జైశ్రీరామ్.
సహృదయ పాఠక సోదరీ సోదరులారా! నాకు వచ్చిన లేఖను మీతో పంచుకుంటున్నాను.ఈ అకలంక మూర్తి ఆవేదనను, ఆశయాలను అత్యవసరంగా గ్రహించ వలసిన అవసరమెంతైనా ఉందనిపించింది. వీరి ఆవేదనను చూస్తే, మనది కాని సంస్కృతిలో జన్మదిన వేడుకలు జరుపుకొంటున్న సమాజంలో ఉండి, ఇంత వరకు ఏమీ స్పందించలనందుకు నాకు సిగ్గనిపించింది. మన భారతీయ సత్సంస్కృతి మృగ్యమైపోతున్న ఈ ప్రస్తుత సమాజాన్ని చూసిన శ్రీ రంగశాయిగారి హృదయం ఎంతో విలవిల లాడుతున్నట్లు వీరి లేఖను చూస్తే తెలుస్తుంది. వీరు కోరిన విధంగా జన్మ దిన వేడుకలకు సంబంధించిన భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే పాటలు ఉన్నట్లైతే మనం తప్పక వీరికి తెలియ జేయాలి. అందుకే మీరు కూడా సహకరించగలరని ఆశిస్తున్నాను.
ఇక వీరు వ్రాసిన విద్యుల్లేఖను వీక్షించండి.
మామిడెన్న వెంకట రంగశాయి (వయసు 78 సం.)
వందే మాతరంమ.రా.శ్రీ చింతా రామక్రిష్ణ కవిగారికి
విశాఖపట్నం నుండి మామిడెన్న వెంకట రంగశాయి అనే 78 సంవర్సరాల వ్రుద్ధుడు వ్రాయునది.
మీ వయస్సు తెలియదు. నాకన్నా వయస్సులో చిన్నవారయితే ఆశీస్సులు. కానీ పెద్దవారయినచో అందుకే కాక జ్ఞానములోనూ సాహిత్యపరంగా కూడా నాకంటే చాలాపెద్దవారు కాబట్టి నమస్కారములు.
నేను 1934లో అవిభక్త మద్రాసు రాష్త్రములోని గంజాము జిల్లాలోని బరంపురం నందు జన్మించితిని. 1936 లో ఒడిషా రాష్త్రము ఏర్పడి గంజాము జిల్లా బరంపురంతోసహా అందులో కలపబడడం వల్ల ప్రవాసీ తెలుగువాడిగా 60 సంవత్సరాలు ఒడిషాలోనే గడిపి ప్రస్తుతం వివ్రాతలో చాలా తప్పులుండవచ్చు. అందుకు క్షమించండి.
తెలుగు బ్లాగులో మీ రచనలు చూసి మీకు ఇది రాస్తున్నాను. మీ అమూల్యమయిన అభిప్రాయములూ, సలహాలూ ఇవ్వవలసినదిగా కోరుతున్నాను.
పుట్టిన రోజు వేడుకలు, చిన్న వారికీ పెద్ద వారికీ కూడా, జరుపుకోవడం ఒక క్రొత్త మోజు అందరిలోనూ ప్రబలుతున్నాది. కానీ అక్కడ కొవ్వొత్తి దీపాలు ఆర్పివేయడం, happy birth day to you అంటూ అందరూ పాడటం నాకు చాలా బాధ కలిగిస్తున్నాది. అందువల్ల ఈ వేడుకలకి వెళ్ళడం మానుకొన్నాను. ఒకవేళ వెళ్ళవలసి వస్తే మొదట నేను చెప్పినట్లు జరపాలని చెప్పి వెళతాను.
నాకు తెలిసిన ఒక పాట "బంగారు పాపాయి(లేదా మాబాబు) బహుమతులు పొందాలి మాపాప (లేదా మాబాబు)చదవాలి మామంచి చదువు" అనే పాట అక్కడ కొంతమందికి నేర్పిస్తాను. కొవ్వొత్తులు ఆర్పడం కాకా కొవ్వొత్తులూ లేదా దీపాలు వెలిగించాలని చేబుతాను. పైన వ్రాసిన పాట పాడింపించి, ఇంకెవరైనా మంచి పాటలు పాడేవారుంటే పాడింపించి, మన సంస్కృతికి సంబంధించిన ఆటలు ఉంటే ఆడింపించి, పుట్టిన రోజు పాపా లేక బాబుకీ మంగళ హారతి ఇప్పించి ఆ తర్వాత అందరి చేతులలో అక్షింతలు ఉంచి "శతమానం భవతి శతాయు .."ఆశీర్వచనం నేను ఒక్కొక్క పదం చెబుతూ మిగతావా రందరి చేతా బృందంగా చెప్పిస్తూ ఆఖరికి అందరి చేత అక్షంతలు వేయింపించి ముగిస్తాను.
