గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

10, డిసెంబర్ 2012, సోమవారం

మేలిమి బంగారం మన సంస్కృతి. 134.

జైశ్రీరామ్.
శ్లో:-
పండితైః సహ సాంగత్యం - పండితైః సహ సంకథా.
పండితైః సహ మిత్రత్వం - కుర్వాణో నాஉవసీదతి.
గీ:-
పండితులతోడ కలయుచు వరలు వారు,
పండితులతోడ భాషించు భవ్య మతులు,
పండితులతోడ స్నేహంబు పడయువారు
నుండు సుగతిని. చెడువారలుండరెపుడు
భావము:-
పండితులతో సాంగత్యము, పండితులతో సంభాషణము, పండితులతో స్నేహము చేయువారు ఎన్నటికీ చెడిపోరు.
జైహింద్.
Print this post

1 comments:

Pandita Nemani చెప్పారు...

పండిత జన వైశిష్ట్యము
పండితవర! తెలిపితీవు, స్వాంతమ్మునకున్
పండువు మాకయ్యెను గద
నిండు మనముతోడ గూర్తు నీకాశిషముల్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.