గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, డిసెంబర్ 2012, శుక్రవారం

అవధాన విశారద శ్రీ భద్రం వేణుగోపాలాచార్యులవారిచే అష్టావధానం

జైశ్రీరామ్.
సుజనులారా! 
విశాఖపట్టణం జిల్లా చోడవరం మండలం జుత్తాడ గ్రామంలో 
అవధాన విశారద శ్రీ భద్రం వేణుగోపాలాచార్యులవారిచే 
09 - 12 - 2012 వ తేదీన మధ్యాహ్నం గం. 3  లకు 
శ్రీ ఉమా మల్లికార్జునస్వామి వారి దేవాలయ ప్రాంగణమున
అష్టావధానం 
నిర్వహింపబడుతోంది.
ఈ కార్యక్రమ నిర్వహణను శ్రీ వల్లభవఝల నరసింహ మూర్తి గారు చేపట్టారు.
కార్యక్రమ సంచాలకులు - డా. మెఱుగుమిల్లి వేంకటేశ్వర రావు
పృచ్ఛకులుగా 
సమస్యా పూరణశ్రీ భూతి కొండలరావు.
దత్త పది శ్రీ వల్లభ వఝల శ్రీరామ చంద్ర మూర్తి.
వర్ణన - శ్రీమతి యమ్. సుబ్బలక్ష్మి.
నిషిద్ధాక్షరి - శ్రీ వల్లభ వఝల నరసింహ మూర్తి.
పురాణ పఠనం - శ్రీ జి. రామయ్య రెడ్డి.
ఉద్దిష్టాక్షరి - శ్రీ మల్లాది సోమ శేఖర శర్మ.
ఘంటా గణనము - శ్రీ చదరం రత్నాలు.
అప్రస్తుత ప్రసంగము - శ్రీ ప్రాత రాజ శేఖర్.
ఆహ్వానం - శ్రీ దొడ్డి మాలి నాయుడు.
వందన సమర్పణ - శ్రీ గుడిమెట్ల సత్య నారాయణ.
ఈ కార్యక్రమమును దేవస్థాన కమిటీ మరియు జుత్తాడ గ్రామ ప్రజల సహకారంతో నిర్వహిస్తున్నారు.
ఔత్సాహికులు యావన్మందీ తప్పక విచ్చేసి ఈ సాహితీ కార్యక్రమమును జయ ప్రదము చేయ వలసినదిగా అందరూ కోరబడుచున్నారు.
జైహింద్.
Print this post

1 comments:

నాగగురునాథ శర్మ చెప్పారు...

అవధాని గారికి నా నమస్కారములు తెలియజేయగలరు...
అవధానం వైభవోపేతంగా జరగాలని కోరుకుంటున్నాను.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.