గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, డిసెంబర్ 2012, మంగళవారం

ప్రపంచ తెలుగు మహా సభలలో పాల్గొనే సదవకాశం.

జైశ్రీరామ్.
సహృదయ భారాతీయ సహోదరులారా! ఆ జగన్మాత కటాఖ్శం వల్ల, మీ వంటి సన్మిర్తుల శుభాకాంక్షలవల్లా, "తిరుపతిలో జరుగుచున్న ప్రపంచ తెలుగు మహా సభలలో దిగ్దంతులవంటి తెలుగు సరస్వతీ, పుంభావ సరస్వతీ మూర్తులను చూచే భాగ్యంతో పాటు, అక్కడ వేదికపై ఉపన్యసించే సదవకాశం కూడా నాకు లభించింది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము నుండి నన్ను ఉపవేదికపై ఉపన్యసించ వలసినదిగా కోరుతూ ఆహ్వానం వచ్చింది.
ఈ సదవకాశం కలిగించిన ప్రభుత్వానికి నా ధన్యవాదములు తెలియ జేసుకొంటున్నాను. 
అక్కడికి వస్తున్న మీ అందరిమీ ప్రత్యక్షంగా చూచే అదృష్టం నాకు కలుగుతున్నందులకు ఆనందంగా ఉంది.
జయంతి తే సుకృతినో రస సిద్ధాః కవీశ్వరాః.
జైహింద్.
Print this post

2 comments:

Pandita Nemani చెప్పారు...

Subham bhooyaat. vijayOstu. swasti.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శ్రీ చింతా వారికి హృదయ పూర్వక అభినందన మందారాలు. నూతన సంవత్సర శుభా కాంక్షలు . క్రొత్త వత్సర మందున మరిన్ని వేదికల నలంకరించి ఉపన్యాసములు , అవధానములు , సత్కారములు , పొంద వలెనని ఆశీర్వ దిస్తూ , అక్క

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.