నున్న గాని,
కన్నులారగ
నిన్ను నే గాంచనిమ్మ.
శ్లో.
కేతకీ మల్లికాఽశోకా వారాహీ ధరణీ ధ్రువా ।
నారసింహీ మహోగ్రాస్యా భక్తానామార్తినాశినీ ॥ 61 ॥
456. ఓం *కేతక్యై* నమః.
నామ
వివరణ.
మొగలి
పుష్పము ఇష్టమయిన తల్లి అమ్మయే.
తే.గీ.
*కేతకీ!* నను
గాంచెడి మాతృమూర్తి!,
పుష్ప
సుకుమార! శుభకరీ! పూవుబోడి!
జ్ఞానపుష్పంబువై
సుధన్ కరుణనొసగి
నన్ను
కరుణించి కావుమా సన్నుతముగ.
457. ఓం *మల్లికా*యై నమః.
నామ
వివరణ.
మల్లిక
అమ్మయే.
తే.గీ.
*మల్లికా!* వర
పద్యముల్ వెల్లువగను
వ్రాయునట్టులఁ
గరుణతోఁ జేయుమమ్మ!
పద్య
సాహస్రమున్ నీకు భక్తి నీయఁ
జేయు
మోయమ్మ, నాకు, నేఁ జేయఁ జాల.
458. ఓం *అశోకా*యై నమః.
నామ
వివరణ.
అశోకము
అమ్మయే. అమ్మ దుఃఖ రహిత.
తే.గీ.
ఓ
*యశోకా!* కృపన్ నాకు శ్రేయమొదవు
చిత్రబంధకవిత్వంబు
నాత్రముగను
వ్రాయఁ
జేయుమా నాలోని మాయఁ బాపి
వందనంబులు
చేసెద నందుకొనుము.
459. ఓం *వారాహ్యై* నమః. ॥ ౪౫౦ ॥
నామ
వివరణ.
వెష్ణువు
యొక్క వరాహ అవతారము అమ్మయే.
కం. *వారాహీ*!
శుభకరముగ
ధీరోదాత్తత్వ
మసమ ధీశక్తియు సు
స్మేరాంభోజ
ముఖంబును
గోరకనే
యొసగుదువుగ, కొలిచెద నిన్నున్.
460.ఓం *ధరణ్యై* నమః ।
నామ
వివరణ.
భూమి
అమ్మయొక్క స్వరూపమే.
కం. *ధరణీ! * నను
గడవరకును
ధరియించెడి
తల్లివమ్మ! తప్పక నిన్నున్
వర
నుత కవితామృతముగ
వరలించుచు
వ్రాయనిమ్ము, వరగుణ గణ్యా!
461. ఓం *ధ్రువా*యై నమః.
నామ
వివరణ.
స్థిరముగా
ఉండు జనని అమ్మ.
కం. ధ్రువముగ
నను నిలిపెడి యో
*ధ్రువా! * మదంబవు
ప్రశాంతితో మనఁజేయన్
భవమును
వీడఁగఁ జేయన్
నివసింపుము
నాదు మదిని నిర్భరశాంతీ!
462. ఓం *నారసింహ్యై* నమః.
నామ
వివరణ.
నరహరి
స్వరూపము అమ్మయే.
తే.గీ.
*నారసింహీ! * ననున్ గను భారమనక,
కోరనమ్మరో
చిల్లరకోరికలను,
కోరుదును
నిన్ను మదిలోన కొలువు తీర
మనుచు,
చాలది తీర్చుమా! యనుపమముగ.
463. ఓం *మహోగ్రాస్యా*యై నమః.
నామ
వివరణ.
గొప్ప
భయంకరమయిన ముఖము కలతల్లి అమ్మ.
కం. గమనించు
*మహోగ్రాస్యా! *
శ్రమజీవుల
శ్రమను దోచి క్రాలెడు వారిన్
సమముగ
న్యాయము కూర్చుము,
భ్రమలను
పోకార్పి నాకు భద్రతనిమ్మా.
464. ఓం *భక్తానామార్తినాశిన్యై* నమః
నామ
వివరణ.
భక్తులయొక్క
బాధలను నశింపఁజేయు తల్లి మన అమ్మ.
కం. శ్రీమన్మంగల
రూపిణి!
క్షేమంబును
గొలుపు జనని, శ్రీకర! *భక్తా
నామార్తి నాశినీ!*
నను
ప్రేమను
వరలింపుమమ్మ ప్రీతిని కొలుతున్
శ్లో.
అంతర్బలా స్థిరా లక్ష్మీర్జరామరణనాశినీ ।
శ్రీరంజితా మహాకాయా సోమసూర్యాగ్నిలోచనా ॥ 62 ॥
465. ఓం *అన్తర్బలా*యై నమః.
నామ