ఈ పద్ధతి పిల్లల సంగతేమో కానీ పెద్దవాళ్ళంతా మెచ్చుకుంటున్నారు. ఇప్పుడు నేను కోరేదేమిటంటే ఈ పద్ధతి బాగుందా? ఇంకేవిధంగా జరుపుకోవచ్చో తెలపండి. అంతే కాక పుట్టిన రోజు మీద నేను
పైన వ్రాసిన పాట కాక ఇంకేవయినా పాటలున్నట్లయితే తెలుప గోరుతున్నాను. మీరు వ్రాయమని వీలయితే నాకు పంపమనీ కూడా ప్రార్ధిస్తున్నాను.
నేను క్రింద ఇచ్చిన నా Email కు లేదా టెలీఫోను ద్వారా కూడా తెలిపినా సంతోషమే.మీ టెలిఫోను నంబరు తెలపండి.
మరొక్క అభ్యర్ధన. నాకు తెలుగే సరిగ్గా రాదు. సంస్కృతం అసలు తెలియదు అందు వల్ల మన ఆశీర్వచనం "శతమానం భవతి ... " యొక్క ప్రతి పదార్ధమూ, తాత్పర్యమూ కూడా తెలిపితే కృతజ్ఞుణ్ణి. మీ జవాబు కోసం ఎదురు చూస్తూంటాను.
భవదీయుడు,
మామిడెన్న వెంకట రంగశాయి
విశాఖపట్నం, 12-12-2012
నేను ఈ పద్ధతి గురించి చాలా రోజుల క్రింద బ్లాగులో రాయడం, చాలామందికి చెప్పడం కూడా జరిగింది. కానీ ఇంతవరకూ ఈ పద్ధతి బాగుందని అందరూ చెప్పడమే కానీ పుట్టిన రోజు పండుగల మీద కొత్త పాటలు రాయడము కాని, ఉన్నాయని తెలపడము కాని జరుగ లేదు.
V RANGASAI MAMIDENNA (VISAKHAPATNAM)
mvrangasai@gmail.com
Phone: 0891-2792744 & +91 94902 35171
చూచారు కదా? వీరి మనోగతాన్ని అర్థం చేసుకున్నారు కదా? ఐతే మీరు కూడా ఈ లేఖకు స్పందించి వ్యాఖ్యానం రూపంలో ఆంధ్రామృతం ద్వారా కాని, లేదా వారికే ఈ మెయిల్ ద్వారా కాని, లేదా సెల్ ద్వా మాటాడి కాని సహకరించ గలరని ఆశిస్తున్నాను.
నమస్తే.
జైహింద్.
4 comments:
నిజమేనండి, చక్కగా తెలియజేసారు.
దీపాలను ఆర్పటం అనేది మన సంస్కృతి ప్రకారం అశుభాన్ని సూచిస్తుంది.
సాంస్కృతిక బానిసలమైన మన భారతప్రజలకు అందునా భాషాభిమానం కూడా లేని మన తెలుగు జనాలకు బుద్దొచ్చేలా ఉంది వీరి ఆవేదన. వారు చెప్పేలా లేక మరోలా మన సంస్కృతిని ప్రతిబింబించేలా నడుచుకోవడం ఎంతో శ్రేయోదాయకం. మొన్న నవంబర్ 27 న మా కుమారుడు యతీశ్వర్ పుట్టినరోజున క్రొవ్వొత్తి ఆర్పించకుండా వెలిగించామండీ. ఇక భవిష్యత్తులో కూడా మన సంస్కృతిని ప్రతిబింబించేలా మావాడిని పెంచాలని సంకల్పించుకున్నాము.
సాంస్కృతిక బానిసలమైన మన భారతప్రజలకు అందునా భాషాభిమానం కూడా లేని మన తెలుగు జనాలకు బుద్దొచ్చేలా ఉంది వీరి ఆవేదన. వారు చెప్పేలా లేక మరోలా మన సంస్కృతిని ప్రతిబింబించేలా నడుచుకోవడం ఎంతో శ్రేయోదాయకం. మొన్న నవంబర్ 27 న మా కుమారుడు యతీశ్వర్ పుట్టినరోజున క్రొవ్వొత్తి ఆర్పించకుండా వెలిగించామండీ. ఇక భవిష్యత్తులో కూడా మన సంస్కృతిని ప్రతిబింబించేలా మావాడిని పెంచాలని సంకల్పించుకున్నాము.
గౌరవ నీయులైన శ్రీ రంగశాయి గారికి పాదాభి వందనములు.
చాలా మంచి విషయాన్ని తెలియ చెప్పారు. కానీ ఏం ప్రయోజనం. ? మనం ఎంత చెప్పినా వినేవారు బహుశా, ఇంకా పుట్ట లేదేమొ . పుట్టి పెరుగుతున్న వారు వినే స్థితిలొ లేరు.ఈ వ్యవస్త మారే దెన్నటికొ ? ఆంగ్ల నాగరికత అంటించిన మత్తు వీడే వరకు ఈ వ్యధ తప్పదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.