గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, డిసెంబర్ 2012, బుధవారం

ఆశావాది అవధాన వినోదం- సరస ప్రసంగం.3 వ భాగము

జైశ్రీరామ్. 
సాహితీ ప్రియబాంధవులారా!
అవధానాచార్య డా. ఆశావాది ప్రకాశ రావు కవి శిరోమణిని గూర్చి తెలియనివారుండరు.
అటువంటి అవధాని గారు చేసిన అవధానాలలో  అప్రస్తుత ప్రసంగములో చేసిన సరస ప్రసంగాలు మీ ముందుంచుతున్నందుకు ఆనందంగా ఉంది. పృచ్ఛకుని ప్రశ్న దానికి అవధాని గారి చతురోక్తులు 3వ భాగము  మీ ముందుంచుతున్నాను.
ఇక చూడండి.
 21. పృచ్ఛకుఁడు:-ఆహారమ్మెంత బాగుంటే మంచిది?
        అవధాని:-ఆహా! అనిపించేటట్లుంటే మంచిది.అది రుచి గల ఆహారం కావచ్చుసువాసన కల 
        హారం కావచ్చు, పెదాలను తడిపే రం కావచ్చు.
22. పృచ్ఛ:-కొందరే విద్యార్థులు. చాలా మంది...?
        అవ:-విన లేదా? ఇటీవలమాష్ట్ర్లు విధ్యార్థులు అంటున్నారు.విధిగా అర్థించే వారు
        (అడుక్కు తినే వారు)కాబట్టి వీళ్ళే ఎక్కువ అనాలి.
23. పృచ్ఛ:-ఎమ్దరో మహానుభావులు.అన్నారు త్యాగరాజు. మరి మీరేమంటారు?
        అవ:-నేను ఆయనంతటి గొప్పవాణ్ణి కాదు.కాబట్టి కొమ్దరే మహానుభావులు.
        అందుకోండి వందనాలు. అంటాను.
24. పృచ్ఛ:-ప్రాణం తీసిన విరామ చిహ్నం ఒకటి చెప్పండి?
        అవ:-ఇది నా సొంతమేమీ కాదుసుప్రసిద్ధమే.హ్యాంగ్ హిమ్, నాట్ లీవ్ హిమ్.
        ( హేంగ్ హిమ్ నాట్, లీవ్ హిమ్ అని ఉండాలి)
25. పృచ్ఛ:-ఏ.బీ.సీ.డీ. లేని పదాలు ఒక వంద చెబుతారా?
        అవ:-వందేంఖర్మాండీ. ఈ దాకా జరిగిన గంట కాలం పాటుఅవధానంలో 
        ఇంకా ఎక్కువేచెప్పి ఉంటాను.కాస్త వెతుక్కుంటే మంచిది.
        పృచ్ఛ:-అవధాని గారూ! నేనేమైనా పోగొట్టుకొని ఉంటే కదావెతుక్కొనే పని? 
        నేనడిగింది ఇంగ్లీషు పదాలు.
        అవ:-మీకు తెలిసినట్టుంది. చెప్పండి వింటాను. ఐతే నా కాలాన్ని గిల్ల కూడదు సుమా!
        పృచ్ఛ:-సరే వన్ టూ నైన్టీనైన్. ఇక్కడికి తొంభైతొమ్మిది ఐనాయికదా! ఇక మిగిలింది జీరో.
        వంద ఐనాయి కదా?
        అవ:-సంతోషమండి మీ ఆంగిలేయ విజ్ఞానానికి.
26. పృచ్ఛ:-సన్యాసికి సన్నాసికి భేదం ఏమిటండి?
        అవ:-యావత్తు గౌరవాలు పొందేవాఁడు సన్యాసి.( ఈ పదంలో సకారానికి 
       యా వత్తు ఉంది.)తన్ను తానుతగిలి ఉండేవాఁడు సన్నాసి.
       (ఇక్కడ నకారానికి న వత్తు ఉంది)సన్యాసి ఆద్యంతాల నసి కాపాడు కోగా 
        న్నాసి ఆ నసిని కోల్పోతాడు.
27. పృచ్ఛ:-పరబ్రహ్మ పద్సార్థం - భగవత్పదార్థం ఏదేదో చెప్పండి?
        అవ:-అన్నం పరబ్రహ్మ పదార్థం. కన్నం భగవ్త్పదార్థ.
28. పృచ్ఛ:-గాడిద వెనుక కాళ్ళతోనే ఎందుకు తన్నుతుంది?
        అవ:-ముందు చూపు కలిగి మసలుకొమ్మని చెప్పటానికి.
29. పృచ్ఛ:-సినీమా పై మీ అభిప్రాయం?
        అవ:-ఎక్కువ సినీమాలు తలక్రిందులై మానిసి.వ్యవహారాన్ని చూపిస్తున్నాయి.
        మరి కొన్ని మనీ(డబ్బు). షీ(స్త్రీ)  చుట్టూ త్రిప్పుతున్నాయి.ఇంకా కొన్ని 
        దేశీయ అన్య దేశీయనాగరికతల కలగా పులగంగా  అయోమయాన్ని సృష్టిస్తున్నాయి.
30. పృచ్ఛ:-అవధాన వేదిక మీద హేమా హేమీలు ఎందరున్నారు?
        అవ:-హేమాహేమీలు ఏమో గాని, హెమా హెమిలు ఇద్దరున్నారు.
        పృచ్ఛ:-ఈ చిదంబర రహస్యం చిట్టా కాస్త విప్పుతారా?
        అవ:-హెమా అంటే హెడ్ మాష్టర్. హెమీ అంటే హెడ్ మిస్త్రెస్.
డా. ఆశావాది ప్రకాశ రావు.
వీరి సెల్ నెంబర్.7386964476.
సశేషం.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు.
పృచ్చకుల ప్రశ్నలకు అవధాని శ్రీ డా . ఆశావాది ప్రకాశ రావుగారి జవాబులు రస రమ్యం గా నున్నవి. చదువు తుంటే వేదిక మీద ఉన్నంత అనుభూతి కలుగు తుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.