జైశ్రీరామ్.
శ్లో:-
రూప యౌవన సంపన్నాః విశుద్ధ కుల సంభవాః
విద్యా హీనా న శోభన్తే నిర్గంధాయివ కింశుకాః.
గీ:-
రూప యౌవన సంపదల్ ప్రబలియుండి
ఉత్తమోత్తమ జన్ముడై యుండ వచ్చు
చదువు లేకున్న వెలుగడు సభలలోన
వాసన విహీన కింశుక వరలనట్లు.
భావము:-
రూప యౌవన సంప్సన్నులైనను, ఉత్తమ కులజు లైనను విద్య లేనివారు శోభించరు. మోదుగ పూవు లెంత బాగుండినను వాసన లేనివైనందున నిష్ప్రయోజనమగుచున్నవి కదా.
జైహింద్.
Print this post
శ్లో:-
రూప యౌవన సంపన్నాః విశుద్ధ కుల సంభవాః
విద్యా హీనా న శోభన్తే నిర్గంధాయివ కింశుకాః.
గీ:-
రూప యౌవన సంపదల్ ప్రబలియుండి
ఉత్తమోత్తమ జన్ముడై యుండ వచ్చు
చదువు లేకున్న వెలుగడు సభలలోన
వాసన విహీన కింశుక వరలనట్లు.
భావము:-
రూప యౌవన సంప్సన్నులైనను, ఉత్తమ కులజు లైనను విద్య లేనివారు శోభించరు. మోదుగ పూవు లెంత బాగుండినను వాసన లేనివైనందున నిష్ప్రయోజనమగుచున్నవి కదా.
జైహింద్.
4 comments:
అవును అందం , డబ్బు , హోదా ,ఆకర్షణ మాత్రమే . చదువు , సంస్కారం , వినయ విధేయతలు పెట్టని ఆభరణాలు
మంచి మంచి శ్లోకాలను అందిస్తున్న శ్రీ చింతా వారు అభి నంద నీయులు
శ్రీ చింతా రామకృష్ణ రావు గారికి శుభాశీస్సులు. విద్వన్మణులు, సాహితీ రంగములో విశేష కృషి చేయున్న నిత్య కృషీవలులు. ప్రతిదినము ఒక ఆణి ముత్యము వంటి సూక్తిని అందరికి అందించు చున్నారు. మీ కృషి తప్పక సద్యోగములను గూర్చును. స్వస్తి.
పూజ్య రాజేశ్వరక్కయ్యా! నమస్తే.
నీ హృదయంబు నవ్య నవనీతము మంజుల పారి జాతమున్.
స్నేహ సుధా ప్రపూరితము, శ్రీకర సద్గుణ భావ జాతమున్.
మోహ విదూర శోభితము. పూజిత రాగ మనోజ్ఞ గీతమున్.
శ్రీహరి భక్త సేవితము. చిన్మయ పూతము. సత్ ప్రభూతమున్.
అట్టి నీసహృదయతకు నా కైమోడ్పులు.
ఆర్యా! నేమాని పండిత వరేణ్యా! మీరు శుభాశీస్సులందించినందుకు హృదయ పూర్వక ధన్యవాదములు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.