గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, డిసెంబర్ 2012, బుధవారం

ఆశావాది అవధాన వినోదం- సరస ప్రసంగం.2 వ భాగము

జైశ్రీరామ్. 
సాహితీ ప్రియబాంధవులారా!
అవధానాచార్య డా. ఆశావాది ప్రకాశ రావు కవి శిరోమణిని గూర్చి తెలియనివారుండరు.
అటువంటి అవధాని గారు చేసిన అవధానాలలో  అప్రస్తుత ప్రసంగములో చేసిన సరస ప్రసంగాలు మీ ముందుంచుతున్నందుకు ఆనందంగా ఉంది. పృచ్ఛకుని ప్రశ్న దానికి అవధాని గారి చతురోక్తులు 2వ భాగము  మీ ముందుంచుతున్నాను.
ఇక చూడండి.
 11. పృచ్ఛకుఁడు:-పట్టి చూచే వాఁడు, పట్టి విడిచే వాఁడు ఎవ్వరో సెలవిస్తారా?
        అవధాని:-నాడి పట్టి ఆరోగ్యం చూచేవాఁడు డాక్టరు. 
        నటన నెపంతో చేయి పట్టి తరువాత విడిచే వాఁడు ఏక్టరు.
12. పృచ్ఛ:-ఇందాకా మీరు ఏక్టరు ప్రస్తావన తెచ్చారు. మరి తార మీద పడితే మీ రేం చేస్తారు?
        అవ:- ప్యాంటు షర్టు విడిచేస్తాను.
        పృచ్ఛ:-అబ్బా! అంత పని చేస్తారా?
        అవ:-ఏం చెయ్యమంటారు? నల్లని రాక్షసి బొగ్గు వేడి ద్రవం తార కదా? అది మీద పడితే 
        బట్టలు పనికి రావు. ఐనా తార వ్యవహారం తేల్చ వలసింది నేను కాదు. శశాంకుఁడు.
13. పృచ్ఛ:-మీరుశాకాహారులా? ఉభయాహారులా?
        అవ:- ఉభయాహారిని. భయం కలిగించని అసహారం తినే వాడిని, 
       భయం లేని ఆహారం తినేవాడిని.అని అర్థం.
14. పృచ్ఛ:-పెళ్ళాం అంటే?
        అవ:- కొందరికి బెల్లం. మరికొందరికి అల్లం.
15. పృచ్ఛ:-ది బస్సీజ్ పోయింగ్ విత్ యమా స్పీడ్.అని నే నంటాను.
       అవ:-ఇట్ ఆల్సో దాటెడ్ ది రివర్ అని నేనంతాను.
16. పృచ్ఛ:-బస్సు ప్రయాణంలో మీకు నిద్ర ఉంటుందా?
       అవ:-కుదుపులు తప్ప నిద్ర ఎందుకుంటుంది?
       పృచ్ఛ:-మరి నిద్రపోయే వాళ్ళ పరిస్థితి ఏమిటి?
       అవ:-వారికి కునుకులే కాని, కుదుపులు ఉండవు కదా!
17. పృచ్ఛ:-మనుషులు ఎన్ని విధాలు?-
       అవ:-పేరు మోసిన వాళ్ళు-పేరు మ్రోసిన వాళ్ళు.అంటే మొదటి రకం వారు 
       గొప్పగొప్ప పేర్లు పెట్టుకొని మోస్తూ ఉంటారు. రెండవ రకం వాళ్ళ పేర్లు 
       ఎక్కడ చూచినా మారుమ్రోగుతూనే ఉంటుంది. 
       పృచ్ఛ:-ఇప్పటి యూత్ లక్ష్యం ఏమిటి?
       అవ:-యూ - యూ అంటూ వెంట పడటం.
18. పృచ్ఛ:-అంతే నంటారా?
       అవ:-లేదంటే దాని స్పెల్లింగులో వై ఉంది కాబట్టి ప్రశ్నించటం.
19. పృచ్ఛ:-మీ దేకులం?
       అవ:-వ్యాకులం లేని కవితా కులం.తరచు కవి తాకులం. మీలాంటి వారి తాకుడు చేత. 
20.పృచ్ఛ:-ఈ సభలో పదార్థాలు ఎన్ని విధాలుగా దర్శన మిస్తున్నాయి?
       అవ:-జడ పదార్థాలు-జడ లేని పదార్థాలుగా. జడ గల పదార్థాలుగా. 
డా. ఆశావాది ప్రకాశ రావు.
వీరి సెల్ నెంబర్.7386964476.
సశేషం.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.